On the Sparrow from my Village … Usharani

Sparrow at CDG Airport, Paris

You little sparrow,

Ha, I could make you out….you are from my village.

That cute little nose and those elfin feathers… betray you.

But then, when I ask you if you have come alone,

Why are you so insolent, taking off without answering me?

As if you only have those dainty feathers?

Reconciling that you might not have noticed me,

I just crossed your way

But, no. You did not give even a cursory look at me.

I don’t know if I had changed with times

Or time had changed me,

You did not recognize me, for sure.

.

Let me make another trial.

Do you remember the other day

When you hurt your nose gory

Pecking at your own image in the mirror?

Can you recall my chasing you jumping on my feet

And catching you in your flight at last?

And when I left you free far off in the open

You teased me by coming home earlier than me?

.

Did you forget your taunting me once more

Playing with your mates on the posts

At the Jasmine garden of Booriyyagaru

When I went there to collect a few flowers

On that festive day

In a silk petticoat, salving my feet with saffron

And wearing ankle bells?

.

Do you remember

Your roaming around the place

When my granny was telling me stories

Picking all the grits thrown at you

By my sister Kamakshi?

.

Isn’t it you who protected the crop

Weeding out the pests in Ramannatata’s farm?

This is exactly how you dissed at me last time

When I wanted to check up with you

The lore I heard about you.

.

Though I left that place you stayed behind.

Maybe, you could not find a mate, like me,

to enchant you out to alien lands.

You were even greeting me

Whenever I came home for festival or vacation.

But suddenly, one day, when my brother Venu said,

“Did you hear, sister?

All the sparrows have disappeared suddenly.

They say, they might have been dead?”

I was so sad and depressed.

When I asked for the reason,

Everybody had given some reason or the other.

And, somebody had said it was due to the use of pesticides.

Well, why could you not convince them

That they were redundant so long as you were there?

.

And now after a long absence

Here in this cold country

In Fall,

You suddenly appeared and delighted me.

Oh! There is a flock around you.

Have you migrated here like me, perchance?

Hey, you are jeering at me in your wont way.

Thank heavens!

Have you recognised me?

.

Photo Courtesy: Usha Rani

Usha Rani

Usha Rani is a computer professional living and working in USA for over 20 years. She runs her blog http://www.maruvam.blogspot. in.  An ardent litterateur and nature lover, her poems and writings reflect an undercurrent of her alienation from the motherland against her will. 

.

మావూర్లో అవతరించిన పిచ్చుకపై …

.

అవును నాకర్థమైపోయిందిలే,
నువ్వొచ్చింది మావూర్నుంచేనని
నీ బుల్లి ముక్కు, బుజ్జి బుజ్జి రెక్కలే నాకు గుర్తులు.
నువ్వొక్కత్తివే వచ్చావేమని పలకరిస్తే,
అవును అలా ఎగిరిపోతావేం
రెక్కలు నీకేవున్నాయని టెక్కా ఏంటి?

ఎందుకంటే కాలం నను మార్చిందో,
కాలంతో నేనే మారానో కానీ,
గమనించలేదేమోనని సరిపెట్టుకుందామన్నా,
మనసాగక నీ ముందుకొచ్చినా తప్పుకునేపోయావ్.
అంటే నువ్వు నన్ను గుర్తు పట్టలేదన్నమాట!

వుండు ఇంకొక ప్రయత్నం చేయనీ,
అద్దంలో నిన్ను చూసుకుని,
పొడిచి పొడిచి ముక్కంతా ఎర్రన చేసుకున్నావని,
గుర్తుందా? నువ్వు రెక్కలతో ఎగిరితే,
నేను కాళ్ళతో ఎగిరెగిరి చివరికి నినుపట్టి,
అల్లంత దూరాన వదిలివస్తే,
నాకన్నా ముందే తిరిగొచ్చి వెక్కిరించావ్.

పండక్కి పట్టూలంగా వేసుకుని,
పారాణి అద్దుకుని,
కాళ్ళగజ్జెలు పెట్టుకుని, పూలు కోసుకోను,
బూరియ్య గారి మల్లె తోటకొస్తే,
పందిరిగుంజలతో,
నీ వాళ్ళనేసుకుని స్తంభాలాటలాడుకుంటూ
మరోసారి వెక్కిరించావ్.

అమ్మమ్మ కాకమ్మ పిచికమ్మాంటూ కథలేవో చెప్తుంటే,
అక్కడక్కడే తిరుగాడుతూ
కామాక్షక్క విసిరిన నూకలన్నీ ఏరేరి తిన్నావ్.
రామన్న తాత పొలంలో నువ్వేనంటగా
పురుగులేరి పంట కాపాడింది,
ఇంకొన్ని విన్నవన్నీ మళ్ళీ నిన్ను
అడిగి తెలుసుకుందామంటే
అదిగో అలాగే వెక్కిరించావ్.

నేవెళ్ళిపోయినా నువ్వక్కడే వుండిపోయావ్,
మరి నీకు అవలేదేమో నాకులా పెళ్ళి.
వేసవికొచ్చినా, ఉగాదికొచ్చినా
కనిపిస్తూనేవున్నవుగా చాన్నాళ్ళు.
వేణు చెప్పాడు విన్నావేంటే అక్కా!
పిచ్చికలు చచ్చిపోయాయంటాని,
ఎంత బాధేసిందో, ఎందుకని అడిగితే
తలో మాటా చెప్పారు,
పురుగుమందుల ప్రభావమన్నారు,
అయినా నువ్వుండగా అవెందుకని
వాళ్ళనెక్కిరించకపోయావ్?

మళ్ళీ ఇంతకాలానికి ఈ చలి దేశంలో,
ఆకు రాలు కాలంలో,
భలేగా కనిపించావే,
బోలెడంత సంబరమైపోయింది.
వెంట పదిమందినేసుకొచ్చావ్,
నాలా వలస వచ్చేసావేంటి?
హమ్మయా గురుతుకొచ్చేసానేంటి,
ఎప్పటిలానే వెక్కిరిస్తున్నావ్?
.
ఉషా రాణి

దాదాపు రెండు దశాబ్దాలుగా USAలో ప్రవాస జీవితం గడుపుతున్న ఉషారాణిగారు కంప్యూటరు వృత్తినిపుణురాలు, మంచి సాహిత్యాభిలాషి, ప్రకృతి ప్రేమికురాలూ కూడా. ఆమె మరువం అన్న కలం పేరుతో వ్రాయడమే గాక అదే పేరుతో ఒక బ్లాగు 10.5.2008 నుండి నడుపుతున్నారు.  ఆమె వ్యక్తిగతాభీష్టానికి వ్యతిరేకంగా దేశాన్ని విడిచిరావాల్సి రావడం ఆమె కవితల్లో, బ్లాగు పోస్టులలో ప్రత్యక్షంగానో, అంతర్లీనంగానో  ప్రతిఫలిస్తుంటుంది.

“On the Sparrow from my Village … Usharani” కి 13 స్పందనలు

  1. Good Translation Sir…నేను బ్లాగులోకంలోకి ప్రవేశించిన కొత్తలోనుండే మరువం పరిచయమై అదో దినచర్యలా మారిపోయింది…అలాగే బ్లాగు నిర్వహణకే పరిమితం కాక ఉషగారు చూపిన స్నేహ ఆత్మీయత నన్ను చాలా సార్లు మానసికంగా స్థైర్యానిచ్చేది..కవితా నిర్మాణం గూర్చి కూడా ఆమె శ్రద్ధపెట్టి చెప్పేవారు.. ఇలా ఆమె రాసిన మంచి కవితలలో ఒకటి అనువాదం చేసి మీరు ప్రచురించి ఆనందాన్నిచ్చారు…ధన్యవాదాలు..కెక్యూబ్ వర్మ

    మెచ్చుకోండి

    1. వర్మగారూ,
      ఉషారాణి గారు, బాగా రాయడమే కాదు, సంస్కారవంతమూ, నిర్దిష్టమైనవీ అయిన ఆలోచనలూ, అభివ్యక్తీ గల రచయిత్రి. ఆమె తనబ్లాగులోనూ, ఇతరత్రా చేసిన వ్యాఖ్యలే ఆమె వ్యక్తిత్వాన్ని పట్టి ఇస్తాయి.
      తరువులతిరసఫలభార గురుతగాంచు
      నింగివ్రేలుచు నమృతమొసంగుమేఘు
      డుధ్ధతులుగారు బుధులుసమృధ్ధిచేత
      జగతినుపకర్తలకునిది సహజగుణము
      అని ఏనుగులక్ష్మణకవి భర్తృహరి అనువాదంలో ఎప్పుడో అన్నారు.

      ఒకప్పుడు సాటిజీవులతో “సహజీవనం” చేసిన మనం, ఈ రోజు మనబాధ్యతలు విస్మరించి ఇతరజీవుల మనుగడని నాశనం చెయ్యడమే గాకుండా, మనకి తెలియకుండా మానవజాతిమెడకి తప్పించుకోలేని ఉచ్చు బిగించుకుంటున్నాం. పాపం, పిచ్చుకలు అంతరించుపోతున్న జాతి. గ్రామీణ, పట్టణ వాతావరణం నేపధ్యం నుండి, ఈనాడు గత్యంతరం లేక మహానగరవాతావరణంలో బ్రతుకుతున్నవారందరికీ, పిచ్చుకలు చిరపరిచితాలే. ఒకప్పుడు పట్టణాల్లోకూడా పిచ్చుకలకి వాకిట్లో నూకలు జల్లే ఆచారం, చీమలకి ఆహారంగాకూడ ఉపయోగపడుతుందని బియ్యపు పిండితో ముగ్గువేసే ఆచారమూ ఉండేవి. మనిషికే నూకలుచెల్లిపోతున్న రోజుల్లో పిచ్చుకలనీ, చీమలనీ పట్టించుకునేవాడెవడు?

      ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు సమాజప్రయోజనాలకంటే ముందుంటున్నాయి. అధికారం ధనమదాంధత కళ్ళుగప్పిన వ్యక్తులు చేసిన అత్యాచారాలు యువతరానికి అనుకరించదగినవిగా, మార్గదర్శకాలుగాకాకుండా ఉండాలంటే, ప్రకృతిపట్ల మనబాధ్యతలని మనం తరచు మననం చేసుకుంటూ ఉండాలి. అందులో భాగమే ఈ చిన్ని ప్రయత్నం.

      అభివాదములతో,

      మెచ్చుకోండి

  2. బావుందండి.. చక్కని కవితని చక్కని అనువాదం.

    మెచ్చుకోండి

    1. తృష్ణగారూ,
      కృతజ్ఞతలు. నా బ్లాగుకి స్వాగతం. మీ బ్లాగు గురించి నాకు ఇప్పుడే తెలిసింది. వెంటనే చూశా. నాకు బాగా నచ్చిన పోస్టులలో, “The Artist” సినిమా గురించి మీరు రాసినది, అలాగే వంశీ గారి పుస్తకం గురించి వ్రాసినదీ ఉన్నాయి. అభిప్రాయం అన్నాక కొందరికి నచ్చుతుంది, మరొకనచ్చదు. నిక్కచ్చిగా మనసులో ఉన్న అభిప్రాయం ఇతరుల మెప్పుకోసం కాకుండా వ్రాయడం (Intellectual Honesty) నాకిష్టం. ఆ పని మీరు చేశారు. అందుకు నా హృదయపూర్వక అభినందనలు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  3. కవితంత అందంగానూ వుంది మీ అనువాదం కూడా…
    అభినందనలు..

    మెచ్చుకోండి

  4. GS Lakshmi గారూ,
    నా బ్లాగుకి స్వాగతం. మీ ఆదర పూర్వక వ్యాఖ్యకి కృతజ్ఞతలు.
    అభివాదములతో,

    మెచ్చుకోండి

  5. డియర్ ఉష ! మూలాన్ని అమూల్యమైన అనువాదాన్నితరచి తరచి చూసా ఏది మూలమో ఏది అనువాదమో నాకు అర్ధం కాలేదు. అను వాదకుల ప్రజ్ఞను ప్రస్తుతించ డానికి నా వద్ద మాటలు లేవు. ఇరవై సంవత్సరాల కాలం లొ నాటి జ్ఞాపకాలు అంతరంగాన పదునెక్కిన రీతులు ప్రతిఫలించిన తీరులు అద్భుతం.
    అమ్మమ్మ కాకమ్మ పిచికమ్మాంటూ కథలేవో చెప్తుంటే,
    అక్కడక్కడే తిరుగాడుతూ
    కామాక్షక్క విసిరిన నూకలన్నీ ఏరేరి తిన్నావ్.
    రామన్న తాత పొలంలో నువ్వేనంటగా
    పురుగులేరి పంట కాపాడింది,
    యీ బాబాయిని పలుకరించి ఆత్మీయ స్పర్సనందించిన ఉష కు నేనేమివ్వ గలను శుభాశీస్సులు తప్ప.
    డియర్ !మీ అనువాదం అద్భుతం మాష్టారూ. ..Sreyobhilaashi ..Nutakki Raghavendra Rao.

    మెచ్చుకోండి

    1. Raghavendra Rao garu,

      Thank you so much for your compliment.

      with best regards

      మెచ్చుకోండి

    2. బాబాయ్, అవును అందుకే మూర్తిగారి అనువాదాలు నాకు తెలిసిన అందరికీ పరిచయం చేయాలనే నా అభిమతం. నా పట్ల అనురాగానికి థాంక్స్!

      మెచ్చుకోండి

  6. “ప్రకృతిపట్ల మనబాధ్యత” – మూర్తిగారూ, ప్రకృతి పట్ల ఆరాధన, ప్రేమ, సహనం ఇవి పెంపొందింపజెయ్యాలనే నా ప్రయత్నాలూను. శ్రీ రమణ గారి బంగారు మురుగు లో బామ్మ మాట “దయ కంటే పుణ్యం లేదు. నిర్దయకంటే పాపం లేదు. చెట్టుకి చెంబెడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకొన్న వాడికి పట్టెడు అన్నం పెట్టడం…” – ఇదే నా ఆచరణ, ఆదర్శమూనూ. 🙂 ఆ కథలోనే బాదం చెట్టు మానుని ఆపేక్షగా తడుముతూ “దీన్ని కాపరానికొచ్చేప్పుడు మా పుట్టింటి నుంచి తెచ్చా… అప్పుడు జానా బెత్తెడుండేది. నువ్ నమ్మవ్…పిచ్చి ముండకి మూడే ఆకులు బుల్లిబుల్లివీ ఉండేవి…” అనే ఆ బామ్మకి నిజజీవితంలో నాకు చాలా పోలికలు ఉన్నాయి. ఈ కవిత అలాంటి అపేక్ష, ఆనందాశ్రువుల నుంచి వచ్చిందే.

    నా పట్ల మీ అభిమానపూరిత అభిప్రాయాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను. శిశిరమో హేమంతమో సరీగ్గా గుర్తులేదు గానీ, ఒక ఉదయపు పొద్దున అలా ఒక గుంపు పిచ్చుకలని చూసి చెందిన దిగ్భ్రమ, అపురూపమైన ఆ దృశ్యం తాలూకు గగుర్పాటు, వాటి వెనక పడి ఫోటోలు తీస్తూ పడ్డ శ్రమ మాత్రం గుర్తే బాగా!

    మీ అనువాదానికి చాలా ధన్యవాదాలు. ఇది నా మనసుకి నచ్చిన కవితల్లో ఒకటి.

    వర్మ గారు, మీ ఆత్మీయ వచనాలు మరవను. మరువపు తోటలో 2008-2010 కాలాలు నాకూ చాలా జీవితానుభవాలు మిగిల్చాయి.

    తృష్ణ, లలిత గారు, మీ ఆదర పూరిత వాక్కులకు కృతజ్ఞతలు. మరువపు వేడుకల్లో మీ పాత్ర నేను మర్చిపోలేనిది.

    మెచ్చుకోండి

  7. ఉషగారూ,
    మీ “మరువం” నాకు సమయం చిక్కినప్పుడల్లా చూస్తున్నాను. అది మీరు కొనసాగించనందుకు చింతిస్తున్న వాళ్ళలో నేనొకణ్ణి. అనువాదంలో ఒక చిక్కు ఉంది. ముఖ్యంగా నాకు. కవిత మనసుని రంజింపజెయ్యలేకపోతే అనువాదం ముందుకి కొనసాగదు. మంచికవిత చదవగా వచ్చిన అనుభూతే అనువాదానికి ప్రతిఫలం. అంటే ప్రెపెయిడ్ అన్నమాట. మీ సాహిత్యాభిలాష, సంపాదించుకున్న సంస్కారం మీ రచనల్లో, వ్యాఖ్యలలో చూశాను. ఈ కవిత నాకు బాగా నచ్చింది. నుడికారంలో బాగా nativity ఉండడంవల్ల కొంచెం సందేహించినా, సాహసించేను. సహృదయుల స్పందన కొంచెం ఆనందాన్నీ, మరికొంత ధైర్యాన్నీ ఇచ్చింది. శ్రీ రమణ గారి బంగారు మురుగు నాకు నచ్చిన అపురూపమైన కథలలో ఒకటి. బహుశా త్వరలో ఈ బ్లాగులో కనిపిస్తుందేమో!
    మీకు నా మనః పూర్వక అభినందనలు.
    అభివాదములతో,

    మెచ్చుకోండి

  8. మూర్తిగారూ,

    I really wish for the bilingual writers/poets like you to form a consortium and bring the gems from yesteryear to the current generation of readers.

    ఈ సైట్ తెలుసా మీకు?

    http://www.thulika.net/Commonfiles/authdex.html

    బంగారు మురుగు కథని అనువదించే ఉద్దేశం లో ఉన్నట్లున్నారని చెప్పాను. మాలతి గారు బ్లాగుల్లోను, పొద్దు, పుస్తకం.నెట్, ఈమాట లోను రాస్తుంటారు. కొన్ని నవలలు, కథా సంపుటులు వెలువరించారు కూడా! మాలతి గారు తెలుగు కథల్ని ఇంగ్లీషానువాదాలుగా ఆ సైట్లో అందిస్తారు. అంచేత మీకవి ఆసక్తిని కలిగించవచ్చును.

    మెచ్చుకోండి

  9. Thank you Usharani garu.

    I know Nidudavolu Malatigaru through her works and the website. She is a veteran in this field of translations.

    best regards

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.