
దిగువన వేలాడుతున్న పొగమబ్బు… హెన్రీ డేవిడ్ థొరో

Low-anchored cloud,
“దిగువన వేలాడుతున్న పొగమబ్బు… హెన్రీ డేవిడ్ థొరో” కి 7 స్పందనలు
-
Loved the picture-poastcard beauty of this poem
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Thank you Sher. It reflects the beauty of the poem so well.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
థొరో ఒకచోట, “నాకు ప్రేమకంటే, ధనం కంటే, కీర్తికంటే సత్యాన్ని ప్రసాదించ”మంటాడు.
“ప్రపంచం అశాశ్వతమూ, సంశయాత్మకమైనదీను. కాని, ఒక పగలు రాత్రీ మనం గనక ఆనందం తో స్వాగతించగలిగితే, పువ్వుల్లా, సువాసనలిచ్చే వనమూలికలల్లా, మనజీవితం కూడ సుగంధాల్ని విరజిమ్మగలిగితే, మనజీవితం ఆ క్షణం అమరత్వం పొందినట్లే.”
thanks a lot
sir,
please keep it up
Nice
?!
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Thank you Siva garu.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
గుండెకి గొంతుకి పట్టినన్ని చదువుకుంటూ లాగేసిన రోజుల్లోకి రెక్క పట్టుకుని ఈడ్చుకెళ్తున్నారు, మూర్తి గారు. థొరో అనగానే మరొక మాటా గుర్తొస్తుంది “I am no more lonely than the loon in the pond that laughs so loud, or than Walden Pond itself…I am no more lonely than a single mullein or dandelion in a pasture, or a bean leaf, or a sorrel, or a horse-fly, or a humble-bee. I am no more lonely than the Mill Brook, or a weathercock, or the northstar, or the south wind, or an April shower, or a January thaw, or the first spider in a new house. [Walden]”
ఎప్పటి మాదిరే వందనాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
ఉషారాణిగారూ,
మీరు నా బ్లాగు విలువని పెంచుతున్నారు మీ కామెంట్లతో. మీకెన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఎంత అందమైన మాటలండీ అవి!!! నిరాశా నిస్పృహలతో కొట్టుకుపోతూ ఒంటరిగానున్నాననుకున్న వాళ్ళందరికీ ఎంత సాంత్వన ఉంది ఆ మాటల్లో! I am no more lonely than the Mill Brook, or a weathercock, or the northstar, or the south wind, or an April shower, or a January thaw, or the first spider in a new house…. ఒక్కొక్కటీ తలుచుకుంటూ, దృశ్యాన్ని కళ్ళముందు ఆవిష్కరించుకుంటుంటే, ఒళ్ళు పులకరిస్తుంది. ఎప్పుడూ మనగురించేగాని, ప్రకృతిలో మనలాంటివెన్నో ఉన్నాయని తెలియజెప్పే ఆ మాటలలో ఎంత మెత్తని ఉద్బోధ ఉంది!!!
అనేక కృతజ్ఞతలూ, అభివాదములతోమెచ్చుకోండిమెచ్చుకోండి
-
మూర్తి గారూ, ఎంత మాట! మీ మాటలు మీ వ్యక్తిత్వ ప్రతీకలు. నావి కేవలం a honest appraisal/appreciation/words from an average yet serious reader’s point of view నిజానికి మేమే మీకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. ప్రకృతిలో మమేకం కావాలన్న నా అభిమతం వలన ఈ కవులకి పెద్ద పీట నా మనసులో. నా కవితల్లో సగం పైన ప్రకృతి తో తాదాత్మ్యం చెంది – సహజం అని మీకనిపిస్తే నాది కవితౌతది, కాకుంటే ఇదో ప్రకృతి చేసే మాయౌతది – అని నేను వెన్ను విరుచుకు చెప్పినవే!
ఇక కొన్ని ఈ పోస్ట్ కి సంబంధం లేని వ్యక్తిగతాభిప్రాయాలు – సాహిత్యచరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకున్న, బ్రిటన్ లో తెలుగు ‘బ్రౌన్’ గా అభివర్ణించబడే శ్రీ “గూటాల కృష్ణమూర్తి” గారిని గూర్చి విన్నారా? ‘బ్రిటీష్ వారి మనసుల్లో చెదిరిపోతున్న సాహితీ సౌరభం గురించి వారికే తెలియపరిచారు. ఆయన లేకపోతే ఆ ఆంగ్ల రచయితల గొప్పదనం అక్కడివారికి తెలిసేది కాదు…’ క్లుప్తంగా ఆయన్ని పరిచయం చేయటం కష్టం. అలాగనే మీరు చేస్తున్న ఈ ప్రయత్నమూ చిన్నది కాదు. 100 ఏళ్ల నాటి తెలుగు ఇపుడు ఆవలీలగా చదవలేము. కానీ, ఇంగ్లీష్ కి ఆ సౌలభ్యం ఉంది. ఇతరత్రా భాషల శోభలు, సోయగాలు అందులోకి ప్రవహించటం ఒక కారణమేమో, సాహిత్యం లో సుస్థిరత అక్కడ పదిలం. దేవులపల్లి, శ్రీశ్రీ ఎవరి జీవిత చరిత్రల్లోకి తొంగిచూసినా మన సాంప్రదాయ సాహిత్యంలో పాటుగా పాశ్చాత్య సాహిత్యం కూడా అభ్యసించినవారేగా! అంచేత ఇప్పటివారిలో కవి గా స్థిరపడాలనుకునే వారికి మీ ఈ ప్రయత్నం చాలా సహాయకారి. మన ముందు తరానికి లేని వెసులుబాటు కల్పిస్తున్నారు. వాళ్ళ సాహిత్య గోష్టి కి తగ్గట్టు ఇలా తెలుగు-ఇతర భాష వర్షన్స్ అందిస్తున్నారు. సాధనతో సంపూర్ణంగా భాషా పటిమ, లయ ప్రాసల పై పట్టు, కవితాత్మకత వంటివి సాధించాలంటే, తెలుగు ఒక్కటే చదివితే చాలదు. ఇంగ్లీషులో పోయెట్రీ, లిటరరీ టెక్నికులూ, మంచి కథలూ గట్రా కూడా చదవాలి. నా వరకు ప్రతి సాయంత్రం వేళా ఒక కప్పు పాల కి తోడుగా వెదుక్కోకుండానే ఒక మంచి కవిత మీ వలనే సాధ్యపడింది. ఆ అభిమానం మరవను.
కృతజ్ఞతలు,
ఉష.మెచ్చుకోండిమెచ్చుకోండి
Leave a reply to Shernaz స్పందనను రద్దుచేయి