ఈ సాయంసంధ్యకూడా … పాబ్లో నెరూడా
“ఈ సాయంసంధ్యకూడా … పాబ్లో నెరూడా” కి 6 స్పందనలు
-
“నువ్వుకూడా ఎప్పుడూ నా నుండి జారుకుంటావు.”
ఎందుకై ఉంటుంది? 🙂మెచ్చుకోండిమెచ్చుకోండి
-
నందకిషోర్ గారూ,
“ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక” అన్నట్టు అందమైన వస్తువు అందరికీ సుందరంగానే కనిపించి ఎవరికి వారు స్వంతంచేసుకోవాలనిపిస్తుంది. కానీ, ఆ వస్తువు స్త్రీ ఐనపుడు, మనకున్న రాగద్వేషాలే, ఇష్టాయిష్టాలే ఆమెకీ ఉంటాయికదా. కనుక ఒక ముఖం వెలిగిస్తే, కొన్నివేల ముఖాలు కళావిహీనం కాకతప్పదు.
అభివాదములతోమెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
చిత్రంగా ఒక వారం వ్యవధిలో 3 అనువాదాలు చదివాను ఈ కవితకి. మొదటగా బాబాగారి బ్లాగులో http://sahitheeyanam.blogspot.com/2009/08/blog-post_26.html చదివి, మళ్ళీ ఈ మధ్యన మరొకమారు స్పందన రాసుకున్నాము నేను నా ప్రియసఖి ఒకతి. మీరు చూసే ఉన్న http://madhavauk.blogspot.com/2011/09/blog-post_26.html మరొకానువాదం కూడా బావుంది. ఇవాళ మీది. మీదైన బాణీ ఉందిక్కడ. నాకీ కవిత మహా మక్కువ అంచేత మళ్ళీ మళ్ళీ చదివా.
మరొకలా అనుకోరనే – “కొనకొమ్ము” పునరుక్తి కాదా? కొమ్ము అన్నా కొన అనే కదా అర్థం. అలానే ‘అసలుసంధ్య’ కాదేమో మా ప్రాంతాల్లో ‘అసురసంధ్య’ అని పరిపాటి.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
ఉషగారూ,
బహుశా అది అసలుసంధ్యకి బదులు “అసురసంధ్య” యే అయి ఉంటుంది. చీకటి ముదురుతున్నకొద్దీ రాక్షసులు విజృంభిస్తారనికదా లోకవ్యవహారం. అయితే బహుశా వ్యవహారంలో భ్రష్టమయి అసలు సంధ్యాకాలం అయిఉంటుంది. అది కరెక్ట్ చేశాను. కొనకొమ్ము అన్నది పునరుక్తే. కాకపోతే చిన్న తేడా అల్లా కొన అన్నది చివర, కొమ్ము అన్నది “skewed” అన్న అర్థాన్ని సూచిస్తాయి. బహుశా, చిన్నప్పుడు నేను చదివిన భాస్కర శతక కారుడి (శ్రీ మారవి వెంకయ్య) ప్రయోగం నా Sub-consciousలో పనిచేసి ఉండవచ్చు. “కొండొకకోతి చెట్టుకొనకొమ్మన నుండగ” అని ఆయన అనువాదం.
అభివాదములతోమెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
మూర్తిగారికి
నమస్తె
అద్బుతంగా ఉంది సార్.
ఒక సందేహం
cape అన్న పదం గురించి
నేను తీరం అని అన్వయించుకొన్నాను (ఎందుకు అలా చేసానో ఇప్పుడు గుర్తుకు రావటం లేదు బహుసా cape of good hope మదిలో మెదిలిందేమో)
మీరు జ్ఞానం అన్నారు
నీలి టోపీ అని ఎక్కడో చదివానుcan you please throw some light on this sir
భవదీయుడు
బొల్లోజు బాబామెచ్చుకోండిమెచ్చుకోండి
-
బాబాగారూ,
capeఅన్న పదానికి మీరు చెప్పిన అర్థం ఉంది. “capa”అంటే స్పెయిన్ లో బుల్ ఫైట్స్ సందర్భంలొ పోతుల్ని ఉసిగొలపడానికి వాడే ఎర్రని వస్త్రం అనీ, (ఆంధ్రా) యూనివర్శిటీ స్నాతకోత్సవాలలో వాడే (కాకపోతే డిక్ష్ణరీలో ఇచ్చిన అర్థం లో చేతులు ఉండవు) మెడనుండి మోకాళ్లదాకా వేలాడే (నల్లని) టటువంటి ఉడుపు అనీ చాలా అర్థాలున్నాయి. అయితే ఇవి ఏవీ నాకు పైన చెప్పిన వర్ణనతో పొసగడం లేదు. మీరు గమనించే ఉంటారు:
“The book fell that is always turned to at twilight
And my cape rolled like a hurt dog at my feet.”
ఈ రెండు వాక్యాలూ అంతకుముందు చెప్పిన విషయానికి ఎక్కడా పొందికగా లేవు. కనుక అతను ఈ మాటల్ని సింబాలిక్ గా ప్రయోగించేడనుకున్నాను. అప్పుడుకూడ అవి ప్రేమకి గాని, ప్రేయసికిగాని ఎక్కడా అనుబంధంగా కనిపించడం లేదు. సూర్యాస్తమయాన్ని జీవిత చరమదశకు సరిపోల్చుకుంటే, ఈ సింబాలిజం నాకు కొంతమేరకి సరిపోయింది. చరమాంకంలో నేర్చుకున్న విద్య/ లౌకిక విషయాల్లో అయిన జ్ఞానోదయం ఎందుకూ పనికిరాదనీ, అది పాదాలదగ్గరే ఉంటుందనీ (తలదాక వెళ్ళదని), చెప్పడం కోసం వాడేడని నేను భావించాను. అందుకనే జ్ఞానం అని వాడేను.
అభివాదములతోమెచ్చుకోండిమెచ్చుకోండి
-
Leave a reply to Nanda Kishore స్పందనను రద్దుచేయి