Sojourn … Vimala, Telugu, Indian

Image Courtesy: http://www.chinafacttours.com

.

The forest

Is so primitively beautiful… and pristine and is

And is coolly spread across, all around…

Thick and green, dense and dark.

Yet, there are tenuous tracks laid by Emmets

And here are mute mountains

Which appropriated silence of centuries,

And assume different forms with each changing season.

Now you look at it…

It is so inviting under that diaphanous veil.

And return here after few days…

You shall find it crouched with an etiolated look, in cold

Throwing you into a melancholic mood…

And comrade! If it’s hot summer breeze,

the forest runs around doffing its veil. 

And the lofty trees wail waving their winding branches.

This woody-desert makes you breathless!

.

Forest…

If it pleases with chirping of birds in the day

The same forest at night

With the mascara of darkness

Looks so ebony and merciless sometimes,

And in its warm and cosy lap cradles us at other.  

Beware!

It can also grind you to your bones

With its carnivorous plants!

Can you think how many heart-rending folk tales

These rills rolling over the rocks carry?

.

Comrade!

We are in the know

Of your endeavour to break the barriers.

And your resistance is with the wild and cruel creatures

From within and without that try to eat us away.

And suddenly a wheezing wind brings in a message:

That every farm field was gory with your blood. 

And it was your breath that comes out of the chimney

We are aware of your attempts outside to make man a man, 

And how the bodies were crushed under the steel boots.

Yet, comrade!

We are also conscious of the fists that remain clenched.

Although childhood was occasionally encountered here

We wouldn’t have survived

But for the Mulugu (Morinda umbellata) tree

Splashed with blood when the tiger lashed its paw…  

But for the sympathy and support of tribal villages

Like Gurajalamodu, Gurimella,

Pagideru, Pandavula Guttalu

And the Pavurayi Gutta close by…

that silently bore the brunt of enemy bullets.

.

But Comrade! Take it cool.

What if the wildfire reduces the forest to ashes in Summer?

Soon it would resurge into a veritable sea of verdure.

A newly fledged bird tossing on a Bastard-Teak branch

Shall ask its ruddy flowers “What are you doing here?”

And the clustered foliage of Deodar

Shall drop in few rosy seeds for morrow’s preserve.

.

Comrade! We are aware of your attempts from outside.

Someday we shall enter into the cities

Walking over the furrows of the plough.

Give us some time to settle;

Let the seeds planted here take ground and sprout;

Let the bastard-teak blow-up in full bloom.

.

Until then… however inhuman the forest might be,

We have to put up with it.

However gloomy and merciless it might be…

It attracts us still, comrade,

An irresistible one at that.  

.

Vimala.

.

మజిలీ…

.

అడవి

అందంగా అమానుషంగా వుంది!

చిక్కగా చీకటిగా

పచ్చగా, చల్లగా …

అడవి దట్టంగా అల్లుకుపోయింది

అయినా ఇక్కడ

చీమలు చేసిన బాటలున్నాయ్!

శతాబ్దాల నిశ్శబ్దాన్ని పొదివిన  మౌనపు కొండలున్నాయ్

అది రుతువు రుతువుకూ రకరకాల రూపాలు ధరిస్తుంది.

ఇప్పుడు చూడు—

పల్చటి వస్త్రం కప్పుకుని రా రమ్మని పిలుస్తుంది.

కొన్నాళ్ళయ్యాక రా

చలికి వెలిసిపోయి దిగులుగా ముడుచుకుని కూర్చుంటుంది—

నిన్ను విషాదంలో ముంచుతూ…

ఇక ఇప్పుడొచ్చావా నేస్తం—

గ్రీష్మం గాలి

అడవి అందమైన ముసుగు లాగేసి పరిగెత్తుతుంది

ఎత్తైన వృక్షాలు కొమ్మల చేతుల్నెత్తి విలపిస్తున్నాయి

ఈ వృక్షపు ఎడారి నీకు ఊపిరాడనివ్వదు మరి!

అడవి

పగలు పచ్చగా పక్షుల పాటలతో ఆహ్లాదాన్నిస్తుంది.

అదే రాత్రి—

చీకటి కాటుక పెట్టుకుని

నల్లగా నిర్దాక్షిణ్యంగా కనపడుతుంది.

అడవి తన వెచ్చటి వొడిలో

మనల్ని ఆడిస్తుంది. లాలిస్తుంది.

అడవి తన నరహంతక మొక్కల్తో మనల్ని నవిలేస్తుంది కూడా!

బండరాళ్ళమీంచి పారే సెలయేళ్ళు

ఎన్నెన్ని వూర్ల విషాదాశృవుల్నో మోసుకొస్తాయి.

నేస్తం…

మాకు తెలుసులే

హద్దుల్ని బద్దలుకొట్టాలనే మీ ప్రయత్నం.

మనల్ని మింగజూసే కౄరజంతువులతో

లోనా బయటా మన ప్రతిఘటన అని.

వీచేగాలి వార్తల్ని మోసుకొస్తుంది:

ప్రతి పంటచేనూ రక్తంతో పచ్చబడిందనీ

ప్రతి ఫ్యాక్టరీ పొగగొట్టం నుండీ పైకిలేచేది మీ ఊపిరేనంటూ.

మనిషి మనిషిగా బ్రతకడానికై

అడవిబైట మీరంతా చేస్తున్న ప్రయత్నాలు

ఉక్కుపాదాలక్రింద నలిగిపోతున్న దేహాలు

అయినా ఇంకా బిగియించే ఉన్న పిడికిళ్ళు

మాకు తెలుసులే నేస్తం!

అడవిలో అక్కడక్కడా  పసిపాపలు ఆహుతైనా

అన్నల్ని రక్షించే గురజలమోడులాంటి గూడేలు- తండాలు

శత్రువు గుళ్ళని నిశ్శబ్దంగా భరించే

గురిమెళ్ళా, పగిడేరు, పాండవుల గుట్టలు

ఆ ప్రక్కనే పావురాళ్ళ గుట్టా…. లేకుంటే

మేం ఇక్కడ నిలబడగలిగేవాళ్ళం  కానేకాము

పులివిసిరిన పంజాదెబ్బకి

నెత్తురు చిందించిన చీకటిగండ్ల ములుగు చెట్టూ ….

నేస్తం, అయినా మరేం ఫర్వాలేదు,

ఎండాకాలం అడవిలో ఎరగళ్ళు పడితేనేం?

తిరిగి అది పచ్చ  సముద్రం అవుతుంది.

ఎగిరి ఎగిరి మోదుగుచెట్టు మీద వాలిన పక్షిపిల్ల

ఎర్ర మోదుగు పూవుల్ని ప్రశ్నిస్తుంది ఇక్కడ మీరేం చేస్తున్నారని!

దేవదారు గుబురు

రేపటి కోసం తన ఎర్రని విత్తనాల్ని రాలుస్తుంది

నేస్తం! అడవి బయట మీ ప్రయత్నాలు మాకు తెలుసులే!

మేం వస్తాం నాగేటి చాళ్ళమీదుగా నగరాల్లోకి 

మమ్మల్ని కొంచెం నిలద్రొక్కుకోనివ్వండి

ఇక్కడ రాలిన విత్తనాల్ని  కాస్తమొలకెత్తనివ్వండి

మోదుగుల్ని మరింత వికసింపనీయండి

అందాకా– అడవి ఎంత అందంగా అమానుషంగా వున్నా సరే….

తప్పదు మరి

అది ఎంత చీకటిగా నిర్దాక్షిణ్యం వున్నా సరే…

అడవి  అటే ఆకర్షిస్తుంది  నేస్తం అటే ఆహ్వానిస్తుంది.

.

విమల

.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: