A Blind Beggar … Viswanatha Satyanarayana.

http://farm5.staticflickr.com/4027/4426236744_55aff11b54_m.jpg
Image Courtesy: http://farm5.staticflickr.com

[Opie, John (1761-1807) – The Blind Beggar of Bethnal Green and his Daughter (Ashmolean Museum of Art, University of Oxford, U.K.)]

.

Whenever I travelled by train

I found him getting into it at some station

His daughter walking him, and following

.

He always rendered one poem or the other, taking

Only from  the Dasarathi Satakam

.

And his voice remained the same—

Like one drowning in a well, in his former life,

Calling out for help and nobody within reach to listen.

.

That call echoed, ringing thin and died down

struggling to stay alive in the gullet,

And at last, reached out to him in this life.

.

His eyes  were  those two sockets,

Which had yearningly looked around, then,

For help in hope, and stalled…

Life lay suspended in those eye slots

Till they found him, once more, in this life.

.

All through his singing; and

Whenever I looked at his eyes,

A feeling charged up in my heart

To rescue that drowning man from the well.

.

Meanwhile, stopping his song,

Begging for a coin here and a copper there, he would get down

After his daughter…  and I was left there behind.

.

Viswanatha Satyanarayana

Note:

Dasarathi Satakam is a work in the genre “Satakams” in Telugu Literature consisting of 100 quatrains (Usually 108) of any one form (or more) of poetry with a refrain in the end… stretching either for the entire length of fourth line  or part thereof.  In case of ‘Seesam’ , another form of poetry of 12 lines, it may extend to last two lines.

.

అంధ భిక్షువు

.

అతడు, రైలులో నే బోయినప్పుడెల్ల
నెక్కడో ఒక్కచోట దా నెక్కు – వాని
నతని కూతురు నడిపించు చనుసరించు.

అతడు దాశరథీశతకాంతరస్థ
మైన పద్యమె పఠించు ననవరతము.

అతని యాగొంతు కట్లనే – అతడు పూర్వ
జన్మమందున నే నూతిలోననో చచ్చిపోవు
చెంతపిలిచిన వినువారలేని లేక,

ఆ పిలుపు ప్రాణకంఠమధ్యములయందు
సన్నవడి సన్నవడి నేటిజన్మ నతని
కనుచు వెదకుచు వచ్చి చేరినది కాక-

అతని కన్నులాబొత్తలే – ఆ సమయము
నందు తన్ను రక్షింప నేరైన వత్తు
రేమొయని చూచి చూచి యట్లే నిలబడి-
అతని ప్రాణాలు కనుగూళ్ళయందు నిలిచి
మరల గనె గాక నేటిజన్మమున నతని.

అతనుపాడినయంతసే పల్ల – నట్టి
యతనికన్నులు చూచినయప్పుడెల్ల,
నూతిలో మున్గునాతని తీతునంచు
వేగిరముపుట్టు నాదు హృద్వీథియందు;

అంతలో పాటనాపి, తా నచట నచట
కానులడిగి, కూతురు ముందుగా, వినిర్గ
మించు నాతడు- నే నందు మిగిలిపోదు!
.
విశ్వనాథ
(ముద్దుకృష్ణ- వైతాళికులనుండి)

[Disclaimer: The painting displayed here is without permission and shall be removed if anybody expresses objection to it.]

“A Blind Beggar … Viswanatha Satyanarayana.” కి 2 స్పందనలు

  1. శ్రీశ్రీ భిక్షు వర్షీయసీ, విశ్వనాథ అంధ భిక్షువు కవితలలోని విషయ సమానత్వాన్ని పరికించండి. ఇప్పుడంటే మనకు చిరపరిచితమైపోయినా, అప్పుడు బహుశా ఈ దృశ్యాలు అరుదైనవి కావచ్చు.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: