నువ్వు నన్ను ప్రేమించదలుచుకుంటే … ఎలిజెబెత్ బారెట్ బ్రౌనింగ్

 
http://2.bp.blogspot.com/_e2_WaI3XLjM/TRUwEhsOSaI/AAAAAAAAABc/A1s4XbP0PZU/s1600/love+in+the+lovely+ocean.jpg
Image Courtesy: http://2.bp.blogspot.com

.

నువ్వు నన్ను ప్రేమించదలుచుకుంటే, 

నీ ప్రేమకు కారణం ప్రేమే తప్ప మరేదీ కాకూడదు

“ఆమె నవ్వుకి ఆమెను ప్రేమిస్తున్నాననీ–

ఆమె చూపులకు ప్రేమిస్తున్నాననీ– 

ఆమె సౌమ్యంగా మాట్లాడే తీరుకనీ, —

మా ఇద్దరి ఆలోచనలూ ఆ విషయం లో

ఆశ్చర్యం గా ఒక్కలా ఉన్నందుకనీ, 

ఫలానా రోజు నిజంగా నాకు

ఎంతో  ఉపశమనాన్నీ సంతృప్తినీ ఇచ్చిందనీ…” చెప్పకు.

ప్రియతమా!

ఎందుకంటే అలాంటి ప్రవర్తనలు స్వతహాగా మారేవి…  

నీకోసం మారొచ్చు.

అంతే కాదు, అలా కలిగిన ప్రేమ, అలాగే విరిగిపోతుంది కూడా.

.

అలాగే నా చెక్కిలిపై కన్నీళ్ళను తుడిచేనన్న జాలితో నన్ను ప్రేమించకు.

నీ అనునయాన్ని చిరకాలమనుభవించిన జీవి,

ఏడవడం మరిచిపోవచ్చు, తద్వారా నీ ప్రేమను కూడా.

నన్ను ప్రేమిస్తే, ప్రేమకోసం మాత్రమే ప్రేమించాలి…

నన్ను నిరంతరం ప్రేమించాలి… 

అనంతమైన  ప్రేమకోసం ప్రేమించాలి.

.

ఎలిజెబెత్ బారెట్ బ్రౌనింగ్ (1806-61)

 

(ఆంగ్ల సాహిత్యం లో అపూర్వమైన ప్రజ్ఞా పాటవాలు కలిగిన కవయిత్రులలో ఎలిజెబెత్ బారెట్ బ్రౌనింగ్ ఒకరు. కేవలం

స్వయంకృషి ద్వారా మాత్రమే సాహిత్యాధ్యనం చేసి, గుర్తింపబడని అనారోగ్యం ఆమెను కుంగదీస్తున్నా చలించకుండా,

సమకాలీన సాహిత్యంలో లబ్దప్రతిష్టులైన సాహిత్యకారులతో చిన్ననాటినుండే ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ, తన

సాహిత్య సంపదకి, వర్డ్స్ వర్త్ మరణం తర్వాత Poet Laureate గౌరవానికి టెన్నీసన్ కి  దీటుగా నిలవగలిగిన ప్రతిభాశాలి.

తమ సంపద అంతా బానిస వ్యాపారంతో ముడిపడి ఉన్నా, బానిసత్వాన్ని నిర్ద్వంద్వంగా ఖండించి, 1831-32 లో జమైకాలో

జరిగిన బానిసల తిరుగుబాటు తర్వాత తండ్రి  దృక్పథంలో మార్పు రావడానికి కొంతవరకు కారకురాలు కూడా.)

If thou must love me… (Sonnet 14)

.

If thou must love me, let it be for nought

Except for love’s sake only. Do not say,

“I love her for her smile—her look—her way

Of speaking gently,—for a trick of thought

That falls in well with mine, and certes brought

A sense of pleasant ease on such a day”—

For these things in themselves, Belovèd, may

Be changed, or change for thee—and love, so wrought,

May be unwrought so. Neither love me for

Thine own dear pity’s wiping my cheeks dry:

A creature might forget to weep, who bore

Thy comfort long, and lose thy love thereby!

But love me for love’s sake, that evermore

Thou mayst love on, through love’s eternity.

.

Elizabeth Barrett Browning

(6 March 1806 – 29 June 1861)

Mrs Browning was a celebrated (and self-made)  poetess of the Victorian Era, who produced an enormous amount of

literary output before her marriage to Mr Robert browning,  in spite of frail health, and made her a rival candidate for

the post of Poet Laureate to Tennyson in 1850, after the death of Wordsworth. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: