As Usual… Arun Bavera, Telugu, Indian Poet
Cerebrations linger anew without day-break,
The look from under the old eyelids
Throws no fresh light,
All along the way … the clothes doffed yesterday.
Washed out colors reveal no new meanings.
Letters won’t shed their wonted winding ways.
There is always a want … for new connotations.
Nobody appreciates the jaded mural inscriptions
On paper.
The “As Usual”ness yawns
With demonic fangs every day.
The senile sea sits silent
swallowing the waves.
No new hopes gleam through the eyes,
Nor, new sensations issue forth.
Blood streams on … putting out its fire,
And old enthusiasm in the body
Gets exposed to white ants.
Smouldering excitements pique… singeing the skin.
Memories of the past
Prick the heart at midnight.
Fractured dreams, always,
Hung on the heart-line to dry.
The whole journey — one, that of a tethered ghanny-ox.
.
Stale Seasons give out … no sweet fragrances,
Old-fashioned Cuckoos … can’t sing new tunes
And for the new lyrics… old burdens are not meet
No conflict gives … room for novelty
No patient wait … gives voice to new songs.
.
Never- the flutter of new sails is heard on the river
Always- A pall of pale moonlight extending on the plains!
.
Arun Bavera
3rd Aug 2001
.
షరా మామూలుగా…
.
కొత్త ఊహలు తెల్లారవు
పాత రెప్పల కింద చూపు
కొత్త వెలుగివ్వదు
దారిపొడుగునా నిన్న విడిచిన దుస్తులే
మాసిన రంగులు కొత్త భావాల్ని చెప్పవు
అక్షరాలు
పాత వంకర్లను వదులుకోవు
కొత్త అర్థాలు ఎప్పుడూ కరవే!
కాగితం మీద
పాతరాతల గోడలు ఎవరూ మెచ్చరు
షరా మామూలుతనం రోజూ
రాకాసికోరలతో ఆవులిస్తుంది
ముసలి సముద్రం
కెరటాలు మింగేసి కూచుంటుంది
కళ్ళల్లో కొత్త ఆశలు మొలకెత్తవు
కొత్త కదలికలు ప్రసవించవు
రక్తం నిప్పులనార్పేసుకుని ప్రవహిస్తోంది
వొంట్లో పాత ఉత్సాహాలకి
చెదలు పడుతున్నాయి
పాత ఉద్రేకాలు
పురుగు ముడుతున్నాయి
అర్థరాత్రి గుండెల్లో
పాత జ్ఞాపకాల సలపరం
సదా చిరిగిన కలల్ని
మనసుమీద ఆరేసుకోవడం…
అంతా ఒకటే గానుగెద్దు ప్రయాణం
.
పాత ఋతువులేవీ పరిమళించవు,
పాత కోయిళ్ళు కొత్త పాటలు పాడవు
కొత్తపాటలకు పాత పల్లవులు సరిపడవు
ఏ సంఘర్షణా కొత్తదనానికి చోటివ్వదు
ఏ నిరీక్షణా కొత్తగీతాలకి గొంతివ్వదు.
.
ఎప్పుడూ- నదిలో తెరచాపల చప్పుడే వినిపించదు!
ఎప్పుడూ- ఆరుబయట రంగు వెలిసిన వెన్నెలే!
.
అరుణ్ బవేరా
ఆగష్టు 3, 2001
(ఒక కన్నీటి చుక్కకోసం కవితా సంకలనం నుండి)
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి