రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 5వ భాగం
స్వామీ! ఒకప్పుడు తమరే కదా, ఈ సింహాసనానికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసింది. అయినా ప్రభువులు తమకు సహజమైన ఔదార్యంతో కనికరించి క్షమా భిక్ష పెట్టారు. కాని ఇప్పుడు మిమ్మల్ని ఏ వెర్రి ఆవహించింది? (కాశ్యపను చూపిస్తూ) ఇంతవరకు ఎన్నడూ కనీ వినీ ఎరుగని మరుగుజ్జూ, కురూపీ, సంస్కార హీనుడూ, ముక్కుమీద బొడిపెలతో అందవికారంగా ఉన్న అటువంటి ఆకారంనుండా మనుమల్ని ఆశిస్తున్నారు? నా గూనిలాగే వంకరవాడు అతను. మీ కూతుర్ని అతని సరసను చూస్తే ఎవ్వరైనా నవ్వుకో వలసిందే!
లేదా నాలాగ గూనితోనో. అబ్బ! ఎంత రోత!
మీ కాళ్లమీద తారంగం, తారంగం, మీ బవిరిగడ్డంతో ఆటలూ…
వేలరీ: ఇంతవరకూ జరిగిన అవమానాలు చాలక మరొకటన్నమాట!
2 responses to “రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 5వ భాగం”
-
Thanks for the translation
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
మీరు ఈ నాటకం పూర్తిగా చదివారా? దయచేసి మీస్పందనని తెలుపగలరు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
వ్యాఖ్యానించండి