అనువాదలహరి

స్నేహితులు మూడు రకాలు…. రూమీ, పెర్షియన్ కవి

నే చెపుతున్నా, వినుకో: స్నేహితులు మూడు రకాలు

మనని వాడుకునే వాళ్ళు, స్నేహం నటించేవాళ్ళు, నిజమైన స్నేహితులూ.

.

ఎదో కొంత విదిల్చి, నిన్ను వాడుకునే వాడిని వదిలించుకో

తియ్యగా మాటాడుతూనే, నటించేవాడు నిన్ను మోసగించకుండా చూసుకో.

.

కానీ, నిజమైన స్నేహితుడిని మనసులో పదిలపరుచుకో

కష్టపడవలసి వచ్చినా, భరించు. కానీ, అతన్ని చెయ్యిజారనియ్యకు.

.

రూమీ

(30 సెప్టెంబరు 1207 – 17 డిసెంబరు 1273)

పెర్షియన్ సూఫీ కవి

.

Jalal ad-Dīn Muhammad Rumi
Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi

 

Friends are three types…
.
Friends are three types, I’ll tell you:

The user, the faker, and the true!

.

Throwing a crumb, cut the user loose!

Speaking sweetly, don’t let fakers abuse!

.

But the true friend, keep him in your heart;

Walk the extra mile, don’t let him depart!

.

Rumi

(1207 – 1273)

Persian  Sufi Poet


Translation: Maryam Dilmaghani.

poem Courtesy:  Persian Poetry in English

ప్రకటనలు

అసలు లేని వడ్డీ… రూమీ, పెర్షియన్ కవి

తినబొయేదానిమీద ఆశే, ప్రేమికుని నిలబెట్టేది;
చేతిలో రొట్టె ఉండనక్కరలేదు;
ప్రేమలో నిజాయితీ ఉన్నవాడు అస్తిత్వానికి బానిస కాడు.

ప్రేమికులకి అస్తిత్వంతో పనిలేదు.
ప్రేమికులు అసలు లేకుండా వడ్డీ గణిస్తారు.

రెక్కలులేకుండానే ప్రపంచం చుట్టివస్తారు; 
చేతులు లేకుండనే, పోలోబంతిని మైదానం బయటకి కొనిపోతారు.

వాస్తవం ఆచూకీ పట్టుకోగలిగిన డార్విష్
అతని చేతులు ఖండించబడినా, బుట్టలల్లగలిగేవాడు

ప్రేమికులు తమ డేరాలని శూన్యంలో నిలబెట్టేరు
వాటి లక్షణం, గుణం రెండూ శూన్యాన్నిపోలినవే.

.

రూమీ

పెర్షియను కవి

The lover’s food is the love of the bread;
no bread need be at hand:
no one who is sincere in his love is a slave to existence.

Lovers have nothing to do with existence;
lovers have the interest without the capital.
Without wings they fly around the world;
without hands they carry the polo ball off the field.

That dervish who caught the scent of Reality
used to weave basket even though his hand had been cut off.

Lover have pitched their tents in nonexistence:
they are of one quality and one essence, as nonexistence is.

.

Rumi

Persian Poet and Sufi

 

poem Courtesy:

http://www.rumi.org.uk/passion.htm

సంతోషక్షణం… జలాలుద్దీన్ రూమీ, పెర్షియన్ కవి

నువ్వూ- నేనూ వరండాలో కూర్చున్నది
ఒక సంతోష క్షణం
చూడడానికి ఇద్దరం గాని నువ్వూ నేనూ ఒకే ఆత్మ
మనిద్దరమూ పూదోట సౌందర్యంతో
పక్షుల కిలకిలారావాలతో
ఇక్కడ జీవనస్రవంతిని అనుభవిస్తున్నాం.
చుక్కలు మనల్ని గమనిస్తుంటాయి
మనం వాటికి సన్నని సినీవాలి
అంటే ఏమిటో చూపిస్తాము.
మన అహాలు వదులుకుని ఇద్దరం కలిసి ఉంటాము
మనిద్దరం భవిష్యత్తుగురించి నిష్ఫలమైన ఊహాగానాలు చెయ్యం
మనిద్దరం నవ్వుతూ ఉంటే
ఆకసంలో పక్షులు పళ్ళు రుచిచూస్తుంటాయి
ఒక ఆకృతిలో ఈ భూమి మీద
మరొక ఆకృతిలో అనంతా కాల వేదికమీద… నువ్వూ నేనూ…
.
జలాలుద్దీన్ రూమీ
పెర్షియన్ కవి

Jalal ad-Dīn Muhammad Rumi Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi

A moment of happiness,
you and I sitting on the verandah,
apparently two, but one in soul, you and I.
We feel the flowing water of life here,
you and I, with the garden’s beauty
and the birds singing.
The stars will be watching us,
and we will show them
what it is to be a thin crescent moon.
You and I unselfed, will be together,
indifferent to idle speculation, you and I.
The parrots of heaven will be cracking sugar
as we laugh together, you and I.
In one form upon this earth,
and in another form in a timeless sweet land.
.

Mewlana Jalaluddin Rumi

భావనాతీతం… రూమీ, 13వ శతాబ్దపు సూఫీ తత్త్వవేత్త

తప్పొప్పులు చేస్తున్నామన్న భావనలకి అతీతంగా

ఒక క్షేత్రం ఉంది. అక్కడ నేను నిన్ను కలుస్తాను.

అక్కడ పచ్చిక మీద ఆత్మ మేను వాలిస్తే

ఈ ప్రపంచం మాటలకి అందనంత పూర్ణంగా కనిపిస్తుంది.

భావనలు, భాష,

ఆ మాటకొస్తే ఒకరితో ఒకరు చేసే సంభాషణా

ఏదీ అర్థవంతంగా కనిపించవు…

.

రూమీ

 13వ శతాబ్దపు సూఫీ తత్త్వవేత్త.

.

Jalal ad-Dīn Muhammad Rumi Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi
Jalal ad-Dīn Muhammad Rumi
Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi

.

Out beyond ideas of wrongdoing and right doing,

there is a field. I’ll meet you there.

When the soul lies down in that grass,

the world is too full to talk about.

Ideas, language, even the phrase each other

doesn’t make any sense.

.

Rumi

(From Essential Rumi Translated by  Coleman Barks)

విశ్వాత్మ… రూమీ, పెర్షియన్ కవి, సూఫీ తత్త్వవేత్త.

ఈ మాటలు నేను ఇప్పుడు చెబుతున్నవి కావు,

కాలాదినుండి వెలుగు తూలికతో రాసినవి.

సత్యానికి రంగూ లేదు, వాసనా లేదు

ఏ ఒకరి ప్రయాసలవల్లా, ప్రమాణాలవల్లా

ఉత్పన్నమయేది, నిరూపించబడేదీ కాదు

 

నువ్విక్కడికి రప్పింపబడ్డావు గనుక

నీకో స్వర్గ రహస్యం చెబుతాను విను:

“ఎవ్వరేమి చెప్పినా, ఏమి రాసినా

ఆ రాసింది నువ్వే… స్వయంగా నువ్వే!

నువ్వే జీవితానికి వాహికవి;

ఈ విశ్వానికి ఆత్మవి!

సంచరిస్తున్నా, సమాధిలో ఉన్నా,

వేదనలోనూ, నిస్పృహలోనూ

నీ జీవిత పర్యంతమూ

నీ వెంట నువ్వే పరిగెడతావు.

 

“కానీ అది నీకు తెలీదు, తెలుసుకో లేవు!

నువ్వు ప్రేమకి పరాకాష్ఠవి. నువ్వే!

నిక్షిప్తమైన నిధివీ,

ఆగోచరమైన రహస్యానివీ,

స్వర్లోక నందనోద్యానవనానివీ,

అత్యున్నత స్వర్గ శిఖరానివీ… నువ్వే.

ఎందుకు? ఏమిటి? ఎలాగ? అన్న ప్రశ్నలపరంపరతో

సందేహాల శృంఖలాలతో, నువ్వు నీ దరికి చేరుకుంటావు.

 

“ఎవ్వరేమి చెప్పినా, ఏమి రాసినా

ఆ రాసింది నువ్వే… స్వయంగా నువ్వే!

నువ్వే జీవితానికి వాహికవి;

నువ్వే ఈ విశ్వానికి ఆత్మవి!

నువ్వు ప్రేమకి పరాకాష్ఠవి.

నిక్షిప్తమైన నిధివీ,

ఆగోచరమైన రహస్యానివీ, అన్నీ నువ్వే!

 

“ఇక్కడే కాదు, విశ్వమంతటా.

ఈ క్షణమే కాదు, ఏ రోజైనా సరే.

ఇది సార్వజనీనిక సత్యం:

అందరిలో నువ్వున్నావు; నీలో అందరూ ఉన్నారు.

మౌనానివీ నువ్వే,

శబ్దానివీ నువ్వే,

ఎందుకు, ఎలాగ అన్న సందేహాల సంగ్రామాలనుండి

చివరకి నీదగ్గరకి చేరుకునేదీ నువ్వే!”

 

ఇపుడు నీకు ప్రమాణం చేసి చెబుతున్నా:

“అన్నీ విన్న తర్వాత,

అన్నీ చూసిన తర్వాత,

నువ్వు మేల్కొని, నిర్భీతితో చరిస్తే

ఇహంలోనే కాదు, పరంలో కూడా నువ్వు వంద్యుడవే!

ఒక అంగమో, ఒక ఉపాంగమో కాకుండా

ఇపుడు నువ్వే మూలానివి!

 

“కనుక, లే! రెక్కతొడిగి విహాయసవీధుల్లో విహరించు!

నిష్ఫలమైనవీ, త్యజించబడినవాటినుండీ దూరంగా  జరిగిపో! 

నీ స్వయంప్రకాశపు వెలుగులలోకి ఎగిరిపో!

అక్కడనీకు బంగారు బహుమానం లభిస్తుంది:

అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువుతో ఐక్యత! “

.

రూమీ (జలాలుద్దీన్ ముహమ్మద్ రూమీ)

(30 సెప్టెంబరు 1207 – 17 డిసెంబరు 1273)

పెర్షియన్ కవి, సూఫీ  తత్త్వవేత్త.

.

Jalal ad-Dīn Muhammad RumiImage Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi
Jalal ad-Dīn Muhammad Rumi
Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi

.

These Words, I do not say them now!

From the beginning of Time,

I wrote them with the Plume of Light.

Truth has no scent, neither it has a hue.

It is not made of their ado–

or of their solemn swears.

 

Now that you are called upon here,

I confide in You, this heavenly covert:

“Whatever they said– and whatever they wrote,

is You, yourself!

You are the Vessel of Life,

And the Soul of this world!

Hidden or unveiled, your whole life–

you run after yourself– in distress and despair.

 

And you know not, you know not!

You are the Zenith of Love, yourself!

You are-

the hidden treasures yourself,

the veiled secrets yourself,

The Garden of Eden–

and The Seventh Heaven;

Returning to yourself–

from the chain of queries,

from the queue of Whys and Hows.

 

Whatever they said– and whatever they wrote,

is You, yourself!

You are the vessel of life,

And the soul of this world!

You are–

The Zenith of Love,

Yourself, the Hidden Treasures,

Yourself, the Veiled Secrets, Yourself!”

 

Not only here, but everywhere!

Not just in this hour, but everyday!

With each and everyone,

All in You, You in All.

You are the silence–

and you are the voice,

retuning to yourself from the crusade–

of Whys and Hows.

****

I swear to You now:

“Having seen it all,

Having heard it all–

and yet awakened, unafraid,

You are noble in Heavens and Earth!

No more just a shell, no more just a part,

You are now The Heart!”

Thus, Soar up and high!

Soar away from the forsaken–

and from the spoiled!

Soar up to the sphere of your own light!

And there, you will receive– the golden prize–

of the Unison with The Beloved.

 .

Rumi

(30 September 1207 – 17 December 1273)

Persian poet, jurist, theologian, and Sufi mystic.

.

Courtesy:

 Translation: Maryam Dilmaghani, June 2010, New Brunswick

.

ప్రేమకి పరాకాష్ఠ … రూమీ, పెర్షియన్ కవి, సూఫీతత్త్వవేత్త.

ఇది నువ్వు తెలుసుకో:

.

నేను శిష్యుడినీ కాను, గురువునీ కాను;

పలుకునీ కాను, దాని భావాన్నీ కాను;

పలకరింపునీ కాను, వీడ్కోలునీ కాను;

.

నేను తెలుపునీ కాను, నలుపునీ కాను;

నువ్వు అనుకుంటున్నదీ కాను,

ఒకరు నా గురించి చెప్పగా నువ్వు నమ్మినదీ కాను;

నువ్వు అనుకుంటున్నదీ కాను,

ఒకరు  నా గురించి రాసి నువ్వు చదివినదీ కాను;

.

నేను ఆకాశాన్నీ కాను, భూమినీ కాను;

ఏ నమ్మకానికీ కట్టుబడి లేను;

ఏ ఋషి ఆదేశానికీ లోబడిలేను;

.

నేను ఎండమావినీ కాను;

నీ ఏకాంత రాత్రులలో మధువునీ కాను;

నేను బందీని కాను, బానిసనీ కాను, ఎన్నడూ అవమానితుడినీ కాను!

.

నేను ఏ ప్రవక్తనీ కాను;

నే నెన్నడూ గుడులలో గాని,

మసీదులలో గాని,

చర్చిలలో గాని కూర్చోను;

.

నేను స్వర్గానికీ  చెందను.

నరకానికీ చెందను.

.

రూమీ

(30 September 1207 – 17 December 1273),

పెర్షియన్ కవి, సూఫీ తత్త్వవేత్త.

.

Jalal ad-Dīn Muhammad RumiImage Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi
Jalal ad-Dīn Muhammad Rumi
Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi

.

Zenith of Love… 

.

And let know:
“I am–
Not the disciple, not the guru,
Neither the word, nor the message,
Neither the greeting, nor the farewell.

I am
Neither black nor white,
Neither what you think, nor what they said and you believed,
Neither what you suppose, nor what they wrote and you read.

I am 
not the Heavens,
And not this Earth,
Nor enchained to a faith–
and in command of a sage.

I am not the mirage,
And not the glass of wine … for your lonely nights,
Not a captive, not enslaved, never disgraced!
And not send by the enlightened,
Nor will I ever sit in the temple,
or in the mosques–
or in the cathedrals.

And I am not meant for Paradise,
and neither for Hell.

Those have never been my fate.”

(Prose-Poem by Rumi)

.

Rumi

(30 September 1207 – 17 December 1273)

Persian Poet and Sufi Mystic

Translation: Maryam Dilmaghani, June 2010, New Brunswick

అతిథి గృహం … రూమీ, పెర్షియన్ కవి

.

ఈ మానవజీవితమే ఒక అతిథి గృహం .

ప్రతి ఉదయమూ ఒక కొత్త అతిథి  రాక.

ఒక ఆనందం, ఒక నిరాశ, ఒక నీచమైన ఆలోచన,

ఒక క్షణికమైన జ్ఞానోదయం, అనుకోని అతిథిలా వస్తుంటాయి.

అన్నిటినీ ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వు!

అవి ఒక కష్టాల పరంపర అయినప్పటికీ

ఇంట్లోని సర్వస్వాన్నీ  తుడుచుపెట్టుకుపోయినప్పటికీ,

ప్రతి అతిథినీ, అతిథికివ్వవలసిన పూర్తి గౌరవంతో సేవించు

ఏమో! ఒకొక్కరూ నిన్నొక కొత్త ఆనందానికి సన్నద్ధం చేస్తుండవచ్చు.

భయాలూ, అవమానాలూ, అసూయలూ

అన్నిటినీ ద్వారం దగ్గరే నవ్వుతూ పలకరించు

లోపలికి సాదరంగా ఆహ్వానించు.

ఎవరు లోపలికి వచ్చినా వారికి కృతజ్ఞుడవై ఉండు.

ఎందుకంటే, అందులో ప్రతి ఒక్కరూ ఊహాతీత లోకాలనుండి

నీకు మార్గదర్శనం చెయ్యడానికి పంపబడినవారే.

.

రూమీ

(30 September 1207 – 17 December 1273),

పెర్షియన్ కవి, సూఫీ తత్త్వవేత్త.

.

Rumi's attributed photo
Rumi’s attributed photo (Photo credit: Eliza_Tasbihi)

.

The Guest House

.

This being human is a guest house.

Every morning a new arrival.

A joy, a depression, a meanness,

some momentary awareness comes

as an unexpected visitor.

Welcome and entertain them all!

Even if they’re a crowd of sorrows,

who violently sweep your house

empty of its furniture,

still, treat each guest honorably.

He may be clearing you out

for some new delight.

The dark thought, the shame, the malice,

meet them at the door laughing,

and invite them in.

Be grateful for whoever comes,

because each has been sent

as a guide from beyond.

.

Rumi

Courtesy: http://lifeacousticandamplified.wordpress.com/

చీకటి అంటే లక్ష్యం లేదు… రూమీ, పెర్షియన్ కవి.

.

ఈ భౌతిక ప్రపంచం విలువిచ్చే వేవీ

ఆత్మ సత్యశోధన ముందు నిలబడవు.

.

నువ్వు నీ నీడని ఇష్టపడుతున్నావు,

బదులుగా, తిన్నగా సూర్యుడిని చూడు.

.

మనం ఒకరొకరు ఆక్రమించే

స్థల-కాలాకృతులు చూసుకొని ఏం తెలుసుకుంటాం?

.

రాత్రల్లా సగం మెలకువగా ఉన్నవాడు

రాబోయే ఉపద్రవాలు ఊహించుకుంటాడు.

వేగుచుక్క పొడుస్తుంది;

ఆకాసపుటంచులు కనిపించడం మొదలౌతుంది.

బిడారులో యాత్రికులు స్నేహాలు చేసుకుంటారు.

.

రాత్రి తిరిగే పక్షులకి

పగలు రాత్రిగా అనిపిస్తుంది,

కారణం, వాటికదే తెలుసు గనుక.

చీకటి భయ, కుతూహలములు

ఎంతమాత్రమూ రేకెత్తించని పక్షి అదృష్టవంతురాలు…

నిత్యం ఆనందంతో ఉండేవారిని “షాం తబ్రిజీ” అంటాము.

.

రూమీ

పెర్షియన్ కవి

( Note:

బిడారు: జంతువులపై ప్రయాణించే యాత్రికుల లేదా వర్తకుల సమూహం.

వేగుచుక్క: శుక్రగ్రహం. ఇది సాధారణంగా డిశంబరునెలలో తూర్పు దిక్కున కనిపిస్తుంటుంది. అది కనిపించిందంటే, ఇక సూర్యోదయం అవబోతున్నదని లెక్క.

షాం తబ్రిజీ: రూమీకి జ్ఞానోపదేశం చేసిన గురువు.

ఈ కవితలో సౌందర్యం …రాత్రి చరించే పక్షులకి పగలు చీకటిగా కనిపించడం. అందుకే గుడ్లగూబలకి “దివాంధములు” అంటారు.  అది స్వభావోక్తి అయినా, ఇక్కడ చేసిన మానసికవిశ్లేషణ చాలా పదునైనది. మనకి ఉండే Mental Blocks ని చాలా చక్కగా చెబుతోంది. (Remember Rumi was a 13th century Poet, Philosopher and Sufi Mystic).

Rumi's attributed photo
Rumi’s attributed photo (Photo credit: Eliza_Tasbihi)

.

Not Intrigued With Evening

.

What the material world values

doesnot shine the same in the truth of the soul.

You have been interested in your shadow.

Look instead directly at the sun.

What can we know by just watching

the time-and-space shapes of each other?

Someone half awake in the night

sees imaginary dangers;

the morning star rises;

the horizon grows defined;

people become friends in a moving caravan.

Night birds may think

daybreak a kind of darkness,

because that’s all they know.

It’s a fortunate bird

who’s not intrigued with evening,

who flies in the sun we call Shams.

.

Rumi

.

(From Soul of Rumi

English Translation by Coleman Barks)

ప్రేమికులు … Rumi, Iranian Sufi Poet

(ఇస్లాంలోని సూఫితత్త్వం ప్రధానంగా ఆలోచన (దైవం వినా అన్ని ఆలోచనలనీ పరిహరించడం),ఆచరణా (విషయ వాంఛలన్నీ వదులుకుని పూర్తి నిరాడంబరమైన జీవితం గడపడం) బోధిస్తుంది. సూఫీ తత్త్వవేత్తల జీవనశైలీ, ఆలోచనా విధానమూ, మానవతా దృక్పధమూ కొన్నివందలసంవత్సరాలు మిగతా మతాలని కూడ ప్రభావితం చేశాయంటే అతిశయోక్తి కాదు.

ఈ కవితలో, వివరిస్తున్న సురాపానము, నిజమైన సురాపానము కాదు. అది దైవ ధ్యానం లేదా భగవన్నామస్మరణకి  ప్రతీక. హేతువాదం నమ్మకానికి పెద్ద అడ్డంకి. కనుక భక్తితో, మనోవాక్కాయ కర్మలా ధ్యానం చేసినపుడు జీవితంలోని చేదు, చేదుగా అనిపించదు; బాధలు బాధించవు; ఈ నిష్కామభక్తి భక్తుడు భగవంతుని సమీపానికి చేరడానికి సాధనమని సూఫీ తత్త్వపు సందేశం.)

.

ప్రేమికులు

రాత్రనక పగలనక తాగుతూనే ఉంటారు…

ఎంత తాగుతారంటే, ఆ తాగుడులో

తమ మేధోపరమైన అహంకారమూ

సిగ్గూ, అవమానాల గురించిన చేతనా

మొదలుగాగల అన్ని పొరలూ తొలగిపోయేదాకా.

.

ఈ ప్రేమలో

మనసూ, శరీరమూ, హృదయమూ, ఆత్మా , బాధా

మొదలైన స్పృహగాని వివేచనగాని ఉండదు.
.

నీ ప్రేమ అలా నిష్కామమైనపుడు

మీరిద్దరికీ వియోగమన్నదే ఉండదు.

.

మౌలానా జలాలుద్దిన్ ముహమ్మద్ రూమీ

(30 September 1207 – 17 December 1273)

.

The Lovers

.

The Lovers

will drink wine night and day,

will drink until they can wash away

the veils of intellect and

shame and modesty.

With this Love,

body, mind, heart and soul and pain

do not exist.

If your Love is unconditional like this

you cannot be separate again.

.

Mawlana Jalal ad-Din Muhammad Rumi

Tomb of Jalal ad-Din Muhammad Rumi; Mevlâna ma...
Tomb of Jalal ad-Din Muhammad Rumi; Mevlâna mausoleum; Konya, Turkey (Photo credit: Wikipedia)

%d bloggers like this: