Tag: Larry S Chengges
-
ఎప్పుడూ అన్యోన్యంగా ఉండండి… లారీ ఎస్. చెంగెజ్, అమెరికను
మీరు ఈ రోజులాగే సన్నిహితంగా, ఆనందంగా ఉండగలుగుతూనే ఎవరికి వారు ఎదుగుతూ, కాలంతోపాటు మారగలిగే నిబ్బరం కలిగి ఉంటే భార్యాభర్తలుగా మీరు అనురాగాన్ని ఒకరికొకరు పంచుకుంటూనే ఇతరులతో ఆనందాన్ని పంచుకుందికి సమయం కేటాయించగలిగితే చేతులో చెయ్యివేసుకుని ఇద్దరూ ఒకరిగా దాంపత్య జీవితాన్ని గడుపుతూనే మీరు ఒకరి ఆశలనీ, కలలనూ రెండవవారు సాకారంచేసేలా సహకరించుకోగలిగితే ఇద్దరూ ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్లగలిగే సాహసాన్ని ప్రదర్శించగలిగితే ఈ రోజు మీరు చవిచూస్తున్న సంభ్రమం మీ జీవితకాలం మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది.…
-
ఏదైనా సాధ్యమే అని నమ్మేవాళ్ళకి… లారీ ఎస్ చెంగెజ్, అమెరికను
తమ శక్తియుక్తులపై నమ్మకం లేనివాళ్లకి ఏ అద్భుతాలూ జరుగవు… నువ్వు ఏది నమ్మినప్పటికీ; నువ్వు ఏం చేసినప్పటికీ; నువ్వు నీ జీవితంలో ఏది సాధించినప్పటికీ, నీ మార్గాన్ని మరలించుకుని ఏదైనా కొత్తగా పునఃప్రారంభించడానికి ఎప్పుడూ సమయం మించిపోదు… ఒక సరికొత్త ప్రారంభం, ఉజ్జ్వలమైన భవిష్యత్తు, అన్ని అంచనాలనూ అధిగమించిన అద్భుతమైన ప్రశాంతతా… ఇప్పటికీ, ఇక ఎప్పటికీ అక్కున జేర్చుకునే అవకాశం ప్రయత్నించాలిగాని… నీదే! . లారీ ఎస్ చెంగెజ్ . For Those Who Believe All…
-
నీ స్నేహానికి నా కృతజ్ఞతలు … లారీ ఎస్ చెంగెజ్
. నామీద నాకే నమ్మకంలేక సతమతమౌతున్నప్పుడు నా మీద నమ్మకముంచినందుకూ… నాతో ఏకీభవిస్తూ నేను వినాలనుకున్నది కాకుండా… నే నేది వినాలో అది చెప్పినందుకు కృతజ్ఞతలు. నీ మనసు నాతో పంచుకున్నందుకూ నీ ఆలోచనలూ, కలలూ, వైఫల్యాలూ నన్ను నమ్మి, నాతో చెప్పుకున్నందుకూ… నీ అవసరానికి నేను పనికొస్తానని విశ్వసించి, అవసరంలో సాయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు. మనస్నేహం పెంపొందడానికి ఎంతో ముందుచూపూ, ఆలోచనా, శ్రద్ధా కనబరిచి నాతో ఎన్నో మధురమైన క్షణాలను పంచుకుని ఎన్నో…
-
నేను నిన్ను ప్రేమిస్తున్నాను… లారీ ఎస్ చెంగెజ్
. నువ్వు నువ్వయినందుకే కాదు, నీ సమక్షంలో నేను నేనయినందుకు నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమలో నిన్ను నువ్వు మలుచుకున్న తీరుకే కాదు నన్ను నువ్వు మలుచుతున్న తీరుకికూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నాలోని ఒకపార్శ్వాన్ని బయటకి రప్పిస్తున్నందుకు నిన్ను ప్రేమిస్తున్నా పోగుపడ్డ నా హృదయం మీద నీ చెయ్యి వేసి అక్కడ కనిపించిన బలహీనమైనవీ, తెలివితక్కువవీ గుర్తించి సరిదిద్దలేనివి అలా వదిలేసి ఇంతవరకూ ఎవ్వరూ చూడడానికి ప్రయత్నించని సుందరమైన విషయాలు చూసి పనిగట్టుకుని వెలుగులోకి తీసుకువచ్చినందుకు నిన్ను ప్రేమిస్తున్నాను.…