అనువాదలహరి

అర్థరాత్రి వేళ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

 .

ఎలాగైతేనేం, ఇన్నాళ్ళకి నాకు జీవితం అంటే అర్థమయింది,

ప్రతిదానికీ ప్రారంభమే గాని, దేనికీ ముగింపు ఉండదు,

మనం గెలిచామనుకుని సంబరపడే గొప్పవిజయాలన్నీ,

మన భ్రమతప్ప నిజానికి ఎన్నడూ గెలిచినవి కావు.

.

దేనికోసమైతే నా ఆత్మ గూడుకట్టుకుందో ఆ ప్రేమ కూడా,

చివరికి, కలతతో ఆలోచనలలోపడ్ద అతిథిలా వస్తుంది.

సంగీతమూ, మగవారి పొగడ్తలూ, ఆఖరికి చిరునవ్వైనా సరే,

మిగతావాటికంటే అంతగొప్పగా ఏమీ ఉండవు.

.

సారా టేజ్డేల్

(August 8, 1884 – January 29, 1933)

అమెరికను కవయిత్రి,  పులిట్జరు బహుమతి గ్రహీత.

.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

At Midnight

.

Now at last I have come to see what life is,
Nothing is ever ended, everything only begun,
And the brave victories that seem so splendid
Are never really won.

Even love that I built my spirit’s house for,
Comes like a brooding and a baffled guest,
And music and men’s praise and even laughter
Are not so good as rest.

.

Sara Teasdale,
(August 8, 1884 – January 29, 1933)
American Poet

  • The Look (quieterelephant.wordpress.com)

జ్ఞానోదయం .. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

అవి వసంతకాలపు తొలిరాత్రులు
హేమంతపు మత్తు నిదర ఇంకా వదల్లేదు
మా చుట్టూ ఉన్న నీడలూ, గాలీ
మేము మాట్లాడుకోని మాటలకి చెవులురిక్కిస్తున్నాయి.

పది సంవత్సరాలు దొర్లిపోయాయి గాని
వసంతం ఇప్పుడూ అప్పటంతవాడిగానే ఉంది
మళ్ళీ మొదలుపెట్టాల్సి వస్తే
అప్పుడు చేసినవే మళ్ళీ మళ్ళీ చేస్తాం

ఎదురుచూసిన వసంతం అయితే ఎన్నడూ రాలేదు
కాని, అదేమిటో తెలుసుకోగలిగినంత జీవితం గడిచిపోయింది
మనకి లేనిది ఎప్పుడూ లేకుండానే మిగిలిపోతుంది,
మనకున్న వస్తువుల్నే మనం పోగొట్టుకునేది.

.

.

సారా టీజ్డేల్

అమెరికను కవయిత్రి

.

మాటలని పొదుపుగా వాడి, ఒక్కొక్కసారి ఏ రకమైన ప్రతీకలూ వాడకుండానే, చెప్పవలసిన భావాన్ని  పాఠకుడికి అందజెయ్యగలగడంలో సారా టీజ్డేల్ ఆరితేరిన కవయిత్రి. ఇక్కడ మూడే మూడుపాదాల కవితలో  వ్యక్తులమధ్య నెమ్మదిగా ప్రవేశించే అసంతృప్తీ, ఎడబాటూ; చివరి పాదంలో అద్భుతమైన సత్యాన్నీ, మనసులోని బాధనీ ఎంత అందంగా వ్యక్తీకరించిందో గమనించవచ్చు.

.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

.

WISDOM

It was a night of early spring,
The winter-sleep was scarcely broken;
Around us shadows and the wind
Listened for what was never spoken.

Though half a score of years are gone,
Spring comes as sharply now as then—
But if we had it all to do
it would be done the same again.

It was a spring that never came;
But we have lived enough to know
That what we never have, remains;
It is the things we have that go.
.
Sara Teasdale.

Poem Courtesy: http://www.gutenberg.org/files/25880/25880-h/25880-h.htm#WISDOM

ప్రేమఫలించిన తర్వాత … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

.

ఇక అందులో ఇంద్రజాలం ఉండదు,

అందరువ్యక్తుల్లాగే మనమూ కలుసుకుంటుంటాం,

నేను నీకూ, నువ్వు నాకూ

ఇక అద్భుతాలుగా అనిపించం.

.

ఒకప్పుడు నువ్వు సుడిగాలివి, నేను సముద్రాన్ని—

ఆ వైభవం ఇక ఏమాత్రం ఉండదు…

నేను సముద్రపొడ్డునే

అలసిపోయిన ఒక మడుగునై మిగిలిపోయాను.

.

ఆ మడుగుకి ఇప్పుడు తుఫానులబెడదనుండీ

ఎగసిపడే అలలనుండీ విముక్తి దొరికింది

అయితేనేం, దానికి దొరికిన అంత ప్రశాంతతకీ సముద్రం కంటే,

ఏదో పోగొట్టుకున్న అసంతృప్తి మిగిలిపోతుంది.

.

సారా టీజ్డేల్

August 8, 1884 – January 29, 1933

అమెరికను కవయిత్రి  

.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

.

After Love
 

.

There is no magic any more,
We meet as other people do,
You work no miracle for me
Nor I for you.

You were the wind and I the sea —
There is no splendor any more,
I have grown listless as the pool
Beside the shore.

But though the pool is safe from storm
And from the tide has found surcease,
It grows more bitter than the sea,
For all its peace. 

.

Sara Teasdale

August 8, 1884 – January 29, 1933 

American Poetess

Poem Courtesy: http://www.poets.org/viewmedia.php/prmMID/19423

  • The Look (quieterelephant.wordpress.com)
%d bloggers like this: