అనువాదలహరి

Friends,
I am down with viral fever. I may not be able to post, respond to your  comments. Please bear with me.
with best regards

సగటు మనిషి … రాబర్ట్ విలియం సర్విస్

English: Poet and author Robert W. Service, so...
English: Poet and author Robert W. Service, sometimes referred to as “the Bard of the Yukon”. (Photo credit: Wikipedia)

మేధావిననే అపోహలు లేని
అతి సాధారణ…. సగటు మనిషిని నేను
జాగ్రత్తగా, ఉన్న కొద్దిపాటి లోకజ్ఞానంతో,
ఒక సుఖప్రదమైన జీవితానికి ప్రణాళిక వేసుకుంటాను
అందరూ చేసే పనులూ నేను చేస్తాను
అందరూ మాటాడే మాటలే నేనూ మాటాడుతుంటాను;
పొద్దున్న వార్తాపత్రిక చదువుతూ
ఈ రోజు సమస్యలేమిటో తెలుసుకుంటాను

నా జీవితం నిస్సారమనీ, మరీ సామాన్యమనీ  
నువ్వనుకోవడం సహజం.  
అయితే నేం? నా దృష్టిలో, నేను నా జాతికి ప్రతినిధిని.
నా పేరు అందరికీ సర్వనామంగా ఊహించుకోవచ్చు
కనీసం పదిలో తొమ్మిదిమందికి;
ఎందుకంటే,ఈ ప్రపంచాన్ని నడుపుతున్నదంతా
సగటు మనుషులే గనుక.

అయితే, నువ్వు కూడ ఒక సగటుమనిషివే
అంటే మాత్రం నువ్వు ఒప్పుకోకపోవచ్చు,
నా లాంటి ఓ సామాన్యుడిలా కాకుండా,   
నువ్వు గర్వంగా కాలరెత్తుకుని నడవొచ్చు,  
బహుశా, నీకో బాంకు స్వంతమై ఉండొచ్చు,
ఇంకొన్ని బాంకుల్ని కలుపుకునే తలపుందేమోకూడా
కాని సోదరా, కాసేపు ఆ హోదాని పక్కనబెట్టి
సగటుమనుషులకి కృతజ్ఞతలు చెప్పుకో!

.

రాబర్ట్ విలియం సర్విస్.

.

Mediocre Man

.

I’m just a mediocre man
Of no high-brow pretence;
A comfortable life I plan
With care and commonsense.
I do the things most people do,
I echo what they say;
And through my morning paper view
The problems of the day.

No doubt you think I’m colourless,
Profoundly commonplace;
And yet I fancy, more or less,
I represent the race.
My name may stand for everyone,
At least for nine in ten,
For all in all the world is run
By mediocre men.

Of course you’ll maybe not agree
That you are average,
And unlike ordinary me
You strut your little stage,
Well, you may even own a Bank,
And mighty mergers plan,
But Brother, doff your tile and thank
The Mediocre Man.

Robert William Service

 

%d bloggers like this: