వర్గం: అనువాదాలు
-
తెలియరాని తన్మయత్వం… ఫ్రాన్సిస్ క్వార్లెస్… ఇంగ్లీషు కవి
తమ తుంటరి ప్రవాహాలతో రాళ్ళని దొర్లిస్తూ అన్ని దేశాలూ తిరిగి వేల నిర్జనప్రదేశాలు చూసి చివరకి మిరిమిట్లుగొలిపే థేమ్స్ నదిలో కలిసి అంతకంటే పెను కెరటాలలో విలినమయ్యే గట్లూ రెంటినీ విడదీస్తూ పారే రెండు సెలయేళ్ళలా కలిసేము. అందుకే నేను నా ప్రియాతి ప్రయతమ సొత్తును; తనూ నాకు అంతే. చాలా ప్రయత్నం చేసిన తర్వాత మేము కలుసుకున్నా మేమిద్దరం విడిగా అసంపూర్ణులమైనా, ఇపుడు పరిపూర్ణులమే. మా ఇద్దరిలో ఎవరు వేరొకరికోసం తపించనక్కరలేదు. నేను జనుమునైతే,…
-
రోదించండి, రోదించండి, అణిగిపోయే పెనుగాలులారా!… హెన్రీ నీలే, ఇంగ్లీషు
అత్యంత విచారకరమైన మీ గాధ లేవీ జీవితమంత విషాదంగా ఉండవు లెండి; మనిషిని పోలిన ఇతివృత్తాన్ని దేన్నీ మీరెన్నడూ ఎత్తుకుని ఉండరు; లేదా, అంత దుఃఖ బాహుళ్యమైనదీను. రాలిపో! రాలిపో! వాడిపోయిన పత్రమా! శరదృతువు దుఃఖమంతగా కాల్చివెయ్యదులే అటువంటి అందమైన పూలను చిదిమెయ్యదులే; దట్టమైన చీకట్లు జీవితాన్ని ముసిరినప్పుడు అది తుఫానుకన్నా భీకరమైనదీ ఆ క్రుంగుపాటు మహా విషాదకరమైనదీ. ఓ నినదించే వీణియా! ష్, ష్! సడిచేయకు! గాయకులారా! మీ గాత్రాన్ని ఆపండి! ఓ మధురమైన మురళీ,…
-
సానెట్ 12… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్ పియర్ 400 వ వర్థంతి సంవత్సరం నేను గడియారాన్ని చూస్తూ కాలం లెక్కపెట్టుకుంటూ దివ్యమైన రోజు ఘోరమైన రాత్రిలోకి మునిగిపోడం గమనించినపుడు; గతించిన గులాబి వన్నె ప్రాయపు సౌందర్యరుచులు గుర్తుచేసుకుని తెల్లని శరీరం నిండా తేరుతున్న నల్లని ముడుతలు చూసినపుడు; మొన్నటి వరకూ ఆకాశమంత పందిళ్ళు వేసి ఎండనుండి పశులగాచిన మహోన్నతమైన వృక్షాలిపుడు మోడులై నిలబడడం చూసినపుడు; వసంతపు పచ్చదనమంతా కట్టలు కట్టలుగా గట్టి బిరుసెక్కిన గడ్దాంతోపాటు పాడెమీద మోసుకుపోతున్నపుడు; నీ అందం గురించి…
-
స్త్రీల ఔన్నత్యము… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలందరికీ శుభాకాంక్షలతో . మేము గొప్పపనులు చేస్తే ప్రేమిస్తారు, శలవులకి ఇంటికి వచ్చినా, లేక చెప్పలేని చోట గాయాలపాలై తిరిగొచ్చినా. మీరు పతకాల్ని ఆరాధిస్తారు; మీకు గొప్ప నమ్మకం యుద్ధంలోని కళంకాన్ని శౌర్యం కప్పిపుచ్చుతుందని. మమ్మల్ని ఉక్కు కవచాల్లా తయారు చేస్తారు. మహాసంతోషంగా వింటారు, మట్టికొట్టుకుపోతూ ప్రమాదాల్నెదిరించిన మా కథలకి పులకిస్తారు. దూరంగా ఎక్కడో యుద్ధం చేస్తున్నపుడు మా లోపలి ఉద్రేకం మీరే మేము మరణిస్తే, జ్ఞాపకాలను పచ్చగా ఉంచుకుంటూమరీ శోకిస్తారు.…
-
వైద్యులు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ప్రతి రాత్రీ నేను మేలుకునే ఉంటాను ప్రతి పగలూ పక్కమీద పడుకునే ఉంటాను వైద్యులూ, వేదనా, మృత్యువూ నా తల దగ్గర చర్చించుకోవడం వింటూ. వాళ్ళు లోగొంతులో చికిత్సావిధానం గురించి శాస్త్ర పరిభాషలో మాటాడుకుంటుంటారు, ఒకరు త్వరగా కోలుకోవాలని వాదిస్తే రెండవవారు, నిర్వాణము నెమ్మదిగా రావాలని. నా లాంటి ఒక అతి సామాన్య జీవికి అది నిజంగా చాలా గర్వకారణం అటువంటి గొప్ప పేరుపడ్డ వ్యక్తులు నా పక్కన నిలబడి చర్చించుకోవడం . సారా టీజ్డేల్ August…
-
ఇహ మన సంబరాలు ముగిసినట్టే … షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వర్థంతి సంవత్సరం సాహిత్యం మానవజీవితపు అపురూపమైన సంపదను దాచుకునే అందాల భరిణె అనుకుంటే, దానిలో … రాగద్వేషాలూ, భావోద్వేగాలూ, చేతనాచేతనావస్థలూ….ఒకటేమిటి జీవితపు ఏ పార్శ్వాన్నీ విడిచిపెట్టకుండా, ఏ పాత్రతోనూ మమేకమవకుండా, అన్ని పాత్రలకీ సమన్యాయంచేస్తూ సృష్టించిన వస్తుసముదాయపు శిల్పి … షేక్స్పియర్. ఏ భాషకు ఆ భాషలోనే సాటిలేని మహాకవులూ, సాహిత్యకారులూ ఉన్నా, దేశకాల పరిమితులకి అతీతంగా అన్నిభాషలవారిచే తనకావ్యసృష్టికి మన్ననలను అందుకోగలిగిన కవి షేక్స్పియర్. కవిత్వం ఆ రోజుల్లో (మన…
-
ఇందుకేనా?… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ఇందుకేనా నేను ఇన్ని ప్రార్థనలు చేసింది, వెక్కి వెక్కి ఏడ్చి, మెట్లు తన్నుకుంటూ వచ్చింది ఇప్పుడు, ఇంట్లో మరో వస్తువులా, రాత్రి పదిన్నర అయ్యేసరికి మంచమెక్కడానికేనా? . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే February 22, 1892 – October 19, 1950 అమెరికను కవయిత్రి Grown-up . Was it for this I uttered prayers, And sobbed and cursed and kicked the stairs, That now, domestic as a…
-
సూర్యోదయం… చార్లెస్ టెన్నిసన్ టర్నర్, ఇంగ్లీషు కవి
ఉదయాన్నే పక్కమీద ప్రార్థన చేసుకుంటూ ఆలోచిస్తూ ఒక్కసారి గోడమీద నా నీడలు చిందులు వెయ్యడం గమనించాను వెనుక అల్లాడుతున్న చెట్ల ఆకులూ, ఎగిరే పక్షులతో సహా… ఒక సూర్యకిరణపు వెలుగు నీడతో గొప్పగా కలగలిసిపోయింది; “దేవునికి వెయ్యి దండాలు” అని మనసులో అనుకున్నాను. “తూరుపు తెరతీసిన ఈ వెలుగులతో గడపడం కాకుండా నా ఉదయాలకి అంతకంటే మెరుగైన అవకాశం ఏముంటుంది? ఆ జగదీశ్వరుని చేతిలో ఎన్ని మాయలున్నాయో గదా మనం చూసి, అనుభవించడానికి! అయినా మనకి తీరిక…
-
సంశయమూ – విశ్వాసమూ… ఆల్ఫ్రెడ్ టెన్నీసన్, ఇంగ్లీషు కవి
ఏ తిరస్కారపు చాయలేకుండా, సహృదయంతో చీకటిలో మునిగిపోతున్న ఆ కీటకాల్ని నీ నీలికళ్ళతో జాలిగా చూస్తూ నాతో అంటావు: అనుమానం దెయ్యంలా పడితే వదలదని. నాకు తెలీదు: అయితే ఒకటి మా తెలుసు ఎంతో మంది నిపుణులైన వైణికుల్ని చూశాను, మొదటిసారి మీటినపుడు ఎప్పుడూ అపశృతే పలికేది, తర్వాతే దానిలో ఎనలేవి నైపుణ్యం సంపాదించేరు. సందేహాలు కలవరపెట్టినా, చేతల్లో నిజాయితీ ఉంది; అందుకే చివరికి అంతరాంతర సంగీతాన్ని బయటపెట్టగలిగేరు. నిజాయితీతో కూడిన సందేహంలోనే ఎక్కువ విశ్వాసం ఉంటుంది,…
-
అటునుండి ఇటు… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
లే! లే, మిత్రమా! పుస్తకాల్ని పక్కన పడెయ్. లేకపోతే నువ్వు రెండురెట్లు లావు అవుతావు. లే! లే, మిత్రమా! లేచి కళ్ళు తుడుచుకో! ఎందుకొచ్చిన శ్రమ ఇదంతా నీకు ? చూడు, సూర్యుడు పడపటికొండ శిఖరాన ఎంత లావణ్యంతో మెరుస్తున్నాడో విశాలమైన ఈ పచ్చిక చేలమీద మనోహరంగా తన బంగారువన్నె నీరెండ పరుస్తున్నాడు. ఆహ్, పుస్తకాలు! స్వారస్యంలేని ఆ గోల ఎప్పుడూ ఉండేదేలే, రా, చిట్టడవిలోని ఆ పిట్టపాట విను. ఎంత మధురంగా ఉంది ఆ పాట!…