వర్గం: అనువాదాలు
-
ఎండుటాకులు… ల్యూసీ ఎవలీనా ఆకర్మాన్, అమెరికను
ఎండుటాకులు తప్ప మరేం లేదు; ఆత్మ ఘోషిస్తుంది జీవితం వృధా చేసినందుకు; వివేకాన్ని నిద్రపుచ్చి, పాపం చేసినందుకు, వాగ్దానాలు చేసి ఎన్నడూ నిలబెట్టుకోనందుకు, ద్వేషం, పోరాటాలూ, ఘర్షణల ఎండుటాకులు తప్ప మరేం లేదు. ఎండుటాకులు తప్ప మరేం లేదు; న్యాయబద్ధమైన జీవితం నుండి ఏరుకున్న కంకులు లేవు; పండు గింజలు లేవు మాటలు, శుష్కమైన మాటలు; చిత్తశుద్ధితో చేసే పనికి బదులు; మనం గింజలు జల్లుతాం, ఓహ్ అవి పొల్లూ, కలుపుమొక్కలే. మనం శ్రమపడి, బాధలు ఓర్చుకుని…
-
అందమైన ముఖం ప్రభావం… మైకేలేంజెలో, ఇటాలియన్ కవి, శిల్పకారుడు
ఒక అందమైన ముఖం నా ప్రేమని ఉదాత్తం చేస్తుంది అది నా మనసుని తుఛ్ఛమైన కోరికలనుండి మరల్చింది; ఇపుడిక మరణాన్నీ లక్ష్య పెట్టను, పాపపు కోరికల్నీ; నీ ముఖము పైలోకాలలోని సుఖాలకి మచ్చుతునక సత్పురుషులంగీకరించే బ్రహ్మానందాన్ని బోధిస్తుంది. ఆహా! స్వర్లోకపు కపోతానికి ప్రతిరూపంగా నీ అంత గొప్ప వస్తువు సృష్టించిన ఆ భగవంతుడు ఎంద సుందరుడూ, దయాళువూ అయిఉంటాడో గదా భూలోక స్వర్గాలైన ఆ సుందరమైన కనులనుండి నా దృష్టిని మరల్చుకోలేని నా అపరాధాన్ని మన్నించు అవే…
-
నాతో నేను … పాల్ ఫ్లెమింగ్, జర్మను కవి
ఓ మనసా! నిన్నేదీ విచారపడేలా, చిరచిరలాడేలా లేక పశ్చాత్తాపపడేలా చెయ్యకుండుగాక; నువ్వు నిశ్చింతగా ఉండు; దైవము ఏది ఆజ్ఞాపిస్తే అది సత్యము దాన్ని కనుక్కోవడంలోనే నీ ఆనందము. ఓ హృదయమా! రేపటి గురించిన చింతతో ఈ రోజంతా ఎందుకు విచారిస్తావు? పైనుండి అందర్నీ ఒకరు గమనిస్తున్నారు. నిజం. నీ భాగం నీకు అందే విషయమై ఎంతమాత్రం సందేహించకు. ధృఢంగా ఉండు; చంచలత్వం వద్దు; ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకు నిద్రకు తప్ప; నీకు తెలిసుండాలి భగవత్సంకల్పం అన్ని జీవరాసులకీ,…
-
ఇద్దరు దేవదూతలు… జాన్ గ్రీన్ లీఫ్ విటియర్, అమెరికను కవి
దేముడు స్వర్గంలో తనకి దగ్గరగా వసిస్తున్న ఇద్దరు దేవతల్ని పిలిచేడు అతిసుకుమారమైనది కరుణ, అతి ప్రీయమైనది ప్రేమ “లేవండి,” దేముడు ఆజ్ఞాపించేడు,”నా దేవతలారా! పాపపు, దుఃఖపు తెరలు స్వర్లోకపు ద్వారాలనుండి లోనకి ప్రవేశించి అంతటా విచారం అలముకుంటోంది. నా వీణియ అధోలోకాలనుండి వెల్లువెత్తుతున్న శోకస్వరాన్ని అందుకుంటోంది. వేదనా ధూమము దట్టంగా వెలుగునుకమ్ముకుంటోంది, పూలు చీడపడుతున్నాయి, మీరు అధోలోకాలకు వెళ్ళి అక్కడి బాధాతప్తమైన ఆత్మలపై బంగరు కేశాలుగల దేవతలైద్దరూ సింహాసనానికి ప్రణమిల్లేరు నాలుగు తెల్లని రెక్కలు అగాధ తమోమయ…
-
ప్రేమికుల వియోగం… అజ్ఞాత చీనీ కవి
ఆమె: “కోడి కూస్తోంది, విను! అతడు: “లేదు! ఇంకా చీకటిగానే ఉంది,” ఆమె: “వెలుగు రేకలు విచ్చుకుంటున్నై.” అతడు: “లేదు, నా వెలుగు కిరణమా!” ఆమె: “ఏదీ లేచి చూసి చెప్పు ఆకాశం తెల్లబడటం లేదు?” ఆమె: “వేగు చుక్క ఇప్పుడే తిర్యగ్రేఖదాటి ఎగబ్రాకుతోంది.” ఆమె: “అయితే నువ్వు త్వరగా వెళ్ళిపో: అయ్యో! నువ్వు వెళ్ళవలసిన వేళ సమీపించిందే!; కానీ ముందు ఆ కోడికి గుణపాఠం చెప్పు అదే మన కష్టాలకి నాంది పలికింది.” . అజ్ఞాత…
-
వనదేవత… జాన్ మిల్టన్, ఇంగ్లీషు కవి
అడుగుల జాడలు అగుపడక, మిలమిల మెరిసే మెత్తని ఆకుపచ్చని పచ్చికమీద, నేను తీగలు సారిస్తూ పాటపాడుతుంటే నన్ననుసరించు. చుక్కలు చొరరాని చిక్కని ఎల్మ్ చెట్టు కొమ్మల నీడలో నా వెంట రా ఆమె దివ్యత్వానికి తగ్గట్టుగా శోభాయమానంగా అలంకరించుకుని కూచున్న ఆమెదగ్గరకి నిను చేరుస్తాను. అటువంటి వనదేవతని ఈ నేల ఎన్నడూ చూసి ఎరుగదు. . జాన్ మిల్టన్ 9 December 1608 – 8 November 1674 ఇంగ్లీషు కవి (From ‘Arcades’) . O’RE the…
-
గంతులేసే పిల్లలు… జార్జి డార్లీ, ఐరిష్ కవి
సొట్టలుపడే బుగ్గల్లా తూగుతున్న పచ్చిక బీళ్ళలోకి తెల్లకుచ్చుల జుత్తుగల తలలగుంపొకటి దూసుకొచ్చింది మొగ్గల్లాంటి పెదాలున్న బాలురూ బాలికలూ ప్రేమపాశాల చిట్టిపొట్టి ప్రతిరూపాలు వాళ్ళు. నవ్వులతో సుడులు తిరుగుతున్న కనుల వరుసలవి ఎంతచక్కగా మెరుస్తున్నాయి! ఎలా కదలాడుతున్నాయి! నదిమీద తళతళలాడే కెరటాల్లా జంటవెంట మరొక జంట మెరుస్తున్నాయి. ఆనందపు మత్తులో తూలుతున్న కెంపువన్నె ముఖాలు సంతోషం తాండవించే దివ్యస్వరూపాలు అవి, ప్రేమగా మీరుచేసే ఎకసెక్కాలూ, కోణంగిచేష్టలూ వాళ్ళూ మీతో చేస్తారు, చెయ్యడానికి వాళ్ళు భయపడరు. . జార్జి డార్లీ…
-
హామ్లెట్ స్వగతం… షేక్స్పియర్
జీవించడమా, మరణించడమా,- అదీ అసలు ప్రశ్న:- అదృష్టము ఇష్టమొచ్చిన రీతిలో సంధించే బాధలూ కష్టాలను మనసులోనే భరించి సహించి ఊరుకోవడం ఉదాత్తమా, లేక సముద్రకెరటాల్లా వచ్చే ఆపదలపై కత్తి దూయడమా, అలా ఎదిరించడం వల్ల వాటికి ముగింపు పలకడమా? లేక మృత్యువు… దీర్ఘనిద్ర నశించడం; అలా మరణించడం వల్ల, మనం గుండె దొలిచే బాధలనుండి ఈ శరీరానికి ప్రకృతిసిద్ధంగావచ్చే, వారసత్త్వంగా సంక్రమించే వేల కొద్దీ కష్టాలనుండి గట్టెక్కగలమా? అటువంటి పరిపూర్ణమైన విముక్తి మనసారా కోరుకోవలసిందే నశ్వరమైన శరీరం……
-
విశ్వజనీన ప్రార్థన… అలెగ్జాండర్ పోప్, ఇంగ్లీషు కవి
సమస్త సృష్టికీ ఆద్యుడవైన ఓ తండ్రీ! ప్రతి యుగంలో, ప్రతి దేశంళో యోగులూ, పశుప్రాయులూ,వివేకులు కొలిచే యెహోవా, ప్రభూ, పరమాత్మా! నువ్వే ప్రథమ కారణానివి, అనవగతమవు, నా ఇంద్రియాలన్నిటినీ స్వాధీనపరుచుకుని ఇదొక్కటి తెలియజేస్తావు, నువ్వు సత్యమని నామట్టుకు నేను నిను చూడలేని అంధుణ్ణి. కానీ, ఈ విశాల నిశా సామ్రాజ్యంలో చెడులో మంచి చూడగల శక్తి నిచ్చేవు. ప్రకృతిని విధికి బానిసను చేసి కాస్తంత వెసులు ఇచ్చావు తోచింది చెయ్యడానికి. నా మనసు ఏది చెయ్యమని చెబుతుందో…