వర్గం: అనువాదాలు
-
మా కతని పేరు ఎలా తెలిసిందంటే… ఏలన్ డూగన్, అమెరికను కవి
నది కొట్టుకొస్తోంది చచ్చిన గుర్రాలనీ, శవాలనీ, శిధిలమైన యుద్ధ సామగ్రినీ, ప్రవాహానికి ఎగువన యుద్ధమో, అధికార యంత్రాంగపు చర్యలో జరుగుతోందనడానికి సూచిస్తూ. అవన్నీ కొట్టుకుపోయాయి, ఆ మాటకొస్తే అన్నీ కొట్టుకుపోతాయి, ఏదీ మిగలదు అదే నదిలోని ప్రత్యేకత. తర్వాత ఒక దుంగమీద ఒక సైనికుడు కొట్టుకుంటూ వచ్చేడు. అతన్ని చూస్తే బాగా తాగినట్టున్నాడు. అతన్ని అడిగేము: అతనూ, ఆ చెత్తా అలా ఎగువనుండి కొట్టుకురావడానికి కారణం ఏమిటని. “మిత్రులారా,” అంటూ ప్రారంభించేడు, “గ్రానికస్ మహా సంగ్రామం ఇప్పుడే…
-
ఆసుపత్రినుండి ఉత్తరాలు… మైకేల్ రైయన్, అమెరికను కవి
వార్డులో మంచాలు, చీకటిలో దయ్యపు పడవల్లా తేలుతున్నాయి. నా తలదిక్కున ఉన్న చిరు దీపం లైట్ హౌస్ అయినట్టూ, అందులో ఒకపొట్టి మనిషి నావికుడి టోపీ పెట్టుకుని సముద్రం మీద చిన్ననాటిసాహసగాథలు చెబుతున్నట్టూ ఊహిస్తున్నాను. ఆ పొట్టిమనిషి ఎవరో కాదు, నేనే. బహుశా నా దగ్గర “ఓల్డ్ సాల్ట్” అన్న కుక్క నా అరచేతిని నాకుతూ, వర్తులాకారపు మెట్లమీద నిరంతరం పరిగెత్తేదొకటి ఉండుంటుంది. బహుశా అది ‘పాపం ‘ అంత గట్టిగా కాటువేస్తుందేమో. ఓడలు నీటిలోని రాతిగట్టులు ఢీకున్నట్టూ,…
-
శ్రీమతి వాల్టర్స్… ఫ్రాంక్ ఓమ్స్ బీ, నార్దర్న్ ఐర్లండ్ కవి
ఉత్తరాలిప్పటికీ వస్తుంటాయి “శ్రీమతి వాల్టర్స్ కి” అంటూ బహుశా, కొన్నాళ్ళ క్రిందట ఆవిడ ఈ ఇంట్లో మా లాగే, నివసించి ఉంటుంది. అన్నీ చిన్న విషయాలే… చుట్టజుట్టిన కాలెండరు, ఆమె ఇక్కడ ఉండి ఉంటే నేను తుప్పు పట్టిన మేకు తీసేసినచోట వేలాడుతూ ఉండేది, కేటలాగులూ, ఆమె చెల్లించని చివరి గేస్ బిల్లూ… అన్నిసార్లూ “శ్రీమతి G వాల్టర్స్” అనే సంబోధన. నా మట్టుకు ఈ ఇంటి ఆత్మలో స్త్రీత్వం కనిపిస్తుంది నిరంతరం దాని గుసగుసలువింటుంటే నాకు…
-
తోబా 1… షున్ తారో తనికావా, జపనీస్ కవి
నాకు రాయడానికి విషయం ఏమీ లేదు ఎండలో నా శరీరాన్ని ఆరబెట్టుకుంటున్నాను నా భార్య అందంగా ఉంటుంది నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు నేను మీకో నిజం చెప్పాలి నేను కవిని కాదు నేను అలా నటిస్తున్నాను, అంతే! సృష్టించి, ఇక్కడ వదిలివేయబడ్డాను నేను. చూడండి, సూర్యుడు కొండల్లోంచి ఎలా జారుకుంటున్నాడో సముద్రాన్ని చిక్కటి చీకటి సముద్రం చేస్తూ. అద్భుతమైన ఈ సమయంలోని ప్రశాంతత గురించి తప్ప మీకు నేను ఏదీ చెప్పదలుచుకో లేదు. మీ దేశంలో…
-
జింగ్-టింగ్ పర్వతశిఖరం… లి బాయ్, చీనీ కవి
పక్షులు గుంపులుగుంపులుగా ఆకాశపుదారులంట ఎగిరిపోయాయి ఒక ఒంటరి మబ్బుతునక, అటూఇటూ తచ్చాడి, అదీ తప్పుకుంది. నేను ఒక్కడినీ కూర్చున్నాను, ఎదురుగా జింగ్-టింగ్ పర్వతశిఖరం ఈ పర్వతానికీ నాకూ, ఒకర్నొకరు ఎంతచూసుకున్నా విసుగెత్తదు. . లి బాయ్ ( లి బో నికూడా పిలుస్తారు) (701- 762) చీనీ కవి . The Ching-Ting Mountain . Flocks of birds have flown high and away; A solitary drift of cloud, too, has gone,…
-
నా శ్రీమతికి… కాన్రాడ్ ఐకెన్,అమెరికను
ఈ సంగీతంలోగల ఆపాత మధురిమా అందమైన వస్తువులపట్ల కలిగే ఆపేక్షా, చీకటిలో చుక్కలనిచూడాలన్న తహతహ నీరసించిన రెక్కలల్లాడించాలన్న ఆరాటమూ వెలుగులకెగబ్రాకాలని గులాబి పడే తపనా నల్లని మట్టిబెడ్డ హృదయపూర్వకమైన చిరునవ్వూ వెన్నెలపట్ల సముద్రానికుండే అలవిమాలిన ప్రేమా మంచిదనంనుండి దేవునివరకూ అన్నిటిపైగల మక్కువా సుందరమైన అన్ని వస్తువులూ, ప్రేమికుని చూపుల్లా కనులలో ఆర్ద్రతతో అందాన్ని తిలకించగలిగే సర్వమూ… నీకే అంకితం; ఓ వెలుగురేకా!అవి నువ్వు అందించినవే; ఈ తారలన్నీ నీకే; ఈ ఆకాశం నువ్వు ప్రసాదించినదే! . కాన్రాడ్…
-
దాడి… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ఒక ఏడాదిపాటు నిశ్శబ్దంలో మునిగిపోవడంతో కప్పలు ఎలా అరుస్తాయో మరిచిపోయాను ఎవ్వరూ అంతగా నడవని ఈ దారిలో నేను ఈ సాయంవేళ నడవడానికి సాహసించి ఉండకూడదు. అందం నాకోసం దారికాసింది. లేకుంటే, నాకూ కప్పల బెకబెకలకీ మధ్య ఎవరు నడుస్తారు? ఓ నిసర్గ సౌందర్యమా! నన్ను పోనీ, నేనొక పిరికి మహిళను, ఒక ఇంటి నుండి వేరొక ఇంటికి పోతున్న దానను! . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే (February 22, 1892 – October 19,…
-
గాడిదలతో స్వర్గానికి … ఫ్రాన్సిస్ జేమ్స్, ఫ్రెంచి కవి
ప్రభూ! నేను నీ కడకు రావలిసిన రోజు, అది దుమ్మూ ధూళీలేని త్రోవ కావాలని ప్రార్థిస్తున్నాను. భూమి మీద నా ప్రయాణాలలో నేను ఎన్నుకున్నట్టే, పట్ట పగలు చుక్కలు స్వచ్చంగా ప్రకాశించే స్వర్గానికి ఏ త్రోవలో వెళ్ళాలో నన్ను ఎంచుకుందికి అనుమతించు. నేను నా చేతికర్రపట్టుకుని నచ్చినత్రోవలో వెళ్తాను వెళుతూ, నా మిత్రులైన గాడిదలకు ఇలా చెప్తాను: “మిత్రులారా, నేనూ, ఫ్రాన్సిస్ జేమ్స్ ని. నేను స్వర్గానికి బయలుదేరాను. (ఎందుకంటే, దేవునిప్రేమతో నిండిన నేలమీద నరకమెక్కడిది?) అంతే…
-
N N స్మృతిలో … చెస్లావ్ మీవోష్, పోలిష్ కవి
అది నీకు దూరమైతే చెప్పు. * బాల్టిక్ చిరు కెరటాలని దాటుకుని వచ్చి డెన్మార్క్ క్షేత్రాల్ని గడచి, బీచ్ తోటలనుదాటి, సముద్రంవైపుకి తిరిగితే, అక్కడ త్వరలోనేమంచుతో తెల్లబడబోయే లాబ్రడార్ కనిపిస్తుంది. నగరాలకీ, అక్కడ రాజమార్గాలమీద తళుకుమనే వెలుగులకీ భయపడి ఏకాంతద్వీపాలగురించి కలగనే నీకు, కరిగి నీలివర్ణంలోకి మారే సెలయేటి నీటితో, జింకలూ కారిబూల కాలిజాడలతోనిండిన సుదీర్ఘమైన మరుభూమిగుండా తిన్నని త్రోవ, ఎంతదూరం అంటే, సియెర్రా వరకూ, విడిచిపెట్టినబంగారుగనులవరకూ కనిపిస్తుంది. పక్కన సాక్రమెంటో నది దట్టంగా, విచ్చలవిడిగా పెరిగిన…
-
యాష్ ట్రేలో… వాస్కో పోపా, సెర్బియన్ కవి
ఒక చిన్ని సూర్యుడు పసుపుపచ్చ పుగాకు జులపాలతో మండుతున్నాడు యాష్ ట్రేలో. చవుకబారు లిప్ స్టిక్ నెత్తురు ఆరిపోయిన సిగరెట్టు కొనలను పీలుస్తోంది. శిరఛ్ఛేదం జరిగిన అగ్గిపుల్లలు సల్ఫరు కిరీటాలకై తహతహలాడుతున్నాయి. కొడిగట్టిన ధూమ్రవర్ణపు నుసిలో ఇరుక్కున్న నీలిపొగల గుర్రాలు హేషతో పైకి లేస్తున్నాయి. ఒక పెద్ద చేయి అరచేతిలో నిప్పులుమిసే కంటితో దిగంతాలలో పొంచి చూస్తోంది. . (అనువాదం: Anne Pennington) వాస్కో పోపా June 29, 1922 – Jan 5, 1991 సైబీరియన్…