వర్గం: అనువాదాలు
-
ప్రయాణం-2 … షున్ తారో తనికావా, జపనీస్ కవి.
నేనీ క్షణాన్ని శాశ్వతం చెయ్యదలుచుకోలేదు ఈ క్షణాన్ని ఉన్నదున్నట్టు స్వంతం చేసుకోవడమూ బాగుంటుంది జారిపోతున్న క్షణాన్ని పట్టుకోగలిగే మార్గం ఉన్నా సూర్యుడప్పుడే ముందుకి సాగిపోతున్నాడు. ఈ మాటలన్నీ కేవలం ఇసుకమీద రాయబడినవి నా వేళ్ళతో కాదు మరుక్షణంలో విషాదంలోకి జారిపోగల ఆహ్లాదమైన హృదయంతో. నా పిల్లలకి నా పోలికలు ఉన్నా నా పిల్లలకి నా పోలిక లేకపోయినా రెండూ నాకు ఆనందదాయకమే. గవ్వలూ, గులకరాళ్ళూ, గాజుపెంకులతో పాటు ఈ గ్రహం అంచున నీటి ఒడ్డున నా హృదయాన్ని…
-
జాతి గుర్తు… ఎఫ్. ఆర్. స్కాట్, కెనేడియన్ కవి
కొన్ని కవితలు సునిశితమైన వ్యంగ్యంతో చెంప చెళ్ళుమనేలా కొట్టి నిజాన్ని తెలియజేస్తాయి. ఒక దేశపు శతాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహక సంఘం ముఖపత్రం మీద ఆ దేశానికి చెందిన ఏ చిహ్నమూ కాకుండా మరొక దేశపు వ్యాపారసంస్థ పేరు ఉండడం హాస్యాస్పదమైన విషయం అనుకుంటే, పేరు మార్పులు తప్ప, మనదేశంలో చిత్రం ఇంతకంటే భిన్నంగా ఉందా అనిపిస్తుంది. దౌర్భాగ్యం కొద్దీ ఎప్పుడూ సమకాలీన అవసరాలదృష్టితోనే చారిత్రకపురుషుల విశ్లేషణ జరుగుతోంది తప్ప వాళ్ళు జాతికి చేసిన సేవనీ, అందించిన ఉత్కృష్టమైన…
-
నిన్ను నేను ప్రేమిస్తున్నాను… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
వసంతం నా మీదకి తొంగి చూసి గాఢనిద్రలో ఉండడం గమనించినపుడు ఒక గుండె దాచలేక దాచిన రహస్యాన్ని మట్టి ఇక దాచనక్కరలేదు. వసంతం కోయిలలకి చెప్పినపుడు మైదానాల్లోని పిట్టలకు తెలుస్తుంది వీచే ప్రతి గాలికీ సున్నితంగా ఆ మూడు మాటలనీ చెబుతాయి. అతని ఇంటి చూరుమీద పిచ్చుకలు దూరంగా చెదరగొట్టబడ్డ వర్షం పోలిన ధ్వనులతో అతని కిటికీ పక్కనున్న పిచ్చుకకి చెబుతాయి ఓ పిచ్చుకా, నా చిన్ని పిచ్చుకా, నేను దీర్ఘనిద్రలో ఉన్నపుడు నే దాచలేక దాచిన…
-
పొగరుబోతు పొరపాటు… వాస్కో పోపా, సెర్బియను కవి
అనగనగా ఒకప్పుడు ఓ పొరపాటు ఉండేది అది చాలా తెలివితక్కుదీ, చాలా చిన్నదీను. దాన్ని ఎవరూ కనీసం గుర్తించేవారుకూడా కాదు. అది తను తప్ప ఎవ్వరూ తనవంక చూడ్డంగాని వినడంగాని చెయ్యకపోడాన్ని సహించలేకపోయింది. అందుకని దానికి తోచిన అన్ని విషయాలూ కనిపెట్టింది దాని ఉనికి నిజంగా లేదని ఋజువుచెయ్యడానికి. అది దాని ఋజువులు భద్రపరచడానికి రోదసిని సృష్టించింది. అవి నిలవడానికి కాలాన్నీ, ఆ ఋజువులు చూడ్డానికి ప్రపంచాన్నీ సృష్టించింది. అది కల్పించినదంతా తెలివితక్కువ విషయమూ కాదు. అల్పవిషయమంతకన్నా…
-
నాలుగేళ్ళు నిండబోతున్న పిల్ల దినచర్య నుండి… హనన్ అష్రవి, పాలసీనా కవయిత్రి
కొన్ని కవితలూ, దానికి జతచేసిన బొమ్మలూ, ఒక్కోసారి ఎన్నాళ్ళయినా వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి కవితల్లో ఇది ఒకటి. ఈ కవితలో ఉన్నదల్లా కేవలం 4 ఏళ్ళవయసుండే పిల్లలలో కనిపించే అమాయకత్వం. ఈ కవితకి పెట్టిన బొమ్మ చూస్తేనే మనసు చలించిపోతే, ఈ కవిత చదివిన తర్వాత మనసు ఒకసారి నిస్తేజానికి గురైంది. ఇంత చిన్న మాటల్లోనే, కవయిత్రి యుద్ధం ఎంతటి వినాశకరమో, దానివల్ల ఎంతో అందమైన భవిష్యత్తుని అనుభవించవలసిన అమాయకులైన పిల్లలు, జార్జి బుష్ జూనియర్ మాటల్లో…
-
పొరలు… స్టాన్లీ కునిజ్, అమెరికను కవి
నేను చాలా జన్మలు ఎత్తాను అందులో కొన్ని నావే కాని, ఇప్పటి నేను, అప్పటి నేను కాదు, జీవిగా కొన్ని లక్షణాలు మిగిలి ఉన్నప్పటికీ; నేను వాటినుండి దూరంగా జరిగిపోకుండా ఉండడానికి నానా తంటాలూ పడుతున్నాను. నేను ముందుకి వెళ్ళడానికి కావలసిన శక్తి సమకూర్చుకోవాలంటే అలా చూసుకోడం తప్పనిసరి కాబట్టి, నేను ఒకసారి వెనుతిరిగి చూసుకుంటే, మైలు రాళ్ళన్నీ తిర్యగ్రేఖవైపు జారిపోవడం గమనించేను; విడిచిపెట్టిన మజిలీలలో వేసిన చలిమంటలు క్రమంగా సన్నగా క్షీణించిపోతుంటే, వాటిమీంచి బరువైనరెక్కలతో దేవదూతలు…
-
ఒక వేసవి పొద్దు… మేరీ ఆలివర్, అమెరికను కవయిత్రి
ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? ఆ తెల్లని హంసనీ నల్లని ఎలుగుని ఎవరు సృష్టించారు? ఈ మిడతని ఎవరు సృష్టించారు? ఈ మిడత… గడ్డిలోంచి తన్నుకుంటూ పైకెగసిన ఈ మిడత నా చేతిలోనున్న పంచదారని తింటున్న మిడత పైకీ క్రిందకీ కాకుండా ముందుకీ వెనక్కీ దవడలు కదుపుతున్న ఈ మిడత తన పెద్ద, సంకీర్ణమైన కనులతో నిక్కి చూస్తున్న మిడతని. దాని బలహీనమైన ముందుకాళ్ళు పైకెత్తి తన ముఖాన్ని నులుముకుంటోంది. దాని రెక్కల్ని చాచి టపటప కొట్టి…
-
పాత చెప్పులు … రోబెర్తో ఫర్రోజ్, అర్జెంటీనా కవి
నేనిపుడు పాత చెప్పులు మాత్రమే తొడుక్కోగలను. నేను నడిచే త్రోవ తొలి అడుగునుండే చెప్పుల్ని అరగదీస్తుంది. పాత చెప్పులైతే నా త్రోవని అసహ్యించుకోవు. అవి మాత్రమే నా రోడ్డు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళగలవు. ఆ తర్వాత నువ్వు ఉట్టికాళ్లతో నడవ వలసిందే. . రోబెర్తో ఫర్రోజ్ అర్జెంటీనా కవి . Poem 3 . Now I can only wear old shoes. The road I follow wears shoes…
-
వేగుచుక్క …. సెజారే పవేజ్, ఇటాలియన్ కవి
సముద్రం మీద చీకటితెరలు తొలగిపోకమునుపే ఒంటరి మనిషి ఒకడు లేచాడు. చుక్కలు ఇంకా మిణుకుమంటూనే ఉన్నాయి. వెచ్చని చిరుగాలి తీరం ఉన్న ఒడ్డునుండి ఎగసి, ఊపిరికి కాంత ప్రశాంతతనిస్తోంది. ఈ సమయం, ఏదీ చైతన్యవంతంగా ఉండే సమయం కాదు. అతని నోట్లో వేలాడుతున్న పొగాకు గొట్టం సైతం వెలిగించకుండానే ఉంది. చీకటి తెరలు తెరలుగా దట్టంగా ఉంది. ఆ ఒంటరి మనిషి అప్పుడే చితుకులు ఏరి చలిమంట వెలిగించి నేల ఎర్రబారుతుంటే దీక్షగా పరిశీలిస్తున్నాడు. సముద్రం కూడా…
-
ఎవరికీ అప్పగించవద్దు… అలెగ్జాండర్ బ్లోక్, రష్యను కవి
నువ్వు అనుసరించదలుచుకున్న మార్గాలని కృతజ్ఞతలేని జనసమూహానికి అప్పగించవద్దు. నీ అందమైన హర్మ్యాన్ని పశుబలంతో కూలదోస్తారు. నువ్వు గర్వంగా ఆరాధించేదాన్ని చులకనచేస్తారు. భారమైన తన శిలువను ఈడ్చుకుపోయేవాడు ఎప్పుడూ ఒంటరే. ఋజుమార్గంలో నడిచే అతని మనోబలం ఎన్నడూ సడలదు అతన్ని స్ఫూర్తిని ఎత్తైన కొండలమీద వెలిగిస్తూ దట్టంగా పరుచుకున్న చీకటితెరలను చీలుస్తుంటాడు. . అలెగ్జాండర్ బ్లోక్ 28 November 1880 – 7 August 1921 రష్యను కవి . Do not entrust… .…