వర్గం: అనువాదాలు
-
వసంతఋతు ప్రశాంతత … క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి
హేమంతము ఇలా గతించింది వసంతం అలా అడుగుపెట్టింది నేనొక రహస్యప్రదేశంలో దాక్కుని అక్కడి కలకూజితాలు వింటాను. అక్కడ మావి చిగురుల్లో కోయిల మనోహరంగా పాడుతుంది అక్కడ పూల పొదల్లో మైనా కమ్మగా ఆలపిస్తుంటుంది ఆ చల్లని ఇంటికప్పుమీదకి దట్టంగా ఎగబాకిన లతలు గుబురుపొదలై మొగ్గతొడుగుతూ నెత్తావులు పరుచుకుంటున్నాయి సుగంధాలు నింపుకున్న అల్లరిగా తిరిగే చిరుగాలి మెల్లగా గుసగుసలాడుతోంది: “ఇక్కడ ఏ ఉచ్చులూ పన్నలేదు; “ఇక్కడ క్షేమంగా వసించు ఒంటరిగా నివసించు స్వచ్ఛంగా పారుతున్న సెలయేరు నాచుపట్టిన బండరాయీ…
-
దొంగాట… వాస్కో పోపా, సెర్బియన్ కవి
ఒకడు మరొకడికి కనిపించకుండా దాక్కుంటాడు అతని నాలుకకింద దాక్కుంటాడు రెండవవ్యక్తి ఇతనికోసం నేలలో వెతుకుతాడు. ఒకడు తన తలరాతలో దాక్కుంటాడు రెండవవాడు ఇతనికోసం చుక్కల్లో వెతుకుతుంటాడు అతను తన మతిమరుపులో దాక్కుంటాడు రెండవవాడితనికోసం గడ్డిలో వెతుకుతుంటాడు. అతనికోసం వెతుకుతూనే ఉంటాడు అతనికోసం వెతకనిచోటుండదు. అలా వెతుకుతూ దారితప్పిపోతాడు. . వాస్కో పోపా June 29, 1922 – January 5, 1991 సెర్బియన్ కవి Hide and Seek Someone hides from someone else Hides…
-
వాన… ఎడ్వర్డ్ థామస్, ఇంగ్లీషు కవి
ఒకటే వాన, అర్థరాత్రి కురుస్తున్న వాన, ఈ పాకమీద కుండపోతగా కురుస్తున్న వాన; నాకు మళ్ళీ దగ్గరలోనే చనిపోతానేమోనని అనిపిస్తోంది, బహుశా నేను మరోసారి వాన చప్పుడు వినలేకపోవచ్చు, నేను ఒంటరిగా పుట్టినప్పటికంటే నిష్కల్మషంగా నన్ను శుభ్రపరచినందుకు దానికి ఉచితరీతిలో కృతజ్ఞతలు చెప్పుకోలేకపోవచ్చు. అద్భుతమైన ఈ వాన తమమీద కురిసే విగతజీవులు ఎంతధన్యులో! కానీ ఇప్పుడు నేను ఒకప్పుడు ప్రేమించినవారితో సహా ఎవరూ ఈ రాత్రి మరణించకూడదనీ, ఒంటరిగా వానపడటం వింటూ గాని, బాధతో గాని ఎండిపోయిన…
-
అయితే, నువ్వు రచయితవి కావాలనుకుంటున్నావన్న మాట!… ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి
ఇన్ని జరిగినప్పటికీ, అది నీలోంచి విస్ఫోటనం చెందుతూరాకపోతే నువ్వు రాయకు. నువ్వు అడక్కుండనే నీ గుండెలోంచీ, మనసులోంచీ, నోటిలోంచీ నీ గొంతులోంచీ రాకపోతే, నా మాటవిని రాయకు! దానికోసం నువ్వు గంటలతరబడి నీ కంప్యూటరు తెరవంక తేరిపారచూస్తూనో, లేక, నీ టైపురైటరు మీద వాలిపోయో మాటలకోసం వెతుక్కుంటూ కూచోవలసి వస్తే రాయకు! నువ్వు డబ్బు కోసమో, కీర్తికోసమో రాస్తుంటే దయచేసి ఆ పని చెయ్యకు. స్త్రీల పొందు దొరుకుందని ఆశించి నువ్వు రాద్దామనుకుంటే, రాయొద్దు. నువ్వు అక్కడ…
-
హృదయవేదన… నజీం హిక్మెత్, టర్కీ కవి
డాక్టర్ గారూ, నా గుండె సగం ఇక్కడ ఉంటే రెండో సగం చైనాలో ఉంది ” యెల్లో రివర్ ” వైపు పరుగులు తీస్తున్న సైనికులతో. ప్రతిరోజూ, డాక్టర్ గారూ, ప్రతి ఉదయమూ నా గుండె గ్రీసులో గాయపడుతుంది. ప్రతి రాత్రీ, డాక్టరు గారూ, ఖైదీలందరూ నిద్రిస్తున్నపుడు, ఆసుపత్రులన్నీ నిర్మానుష్యమైనపుడు, నా గుండె ఇస్తాన్ బుల్ లో ఒక పాడుబడ్డ ఇంటి ముందు ఆగిపోతుంది. పదేళ్ళు గడిచేక నా పేదప్రజలకి నేనివ్వగలిగింది నా చేతిలో ఉన్న ఈ…
-
రెండు సానెట్ లు… చార్ల్స్ హామిల్టన్ సోర్లీ, స్కాటిష్ కవి
I సత్పురుషులు ఉదాత్తమైన నీ ఆత్మని శ్లాఘించారు. మహోన్నతమైన నీ కీర్తిచంద్రికలకు కవులు సిగ్గుపడ్డారు. నువ్వు చూపిన మార్గంలో నడవడానికి ఉద్యుక్యులైన అనేకమంది సరసన మేమూ నిరీక్షిస్తూ నిలబడ్డాము. ఇప్పుడు పేరుబడ్డా, ఒకప్పుడు నువ్వెవరో ఎవరికీ తెలీదు; నీ ఉనికి గుర్తించకుండా జీవించడానికి ప్రయత్నించాము. కానీ ఇపుడు ప్రతి వీధిలోనూ, ప్రతి దిక్కునా నిలకడగా నిశ్చలంగా నీ గుర్తులున్న స్థంబాలు చూస్తున్నాము. ‘కొండలమీదకి ఎక్కడానికి మార్గము ‘అని సూచిస్తూ మా ఊర్లో ఉన్న పాడుబడ్డ పొడుగాటి రాటని…
-
గాలివాన … లెనోరా స్పేయర్, అమెరికను .
ఈ కవితలో సౌందర్యం గాలివానని గెద్దలావాలడం అన్న ఊహలో ఉంది. సహజంగా సంగీతజ్ఞురాలైన ఈ కవయిత్రి అంత సంగీతభరితంగానూ ఈ కవితను వ్రాసింది. ప్రతి పదచిత్రం వెనుకా ఆ భావాన్ని ప్రతిబింబించే శబ్దం వెనుక శబ్దాన్ని గమనించండి. *** నల్లని రెక్కలతో కనుమరుగైన కోండలమీదకి వాలుతుంది భయపడిన పిల్లయేరు, దానికి ముందు దౌడుతీస్తుంది; అడవిలోంచి ఎక్కడనుండో ఆకుల గలగల వినిపిస్తుంటుంది రెమ్మల్ని హత్తుకుంటూ కొమ్మలమీంచి జారుతూ ఒక్కసారిగా పిట్టలన్నీ గప్ చుప్ అయిపోతాయి. ఒక ఉరుము ఆకాశాన్ని…
-
జ్ఞాపిక… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
ఉత్తమోత్తమమైన పింగాణీ, ఎంచెంచి వేసినట్టున్న రంగుతో రాబిన్ పక్షి గూట్లో దొరికిన ఈ చిన్న గుడ్డును చూసి నెత్తిమీద బోర్లించినట్టు నీలం మూకుడుందిగదా, ఆకాశం అంటాం, దాని ముక్క ఒకటి తెగి భూమి గుండెలమీద పడిందేమో ననుకున్నాను. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ అమెరికను అమెరికను కవయిత్రి, అనువాదకురాలు, చిత్రకారిణి The Souvenir . Of finest porcelain and of choicest dye, This bit of egg shell from a…
-
ప్రేమలో మునిగిన పడవ… రూమీ, పెర్షియన్ సూఫీ కవి
నేను దహించుకుపోతేనే తప్ప ప్రేమకి సంతృప్తి కలగదా? ఎందుకంటే, నా మనస్సే ప్రేమ ఆవాసమందిరం. ఓ ప్రేమా! నీ ఇల్లు నువ్వు తగలబెట్టుకుంటానంటే, తగలబెట్టుకో! “అది నిషిద్ధం,” అని ఎవడనగలడు? ఈ ఇంటిని పూర్తిగా దహించు. ప్రేమికుడి స్థావరం దహించబడ్డాక ఇంకా మెరుగౌతుంది. ఈ రోజునుండీ దహించుకుపోవడమే నా పరమార్థం నేను కొవ్వొత్తిలాటివాడిని, మంట నన్ను మరింతప్రకాశవంతం చేస్తుంది. ఈ రాత్రికి నిద్రకి దేవిడీ మన్నా; నిద్ర లేమితో అటూ ఇటూ తిరుగుతుంటాను అదిగో, ఆ ప్రేమికులని…
-
పికమేమన్నది?… జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి
ఇదిగో నిన్నే! శీతగాలికి ముఖమెదురొడ్డుతున్నవాడా! హిమపరాగపు తెరలలో వేలాడుతున్న మబ్బులనీ, గడ్డకట్టిన తారలలో నల్లని చెట్లకొమ్మలనీవీక్షిస్తున్నవాడా, నీకు వసంతాగమనమంటే, పండగ వేళే లే! ఇదిగో నిన్నే! సూర్యుడు అస్తమించిన పిదప ఒక రాత్రి తర్వాత మరో రాత్రి, నిన్నావరించిన చిమ్మచీకట్లలోనే వెలుగులకై వెదుకుతున్నవాడా నీకు వసంతపు రాక మూడింతల ప్రభాతమే లే! జ్ఞానం కోసం పరితపించకు … నా కెక్కడిదీ జ్ఞానం? అయినా నా పాట సహజంగా ఆర్ద్రతతో వస్తుంది. జ్ఞానంకోసం వెంపర్లాడకు… నా కెక్కడిదీ జ్ఞానం?…