వర్గం: అనువాదాలు
-
కవిహృదయం… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను
(మనవి : ఈ కవితకి శీర్షిక లేదు. ఎలా వీలర్ విల్ కాక్స్ తన Poems of Passion అన్న పుస్తకంలో ముందుమాటకంటే ముందుగా ఈ కవితని పెట్టుకుంది.) *** ఓ పాఠకుడా!నేను పాడుకున్న ఏదో గీతాన్ని చదివినంతమాత్రాన ఏ హృదయపులోతులలోంచి వచ్చిందో నువ్వు పసిగట్టగలవా? కవి కన్న కల ఎన్నడైనా బయటకు గట్టిగా చెబుతుందా దాని రహస్యపుటాలోచనలను వింటున్న జనసమూహానికి? ఏదీ, లేచి సముద్రపుటొడ్డునున్న ఒక శంఖుని తీసుకో— నీకేమిటి కనిపిస్తుంది? దాని ఆకారం, రంగూ. అంతే! విశాలమైన…
-
కొత్త జీవితం… ఆస్కార్ వైల్డ్ ఐరిష్ కవి
ఏ వేటా లభించని సముద్రం అంచున అలా నిరీక్షిస్తూ నిలబడ్డాను నా ముఖాన్నీ, జుట్టునీ నురుగుతో కెరటాలు తడి ముద్ద చేసేదాకా. గతించిన రోజు ఎర్రని చితిమంటలు సుదీర్ఘంగా పశ్చిమాకాశాన మండుతున్నాయి; గాలి బావురుమని ఊళలేస్తోంది; అరుచుకుంటూ సీ గల్స్ నేలవైపు పరిగెత్తుతున్నాయి; “అయ్యో! నా జీవితమంతా బాధలమయమేగదా! నిత్యం ప్రసవవేదన పడే ఈ చవిటి నేలల్లో పళ్ళూ, బంగారు ధాన్యాన్నీ ఎవరు పండించగలరు?” అని వగచేను. నా వలలు తెగి, పురితగ్గి, నోరు వెళ్ళబెడుతున్నాయి. అయినప్పటికీ…
-
రేపు సూర్యోదయం వేళకి… విక్టర్ హ్యూగో, ఫ్రెంచి కవి
హ్యూగో పెద్ద కూతురు 19 ఏళ్ళ లెపాల్డైన్ ప్రమాదవశాత్తూ సెప్టెంబరు 4, 1843 లో సియాన్ నదిలో పడి, ఆమెను కాపాడబోయిన భర్తతో సహా మరణిస్తుంది. ఆమె స్మృతిలో రాసిన కవిత. ఆమె సమాధిని దర్శించడానికి వెళ్ళిన ఒక సందర్భంలో రాసిన ఈ కవిత అతనికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది.) . రేపు, సూర్యోదయం వేళకి, పల్లెలు తెల్లదనాన్నలముకుంటూంటే నేను బయలు దేరుతాను. నాకు తెలుసు నువ్వు నాకోసం నిరీక్షిస్తుంటావని. నేను కొండలు ఎక్కి అడవిగుండా ప్రయాణం…
-
నీరు … ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి
అన్ని మతాల్లోనూ నీటిప్రాముఖ్యత గురించి కవి ఈ కవితలో పరోక్షంగా చెబుతున్నాడు. . నన్నే గనక ఒక మతాన్ని స్థాపించమని చెబితే నేను నీటిని ఉపయోగించాల్సి వస్తుంది. చర్చికి వెళ్ళాలంటే పాదాలు తడిసే నీళ్ళలోంచి నడవాలి వేరే రకమైన వస్త్రాలు ఆరబెట్టాలి. నా ప్రార్థనలూ పూజల్లో భక్తితో స్నానం చెయ్యడం నీటిలో నిలువునా తడవడం వంటి దృశ్యాలుంటాయి. నేను ‘తూర్పు’కి ఒక గ్లాసుడు నీళ్ళు ఎత్తితే చాలు దానిమీద ప్రతిఫలించే ఏపాటి కాంతైనా తండోపతండాలుగా ప్రజల్ని సమీకరిస్తుంది.…
-
ఇదిగో నీకే…. వాల్ట్ విట్మన్, అమెరికను
పద! అందరికీ దూరంగా మనిద్దరం కలిసినడుద్దాం; ఇక మనిద్దరం ఏకాంతంగా ఉన్నాం గనుక కాసేపు మర్యాదలన్నీ పక్కనబెడతావా? ప్రారంభించు! నువ్వింతవరకు ఎవరికీ చెప్పనిది నాతో చెప్పు. విషయమంతా ఉన్నదున్నట్టుగా చెప్పు. నువ్వు నీ సోదరుడికీ, నీ భార్యకీ (లేదా భర్తకీ), వైద్యుడికీ చెప్పనివన్నీ వినిపించు. . వాల్ట్ విట్మన్ మే 31, 1819 – మార్చి 26, 1892 పద అమెరికను . . To You . Let us twain walk aside from…
-
మా పూర్వీకుల గ్రామంలో… వాస్కో పోపా, సెర్బియన్ కవి
ఒకరు నన్ను కాగలించుకుంటారు ఒకరు నా వంక తోడేలులా చూస్తారు మరొకరు తన టోపీని తీస్తారు తనని నేను బాగా చూడగలిగేలా. ప్రతివారూ నన్నడుగుతుంటారు నేన్నీకు ఏమౌతానో చెప్పగలవా అంటూ ఎన్నడూ ఎరుగని వృద్ధ స్త్రీలూ, పురుషులూ నా చిన్నప్పటి జ్ఞాపకాలలోనిలిచిన పేర్లు చెబుతూ … వాళ్ళు తామే అంటారు. అందులో ఒకర్ని అడుగుతాను: నామీద దయ ఉంచి చెప్పండి “తోడేలు జార్జి” ఇంకా బ్రతికున్నాడా? ఏదో మరో లోకంనుండి మాటాడినట్టు ఒక వ్యక్తి “అది నేనే”…
-
జ్వాలలు… జోసెఫ్ కాంప్ బెల్, ఐరిష్ కవి
ప్రకృతి రగిలించే ఆ చిన్ని చిన్ని జ్వాలలు… నీలి నీలి మొగ్గలూ, ఎర్ర ఎర్రని పూలూ… తుఫాను రాత్రుల్లో ఆమె ఆగ్రహం కొండల్ని కొరడాలతో కొట్టినపుడు, చల్లారుతుంది. మేఘాల ఎత్తుకి ఆమె ఎగదోసే మంటలు రంగురంగుల హరివిల్లూ, తటిల్లతలూ … ఆమె ఆగ్రహంతో నేలను గట్టిగా శపిస్తూ కుమ్మేస్తుంది పర్యవసానం మృత్యువైనా లెక్కచేయదు. ఆమె ఆత్మలో రగిలించే అగ్ని కీలలు కవి ఆవేశంలోనూ, విప్లవకారుడి ఆలోచనలోనూ; రెంటినీ నియంత్రించలేదు; అక్కడ వాడిన ఇంధనం ఇక్కడకాదు, వేరే గనుల్లోంచి…
-
ఓటమి … గ్లెన్ వార్డ్ డ్రెస్ బాక్, అమెరికను కవి
హతుని ముఖం కాల్పులదిశలో ఉంటూ యుద్ధం గుర్చిన అన్ని కోర్కెలూ చిక్కిశూన్యమై మితిలేని మరపులో కప్పబడి; చివరకి మృత్యువు మాత్రమే ఉపశాంతినివ్వగడంలో ఓటమి ఉంది. ఈ శరీరం ఆత్మ సంకల్పాలని గ్రహించలేక దేవులాడుతూ, చిత్రహింసలపాలైన బుద్ధి తిరిగి పొందలేని పూర్వవైభవాన్ని తలుచుకుంటూ మదిరప్రభావానికిలోనైనట్టు స్మృతితప్పడంలో ఓటమి ఉంది. కానీ, విజయానికి ప్రేరణనిచ్చి, దాన్ని సాధ్యం చేసిన కలల్ని పక్కనబెట్టి, చిత్రంగా, సాధించిన విజయానికి సంతృప్తి చెంది, గెలుపు ప్రయోజనం క్రమంగా బలహీనపడుతూ, చివరకి ఏ ప్రయోజనం ఇవ్వకపోగా, ఇవ్వలేని…
-
నీడపట్టున నివసించేవాళ్ళు … హోవర్డ్ ముంఫోర్డ్ జోన్స్ , అమెరికను కవి
నీడపట్టున నివసించేవాళ్ళు చూపుమేర వ్యాపించిన నీడల మైదానాలలో భ్రాంతికలిగించే తెలినురుగు తీరాలవెంట ప్రేతాత్మల్లా నిరంతరం సంచరిస్తూనే ఉంటారు. వాళ్ళజీవితాలలో ఏ కోశానా ఆశ కనిపించదు ఐనప్పటికీ వాళ్ళు మరణించలేరు, బావురుమనే వాళ్ళ సముద్ర తీరాల్ని వదలలేరు అసంతృప్తికరమైనా, వాళ్ళ ఊహల్ని వదులుకోలేరు. నీడపట్టున నివసించేవాళ్ళు ఎండుటాకుల కదలికల్లా మాటాడుతుంటారు. పచ్చనిమైదానాలతో మాటాడేటపుడు ఎవరికీ సంతోషమూ ఉండదు, విచారం ప్రకటించరు. వాళ్ళు అలా గుసగుసలాడుతూనే ఉంటారు అంతే బహుశా బిక్కుబిక్కుమని ఒంటరిగా ఒడ్డుకుచేరే కెరటాలకీ అక్కడ నివసించే మనిషికి…
-
ఏం చేద్దాం మనం ?… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి
ఇప్పుడిక, ఎప్పటికన్నాకూడా, మనజీవితాలు విడిపోకతప్పదు నా దారి అటు వెళుతోంది, నీదారి ఇంకోవైపుకు పోతోంది. ఓ మనసా! మనం ఈ ప్రాణప్రదమైన ప్రేమని ఏం చేద్దాం? అది రోజు రోజుకీ భరించలేని భారమౌతోంది. దాచెద్దామా? ఈ భూమిమీద అన్ని మాళిగలలో, శూన్యమూ, రోదసిలో ప్రియా, దాన్ని దాచడానికి సరిపడినంత జాగా దొరకదే ; గతమంతటి ఘనమైన అంతులేని గిడ్డంగి కూడా మనకళ్ళకి కనిపించకుండా దాన్ని దాచలేదని నా భయం. పోనీ దేన్లోనో ముంచెద్దామా? అన్ని సముద్రాలలోని నీళ్ళనూ…