వర్గం: అనువాదాలు
-
ఇసుకమీద… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి
స్నేహం పునాదిగా లేని ప్రతి ప్రేమా ఇసకమీద కట్టిన భవంతిలాంటిది. దాని గోడలు దేశంలో దేనికీ తీసిపోనంత గట్టివైనా వాటి శిఖరాలు ఆకాశంలోకి నిటారుగా హుందాగా తలెత్తినా; అనుభవజ్ఞులూ, నిపుణులైన పనివారు అన్నిచోట్లా అందమైన అలంకరణలతో తీర్చిదిద్దినా చీకటి మూలల్లో తళతళలాడే విగ్రహాలు నిలబడినా, పూలుదాగున్న చోటుల్లో జలయంత్రాలు నీరు చిమ్ముతున్నా, తూర్పునుండి ఆగ్రహోదగ్రమైన ఒక్క పెనుగాలి వీచితే చాలు, విధి వక్రించి, పగలనక రాత్రనక ఒక తుఫాను ముంచుకొస్తే చాలు, దాని గోడలు దాసోహం అంటాయి.…
-
మనిషికి బ్రతికుండగా సమయం దొరకదు… యెహుదా అమిఖాయ్, ఇజ్రేలీ కవి
మనిషికి బ్రతికుండగా సమయం దొరకదు ఏ పనిచెయ్యడానికైనా సమయం కేటాయించడానికి. అతనికి చాలినన్ని ఋతువులు లేవు తన ప్రతి అవసరానికీ ఒక ఋతువు కేటాయించడానికి. ఆ విషయంలో మతగ్రంథం చెబుతున్నది తప్పు. అతనికి ఒకే సమయంలో ప్రేమా కావాలి, ద్వేషమూ కావాలి ఆ కళ్ళతోనే ఒక ప్రక్క నవ్వాలి, మరొక వంక ఏడ్వాలి, ఆ చేతులతోనే రాళ్ళు రువ్వాలి, రాళ్లు ఏరుకోవాలి, యుద్ధంలో ప్రేమించాలి, ప్రేమలో యుద్ధం చెయ్యాలి. ద్వేషించాలి, క్షమించాలి, గుర్తుంచుకోవాలి, మరిచిపోవాలి, ఒక క్రమ…
-
తరుణి… లిండా గ్రెగ్, అమెరికను కవయిత్రి
నేను ఒకప్పుడు హాయిగా బ్రతికిన నా స్వదేశానికి తిరిగివచ్చేను, ఎన్నో మార్పులకు లోనై. ఇప్పుడు అవేశం నన్ను ఒత్తిడికి గురిచెయ్యదు. ఇప్పుడు వాంఛల జాగాలో ఏవి వచ్చి చేరుతాయోనని కుతూహలంగా ఉంది. నేను ఎంతో మెరుగ్గా ఎక్కడ జీవించేనో అక్కడ తిరుగాడుతున్న నా గత ప్రకృతికి వికృతిలా ఉన్నానేమో! అటూ ఇటూ తచ్చాడుతూ విలువైన వస్తువు నాకు కనిపించినపుడు తల పంకిస్తూ. ఇప్పుడు నా ఇంట్లో గుడ్లగూబల అరుపులు వింటూ నివసిస్తున్నాను. అవి నేను నెమ్మదిగా మళ్ళీ…
-
ప్రేమే సర్వస్వం కాదు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
గమ్మత్తైన శిల్పంతో ప్రేమ సర్వస్వం కాదంటూనే, దాన్ని సర్వస్వంగా వాచ్యం చెయ్యకుండా నిరూపిస్తుంది ఎడ్నా ఈ కవితలో. *** ప్రేమే సర్వస్వం కాదు; అది తిండిపెట్టదు, దాహం తీర్చదు నిద్రపుచ్చదు, కనీసం వర్షాన్నుండి రక్షించదు; అది ప్రవాహంలో కొట్టుకుపోతున్న కొయ్యకూడా కాదు దాన్ని ఆసరాగా చేసుకుని మునుగుతూ, తేలుతూ, ఒడ్డుచేరుకోడానికి; గట్టిపడిన ఊపిరితిత్తుల్ని అది గాలితో నింపలేదు, రక్తాన్ని శుభ్రపరచలేదు, విరిగిన ఎముకని అతకనూలేదు; అయినప్పటికీ, మనిషి మృత్యువుని కాగలించుకుంటూనే ఉన్నాడు నేను మాటాడుతున్న ఈ క్షణంలో…
-
నాకేమిటి లక్ష్యం… సారా టీజ్డేల్
కలలలోనూ, వసంతపు మత్తులోనూ నా పాటలు వినిపించకపోతే నాకేమిటి లక్ష్యం? అవి సుగంధాలవంటివి, నేనొక చెకుముకి రాయిని, నిప్పురవ్వని, ఆర్తిగా పిలిచేవి అవి; వాటికి బదులుపలుకుతాను అంతే! నా ప్రేమ కొద్దిలో ముగిసిపొతుందంటే, నాకేమిటి లక్ష్యం? నా హృదయాన్ని చెప్పదలుచుకున్నది చెప్పనీండి, బుద్ధి మారుమాటాడదు. నా బుద్ధికి మౌనంగా ఉండగల అహం, సమర్థతా ఉన్నై, పాటలు కట్టేది నా హృదయమే, నేను కాదు. . సారా టీజ్డేల్ అమెరికను కవయిత్రి . . . . What…
-
శాస్త్రవిజ్ఞానానికో నమస్కారం… ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను కవి
శాస్త్రవిజ్ఞానమా! ప్రాచీనకాలానికి అచ్చమైన బిడ్డవు నువ్వు. నీ నిశితమైన దృష్టితో అన్నిటినీ పరివర్తన చెయ్యగలవు. ఎందుకునువ్వు ఈ కవిహృదయాన్ని కబళించడానికి సిద్ధపడతావు? నువ్వు హృదయంలేని కరుకు సత్యాలరెక్కలతో విహరించే రాబందువి కావూ? కవికి నీమీద ప్రేమ ఎక్కడినుండి కలుగుతుంది? నీ జ్ఞానాన్ని మెచ్చేదెలా? అలుపులేని ఆలోచనల రెక్కలతో అతను మింటికెగసి అక్కడ నిక్షిప్తమైన సౌందర్య నిధులకై తిరుగాడుతుంటే నువ్వు అతన్నికూడా విడిచిపెట్టవు గదా! డయానాని తన సింహాసనం నుండి బహిష్కరించింది వనదేవతలని చెట్లనుండి వేరుచేసి మరో చోటు…
-
ముగ్గురు బాలికలు… హేజల్ హాల్, అమెరికను కవయిత్రి
ముగ్గురు బాలికలు ఇటువైపునుండే రోజూ బడికెళ్తుంటారు అందులో ఇద్దరు, ఆడపిల్లలకి సహజంగా ఉండే భయాలతో బెదురుతూ బెదురుతూ వెళుతూ ఉంటారు. ఒకమ్మాయి మాత్రం కళ్ళలో కలలతో నడిచిపోతుంటుంది. ఆ ఇద్దరికీ ఆడపిల్లలలకుండే బెరుకుచూపులున్నాయి వాళ్ళ జుత్తు వంకీలకే వంకలుపెడుతోందా అన్నట్టు ఉంది కానీ, ఆ మూడో అమ్మాయి కళ్ళు ఎక్కడో ఊహాతీరాలవైపు తెరుచుకున్న విశాలమైన తలుపుల్లా ఉంటాయి. వాళ్ళు ఈ రోజు వెళ్ళినట్టే వెళ్తారు క్షణికమైన ఈ జీవితపు చరమాంకందాకా; మొదటిద్దరికీ జీవితం ఏదిస్తే అదే అనుభవమౌతుంది…
-
ప్రయాణం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ఈ రైలు మార్గము మైళ్ళ కొద్దీ సాగుతోంది. రోజల్లా మనుషులమాటలతో సందడిగా ఉంటుంది కానీ రోజు రోజల్లా ఎదురుచూసినా ఏ రైలూ రాదు నాకు మాత్రం దాని కూత ఎక్కడినుండో వినిపిస్తూంటుంది రేయి నిద్రపోడానికీ, కలలు కనడనికే అయినా ఎంత చూసినా, రాత్రి మొత్తంలో ఏ రైలూ ఇటు రాదు; కానీ నాకు ఆకాశంలో ఎగురుతున్న నిప్పు రవ్వలు కనిపిస్తున్నాయి దాని ఇంజనులోంచి ఎగజిమ్ముతున్న ఆవిరిచప్పుడు వినిపిస్తోంది. నే నేర్పరచుకున్న స్నేహాలవల్ల మనసు హాయిగా ఉంది అంతకంటే…
-
ఫిరంగుల మోత… రిచర్డ్ ఆల్దింగ్టన్, ఇంగ్లీషు కవి
నాలుగురోజులపాటు భూమి ఇనపగుళ్ళ వర్షానికి పగిలి ముక్కలైంది. మా చుట్టూ ఉన్న ఇళ్ళు నేలమట్టమయాయి; మృత్యుసంకేతమైన ఇల్లుకూలిపోయిన శబ్దం ఎప్పుడు వినబడుతుందోనని చెవులు రిక్కించి భయంతో,చెమటలు కక్కుకుంటూ మూడురోజులూ అసలు నిద్రపోడానికి ధైర్యం చాలలేదు. నాలుగోనాటి రాత్రి ప్రతిఒక్కరూ, నరాలు పిట్లిపోయి, అలసట అంచులకు చేరి, నిద్రపోయాం, నిద్రలొ గుంజుకుంటూ, ఏవో గొణుక్కుంటూ పైన ఫిరంగులు అలా మోతమోగుతున్నా. ఐదవరోజుకి ఒక్కసారి ప్రశాంతత వచ్చింది; మేము మా కలుగుల్లోంచి బయటకి వచ్చాం నేలమీద జరిగిన విధ్వంసాన్ని చూశాము.…
-
మార్మిక కవిత 2… రూమీ, పెర్షియను సూఫీ కవి
వివేకం అంది,”చూస్తుండు, అతన్ని నా వాదనతో వంచిస్తాను;”అని. ప్రేమ అంది, “ఊరుకో! నేనతన్ని మనసుతో వంచిస్తాను.” అని మనసు హృదయంతో అంది, “ఫో!నన్ను చూసీ, నిన్ను చూసీ నవ్వకు. అతనిది కానిదేముందని అది చూపి అతన్ని మోసగించడానికి? అతనికి విచారంలేదు, ఆందోళన లేదు, అజ్ఞాతమే కొరుకుంటున్నాడు పోనీ అతనికి మద్యాన్నీ, అధికమొత్తంలో ధనాన్నీ చూపి వంచిద్దామన్నా. అతని చూపులతూపులు ఏ వింటినుండీ వెలువడటంలేదు ప్రతిగా మరొక వింటినుండి చూపుల అమ్ములతో ఖండించడానికి. అతనీ ప్రపంచానికి ఖైదీ కాడు,…