వర్గం: అనువాదాలు
-
అతని అంతిమ యాత్రలో ఆమె… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి
అతన్ని … తన కడపటి విశ్రాంతి స్థలానికి నెమ్మదిగా నడుస్తూ తీసుకుపోతున్నారు; నేనొక అపరిచితవ్యక్తిలా అనుసరిస్తున్నాను; వాళ్ళు అతనికి బంధువులు; నే నతని ప్రేయసిని వాళ్ళందరూ నల్లని శోకచిహ్నమైన నలుపుదుస్తుల్లో ఉన్నా, నేను గాఢమైన రంగులో ఉన్న నా గౌనుని మార్చలేదు; వాళ్ళు అతనిచుట్టూ ఏ విచారమూ లేకుండా నిలుచుంటారు, కానీ, నా పశ్చాత్తాపము నన్ను దహిస్తుంది. . థామస్ హార్డీ (2 June 1840 – 11 January 1928) ఇంగ్లీషు కవి. . . She…
-
మా అమ్మకు… ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను కవి
ఊర్ధ్వలోకాలలోని దేవదూతలు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ, వారి అత్యంత ప్రేమాస్పదమైన పదాల వెదుకులాటలో, “అమ్మ”ను మించిన పూజనీయమైన మాటను కనుగొనలేరని నేను భావిస్తున్నాను గనుక, ఇష్టమైన ఆ పేరుతోనే నిన్ను ఎప్పటినుండో పిలుస్తున్నాను… నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లికంటే పూజనీయురాలవు, నా మనోంతరాలములో సదా నిలుస్తావు, నా వర్జీనియను చైతన్యాన్ని స్వేచ్ఛగా విడిచిపెట్టడానికి మృత్యువు నిను నియోగించింది. నా తల్లి… కన్న తల్లి… నా చిన్నప్పుడే మరణించిన తల్లి కేవలం నాకు మాత్రమే తల్లి; కానీ నువ్వు…
-
గుప్తప్రేమ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నా ప్రేమని నేను హృదయంలోనే పదిలపరిచాను నా కళ్ళల్లో నవ్వులు వెలిగించుకున్నాను, ఎందుకంటే, మేం కలుసుకున్నప్పుడు నా ప్రేమ అమరమని అతనికి తెలియకూడదు. కానీ ఒక్కోసారి అతను రాత్రి సుగంధాలు విరజిమ్మే చిక్కని, పచ్చని తోటలను కలగంటునపుడు, బహుశా నా ప్రేమ మెల్లిగా బయటకి జారుకుని అతనికి ఆ కలని తేప్పించిందేమో! ఒక్కోసారి అతని మది వేదనా భరితమై వెనువెంటనే కోలుకున్నప్పుడు, బహుశా, అక్కడ నా ప్రేమ ఉందేమో అతనికి బాధనుండి విముక్తి కలిగించడానికి! . సారా…
-
ఎడ్వర్డ్ థామస్ స్మృతిలో … రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి
నీ కవితలు గుండెమీదపెట్టుకుని నిద్రలోకి జారుకున్నాను అలా పేజీలు తెరిచి ఉంచి, అర్థాంతరంగా విడిచిపెట్టి, సమాధిమీది చిత్రంలోని పావురాయి రెక్కల్లా నిద్రలోనైనా అవి మనిద్దరినీ కలుపుతాయేమోనని. నేను జీవించి ఉండగా తప్పిపోయిన అవకాశం మరి రాదు కొంచెం ఆలస్యమైనప్పటికీ నిన్ను నేను కలుసుకుంటాను ముందుగా నువు సైనికుడివి, తర్వాత కవివి, తర్వాత రెండూను, నీ జాతిలో సైనిక-కవిగా మరణించింది నువ్వే. నా ఉద్దేశ్యమూ, నీ ఉద్దేశ్యమూ కూడా మనిద్దరిమధ్యా ఏ దాపరికాలూ ఉండకూడదన్నది; సోదరా, ఇదొకటి మిగిలిపోయింది—…
-
నిరంకుశుడిపై స్మృతిగీతం… ఆడెన్, ఇంగ్లీషు- అమెరికను కవి
అతను ఒక విధమైన వేలెత్తిచూపలేని పరిపూర్ణతకై ప్రాకులాడుతున్నాడు దానికోసం అతను సృష్టించిన పరిభాష అందరికీ అవగతమే; అతనికి మనిషుల బలహీనతలు తన మండ ఎరిగినంతగా అవగతం, అతనికి సైనికపటాలాలన్నా, నావికదళం అన్నా గొప్ప ఇష్టం; అతను నవ్వితే చాలు, పూజ్య సభాసదులంతా పగలబడి నవ్వుతారు, అతను రోదిస్తే, రోడ్లపై పసిపిల్లలు మరణిస్తారు. . WH ఆడెన్ (21 February 1907 – 29 September 1973) ఇంగ్లీషు-అమెరికను కవి . . Epitaph on a tyrant…
-
పాఠకుడికి… డెనిస్ లెవర్టోవ్, బ్రిటిషు కవయిత్రి .
మీరు ఇది చదువుతుంటే, ధృవాలలో ఒక తెల్లని ఎలుగు తెల్లని మంచుని కాషాయరంగులో ముంచుతూ మూత్రాన్ని విసర్జిస్తుంది. మీరిది చదువుతుంటే చాలామంది దేవతలు వృక్షాలనల్లుకున్న లతలలో దాక్కుంటారు; గాజులామెరిసేకళ్లు తరాల పచ్చని ఆకులని వీక్షిస్తుంటాయి. మీరిది చదువుతుంటే ఆ సముద్రం అలలు ఎగదోస్తుంటుంది భీకరమైన తన అలల్ని ఎగదోస్తుంటుంది. . డెనిస్ లెవర్టోవ్ (24 October 1923 – 20 December 1997) బ్రిటిషు కవయిత్రి Denise Levertov British Poet Photo Courtesy: http://lithub.com/denise-levertov/…
-
ప్రతి ఊరూ నా ఇల్లు… కణియన్ పూన్గున్రనార్, తమిళకవి
ప్రతి ఊరూ నా ఇల్లు ప్రతి మనిషీ నా చుట్టము. మన జీవితాలు, అవెంతప్రియమైనవైనా వాటి మార్గాన్ని అవి అనుసరిస్తాయి, ఆకాశాన్ని చీలుస్తూ మెరిసే మెరుపుల తర్వాత కురిసినకుండపోతకి ఉధృతంగా పారే నదీ ప్రవాహానికి రాళ్ళమీద ఒక్కదెబ్బకు ముక్కలయో లేదా దారితప్పో పోతున్నాయి తెప్పలు. ఇదంతా దూరదృష్టిగలవారి దార్శనికతవల్ల మనం తెలుసుకోగలం అందుకే మనల్ని గొప్పవాళ్ళు ఆశ్చర్యపరచరు సామాన్యుల్ని మనం కించపరచము. . కణియన్ పూన్గున్రనార్ తమిళకవి సంగం యుగం. Every Town a Home Town…
-
ఇక్కడ ఈ ఉదయం… ఏలన్ డూగన్,అమెరికను
ఇది ఈ రోజు సరికొత్త ఉదయం: గతరాత్రికి చెందిన కీర్తి అపకీర్తులు గతించాయి, వాటి ప్రభావాలు మినహా ; ఒకటవ, రెండవ ప్రపంచ మహాసంగ్రామాలూ, ఎడ్వర్డు ఏడుతోనో, ఎనిమిదితోనో, వాలిస్ వార్ ఫీల్డ్ సింప్సన్ వివాహమూ, “పోప్” లకున్న క్రమసంఖ్యల్లా… వరుస సంఖ్యలిచ్చిన రాకెట్లు …ఆకాశంలోనో చంద్రమండలం మీదనో పేలిపోతాయి. ఇక ఇప్పుడు ఒక కొత్త రోజు మొదలైంది. ఈ రోజునీ, దాని చక్కని చుక్కల్నీ తక్షణం హస్తగతం చేసుకోవాలి, మతాధికారులు ఆరుబయట పాదచారుల కాలిబాటల్ని శుభ్రపరుస్తున్నారు,…
-
స్వాప్నికుడు… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
కలల కనుమల్లో ఒక స్వాప్నికుడు అతన్ని పిచ్చివాడిగా పరిగణిస్తారు; అతనికి అదొకవెర్రి; బక్కచిక్కి, వంగిన శరీరాన్ని కప్పి ఉంచిన అతని ఉడుపుల మాసికలనుబట్టి అతన్ని విలువకడతారు. ప్రతిరోజూ సూర్యుడు పడమటికొండ దిగగానే, తీరికలేని నగర పొలిమేరలుదాటి, నింగీ నేలా కలిసే చోట వంపులుతిరిగి, తీరికగా, సడిచేయక పారే సెలయేటి తీరాన ఆ వింత మనిషి ప్రశాంతంగా అటూఇటూ తిరుగుతుంటాడు. అతని చెవులబడే సంగీతం గురించి, ఆహ్! ఏమని చెప్పను?! ఆ కన్నులాలోకించే అద్భుతదృశ్యాలను ఏమని వర్ణించను?! అతనా పేదవాడు? ఎన్నటికీ…