వర్గం: అనువాదాలు
-
స్థూలంగా చూసినపుడు … లార్డ్ టెన్నిసన్, ఇంగ్లీషు కవి
ప్రేమలో, ప్రేమ నిజంగా ప్రేమ అయి, ఆ ప్రేమ మనదైనపుడు విశ్వాసమూ, విశ్వాసఘాతమూ సమ ఉజ్జీలు ఎన్నడూ కాలేవు; స్థూలంగా చూసినపుడు అన్నిచోట్లా విశ్వాసఘాతం అంటే, అపనమ్మకమే. వీణలో ఎక్కడో అతి చిన్న బీట, క్రమక్రమంగా దానిలోని సంగీతాన్ని హరిస్తూ, క్రమంగా వ్యాపిస్తూ వ్యాపిస్తూ,దాన్ని పూర్తిగా మూగబోయేట్టు చేస్తుంది. అలాగే, ప్రేమిక మదివీణియలోని చిన్న బీట లేదా ఏరినపండ్లమధ్య కనిపించని ఒక చిన్న ముల్లు, లోలోపలే కుళ్ళిపోయి దానిచుట్టూ బూజుపేరుకునేలా చేస్తుంది ఇక అది దాచుకుందికి పనికి…
-
అసత్యం… సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి
ఓ ఆత్మా! ఈ శరీరపు అతిథీ! ఫో! ఎవ్వరూ మెచ్చని ఈ పని చేసిపెట్టు; అత్యుత్తమమైన వాటిని ఎంచుకోడానికి వెనుకాడకు; సత్యమొక్కటే నీకు అనుమతి పత్రం. ఫో! ఫో! నాకు మరణం ఆసన్నమయింది. పోయి లోకం చేసే తప్పులు … తప్పులని చెప్పు! రాజాస్థానికి పోయి అది కుళ్ళిన కట్టెలా వెలుగుతోందని చెప్పు; చర్చికి పోయి అది మంచేదో చెబుతుంది గాని, ఏ మంచీ చెయ్యదని చెప్పు. చర్చిగాని, రాజసభగాని వాదిస్తే, వాళ్ల సమాధానాలు నిర్ద్వంద్వంగా ఖండించు.…
-
సత్యదర్శనము… కొవెంట్రీ పాట్ మోర్, ఇంగ్లీషు కవి
ఒక వ్యర్థ కవి, నూటికొక్కడు తనపరిసరాల్ని పరికిస్తాడు, కానీ, తక్కినపుడు అతని అవగాహనకి అందనంత సౌందర్యవంతంగా ఉండే సృష్టి, అతనికి కుకవి హాస్యం కంటే పేలవంగా కనిపిస్తుంది. ప్రేమ ప్రతి వ్యక్తినీ జీవితంలో ఒక్కసారి మేల్కొలుపుతుంది; మనిషి తన బరువైన కనులెత్తి, పరికిస్తాడు; ఆహ్! ఒక సౌందర్యవంతమైన పేజీ బోధించలేనిదేమున్నది! దాన్ని ఆనందంతో చదువుతారు, మళ్ళీ పుస్తకం మూసేస్తారు. కొన్ని కృతజ్ఞతలూ, కొన్ని దూషణలూ గడచిన తర్వాత, చాలమంది అన్నీ మరిచిపోతారు, కానీ, ఎలా చూసినా, గుర్తుపెట్టుకోలేని…
-
రసగీతి… విలియం ఓల్డిస్ , ఇంగ్లండు
క్షణం తీరికలేక, కుతూహలంతో, దాహంతో తిరిగే ఓ ఈగా, నేను తాగుతున్నట్టుగానే, నెమ్మదిగా ఈ పానీయం తాగు; నా కప్పు మీదకి నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాను, నువ్వు దీన్ని తాగగలిగితే, సొక్కి సోలు; నీ జీవితంనుండి పొందగలిగినంత పొందు, జీవితం చాలా క్షణికం, త్వరగా కరిగిపోతుంది. నీదీ నాదీ ఒక్క తీరే, కాలం త్వరగా అస్తమదిక్కుకి పరిగెడుతుంది; నీది ఒక్క వసంతమే, నాదీ అంతకంటే ఎక్కువేం కాదు, కాకపొతే అది మూడు ఇరవైల వసంతాలు తిరుగుతుంది; ఆ…
-
ప్రకృతి… HW లాంగ్ ఫెలో, అమెరికను కవి
నిద్రపుచ్చడానికి … సగం ఇష్టంగా, సగం అయిష్టంగా నేలమీద తను ఆడుకుంటూన్న వస్తువులనన్నీ నేలమీదే వదిలేసి, అయినా తెరిచిఉన్న తలుపులోంచి వాటిని చూస్తూ, పూర్తిగా ఊరడింపూలేక, వాటికి బదులు ఇస్తానన్నవి అంతకంటే మంచివైనా సంతోషం కలిగిస్తాయన్న హామీ లేక, బాధపడే చిన్న పిల్లాడిని ఆ రోజుకి ఆటముగిసేక ప్రేమగా లాలిస్తూ చెయ్యిపట్టుకుని లాక్కువెళ్ళే పిచ్చితల్లిలా ప్రకృతికూడా మనతో సంచరిస్తుంది, మన ఆటవస్తువుల్ని ఒక్కటొక్కటిగా లాక్కుంటూ, మనల్ని చెయ్యిపట్టుకుని మన విశ్రాంతి స్థలానికి నెమ్మదిగా నడిపించి తీసుకుపోతుంది కళ్ళమొయ్యా…
-
నూత్న మహావిగ్రహం… ఎమ్మా లాజరస్, అమెరికను కవయిత్రి
అద్భుతమైన ఈ కవిత అమెరికా దేశపు నాయకత్వం 20 వశతాబ్దం మొదలు వరకూ పాటించిన ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. చిత్రంగా అదే దేశపు నేటి నాయకుల ఆకాంక్షలూ, అభిప్రాయాలూ దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో సాగుతున్నాయి. ఫ్రెంచి ప్రజల సౌహార్ద్ర సూచకంగా అమెరికనులకు బహూకరించబడిన ఈ రాగితో చేసిన విగ్రహాన్ని గుస్తావ్ ఈఫెల్ నిర్మించగా, అక్టోబరు 28, 1886 న జాతికి అంకితం చెయ్యబడింది. కవయిత్రి మరణించిన 15 సంవత్సరాలకు, 2003 లో Statue of Liberty పదపీఠాన…
-
ఈ సజీవ హస్తం… జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి
ఇది చాలా చిత్రమైన కవిత. నిజానికి ఇది అసంపూర్ణ కవిత. కీట్స్ దీనిని తన అసంపూర్ణ కవితల రాతప్రతులలో రాసుకున్నాడు. ఈ కవిత కాలం సుమారుగా అక్టోబరు 1819. నిజానికి 18 అక్టోబరు 1819 న కీట్స్ కీ అతని ప్రేయసి ఫానీ బ్రౌన్ కీ నిశ్చితార్థం జరిగింది. వారిద్దరు వివాహం చేసుకునే అదృష్టానికి నోచుకోలేదు. అప్పటికే అతను క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. కీట్స్ కి తను ఎక్కువకాలం బ్రతకనని అప్పటికే తెలుసు. భయపడినట్టుగానే, రెండేళ్ళలో కీట్స్ చనిపోతాడు. అతనిమీద ఉన్న…
-
వెన్నెల… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ముదిమి పైబడిన తర్వాత నాకు బాధ అనిపించదు, చంద్రకాంతితో జ్వలిస్తూ సాగే కెరటాలు ఇకపై కోరలుసాచిన వెండి పాముల్లా నన్ను కాటెయ్యవు; రాబోయే రోజులు నిరుత్సాహపరుస్తూ విచారంగా గడుస్తాయి, అయినప్పటికీ, ముక్కలయ్యేది సంతుష్ట హృదయమే. మనసెప్పుడూ జీవితం ఇవ్వగలిగినదానికంటే ఎక్కువే ఆశిస్తుంది అది తెలుసుకోగలిగితే, సర్వమూ తెలిసుకున్నట్టే, ఒక విలువైన పాయమీద మరొకపాయగా కెరటాలు దొర్లిపడుతుంటాయి, కానీ సౌందర్యం మాత్రం స్థిరంగా నిలవక పలాయనం చిత్తగిస్తుంటుంది, అందుకే, ముదిమి పైబడినా, నాకు పెద్దగా బాధ అనిపించదు. .…
-
భగవంతుని వైభవం… గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్, ఇంగ్లీషు కవి
ఈ సృష్టి అంతా భగవంతుని వైభవంతో నిండి ఉంది… కంపించే బంగారు రేకునుండి వెలువడే కాంతిపుంజంలా; అది గానుగలోంచి ఊరే నూనెలా కొద్దికొద్దిగా వస్తూనే అఖండమౌతుంది. మరి మనుషులెందుకు అతని అధికారాన్ని లెక్కపెట్టరు? తరాలు నడచి పోయాయి, నడుచుకుని పోయాయి, నడుచుకుంటూపోయాయి అందరూ తమ పనుల్లో, శ్రమలో, వేదనల్లో మునిగి తేలేరు; మనుషులుగా తమ ముద్ర వేసుకున్నారు, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు: ఇప్పుడామట్టి అంతా ఖాళీ; పాదరక్షలుండడంతో కాళ్ళు తగిలినా పోల్చుకోలేవు. అయినప్పటికీ, ప్రకృతికిలో “నిండుకుంది” అన్న…
-
నిరాకరణ… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి
ప్రశాంతంగా ఉన్న నీ చెవులలోకి నా ప్రార్థనలు చొరబడలేనపుడు; నా కవితలాగే, నా హృదయమూ ముక్కలై, నా గుండెనిండా భయాలు నిండి అంతా అస్తవ్యస్తమైపోయింది. వక్రించిన నా ఆలోచనలు, శీర్ణధనువులా, రెండుగా చీలిపోయాయి; వేటిత్రోవన అవిపోయాయి; కొన్ని సుఖాలవేటలో పోతే కొన్ని పోరాటాలకీ, ప్రమాదకరమైన ప్రయత్నాలవైపు మరలాయి. ఎక్కడికెళితేనేమిటి, అని అవి అంటుండేవి, రేయింబవళ్ళు చేసే వాడికోళ్లకు హృదయమూ, కాళ్ళూ చచ్చుబడిన తర్వాత? ఓ ప్రభూ! కనికరించి కనిపించు, కనిపించు, అయినా నువ్వు కనిపించవు. చిత్రమేమిటంటే, నువ్వు…