వర్గం: అనువాదాలు
-
పురికొసను పోలిన క్రూరత్వం … చార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను
[గమనిక: వ్యవహారంలో జనపనారతో పేనిన తాడుని కూడా పురికొస అంటారు. కానీ, ఇక్కడ అదికాదు. విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో అచ్చం సాలీడుని పోలి, కుట్టినపుడు మనిషికి విషం ఎక్కే పురుగుని పురికొస అంటారు.] . మంచి మధ్యాహ్న వేళ వాళ్ళు నిన్ను యురోపులో ఏ కాఫీ హోటల్లోనైనా ముందువరుస టేబిళ్ళదగ్గర కూచో నివ్వరు. నువ్వుగాని అలా కూచున్నావో ఎవడో ఒకడు పక్కనుండి వాహనం నడుపుకుంటూ వచ్చి నీ గొంతులో, సబ్ మెషీన్ గన్ తో తూటాలు దించి…
-
జ్ఞాపకం… సుజేన్ డోయిల్, అమెరికను కవయిత్రి
(మాత్యూ డోయిల్ జేకోబస్ కి) . ఒకరోజు నేను నిన్ను మీ అమ్మపక్కనుండి ఎత్తుకొచ్చాను (ఆ సారవంతమైన ఉప్పుటేరు ఎంత ఉత్సాహంగా ఉందో నీకు గుర్తుండదు) అక్కడికి నెత్తళ్ళు (మిన్నోలు) కెరటాలతోపాటే కొట్టుకొచ్చాయి ఉక్కపోతగా ఉన్న ఆ చోట, మేము ఊపిరాడక తెగ కష్టపడ్డాము. నీకప్పటికి ఇంకా నాలుగు నిండలేదు, నాకు వయసుపైబడి (నీకు గుర్తుండదు గాని నువ్వు గుర్తుపెట్టుకోవాలి) నేను మమకారంతో కొట్టుకుంటున్నాను. “ఇక్కడ ఈదకూడదు” అని రాసి ఉండడం చదివేను; అయినా నిన్ను ఈదడానికి…
-
ప్రభాత స్తుతి… డిక్ డేవిస్, ఇంగ్లీషు కవి
ఈ కవిత మయూర మహాకవి వ్రాసిన సూర్య శతకంలో మొట్టమొదటిశ్లోకాన్ని గుర్తుకు తెస్తోంది: జంభారాతీభకుంభోద్భవమివ దధతః సాంద్ర సింధూర రేణుమ్ రక్తాస్సిక్తా ఇవౌఘైరుదయగిరితటీ ధాతుధారా ద్రవస్య ఆయాంత్యా తుల్యకాలం కమలవనరుచే వారుణావో విభూత్యై భూయాసుర్భాసయంతో భువన మభినవా భానవో భానవీయాః (ప్రాన్నగమునుండి అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఇంద్రుడి ఐరావతం నుండి వస్తున్న సింధూర రేణువుల్లాగా, ఉదయగిరులపైనున్న గైరికాది ధాతువుల ప్రవాహంచే తడిసి ఎర్రనైనట్టుగానూ, అదే సమయంలో పూర్తిగా విచ్చుకుంటున్న ఎర్రకలువలనుండి ఎగసి వస్తున్న పుప్పొడికాంతులతోనూ కలిసి మనోహరంగా…
-
అశ్రద్ధచేసిన పూలతోట… రాబర్ట్ క్రాఫర్డ్, స్కాటిష్ కవి
ఆగష్టునెల వచ్చేసరికి నిర్లక్ష్యపుచాయలు గమనించాను ఇపుడు సెప్టెంబరులో నాకు నైరాశ్యం వచ్చేస్తోంది; తుప్పుపడుతున్న పనిముట్లు, మాయమవుతున్న వరుసలు, ఈ ప్రయత్నమంతా తాత్కాలికమని చెప్పకనే చెబుతున్నాయి ఆశావహంగా ప్రారంభమైన కార్యాచరణ ముగింపుకి వచ్చేసింది ఇప్పుడిది రాబోయే చెడురోజులను సూచించే కాకిమూకలకీ, ఏది పడితే అది మొలవడానికి అనుకూలంగా ఎన్నడు తయారవుతుందా అని ఎదురుచూసే కలుపుమొక్కలకీ నెలవు; ఈ చక్కని పూలవనాన్ని బీడువారేలా నిర్లక్ష్యం చేసిన తోటమాలి ఎవరై ఉంటాడు? నాకు తెలుసని అనుకుంటాను? కొందర్ని కలిసేను కూడా: అతను…
-
సహ- అనుభూతి … టీ. ఎస్. ఏలియట్ , ఇంగ్లీషు కవి
కాలం ఎంత అనంతమో, వ్యధాభరితక్షణాలుకూడా అంతే శాశ్వతమని మనం తెలుసుకుంటాము. కానీ, ఈ ఎరుక, మన స్వానుభవంలో కంటే, ఇతరుల మనోవ్యధలతో సహ అనుభూతి ద్వారా ఎక్కువ సాథ్యపడుతుంది. కారణం మన గతం మన చేష్టలవల్ల ప్రభావితమౌతుంది; కానీ ఇతరుల వేదనని ఆ క్షణంలో ఏ షరతులకూ లోబడకుండా అనుభూతి చెందడమే గాదు, సంతాపప్రకటన తర్వాతకూడా అది సమసిపోదు. మనుషులు మారతారు; చిరునవ్వులు మొలకెత్తుతాయి; కానీ వేదన శాశ్వతంగా నిలుస్తుంది. . టీ. ఎస్. ఏలియట్ …
-
మార్తా… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి
“అనగా అనగా ఒక ఊళ్ళో…” అలా ఎన్ని సార్లు ప్రారంభించి మార్తా మాకందరికీ ఆ చిలకపచ్చని కోనలో ఎన్ని కథలు చెప్పేదో. ఆమెవి చాలా స్వచ్ఛమైన గోధుమవన్నె కళ్ళు మీరు గాని వాటిని అలా చూస్తూ ఉంటే అసలు ఆ కథలన్నీ ఆ కళ్ళు తమ కలల ప్రశాంతతతో చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె తన సన్నని రెండు చేతులతో తనముణుకులని బంధించినట్టు కూచునేది; మేము మాత్రం మా రెండు చేతులమీదా వెనక్కి వాలి ఆమె వంకే అలా…
-
ఉత్తరాలు రానపుడు… గెరీ కేంబ్రిడ్జ్, స్కాటిష్ కవి
నేను జీవితాన్ని ఎంచుకోకతప్పదు, ఇక్కడ నువ్వింత నిర్లక్ష్యంగా ఉంటూ, రహస్యాలేవీ లేనపుడు … నువ్వు స్టాండుమీదనుండి కొవ్వొత్తి తీసుకుని చీకటి గదుల్లోంచి దీపంలేని స్నానాలగదిలోకి నడుచుకుంటూ పోతావు అక్కడ మనిద్దరం మధ్యయుగంనాటి అద్భుతకథలోలా జంటగా వేడినీటి స్నానం చేస్తాం, ఊసులాడుకుంటూ సువాసనలు వెదజల్లే ఆవిరిలో స్నానంచేస్తున్నామన్న స్పృహతోనూ… బయట దట్టంగాకురుస్తున్న రాత్రివర్షానికీ, గీపెడుతున్న తుఫానుగాలికీ దూరంగా. అన్నిగంటలు కలిసి ఉండడంలో సంతృప్తి పరచడానికి ఏదీ మిగిలి లేదు; మనిద్దరం కలుషాలు వీడి, శాంతిపడి, పొడిబారి, సుగంధభరితమైన శరీరాలతో…
-
తక్కినవాళ్ళు… డేవిడ్ బెర్మన్… అమెరికను కవి
కొందరికి సాహిత్యంలో జీవిత లక్ష్యం దొరుకుతుంది కొందరికి లలిత కళలలో, ఎవరికి వారికి అది మనసులోనే దొరుకుతుందన్న నమ్మికకి కొందరు అంకితమౌతారు. కొందరికి మదిరలో ఆనందం దొరుకుతుంది కొందరికి మగువలో కొందరికి జీవితంలో వెలుగెన్నడూ దొరకదు వాళ్ళు చీకటితోనే సర్దుకుపోతారు. మనం వాళ్ళగురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళెప్పుడూ దుఃఖంలో మునిగి ఉన్నట్టు ఊహించుకోవచ్చు; కానీ, అది నిజం కాదు; వాళ్ళకి కనిపించని ఆ వెలుగు వాళ్ళెన్నడూ కోరుకున్నది కాదు. . డేవిడ్ బెర్మన్ జననం 4 జనవరి 1967…
-
శాంతశీలి సాలీడు… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి
ఒక చిన్నగుట్టమీద ఒంటరిగా నిశ్శబ్దంగా ఉన్న శాంతశీలియైన ఒక సాలీడుని అది దానిపరిసరాల్లోని ఖాళీజాగాలని ఎలా వాడుకుందికి ప్రయత్నిస్తుందో గమనించేను. అది ముందుగా దానిపొట్టలోంచి ఒక సన్నని దారాన్ని తీసి దూకింది, అక్కడినుండి అలసటలేకుండా దారాన్ని తీస్తూ అల్లుతూనే ఉంది… పరీవ్యాప్తమైన, ఎల్లలులేని రోదసిచే చుట్టుముట్టబడి నిర్లిప్తంగా నిలబడ్డ ఓ నా మనసా! నిరంతరం ఆలోచిస్తూ, కనిపిస్తున్న గోళాలచలనాన్ని అర్థంచేసుకుందికి సాహసంతో సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ, విడిచిపెడుతూ, చివరకి నీకు నచ్చిన సిద్ధాంతం దొరికేక, నిరాధారమైన ఆలోచనల వంతెన…