వర్గం: అనువాదాలు
-
ఒడంబడిక … రాబర్ట్ క్రాఫర్డ్, స్కాటిష్ కవి
దా, నా దగ్గర కూర్చో! నీ అభిప్రాయంలో ప్రేమంటే ఏమిటో, ఏది ప్రేమకాదో వివరించు. మనం అదనుకోసం నిరీక్షిస్తున్నంతసేపూ మాటాడు మనం కాలహరణం చేస్తున్నంతసేపూ మాటాడుతూనే ఉండు. తార్కికశక్తిపై నాకు తిరుగులేని,దృఢమైన నమ్మకమున్నా పణంగా ఉంచిన ప్రాణాల లెక్కలు వచ్చినపుడు ప్రతిసంకోచం, అనిశ్చితి వెనకా తారాడే నర్మగర్భమైన మాటలు వినడానికి ఇష్టమే; అది బెరుకుగా చూసే చూపు కావచ్చు, దీర్ఘంగా బిగబట్టి విడిచిన నిట్టూర్పు కావచ్చు; లేదా అసంకల్పితంగా, సమయాన్ని మించి చేతిలో ఉంచిన మరో చేతి…
-
Velu Pillai… C. Ramachandra Rao, Telugu, Indian
I started my blog on 28th Aug 2010 and this is the 2000th Post in my blog. I have come a long way and never expected that I would last this long with my modest to less than modest work. I thank all my blog viewers and visitors for their continuous support, encouragement and comments which…
-
వేదాంతికి చరమశ్లోకం … బిల్ కోయిల్
యుద్ధాలు పాలకుల వినోదానికీ, వారి అధికార దర్పాన్నీ, బలాన్నీ ప్రదర్శించడానికీ తప్ప, పాలితులకు లవలేశమైనా మేలు కలిగించదన్న సత్యం అనాదిగా అందరూ చెబుతున్నదే. దీనినే కవి మరింత చమత్కారంగా చెప్పాడు. *** అతను మరణించి, కొన్ని వేల రణభూముల అంతిమ ప్రతిఫలమైన ధూళికణంగా మారాడు. . బిల్ కోయిల్ సమకాలీన అమెరికను కవి Bill Coyle Epitaph for a Philosopher . He has become, in death, the dust that yields the…
-
అనుకోని సంఘటన… గెరీ కేంబ్రిడ్జ్, స్కాటిష్ కవి
మనోహరమైన రాత్రి. నేను ఆరుబయటకి నడిచి శిశిర నిశీధిని తలెత్తి ఆకాశాన్ని పరికిస్తాను అక్కడ మేఘాలమధ్య తారకలు దివ్యంగా మెరుస్తుంటాయి అప్పుడు మనసుకి ఏ ఆలోచనతడితే అది ఆలోచించవచ్చు. నెత్తిన మెరుస్తున్న కృత్తిక దిగువ గొప్ప ఆలోచనలు గిలకొడుతోంది. నలుప్రక్కలా దట్టంగా పరుచుకున్న ఈ రాతిరి కిటికీ వెలుతురులోంచి వెతికే కనులకు అందని, శుష్కమైన పశ్చాత్తాపాలనీ, వీడ్కోళ్ళనీ సులభంగా గుర్తుచేస్తోంది. కానీ, ఇదేమిటి అకస్మాత్తుగా నా కాళ్ళదగ్గర పాదాలను నాకుతూ? ఓహ్! ఎప్పుడూ మచ్చికగా ఉండే బలిష్ఠమైన…
-
పగిలిన అద్దం… డేవిడ్ బెర్మన్, అమెరికను కవి
నా జీవితం చివరకు వచ్చేసింది; గణాంకశాస్త్ర రీత్యా అది రాబట్టిన సత్యమైనా, అది నిజమే; నేను అద్దంలో చూసుకోబోతే, అది పగిలి ఉంటుంది. అందుకని అది ఒకటి, రెండు, మరెన్నో పొంతనలేని ప్రతిబింబాలు చూపిస్తుంది; వాటిలో దేని లక్ష్యాన్నని నేను అందుకో ప్రయత్నించను? నా జీవితమా చరమాంకానికి వచ్చేసింది. అది సత్యం. ఇక మిగిలిన సమయంలోనంటావా? సామాను చాలవరకు సర్దేశాను. కట్టలుగట్టి పెట్టెల్లో పెట్టేశాను; చెయ్యడానికింకేమీ లేదు; నేను అద్దంలోకి చూసుకుంటే, అది పగిలి కనిపిస్తుంది. దాన్ని…
-
భద్రవలయాన్ని దాటిపోవడం … టెన్నీసన్, ఇంగ్లీషు కవి
సూర్యాస్తమయమూ, సాంధ్య తారకా… రమ్మని నాకోసం ఒక స్పష్టమైన పిలుపు! నేనా ఇసుకతిన్నెను దాటి సాగరంలోకి అడుగిడినపుడు ఎవరూ శోకించకుందురు గాక! నిద్రాకెరటమెంత తీవ్రంగా చుట్టుముడుతుందంటే గురకపెట్టడమూ, చొంగకార్చడమూ ఉండవు. మేరలేని అగాథాల లోతులలోంచి బయటకు తెచ్చినదే చివరకు స్వస్థానానికి తిరిగి జాగ్రత్తగా చేరుస్తుంది. అసురసంధ్యాకాలమూ, సాంధ్యఘంటారవాలూ … ఆ తర్వాత అంతా చిక్కని చీకటే! నేను పడవలోకి ఎక్కినపుడు ఏ విషాదపు వీడ్కోలులూ ఉండకుండు గాక! దేశకాల సరిహద్దులనుండి తిన్నగా ఈ ఉప్పెన నన్ను చాలా…
-
ఇక నీకు ఎండ బాధలేదు… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇక నీకు ఎండ బాధలేదు… ఎంత గజగజ వణికించినా చలి బాధా లేదు; నువ్వు ఈ లోకంలో వచ్చిన పని పూర్తిచేసుకుని ఇంటిముఖం పట్టేవు, తగిన వేతనం అందుకున్నావు; అందమైన, డబ్బున్న మగపిల్లలైనా ఆడపిల్లలైనా, బీదా బిక్కీ అనాధల్లా ఒకరోజు మట్టిలో కలవవలసిందే. గొప్ప అధికారుల కోపం నిను భయపెట్టదు; నిరంకుశుల బాధల పరిధి దాటిపోయావు; ఇక కూడూ గుడ్డా గురించి ఆలోచించే పని లేదు; నీకు చెట్టుకీ, రెల్లుగడ్డికీ మధ్య భేదం లేదు; మహరాజయినా, మేధావైనా,…
-
సత్యం ఉత్కృష్టమైనది … కొవెంట్రీ పాట్ మోర్, ఇంగ్లీషు కవి
మహానగరానికి దూరంగా,సూదిగా ఎత్తుగా ఉన్న శిఖరాల క్రింద సందడిగా ఉంటూనే మనసుకి ప్రశాంతతనిచ్చే ఈ సముద్రతీరాన రోజుకి రెండుసార్లు పెద్దకెరటాలతో (High Tide) ఏ లక్ష్యమూ లేకుండా, ఉత్సాహంతో వచ్చిపోయే సముద్రాన్ని చూడడానికి నేను వచ్చి కూచుంటుంటాను. నేను లేకపోయినంత మాత్రాన్న లోకవ్యవహారం ఆగిపోదు; దాని లక్ష్యం నెరవేరిన తర్వాత అసత్యం కూడా మురిగిపోతుంది. కానీ సత్యం మాత్రం చాలా ఉత్కృష్టమైనది… దాని ఉనికిని ఇతరులు పట్టించుకున్నా లేకున్నా, అశ్రాంతంగా కొనసాగుతూనే ఉంటుంది. . కొవెంట్రీ పాట్…
-
మంచు పలకలు … H W లాంగ్ ఫెలో, అమెరికను
మోడువారి, నగ్నంగా ఉన్న అటవీ సీమల మీంచి కోతల తర్వాత ఉపేక్షించబడిన పంటభూములమీంచి గాలి గుండె లోతుల్లోంచి, దాని మొయిలు ఉడుపుల కదలికలలలోంచి, నిశ్శబ్దంగా, నెమ్మదిగా, మెత్తగా మంచు జాలువారుతోంది. చిత్రమైన ఆకారాలు ధరించే ఈ మేఘాలు అకస్మాత్తుగా దివ్యాకృతుల్లో కనిపించినా, పాలిపోయిన వదనంతో కలతచెందిన మనసు తన తప్పిదాలను ఒప్పుకుని మన్నించమని వేడుకుంటుంటే ఉద్విగ్నమైన ఆకాశ శకలం తన మనసులోని బాధను వ్యక్తం చేస్తుంది. ఈ కవిత గాలి అంతరంగ వ్యధ మౌనంగా సడిలేని శబ్దవర్ణాలతో…