వర్గం: అనువాదాలు
-
అమ్మ కాని అమ్మ … గ్వెండొలీన్ బ్రూక్స్, అమెరికను కవయిత్రి
గర్భస్రావాలు మిమ్మల్ని ఒకంతట మరిచిపోనివ్వవు. మీ కడుపున పడి, భూమ్మీదపడని పిల్లలు మీకు గుర్తుంటారు, ఆ చిన్న తడి మాంసపు ముద్దలు జుత్తు ఉండీ, లేకనో, ఎన్నడూ ఊపిరికి నోచుకోని ఆ పాటగాళ్ళూ, పనివాళ్ళూ. మీరు ఎన్నడూ వాళ్లని నిర్లక్ష్యం చెయ్యలేరు, కొట్టలేరు వాళ్ళకి మిఠాయిలు కొనీ, మరోలా నోరు మూయించలేరు. చీకుతున్న బొటనవేలు నోట్లోంచి పక్కకి తప్పించలేరు వాళ్ళని భయపెట్టే దయ్యాలనీ భూతాల్ని పారద్రోలనూ లేరు. ప్రేమగా నిట్టూరుస్తూ వాళ్ళని విడిచిపెట్టనూ లేరు కంటితో చూసి…
-
స్త్రీ-పురుషుల మానసిక స్థితి… డొరతీ పార్కర్, అమెరికను
స్త్రీ ఒక పురుషుడినే భర్తగా కోరుకుంటుంది మగవాడికి ఎప్పుడూ కొత్తదనం కావాలి. స్త్రీకి ప్రేమే వెలుగూ, వెన్నెలా; మగాడు సరదాలు తీర్చుకునే మార్గాలు వేవేలు స్త్రీ తన భర్తతోనే జీవిస్తుంది ఒకటినుండి పది లెక్కపెట్టు… మగాడికి విసుగేస్తుంది. వెరసి, ఈ సారాంశము గ్రహించేక ఇందులో ఇక ఏమి మంచి జరుగనుంది ? . డొరతీ పార్కర్ 22nd Aug- 6 Jun 1967 అమెరికను కవయిత్రి . General Review of the Sex Situation .…
-
కొన్ని రోజులు … కార్ల్ విల్సన్ బేకర్, అమెరికను కవయిత్రి
కొన్ని రోజులు నా ఆలోచనలు తమలోతాము ముడుచుకుపోతాయి చలికి ముడుచుకుపోయినట్టు, నీరసంగా, కళ్ళుమూసుకుని నా మనసులోని మోడుబారిన చేట్లమీంచి చినుకులు చుక్క చుక్కగా కారుతున్నట్టు వేలాడుతూ. మరికొన్ని రోజులు అవి మెరుస్తూ తేలిపోతుంటాయి గాలిలో స్వేచ్చగా రెక్కవిచ్చి మరీ ఎగురుతాయి సున్నితమైన వాటి రెక్కల తాకిడికి అంటిన బంగరు ధూళి నా కురుల్లో మెరుస్తుంది. . కార్ల్ విల్సన్ బేకర్ (1878–1960) అమెరికను కవయిత్రి Some Days . Some days my thoughts are…
-
పూ రేకలు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
జీవితం ఒక ప్రవాహం. దానిమీద మన హృదయపుష్పపు రేకలను ఒకటొకటిగా తెంపుతూ విడిచిపెడుతుంటాము; వాటి గమ్యం మన కలలో మరుగైపోయినా అవి మన కనుచూపుమేరవరకు తేలుతూ కనిపిస్తాయి. ఆనందంగా సాగే వాటి ప్రయాణపు తొలి అడుగులు మాత్రమే మనం చూడగలం. వాటిపై ఆశలబరువును మోపుతూ, ఆనందంతో ఎరుపెక్కి మనం గులాబీ తొలి రేకలను విరజిమ్ముతాం; అవి ఎంతవరకు విస్తరిస్తాయో, చివరకి అవి ఎలా వినియోగపడతాయో మనకెన్నడూ తెలియదు. ఆ అనంత ప్రవాహం వాటిని పక్కకి నెట్టివేస్తుంది, ఒక్కొక్కటీ…
-
చిత్రకారుడు… ఫిల్లిస్ వీట్లీ, అమెరికను కవయిత్రి
లారా అగుపించగానే, పాపం, ఎపెలీజ్* తన కళ్ళు నొప్పెడుతున్నాయనీ, ఆ వెలుగుకి కళ్ళు చికిలించి చూడవలసి వస్తోందనీ ఆరోపించేడు. ఆమె అందం అతన్ని పూర్తిగా గ్రుడ్డివాణ్ణి చేస్తుందేమోనన్న భయంతో అతను తన కుంచెల్నీ, రంగుల పలకనీ పక్కనపెట్టేశాడు. కానీ అందాల ఏన్ రాగానే, అతనికి చూపు తిరిగొచ్చింది రంగుల్నీ కుంచెల్నీ క్రమపద్ధతిలో అమర్చేడు. ఆ చిత్రకారుడు తన ప్రవృత్తిలో మునిగిపోయాడు అంటే!బాధా, గుడ్డితనం, అన్నవి తలపులోకి రాకుండా ఎప్పటిలా గీతలు చకచకా సాగిపోతున్నాయి … ఆ శ్యామల…
-
ఈ నేలపై తారకలు శాశ్వతం … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
భూమి తనలో తాను తిరిగిన ప్రతి రోజూ… మనం ప్రేమించిన ఇల్లూ, ఇష్టపడిన వీధీ కనుమరుగైనా… ఈ నేలపై తారకలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి శరత్కాలపు విషువత్ నాటి రాత్రి మనకి తెలిసిన రెండు చుక్కలు, సరిగ్గా అర్థరాత్రి వేళ ఆకసంలో ఉచ్చస్థితికి చేరుకుంటాయి; జడత్వం గాఢమౌతుంది ఈ నేలపై తారకలు శాశ్వతంగా ఉంటాయి మనం నిద్రలోకి జారుకున్నా, తారకలు మాత్రం శాశ్వతం. . . సారా టీజ్డేల్ (8 August 1884 – 29 January…
-
1994- ల్యూసిల్ క్లిఫ్టన్ … అమెరికను కవయిత్రి
నాకు 58 వ ఏడు నిండబోతోంది. అప్పుడు బొటకనవేలంత మంచుగడ్డ నా గుండెమీద దాని ముద్ర వేసింది. నీ అభిప్రాయం నీకుంటుంది. నీ భయాలూ, నీ కన్నీళ్ళూ నీ నమ్మలేని నిజాలగురించి నీకు తెలుసు. చిత్రం ఏమిటంటే, మనం చెప్పే అబద్ధాలలో అతి బాధాకరమైనవి మనకు మనం చెప్పుకునేవి. నీకు అదెంత ప్రమాదమో తెలుసు రొమ్ములతో పుట్టడం; నీ కదెంత ప్రమాదకారో తెలుసు నల్లని చర్మం కలిగి ఉండడం. నాకు 58 వ ఏడు నిండబోతుంటే కొంత…
-
కొండమీద ఒక మధ్యాహ్నం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ఈ ఆకాశం క్రింద నా అంత ఆనందంగా ఎవరూ ఉండరు. నే ఒక వంద పుష్పాలు తాకుతాను కానీ, ఒక్కటీ తురుమను. నేను మేఘాల్నీ, కొండ కొనకొమ్ముల్నీ ప్రశాంత వదనంతో తిలకిస్తాను. గాలి ఎలా పచ్చికని అవనతం చేస్తూ పోతుందో పచ్చిక తిరిగి ఎలా తలెత్తుకుంటుందో చూస్తాను. దూరాన ఉన్న మా ఊరిలో దీపాలు వెలిగే వేళకి మా ఇల్లు ఎక్కడ ఉందా అని చూసి, గుర్తించి కొండ దిగడం ప్రారంభిస్తాను. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే…
-
చిత్తరువులు … మారిన్ సొరెస్క్యూ, రుమేనియా కవి
మ్యూజియాలన్నిటికీ నేనంటే భయం: ఎక్కడైనా నేను రోజల్లా ఒక చిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తానా, మరుచటిరోజే, అది మాయమైపోయిందని ప్రకటిస్తారు. ప్రతిరోజూ, ప్రపంచంలో ఏదో ఒకచోట నేను ఏదో ఒకటి దొంగిలిస్తుండగా పట్టుకుంటారు. నా చెవుల్ని ఒరుసుకుంటూ తుపాకిగుళ్ళు పోతుంటాయి; ప్రేమికులకి తమ ప్రేమికల శరీరగంధం తెలిసినదానికంటే ఎక్కువగా పోలీసు కుక్కలకి ఇప్పుడు నా అడుగుల వాసన బాగా తెలుసు; అయినా నేనేమీ చలించను. నేను నా ప్రాణానికి ముప్పుతెచ్చిపెట్టే తైలవర్ణచిత్రాలమీద గట్టిగా అరుస్తాను. వాటిని మేఘాలమీదా, చెట్టుకొనలకీ…
-
స్వర్గానికి నిచ్చెన… మారిన్ సొరెస్క్యూ, రుమేనియన్ కవి
సాలీడు అల్లిన పట్టు దారపుపోగు కప్పునుండి వేలాడుతోంది సరిగ్గా నా పక్కకి నెత్తిమీద. రోజు రోజుకీ అది క్రిందకు దిగడం గమనిస్తున్నాను. నే ననుకుంటుంటాను: “ఇప్పుడు నాకు దేముడు స్వర్గాన్ని అధిరోహించడానికి నిచ్చెన వేస్తున్నాడని.” నేను నీరసించిపోతే నీరసించిపోదునుగాక పూర్వపు నా రూపుకి నేను ఒక చాయనవుతే అవుదునుగాక కానీ, నన్నీ నిచ్చెన భరించలేదు. ఓ హృదయమా, విను! నువ్వు మాత్రం ముందుకి సాగు… మెత్తగా… సుతిమెత్తగా . మారిన్ సొరెస్క్యూ రుమేనియన్ కవి, నాటక కర్త…