వర్గం: అనువాదాలు
-
సంశయాత్మ … ఏడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
ఈ పిచ్చుకలు ఎక్కడికి వలస పోయాయి? కొంపదీసి ఏ చీకటి తుఫాను తీరాలలోనో తడిసి వణుకుతూ మరణించలేదు గద! ఈ పూలు ఎందుకు వాడిపోవాలి? ఓ సంశయాత్మా! కన్నీటి వర్షాన్ని లెక్కచేయకుండా ఈ చలిపీఠాలలో ఎందుకు బందీలై ఉండాలి? ఒకవంక నీ పెదాలపై చిరునవ్వు మొలిపించడానికి శీతగాలులు వీచుతుంటే తెల్లపిల్లిలాంటి మెత్తని మంచుక్రింద అవి కేవలం నిద్రిస్తున్నాయి ఇన్నాళ్ళూ సూర్యుడు తన కిరణాల్ని దాచుకున్నాడు ఓ నా పిరికి మనసా! ఈ ప్రపంచాన్ని నైరాశ్యపు ఋతువు విడిచిపెట్టదా?…
-
అజరామరము … ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి
చాలా విషయాలు అసలెన్నడూ జరగకపోవచ్చు; ఇది మాత్రం తప్పక జరిగి తీరుతుంది”… ఫిలిప్ లార్కిన్ *** నా మరణం గురించిన సత్యం నాకు తెలుసు ఈ లోకం తప్ప వేరెక్కడా నాకు పునరుజ్జీవనం లేదు.…
-
మడుగు…. లయొనెల్ ఆబ్రహామ్స్, దక్షిణాఫ్రికా
నే నెక్కడ లోతుగా ఉంటానో మీరు కనిపెట్టవచ్చు అదంతా బురదమాటు రహస్యం. నా ఉపరితలంపై పరుచుకుంది సువిశాలమైన నీలాకాశం . లయొనెల్ ఆబ్రహామ్స్ 1928–2004 దక్షిణాఫ్రికా . Pool Where I’m deepest you may discern a few muddy secrets. My surface contains the whole open sky. . Lionel Abraham 1928–2004 South African Poet Poem Courtesy: http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/5380/10/Lionel-Abrahams
-
కవిత్వ పరిచయం… బిల్లీ కాలిన్స్, అమెరికను
వాళ్లని ఒక కవితని తీసుకోమని చెబుతాను. తీసుకుని, దాన్ని ఒక రంగుటద్దాన్ని చూసినట్టు వెలుతురుకి ఎదురుగా నిలపమని చెబుతాను. లేకుంటే, దాని గూటికి చెవి ఒగ్గి వినమంటాను. లేదా, కవితలోకి ఒక ఎలుకని జార్చి అది బయటకి ఎలా వస్తుందో గమనించమంటాను. కవిత చీకటి గదిలోకి ప్రవేశించి దీపపు స్విచ్చి ఎక్కడుందో గోడలు తడవమని చెబుతాను. కవిత ఉపరితలం మీద నీటిమీద స్కీయింగ్ చేసినట్టు నడుస్తూ ఒడ్డునున్న కవిపేరుకి చెయ్యి ఊపమని చెబుతాను. కానీ, ఇన్ని చెప్పినా,…
-
కెరటాలమీద పడవ… విలియమ్ ఎలరీ చానింగ్, అమెరికను
తెల్లని మంచు పెల్లలపై గాలి విడిచిపెట్టిన వంకర అడుగు జాడల్లా ఎగిసి మెలితిరిగిన కెరటం అదాటున విరగబడినచోట అలతోపాటు వంపులు తిరుగుతూ, మన పడవ కెరటాలపై అలవోకగా సాగుతుంది. పద! పద! నీటిపుట్టపై నిలువెత్తు త్రోవ అదిగో! పెనుగాలి రానుంది, తెరచాపలెత్తు… గాలినుండే మనము ఉత్సాహం దొరికించుకోవాలి మనసు దిటవుగా ఉంటే, ఎంత నల్లటిమేఘమైనా తలవంచుతుంది గాలి ఊళలకి మనం భయపడేది లేదు! . విలియమ్ ఎలరీ చానింగ్ (November 29, 1818 – December 23,…
-
మగాళ్ళు… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి
నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించినందుకు వాళ్ళు నిన్ను “వేగుచుక్క”వని పొగుడుతారు. అదే సుకుమార భావనతో వాళ్ళని తిరిగి మన్నిస్తే వాళ్ళు, నీ గురించి వేరే అర్థాలు తీస్తారు; వాళ్లకి రూఢిగా, చింతలేని నీ పొందు దొరికిందా వాళ్ళు నిన్ను అన్నిరకాలుగానూ మార్చడానికి ప్రయత్నిస్తారు. నీ నడతమీద, అవేశాలమీదా ఆంక్షలు పెడతారు వాళ్ళు నిన్ను నువ్వుకాని వేరే వ్యక్తిగా మార్చివేస్తారు. నువ్వు నడిచేరీతిలో నిన్ను నడవనివ్వరు వాళ్ళు తమప్రభావం చూపించి అన్నీ నేర్పుతారు. వాళ్ళు పూర్వం పొగిడినవే, అయినా,…
-
కలలు
Originally posted on తెలుగు కథలు పద్యాలు: కలలు చాలా పెంకివి… చిన్నపిల్లల్లా… కథలోని రాజకుమారుడు అన్ని వీధులూ వదిలి ఏడో వీధికే నడిచినట్టు ఎప్పుడూ వద్దన్నవైపుకే పరిగెడతాయి… అలసి మేనువాల్చాలని ఇలా కుర్చీలో చేరబడతానా మనవరాల్లా ఒళ్ళోవాలి మెడ బిగించి, ఎలామూస్తాయో గాని, ఇట్టే కళ్ళుమూస్తాయి. రెండు రెప్పల్నీ రెక్కల్లాజాచి చెప్పలేనిలోకాలకు తీసుకుపోతాయి. మయుణ్ణి మించినమాయలాడులు కలలు. వాటికిలొంగని వాళ్ళూ, భంగపడనివాళ్ళూ ఉండరు. జీవితపు ఎడారిలో నిరాశాలదాహార్తి తీర్చే ఒయాసిస్సులు అసాధ్యమైన పనులు సుసాధ్యమయేది ఈ…
-
అవిశ్వాసం… ఆల్బెర్టో పిమెంటా, పోర్చుగల్
పూర్వం రోజుల్లో పళ్ళూ కాయధాన్యాలూ పూలమొక్కలూ, చేపలూ అమ్ముకునే వ్యాపారులు సంతలోని గుడారాల్లో తమ వస్తువులు పరుచుకుని నిర్భయంగా ఒకరికొకరు వ్యాపారం బాగుండాలని ఆకాంక్షలు అందించుకునే వారు. . ఇప్పుడందరూ ఆ సంప్రదాయం పాటించడం లేదు కానీ వాళ్ళందరికీ తెలుసు తమ మనుగడ ఒకరిమీద ఇంకొకరికి ఉండే విశ్వాసం మీద ఆధారపడిందని. . ఇప్పుడు ప్రతి శనివారం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం మానేశారు. వాళ్ళ కళ్ళల్లో అపనమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళ మధ్య తిరుగుతూ…
-
ఆశావాదికి … ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
Wall Paper Courtesy: http://www.modafinilsale.com/beautiful-sunset-wallpapers.html నీ జీవితం నాకెప్పుడూ ఒక అందమైన సూర్యాస్తమయంలా కనిపిస్తుంది:- ఆకాశంలో వేలాడే ప్రతి పేలవమైన మేఘశకలాన్నీ నీ రసవాద నైపుణి ఒక అద్భుతమైన మణిగా మార్చివేస్తుంది; వాటినుండి వెలువడే రంగురంగుల కిరణాలు నినుదర్శించేవారికి నయనానందం కలుగజేస్తాయి. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ 1866- 1925 అమెరికను కవయిత్రి To an Optimist Thy life like some fair sunset ever seems:- Each dull grey cloud thy subtle…
-
అలనాటి నా ప్రేయసి…జేమ్స్ విట్ కూంబ్ రైలీ, అమెరికను కవి
సాయంత్రంవేళ ఒంటరిగా కూచుని ఫోటో ఆల్బమ్ తిరగేస్తూ, అందులో కనిపించిన మిత్రుల ముఖాలు చూసి వాళ్ళ గురించి దీర్ఘంగా ఆలోచించినట్టు నా ఆలోచనల ఎండుటాకులు చెల్లాచెదురుచేస్తున్నాను వాటి నీడల అమరికలో చిరునవ్వులు చిందించే అలనాటి నా ప్రేయసి ఛాయలు కనుగొనేదాకా. నా కళ్ళలో పడుతున్న తీక్ష్ణమైన వెలుగు తగ్గించడానికి, దానిని తగ్గిస్తే లాంతరులోని దీపం ఆశ్చర్యంగా నా వంక రెప్పలు కొట్టుకుంటూ చూస్తోంది; పొగతోపాటు మాయమవడానికి పొగాకుకి బంధం వేస్తోందేమోనన్నట్టున్న నా నిట్టూర్పుతప్ప, చడీచప్పుడు లేకుండా నేను…