వర్గం: అనువాదాలు
-
ప్రకృతి ఒక రసానంద నివహం … రిచర్డ్ వాట్సన్ గిల్డర్, అమెరికను కవి
ప్రకృతి ఒక రసానంద నివహం దాని విన్యాసమునకు ఎదురులేక సాగిపోతున్నది. అవిగో దాని స్వచ్ఛ మధుర కలస్వనములు; వేల పదఘట్టనలు నాకు వినిపిస్తున్నయి. గాలికి తూగుతున్న పచ్చికని తొక్కుతూ పోతున్నది ఆ మైదానమంతా దాని సొగసులే నిండి ఉన్నయి ; ప్రతిధ్వనించే ఎత్తైన కొండ దారులలో నాకు వేవేల ఫిరంగుల మోత వినిపిస్తోంది. అది నా తోట వాకిలిని ముట్టడించింది అంతలోతైన నూతినీటినీ చుక్క మిగలకుండా త్రాగేస్తుంది దానికి అలుపులేదు; అది ఎవరికోసమూ ఆగదు; రాత్రనక పగలనక…
-
వస్త్రధారణలో స్వేచ్ఛ… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి
(ఈ కవిత తీసుకున్న ‘ఎపిసీన్ ‘ (మౌన సుందరి) లోని విశేషం, ఆ కథకీ, కన్యాశుల్కంలోని ఒక ప్రథానమైన సంఘటనకీ సారూప్యం ఉంది. ఇందులోనూ అబ్బాయికి అమ్మాయివేషంవేసి ఒక వయసుమళ్ళిన వ్యక్తికి పెళ్ళిచెయ్యడం ఉంది. ఆ కథ ఇక్కడ చదవండి ) *** ఏదో విందుకి వెళుతున్నట్టు ఇంకా చక్కగా కనిపిద్దామనీ, ఇంకా మంచిదుస్తులేసుకుందామనీ; ఇంకా సువాసనలద్దుకుని సుగంధం పూసుకునే నీ ప్రయత్నాల ఆంతర్యం తెలియకపోయినా ఊహిస్తున్నాను; కానీ, ఓ తరుణీ అన్నీ మనోహరంగానూ, యోగ్యంగానూ లేవు. నిరాడంరతలోని…
-
పిల్లికూనల ఆట… విలియమ్ వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
Today is 249th Birthday of William Wordsworth ఆ గోడమీద పిల్లికూనలు కనిపిస్తున్నాయా చక్కని వెలుతురుతో, హాయిగా ఉన్న ఈ ఉదయం అతిచల్లని ప్రశాంతమైన వాతావరణంలో ఎల్డర్ చెట్టునుండి ఒకటి… రెండు… మూడు… ఒకటొకటిగా రాలుతున్న పండుటాకులతో అవి ఆడుకుంటున్నాయి… ఒకసారి గమనించు, ఓ పిల్లికూన ఎలా ప్రారంభించి ఒళ్ళుకూడదీసుకుని, కాళ్ళు ఒక్కసారి సాగదీసి పంజాతో నేలని దువ్వి ఒక్కసారి దూకుతోందో పెద్దపులిలా ఒక దూకుదూకి రాలనున్న తన వేటని మధ్యదారిలోనే అందుకుంటోంది, అది ఎంత…
-
మా చిన్నవాడు అడుగుతుంటాడు… బెర్తోల్ట్ బ్రెక్ట్, జర్మను కవి
మా చిన్నవాడు అడుగుతుంటాడు: నాన్నా, నేను లెక్కలు నేర్చుకోవాలా? అని. నేనందా మనుకుంటాను, నేర్చుకుని ఏమి లాభం? చివరకి, నువ్వు నేర్చుకున్నదానికంతటికంటే రెండు రొట్టెముక్కలు మిన్న అని. మా చిన్న వాడు అడుగుతుంటాడు, నాన్నా నేను ఫ్రెంచి నేర్చుకోవాలా? అని నే నందా మనుకుంటుంటాను: నేర్చుకుని ఏమి లాభం? ఈ దేశం ముక్కలౌతోంది. నువ్వు ఒకసారి నీపొట్టని చేతితో తడుముకుని అరిస్తే అంతకంటే కష్టం లేకుండా అవతలి వ్యక్తికి అర్థమౌతుంది అని . మా…
-
జులై అర్థరాత్రి… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
చెట్ల చిటారుకొమ్మలలోనూ నేలమీదజీరాడుతున్న దిగువరెమ్మలలోనూ మిణుగురులు మెరుస్తున్నాయి. నారింజవన్నె తారకల వెలుగులు లిప్తపాటు వెన్నెలంత తెల్లని లిలీలపై మెరిసి మాయమౌతున్నాయి. నువ్వు నాకు చేరబడితే ఓ చంద్రికా! నిన్నావరించిన పిల్లగాలి తెలియరాని చీకటి తరులగుబురుల్లో పుట్టిన తెలిపసుపు జ్వాలలకి బీటలువడి, చీలి, రవ్వలుగా ఎగురుతోంది. . ఏమీ లోవెల్ (February 9, 1874 – May 12, 1925) అమెరికను కవయిత్రి. . July Midnight . Fireflies flicker in the tops of trees,…
-
చెయితొడుగు తొడుగు- సింహాలూ… లే హంట్, ఇంగ్లీషు కవి.
ఫ్రాన్సిస్ మహారాజు సరసుడూ, వినోదప్రియుడూ. ఒకరోజు, పరివారంతో క్రీడామైదానంలో సింహాలపోరాటం కుతూహలంగా చూస్తున్నాడు. స్త్రీలు ప్రత్యేకస్థానాలలో, పురుషులు ఎదురుగా ఉన్నతాసనాలు అధిరోహించారు. వారిలో లోర్జ్ యువరాజూ, అతని మనోహరి కూడా ఉన్నారు; అప్పుడొక అద్భుతమైన ప్రదర్శన జరిగింది, సాహసానికీ ప్రేమకీ ప్రతీకగా పైనుండి మహరాజూ, క్రిందనున్న మృగరాజులూ చూస్తుండగా. సింహాలు అరుచుకుంటూ, దవడలు భయంకరంగా చాచి కరుచుకుంటూ; ఒకదాన్నికటి చరుచుకుంటూ, తేరిపారి చూసుకుంటూ పోట్లాడుతున్నాయి; పంజా విసురుకి గాలి ఒక్కసారి గట్టిగా వీచింది; ఒకదానిపై ఒకటి పడి…
-
పల్లె పదాలు… సరీజినీ నాయుడు, భారతీయ కవయిత్రి
నా దుత్తలు నింపుకున్నా, చాలాదూరం మోసుకుపోవాలి తోడులేని సుదీర్ఘమైన ఒంటరి దారి, కానీ ఈ ఓడ సరంగు పాట నన్నెందుకు బులిపిస్తోంది? దారికి అడ్డంపడి నన్నెందుకు ముందుకి పోనివ్వదు? అయ్యో అప్పుడే చీకటిపడిపోతోంది. ష్! వినండి. ఏమిటది? తెల్లకొంగ పిలుపా? లేక, గుడ్లగూబ అరుపా? దారి చూపించడానికి మసక వెన్నెలైనా లేదు ఈ చీకట్లో న న్నేపురుగైనా కరిస్తే? లేక ఏ భూతమో నన్ను మొడితే? రామా! హే రామా! నేను చచ్చిపోతాను! మా సోదరుడు గొణుగుతాడు…
-
కామన… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి
ఒంటిగా ఉయ్యాలలూగెడివాడా! నీదేమిటో తెలిసిన స్వామీ! ఓ సర్వజ్ఞుడా, ఊయలనుండి పాడెదాకా రక్షంచు, ప్రభూ, నన్ను రక్షించు! ఈ ప్రపంచపు వ్యామోహాలనుండీ ఇక్కడి విపత్తులనుండీ మేము నిరంతరం తపించి కృశించే తీవ్ర ఆవేదనలనుండీ, మృత్యువంత బరువైనదీ సమాధి అంత చల్లనిదీ అయిన మా లోలోపలికి చొచ్చుకుపోయి మమ్ము వివశుల్ని చేసే జడత్వం నుండి కాపాడు, మహప్రభో, కాపాడు! ఆప్తమిత్రుడు ‘గర్వం’ పక్కన తోడుగా నడుస్తుంటే ఈ ఆత్మ నిష్కల్మషమౌతున్నకొద్దీ భగవంతుని దరిదాపులోకూడా కనలేదో, ఈ ఆత్మ ఎత్తు…
-
ఆఖరి ఆకు… అలెగ్జాండర్ పూష్కిన్, రష్యను కవి
నా బ్రతుకు కోరికల పరిధి దాటింది నా వ్యామోహాలుతలుచుకుంటే విసుగేస్తోంది; శూన్యహృదయ జనితాలైన దుఃఖాలొక్కటే చివరకి మిగిలేది. నా అధికార తీరాలపై విధి రేపే క్రూరమైన తుఫానుల నీడలో నా తుది ఘడియకోసం ఎదురుచూస్తూ దుఃఖభరితమైన ఒంటరి బతుకు ఈడుస్తున్నాను. ఆవిధంగా, శీతగాలి ఊళలేస్తూ చలితో కోతపెడుతుంటే ఆఖరిఆకు మాత్రమే మిగిలి మోడుబారిన కొమ్మ … గజగజా వణుకుతోంది. . అలెగ్జాండర్ పూష్కిన్ 6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837 రష్యను కవి .…
-
పోలికలు… విలా సైబర్ట్ కేథర్, అమెరికను కవయిత్రి
(రోము నగరం లో కేపిటాల్ లో ఉన్న ఒక అజ్ఞాత వ్యక్తి అర్థాకృతి శిల్పాన్ని చూసి) *** ప్రతి వంపులోనూ మృదుత్వం… చింతలతో నిండిన తల ఒకింత వాలి… సుఖాలపట్ల విముఖత, బాధ్యతలపట్ల తిరస్కారం, అసంతృప్తితో తెరువనిరాకరించిన కనులు. అతని ముఖంలో కనిపించే ఏహ్యభావం తప్ప జీవితంలో అనుభవించిన సుఖదుఃఖాలగురించి ఏ ఆచూకీ విడిచిపెట్టకుండా గతించిన ఈ యువకుని శిల్పం ప్రక్కన కూర్చోడానికి నేను తరచు వస్తుంటాను. ఆ ఇంటివారందరి ఆశల ప్రోవు, ఆరాధించే సోదరుడు, బంగారంలాంటి…