వర్గం: అనువాదాలు
-
ఈ రోజు ఎంత బాగుంది? … డగ్లస్ మలోష్, అమెరికను కవి
నిజమే! ఈ ప్రపంచం కష్టాలమయం అవి లేవని నే ననలేదు. దేవుడా!నాకు చాలినన్ని కష్టాలున్నాయి, మొరపెట్టుకుందికి రెండింతల కారణాలు. వర్షాలూ, తుఫానులూ చిరాకు పెట్టేవి ఆకాశం ఎప్పుడూ మేఘావృతమై ఉండేది నా మార్గం నిండా ముళ్ళూ ముళ్ళకంపలూ నిండి ఉన్నాయి అయితేనేం, ఈ రోజు బాగులేదూ? ఎప్పుడూ ఏడుస్తూ కూచుంటే లాభమేమిటి? బాధలు ఇంకా కొనసాగించడం తప్ప? ఎప్పుడూ గతాన్ని మనసులో పెట్టుకుని చింతిస్తే లాభమేమిటి? ఎవరికి వాళ్ళ బాధలుంటాయి సుఖాలూ కష్టాలతో పలచబడుతూనే ఉంటాయి జీవితం,…
-
రెండు పిల్లి పిల్లలు… జేన్ టేలర్, ఇంగ్లీషు కవయిత్రి
రెండు పిల్లి పిల్లల మధ్య ఒక తుఫానురాత్రి ప్రారంభిమైన తగవులాట పెరిగి, కొట్టుకునేదాకా వచ్చింది. ఒకదాని దగ్గర ఎలక ఉంది రెండోదాని దగ్గర లేదు, అసలీ తగవంతటికీ మూలకారణం అదే! “ఆ ఎలుక నా క్కావాలి,” అంది రెండింటిలో పెద్దది “నీకు ఎలక కావాలేం? అదెలా జరుగుతుందో చూద్దాం!” “ఆ ఎలక నెలాగైనా తీసుకుంటాను,” అంది ‘తాబేలు డిప్ప’ అని, ఉమ్ముతూ, గీకుతూ దాని చెల్లెలుమీద దూకింది. నే చెప్పినదంతా ఆ రాత్రి తుఫాను రాకముందు…
-
కాలవిహంగము… సరీజినీ నాయుడు, భారతీయ కవయిత్రి
ఓ కాల విహంగమా! ఫలభరితమైన నీ పొదరింటినుండి నువ్వు ఏ రాగాలను ఆలపిస్తున్నావు? జీవితంలోని ఆనందం, గొప్పతనం గురించా, పదునైన దుఃఖాలూ, తీవ్రమైన వివాదాలగురించా? హుషారైన వాసంత గీతాలనా; రానున్న భవిష్యత్తు గురించి బంగారు కలలనా, రేపటిఉదయానికి వేచిఉండగల ఆశగురించా? ప్రాభాత వేళల పరిమళభరితమైన తెమ్మెరలగురించా మనుషులు మరణమని పిలిచే మార్మిక నిశ్శబ్దంగురించా? ఓ కాలవిహంగమా! నీ గొంతులో అవిరళంగా మారే నీ శృతుల గమకాలను ఎక్కడ నేర్చావో చెప్పవూ? ప్రతిధ్వనించే అడవులలోనా, విరిగిపడే అలలలోనా ఆనందంతో…
-
ఒక కుర్రాడి ఆలోచనలు… రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి
ఏడు గంటలకి నేను నిద్రకి ఉపక్రమించేటపుడు నా బుర్రలో ఎన్నో బొమ్మలు తారాడుతుంటాయి: పెద్ద పెద్ద భవనాలూ, వాటిని చుట్టుముడుతూ మహాసర్పాలూ వింత వింత గారడీలు చెయ్యగల పండ్లు పండే తోటలూ, దుర్గాల్లో బందీలు చెయ్యబడీ, లేదా, మాయాలతాగృహాల్లో దారితప్పిన అందమైన రాకుమార్తెలూ… ఒక సాహసిక ఆశ్వికుడు సెలయేటిలో స్వారీచేస్తూ పోతుంటే నా కలల్లో ఆ దారంతా స్పష్టంగా కనిపిస్తుంది నేను ఏడు గంటలకి నిద్రకి ఉపక్రమించేటపుడు. నేను ఏడు గంటలకి నిద్రలేచే సరికి నేను వెతుకుతున్న…
-
గడపలు… కేల్ యంగ్ రైస్, అమెరికను కవి
ప్రతి క్షణం ఒక ద్వారం, ప్రతి రోజూ, గంటా, ప్రతి ఏడూ జరిగినవీ, జరగబోయేవీ అన్నీ అందులోంచే మాయమౌతాయి. వాటిలోంచే ఈ సృష్టి అంతా, సచేతనంగానో, అచేతనంగానో జీవితమనే అద్భుతంనుండి మృత్యువనే రహస్యం వరకూ జారుకుంటాయి. ప్రతి క్షణమూ ఒక కవాటము, అది అగోచరంగా ఆహ్వానిస్తుంది విషాదం కలిగించే దుఃఖాల్నీ, ఎదురౌతున్న సౌఖ్యాల్నీ వెగటుపుట్టేదాకా మనం వాటిలోంచి ఆవేశంగా ప్రవేశించి, శాంతితో బయటకు వస్తాము మధ్యనున్నదంతా ప్రయాసా, పారవశ్యం, చివరకి విముక్తీ. ప్రతి క్షణమూ ఒక ప్రవేశద్వారం…
-
నువ్వు నన్నెప్పుడైనా ప్రేమించదలుచుకుంటే… అజ్ఞాత కవయిత్రి
నువ్వెప్పుడైనా నన్ను ప్రేమించదలుచుకుంటే, అదేదో ఇప్ప్పుడే ప్రేమించు; నిజమైనప్రేమనుండి వెలువడే తీయని, సున్నితమైన భావనలన్నీ నాకు తెలిసేలా, నేను బ్రతికున్నప్పుడే నన్ను ప్రేమించు; నేను చనిపోయేదాకా ఎదురుచూడకు, చల్లని పాలరాతిపలకలమీద రసాత్మకమైన వెచ్చని ప్రేమ కావ్యాలు చెక్కడానికి. నీకు నా గురించి మధురభావనలుంటే, అవి నా చెవిలో ఎందుకు చెప్పకూడదు? నీకు తెలీదూ అది నన్ను ఎంత ఆనందంగా ఉండగలనో అంత ఆనందంగా ఉంచుతుందని? నేను నిద్రించేదాకా నిరీక్షిస్తే, ఇక నేను ఎన్నడూ నిద్రలేవకపోవచ్చు, మనిద్దరి మధ్యా…
-
ఈ రోజు గడిచింది… లాంగ్ ఫెలో, అమెరికను కవి
మొత్తానికి రోజు గడిచింది, రేయి రెక్కలనుండి చీకటి జాలువారుతోంది, ఎగురుతున్న గ్రద్ద ఈక ఒకటి ఊడి క్రిందకి తేలియాడుతూ రాలుతున్నట్టు. ఈ పొగమంచులోంచీ, రాలుతున్న తుంపరలోంచీ ఆ పల్లెలోని దీపాలు మిలమిలా మెరుస్తున్నాయి; నన్ను ముసురుకుంటున్న దుఃఖాన్ని నా మనసు నిగ్రహించలేకపొతోంది ఒక ఆవేదన, ఒక విషాద భావన అది పొగమంచుకీ తుంపరకి ఉన్న సామ్యంలా అది బాధ అని అనలేను గాని ఒక విషాదకరమైన మానసిక స్థితి. రండి, ఎవరైనా ఒక పద్యాన్ని…
-
చిరుగులు… షున్ తారో తనికావా, జపనీస్ కవి
పొద్దుపొడవకముందే ఒక కవిత నా దగ్గరకి వచ్చి నిలుచుంది ఒంటినిండా చిరుగులుపడ్డ మాటలు కప్పుకుని. తనకి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అయినా తను నాకు అందించిన విరిగిన సూది అందుకున్నాను అది తన నగ్నత్వాన్ని క్షణకాలం గమనించే అవకాశాన్ని కల్పించింది. అంతే! దానితో మరొకమారు చిరుగులకు అతుకు వెయ్యగలిగాను. . షున్ తారో తనికావా Born: 15 Dec. 1931 జపనీస్ కవి TATTERS Before daybreak Poem came to me …
-
నీకోసం రోదించను… ఎలెన్ గేట్స్, అమెరికను కవయిత్రి
నువ్వు రావాలని పదే పదే కోరుకుంటూ రోదించను … నా జీవితమంతా రోదిస్తూ అసలు గడపను; కానీ ఎంతకాలం సూర్యాస్తమయాలు ఎర్రబడుతూ, సుప్రభాతాలు ఆలస్యం కాకుండా వస్తుంటాయో అంతకాలమూ నేను ఒంటరిగానే ఉంటాను… నీ చేతినీ, మాటనీ, నవ్వునీ, ముద్దునీ కోల్పోతూ. నీ పేరు తరచుగా స్మరించను, కొత్తముఖాలకి ఏం అర్థమౌతుంది గనక ఓ రోజు అనుకోకుండా ఒక పెద్ద తుఫాను వచ్చిందనీ నా తోటని బోసి చేసి పోయిందనీ చెబితే? ఆ తర్వాత నువ్వు పోయావు,…
-
అతనిపేరు స్మరించకండి… థామస్ మూర్, ఐరిష్ కవి
రాబర్ట్ ఎమెట్ స్మృతిలో ఓహ్, అతని పేరు స్మరించకండి! అతని అస్తికలు నిర్లిప్తంగా ఏ సమ్మానమూ లేక పడి ఉన్నట్లే అజ్ఞాతంలోనే పరుండనీండి; దుఃఖంతో మేము మౌనంగా కార్చే కన్నీరు, అతని సమాధిపై తలదిక్కున బొట్టుబొట్టుగా రాలే రాత్రికురిసిన మంచులా బరువుగా రాలనీండి. కానీ, రాత్రి కురిసిన మంచు, అది మౌనంగా రోదిస్తే రోదించుగాక, అతను పరున్న సమాధి నలుదుక్కులా పచ్చని తివాచీ కప్పుతుంది; మేము కార్చే కన్నీరు అది ఎవరికీ కనిపించకపోతే కనిపించకపోవచ్చు గాక కానీ,…