వర్గం: అనువాదాలు
-
ఊరట… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి
సూర్యరశ్మిని పొగమంచు కప్పేసింది నాలుగుప్రక్కలనుండీ పొగలు ఎగస్తున్న పొట్టి గుడిశెలు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి; ఏదో చెప్పలేని నిరాశ నా మనసుని కృంగదీస్తోంది. కానీ, నే నొకవంక దిగులుతో అలమటిస్తుంటే ప్రతి దిక్కునా లెక్కలేనన్ని అవకాశాలు ఒకదానివెంట ఒకటి పరచుకుంటున్నాయి గణించలేనంత మంది మనుషులు చెప్పలేనన్ని మానసిక అవస్థలలో గడుపుతున్నారు. ఇక్కడనుండి దూరంగా, ఆసియాలో చదునుగా ఉన్న బిక్షువుల ఆశ్రమగోపురాలపైనా బంగారు రంగులో మెరిసే లాసా (టిబెట్) లోని మిద్దెలపైనా సూర్యుడు మిలమిల మెరుస్తున్నాడు. పసుపుపచ్చని టైబరు…
-
Lighting Fire under Her Feet… Sripada Subrahmanya Sastry, Indian
[This is one of the most touching stories by Sri Sripada Subrahmanya Sastry. In spite of my best efforts to the contrary, I could not contain my tears while reading and translating this story. It presents how pathetic the relations were between the kith and kin in Brahmin families not so long ago (I am…
-
హెన్రీ వాన్ సమాధి దగ్గర… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
గలగలలాడుతూ పారుతున్న నదికి ఎగువన అదిగో సాదాసీదాగా కనిపిస్తున్న ఆకుపచ్చ సమాధిఫలకం ఎవరికీ కనిపించకుండా, యూ చెట్టు చాటున కనుమరుగై ఉంది. ఇక్కడే హెన్రీ వాన్ నిద్రిస్తున్నాడు, అతని పేరు శాశ్వతంగా మంచుకడిగిన వనదేవతలా, మన ఊహకికూడా అందనంత కాలం నక్షత్రాల వెలుగులా నిలిచిపోతుంది. అందరూ ఇష్టపడ్డ డాక్టరు, వేల్స్ కి చెందిన సిలూరిస్ట్ ఇక్కడే నిద్రిస్తున్నాడు, అతనెలా ఉంటాడో తెలిపే చిత్తరువులూ లేవు. అతని మనసులో దేవదూతలు వసించేవారు, అతను మనోనేత్రాలతోనే ప్రభాతవెలుగులు దర్శించేవాడు. ఇక్కడ…
-
ప్రియ మృత్యువు… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను
. ప్రియ మృత్యువా! అన్నీ నీ రెక్కల క్రిందకి తీసుకుంటావు. హతమార్చడానికికాదు, కేవలం ఆకారం మార్చడానికి. బాధలతో తపిస్తున్న ఈ శరీరానికి మరో రూపం ఇవ్వడానికి. నువ్వు మళ్ళీ సుమారుగా ఇలాంటి వస్తువునే సృష్టించవేమోగాని కానీ, ఎన్నడూ అక్షరాలా ఇదే వస్తువుని తయారుచెయ్యవు. ఓ ప్రియ మృత్యువూ! నీ మారు పేరు మార్పు కదూ? . లాంగ్స్టన్ హ్యూజ్ (February 1, 1902 – May 22, 1967) అమెరికను కవి . Dear Lovely Death…
-
ఎవరు ఎక్కువ ప్రేమించారు? … జోయ్ ఏలిసన్, అమెరికను కవయిత్రి
“అమ్మా! నువ్వంటే నాకిష్టం,” అన్నాడు జాన్ అని, తన పని మరిచి, తన కుళ్ళాయి మరిచి తోటలో ఉన్న ఉయ్యాల ఊగడానికి పరిగెత్తాడు, నీళ్ళూ, కట్టేలూ తెచ్చే బాధ్యత ఆమెకి వదిలేసి. “అమ్మా! నువ్వంటే నాకిష్టం,” అంది ఎర్రబుగ్గల నీల్, “నువ్వంటే నా కెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను,”; అంటూ రోజులో సగభాగం బుంగమూతి పెట్టుకుని సతాయించేది చివరికి తను ఆటకి పరిగెత్తగానే సంతోషంగా ఊపిరిపీల్చుకుంది. “అమ్మా! నువ్వంటే నాకిష్టం, ” అంది చిన్నారి ఫాన్, “ఈ రోజు నీకు ఎంత…
-
వానంటే ఎవరికి ఇష్టం?… క్లారా డోటీ బేట్స్, అమెరికను
“నాకు,” అంది బాతు, “అది గొప్ప సరదాగా ఉంటుంది. ఎందుకంటే, అప్పుడు నేను కాళ్ళతో ఈదొచ్చు మెత్తని బురదలో నడిచేప్పుడు, మూడు కాలివ్రేళ్ళ ముద్రలు పడతాయి… క్వాక్! క్వాక్!!” “నాకు,” అని అరిచింది డేండిలియన్ పువ్వు. “నా మొగ్గలు ఎండిపోయాయి, వేళ్ళు నీటికై తపిస్తున్నాయి,” అంది, పచ్చగా ఒత్తుగా ఉన్న తన గడ్డి పరుపు మీంచి తన చిందరవందరగా ఉన్న తల పైకెత్తుతూ. సెలయేరు పాట అందుకుంది,”ప్రతి చినుకుకీ స్వాగతం, వాన చినుకులారా! చిత్తుగా కురవండి! నన్ను…
-
అఖండ ప్రార్థన… జేమ్స్ విట్ కూంబ్ రైలీ, అమెరికను
ఓ ప్రభూ! కరుణామయా! దయావార్నిధీ! నేను ఇష్టపడే వారినందరినీ ఈ రోజు నీ కటాక్షవీక్షణలతో చూడు! వాళ్ళ హృదయాలని పట్టిపీడించే అలసటని తొలగించు! గాలిని తూర్పారబెడుతున్నట్టు ఎగిరే నీ దూతల రెక్కల రెపరెపల జాడల్లో వాళ్లకి కావలసిన అవసరాలూ తీర్చు! బాధాతప్తహృదయులందరికీ బాధలనుండి విముక్తి కలిగించు. తిరిగి వాళ్ళ పెదాలపై చిరునవ్వులు వరదెత్తనీ! లేమితో అలమటించే దీనులకు ప్రభూ! ఈ రోజు నా సొత్తైన అనంతమైన సంతృప్తి సంపదని పంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను! . జేమ్స్ విట్ కూంబ్…
-
నువ్వు పక్షిలా బ్రతుకు … విక్టర్ హ్యూగో, ఫ్రెంచి కవి
నువ్వు పక్షిలా బ్రతుకు. ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ విశ్రాంతికి చెట్టుకొమ్మ మీద వాలినపుడు అల్పమైన దాని బరువుకే కాలి క్రింద కొమ్మ విరగబోతున్నా అది పాడుతూనే ఉంటుంది తనకి రెక్కలున్నాయన్న ధైర్యంతో! . విక్టర్ హ్యూగో 26 February 1802 – 22 May 1885 ఫ్రెంచి కవి, నాటకకర్త, నవలా కారుడు . Be Like the Bird . Be like the bird, who Halting in his flight On limb…
-
ప్రతిధ్వని… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి
“ఎవరది పిలిచింది?” అన్నాన్నేను. నా మాటలు ఊసులాడుతున్న వనసీమలలోంచి, ఇటూ అటూ పోతూ పిట్టల్ని గాభరాపెట్టేయి “ఎవరది పిలిచింది? ఎవరది పిలిచింది?” అంటూ. చిటారుకొమ్మలనున్న ఆకులు ఎండలో గలగలలాడాయి ఎండకాగిన పొడిగాలి నా అరుపుని సన్నగా మోసుకుపోయింది: పచ్చదనం మద్య తొంగి చూస్తున్న కళ్ళూ, నీడలోనున్నవీ కదలకుండా పడున్న డొంకలోని గొంతులు నన్ను వెక్కిరించడానికి నే నేమంటే తిరిగి అదే అంటున్నాయి. నా కన్నీళ్ళలోంచి ఒక్క సారి అరిచేను: “ఎవడికి ఖాతరు?” అని; గాలి ఒక్కసారి పల్చబడింది:…
-
చిరునవ్వు- రౌల్ ఫొలేరో, ఫ్రెంచి రచయిత
చిరునవ్వుకి కాణీ ఖర్చులేదు, కానీ చాలా ప్రసాదిస్తుంది. దానికి కొన్ని లిప్తలు పడుతుంది కానీ దాని ప్రభావం శాశ్వతం. అది లేకుండా బ్రతకగలిగిన ధనవంతులెవరూ ఉండరు, దాన్ని ఇవ్వడం వలన పేదవాళ్ళయిపోయేవారెవరూ ఉండరు. అది ఇచ్చేవాళ్ళని పేదవాళ్ళని చెయ్యకుండానే పుచ్చుకునే వాళ్ళని ధనవంతుల్ని చేస్తుంది— అది ఇంటిలో వెలుగు సృష్టిస్తుంది- వ్యాపారంలో మంచిపేరు సంపాదిస్తుంది అన్ని విషమ సమస్యలకీ విరుగుడుగా పనిచేస్తుంది. అయినప్పటికీ, దాన్నెవడూ యాచించలేడు, అరువు తీసుకో లేడు, దొంగిలించలేడు, ఎందుకంటే, అది అయాచితంగా ఇస్తేనే…