వర్గం: అనువాదాలు
-
గీతిక 314… రూమీ పెర్షియన్ కవి
ప్రేమ తమని నదిలా తనలోకి ఈడ్చుకుపోతున్నట్టు ఎవరు అనుభూతిచెందలేరో, ఎవరు ప్రాభాతాన్ని చెలమనీటిని దోసిలితో తాగినట్టు గ్రోలలేరో, లేక, సూర్యాస్తమయాన్ని రాత్రిభోజనంలా ఆరగించలేరో, ఎవరు మారడానికి అయిష్టంగా ఉంటారో, వాళ్ళని అలా నిద్రపోనీయండి. ఈ ప్రేమ వేదాంత చర్చ పరిధికీ, ఒకప్పటి మాయమాటలకీ, ఆత్మవంచనలకీ అతీతమైనది. మీరు మీ మనసుని ఆ విధంగా మెరుగుపరచుకోదలిస్తే అలాగే కానీండి. నిద్రపోండి. నేను నా బుద్ధిని పక్కనబెట్టాను. నా తొడుగులను విడిచి పీలికలు పీలికలుగా చేసి పారవేశాను. మీరు ఏ…
-
మంచులో వేటగాళ్ళు… విలియం కార్లోస్ విలియమ్స్, అమెరికను కవి
This Poem is about this picture by Piter Brugel the elder (1525- 9th Sept 1569), the famous and most significant artist of Dutch and Flemish Renaissance Painting. The Painting is “Hunter In the Snow” … is an Oil on canvas, 46 inches x 63.75 inches displayed in Kunsthistorisches Museum, Vienna. *** ఆ చిత్రం శీతకాలంలో మంచుకొండలు.…
-
The Painter… Bolloju Baba, Telugu Poet, Indian
Once His signature on walls, Banners, signboards and cut-outs Used to gleam like The solar disc hanging on to the horizon. Between the straight lines He drew with the twine dipped in indigo His letters used to nestle like doves in a nest. The paints amid the squirrel hairs of the brush…
-
కాలిపోతున్న ఓడ… జాన్ డన్ ఇంగ్లీషు కవి.
. ఇది చాలా సందేశాత్మకమైన కవిత. మనం జీవితాలు కాలి మునిగిపోతున్న ఓడలాంటివి. మరణాన్నించి ఎవ్వరమూ తప్పించుకోలేం. అలా తప్పించుకుందికి ప్రయత్నంచేసిన వారికి మరణకారణం మారుతుందేమో గాని మరణాన్నుంచి మినహాయింపు మాత్రం దొరకదు. జాన్ డన్ 17 వ శతాబ్దపు ప్రముఖ ఆధిభౌతిక (Metaphysical) కవుల పరంపరకి చెందినవాడు. . సముద్రంలో మునిగిపోవడంవల్ల తప్ప మంటలనుండి తప్పించుకోలేని కాలిపోతున్న ఓడ లోంచి కొందరు మనుషులు ఒక్కసారి బయటకు గెంతారు , వాళ్ళు శత్రుఓడలదరికి జేరగానే వాళ్ళతూటాలకు బలైపోయారు;…
-
సమస్య… ఆల్ఫ్రెడో గోమేజ్ జైమ్, కొలంబియన్ కవి

నేను మృత్యువంటే భయపడే పిరికివాడిని. నేను జీవితమన్నా భయపడే పిరికివాడిని: మృత్యువూ- జీవితమూ: రెండూ బృహద్రహస్యాలు . జీవితం- మృత్యువూ: రెండూ గొప్ప మోసగత్తెలు. . గులాబిమాలలతో అలంకరింపబడి – జీవితం సాగిపోతుంది; బరువైన ముసుగుకప్పుకుని- దరిజేరుతుంది మృత్యువు; దాని ప్రయాణంవేగంలో జీవితాన్ని ఎవరూ నిరోధించలేరు. అది రాకుండా మృత్యువుని ఎవ్వరూ అడ్డగించనూ లేరు. . నేనొక పిసినారిని, చెంగటనున్న సంపద కాపుకాస్తుంటాను నేను ఆరాధించే- మనసుకి నచ్చిన అపురూప సంపదను. ఎంతో ఇష్టమైనవని పువ్వుల్ని అతిజాగ్రత్తగా…
-
స్నేహితులు మూడు రకాలు…. రూమీ, పెర్షియన్ కవి
నే చెపుతున్నా, వినుకో: స్నేహితులు మూడు రకాలు మనని వాడుకునే వాళ్ళు, స్నేహం నటించేవాళ్ళు, నిజమైన స్నేహితులూ. . ఎదో కొంత విదిల్చి, నిన్ను వాడుకునే వాడిని వదిలించుకో తియ్యగా మాటాడుతూనే, నటించేవాడు నిన్ను మోసగించకుండా చూసుకో. . కానీ, నిజమైన స్నేహితుడిని మనసులో పదిలపరుచుకో కష్టపడవలసి వచ్చినా, భరించు. కానీ, అతన్ని చెయ్యిజారనియ్యకు. . రూమీ (30 సెప్టెంబరు 1207 – 17 డిసెంబరు 1273) పెర్షియన్ సూఫీ కవి . Friends are…
-
ఆటు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

నీ ప్రేమ నానుండి మరలింది కనుక నాకు నా మనఃస్థితి తెలుస్తోందిలే: అదొక తీరంనుండి సముద్రంలోకి చొచ్చుకొచ్చిన బండరాయి, దానిమీద ఒక చిన్న గుంత; అందులో, ఎగసినకెరటాలనుండి జారిపోగా మిగిలిన నీటితో ఏర్పడిన చిన్న మడుగు. ఆ గోర్వెచ్చని నీరు ఎండకీ, గాలికీ మెల్లమెల్లగా హరించుకుపోతుంటుంది. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే (22 ఫిబ్రవరి 1892 – 19 అక్టోబరు 1950) అమెరికను కవయిత్రి . Ebb . I know what my heart…
-
మండువేసవిలో ఒక సూర్యోదయం… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి

ఓ ఆకాశమా! విపుల వైశ్వానర స్వరూపమా! విను! బ్రహ్మాండమైన సూర్యగోళపు గర్జనలు వినిపించకపోవచ్చు నేమో గానీ, అవి వినలేనంత భీకర శబ్దాలు; వెలుగునే వేడెక్కించగలవవి. ఓ మహానుభావా! సూర్యుడా! మా ఆత్మలని వెలిగించు, కోరికలు రగిలించు… మా ఆత్మలకి ప్రేరణనివ్వు! మేము ఈ చీకటిని చాలా కాలమై ప్రేమిస్తున్నాం. ఈ చీకటికి చితి రగిలించి, వెలుగుని మరింత ప్రజ్వలనం చెయ్యి. ఎంతగా అంటే ఆ వేడిలో నిస్తేజమైన ఈ రోజులు రగిలి, ఆ సెగలలో సుషుప్తిలో మునిగి…
-
Sri Visakhapatnam Kanaka Mahalaksmi… Munipalle Raju, Telugu, Indian

On the eve of First Death Anniversary of Sri Munipalle Raju garu I had been working in Visakhapatnam for long, but I never occasioned to walk the steps of the Simhachalam Temple or visit the village Goddess, Sri Kanaka Mahalakshmi. My aunt had changed it all that with her recent visit. Getting down from the…
-
చిత్రం… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి

ఊపిరి తీయనివీ, కంటి చూపు లేనివీ, వాటికే మరణం లేకపోవడం ఏమిటి?! చైతన్యం ఎరుగని ఒక బండరాయికీ, పిసరంత నేలకీ శాశ్వతత్వం అనుగ్రహించబడటం ఏమిటి?! ఒక ధూళికణం, ఒక మట్టి బెడ్డ భగవంతుడి అపురూపమైన వరానికి నోచుకుంటాయి. దారి పక్కన పడుండే గులకరాయికి చావు లేదు. మన తాత ముత్తాతలు కోసిన గడ్డి పరకలు ఇప్పుడు వాళ్ళ సమాధులమీద మొలుస్తున్నాయి. కనీ కనిపించకుండా ప్రవహించే పిల్లకాలువలు అనవరతంగా ప్రవహిస్తూ ఎండిపోతుంటాయి. పేలవంగా, నిశ్చలంగా పడి ఉండే ఇసకరేణువులకి…