వర్గం: అనువాదాలు
-
నే చెప్పలేదూ?… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి

నే చెప్పలేదూ… ఇకపై పాపాలు చెయ్యనని? ప్రభూ, నువ్వే సాక్షివి, చేశాను; అంతే కాదు, ఇంకా చేస్తూనే ఉన్నాను. నా తప్పుల్ని దాచ శక్యం కాదు. ఏం చెయ్యను? మళ్ళీ ప్రమాణంచేసి మాట తప్పనా? ప్రమాణం చెయ్యడం కేవలం వృధా ప్రయాస. నాలోని మంచి చెడుని అదుపుచెయ్యలేకపోతోంది; ఈ ప్రయత్నం తప్పకుండా విఫలమౌతుంది. ఓహో! ఎందుకు అలా అనుకుంటావు? నీకు భగవంతుడు ఎంతటి ఆత్మనిగ్రహాన్ని ప్రసాదించేడో నీకు తెలియదు, తిరిగి ఒట్టుపెట్టుకో, నువ్వు చివరిదాకా నిలబడగలిగితే దేముడు…
-
రకరకాల మనసులు…. రిఛర్డ్ చెనో ట్రెంచ్ , ఇంగ్లీషు కవి
. ఆకాశం నిర్మలంగా ఉండి చూడడానికి ప్రకాశవంతంగా ఉన్నా, కొందరు గొణుగుతారు అంతనిర్మలంగా ఉన్న నీలాకాశంలోనూ ఎక్కడో నల్లని మరక కనిపించిందంటూ; కొందరికి వారి చీకటిముసిరినజీవితాలలో భగవంతుని అనుగ్రహం ఒక్కసారి కలిగినా, ఒక్క వెలుగురేక తొంగిచూచినా చాలు, హృదయం కృతజ్ఞతాపూర్వక ప్రేమభావనతో నిండిపోతుంది. రాజప్రాసాదాలలోని హృదయాలు అసంతృప్తితో, అహమికతో అడుగుతుంటాయి జీవితం ఎందుకింత నిస్సారంగా ఉండి ఏ మంచీ ఎందుకు జరగడం లేదని. నిరుపేద గుడిసెలలోని మనసులు ప్రేమ వారిజీవితాలని ఎలా ఆదుకుందో (అసలా ప్రేమకు అలసట…
-
కొవ్వొత్తి … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
. నా కొవ్వొత్తి రెండు వైపులా మండుతోంది అది ఈ రాత్రల్లా వెలగకపోవచ్చు కానీ, నా శత్రులారా! ఓ నా మిత్రులారా! అది వెలిగినంతసేపూ అద్భుతమైన కాంతినిస్తుంది. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, ( 22 February 1892 – 19 October 1950) అమెరికను కవయిత్రి . . First Fig . My Candle burns at both ends; It will not last the night; But, ah, my…
-
సంఘర్షణ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

. నాలోని యోగీ, భోగీ రాత్రీ పగలూ పోట్లాడుకుంటూ ఉంటారు. సమ ఉజ్జీలేమో, అతి జాగ్రత్తగా, లొంగకుండా ఒకర్నొకరు తిట్టుకుంటూ నాకు ఒకపక్క చెమట్లు పట్టేస్తుంటే సూర్యోదయం మొదలు చీకటిపడేదాకా కొట్టుకుంటారు. రాత్రయినదగ్గరనుండీ పోరాటం మళ్ళీ ప్రారంభం. పొద్దుపొడుస్తుంటే వణుక్కుంటూ వాళ్ళని గమనిస్తాను. ఈసారి ఒకరి అంతు రెండోవాళ్ళు చూసేదాకా కొట్టుకుంటారు. ఎవరు జయిస్తారన్నది నేను పట్టించుకోను. ఏవరు గెలిచినా, చివరికొచ్చేసరికి ఓడిపోయేదాన్ని నేనే! . సారా టీజ్డేల్ (8 August 1884 – 29 January…
-
పోగొట్టుకున్న నేల… ఈవన్ బోలాండ్, సమకాలీన ఐరిష్ కవయిత్రి

. నా కిద్దరు ఆడపిల్లలున్నారు. నేను ఈ జన్మకి కోరుకున్నది ఆ ఇద్దరినే. బహుశా నేను అంతకుమించి కోరుకోలేదేమో! . హాఁ! నేను చారెడు జాగా కూడా కోరుకున్నాను: ఎప్పుడూ ఎవరిపని వారు చేసుకోగలిగే వాతావరణమున్న దీవి, చుట్టూ కొండలమధ్య ఒక నగరం, ఒక జీవ నది … ఉన్న చోట. ఆ నేల నాదని చెప్పుకోగలగాలి. నా స్వంతం. అక్షరాలా నా తాత్పర్యం అదే. వాళ్ళు పెద్దవాళ్ళయిపోయి దూరాభారాన ఉన్నారు. ఇప్పుడు జ్ఞాపకాలే వలస పోతున్నాయి.…
-
“ఎవరక్కడ?… రూమీ, పెర్షియన్ కవి

. “ఎవరక్కడ?” అని అతనడిగేడు “మీ విధేయుడైన సేవకుడిని,” అన్నాను నేను. “ఈక్కడ నీకేం పని?” అడిగేడతను. “ప్రభూ! మిమ్మల్ని దర్శించుకోడానికి వచ్చేను,” అన్నాను నేను. “ఎన్నాళ్లని ఇలా తిరుగుతూ ఉంటావు?” అని అడిగేడతను. “స్వామీ! మీరు ఇక చాలు అనేదాకా,” అన్నాను నేను. “ఎన్నాళ్లని ఇలా మంటలో సలసల్కాగుతావు?” “నేను పరిశుద్ధుడను అయేదాకా!” అన్నాను నేను. అని, “ప్రభూ! ప్రేమమీద ప్రమాణం చేసి చెబుతున్నా, నేను ప్రేమ కోసం నా హోదానీ, నా సంపదనీ వదులుకున్నాను,”…
-
ఈ భూమ్మీద అందరూ… అలెగ్జాండర్ బ్లోక్, రష్యను కవి
. ఈ భూమ్మీద అందరూ గతిస్తారు… నీ యవ్వనం, నీ తల్లిదండ్రులూ; నీ భార్య నిన్ను వంచించవచ్చు, నీ ఆప్తమిత్రుడు నిన్ను విడిచిపోవచ్చు, కానీ, ధృవందగ్గర అద్దంలాంటి ఈ నేలనీ చూస్తూ ఒక అలౌకికమైన ఆనందాన్ని అనుభవించడం ఎలాగో నేర్చుకో. నీ దోనెలోకి నువ్వు ఎక్కు, మంచుగోడల మధ్యనుండి దూరానకనిపిస్తున్న ధృవానికి సాగిపో; నీ వాళ్ళు నిన్నెలా ప్రేమించేరో, ఎలా పోరాడేరో, ఏమి సాధించేరో, ఎలా మరణించేరో, ఒక్కొక్కటే మరిచిపో; నిరంతరం నిన్ను బాధించే కష్టాల చిఠ్ఠా…
-
చిన్నిపెట్టె… వాస్కో పోపా, సెర్బియన్ కవి

ఇక్కడ “చిన్ని పెట్టె” ఒక ప్రతీక. అది మనిషి జ్ఞాపకాలకీ, మెదడుకీ కూడా సంకేతం కావొచ్చు. ఇలా సున్నితంగా ప్రారంభమైన జీవితం, దృశ్య, శ్రవణాది ఇంద్రియాల అనుభూతుల్నీ, వాటి జ్ఞాపకాలను పోగుచేసుకోవడం ప్రారంభిస్తుంది. ఇంత చిన్నదీ, ప్రపంచం గురించి అవగాహన చేసుకుంటూ, ప్రపంచాన్ని తనలో ఇముడ్చుకోగలిగేలా ఎదిగిపోతుంది. ఈ జ్ఞాపకాలని ఇతరులతో పంచుకుంటుంది. వయసు మీరినపుడు అందులో కొన్ని పోగొట్టుకుంటుంది. నిజానికి ఎవరికైనా, జీవితమంతా అనుభూతుల, జ్ఞాపకాల భరిణ. అందుకే వాటిని పదిలంగా కాచుకోవాలని చెబుతున్నాడు కవి.…
-
ఇక్కడ మనం జీవచ్ఛవాల్లా పడుంటాం… ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్, ఇంగ్లీషు కవి
. మనం జీవించదలుచుకోలేదు కాబట్టి, మనం పుట్టిన గడ్డకి మచ్చతెస్తూ, జీవచ్ఛవాల్లా ఇక్కడ పడుంటాం. నిజం చెప్పాలంటే, జీవితంలో పోగొట్టుకోడానికి ఏమీ లేదు. కానీ యువత అలా అనుకోదు, మేము యువకులం కదా! . ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్ 26 March 1859 – 30 April 1936 ఇంగ్లీష్ కవి . Here Dead We Lie . Here dead we lie Because we did not choose To live and…
-
పిల్లలూ, మెల్లమెల్లగా మీరు గడపదాటి పోతున్నప్పుడు… ల్యూసియస్ ఫ్యూరియస్, అమెరికను కవి
పిల్లలూ, మీరు అంచెలంచెలుగా గడపదాటుతున్నప్పుడు — ఒకటో తరగతి… తర్వాత కాలేజీ… తర్వాత మీ స్వంత ఇల్లూ, తర్వాత బహుశా పెళ్ళి—, ఇన్నాళ్ళూ భద్రంగా దాచిన ఈ నాలుగుగోడల్నీ ప్రేమతో గుర్తుంచుకుంటారనుకుంటాను, ఈ ఏటవాలు పసుపుపచ్చ పైన్-చూరిల్లూ, ఇక్కడ మీ రనుభవించిన వెచ్చదనమూ- వాటిని మీరు జీవితంలో అవవలసినదానికి అవరోధాలుగా కాక నిరంతరం విశాలమవుతున్న ఈ ప్రపంచాన్ని ఎదుర్కోడానికి బలమైన గాలి తోడుగా ప్రయాణమైన మీ జీవననౌకల్ని క్షేమంగా ఉంచిన ఓడరేవులుగా తలచుకుంటారనుకుంటాను. నిజమే! లోకంలో చెడ్డ…