వర్గం: అనువాదాలు
-
మరొక ఆకాశం… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి

కవిత్వమనే సరికొత్తలోకంలోకి ఆహ్వానిస్తూ ఎమిలీ డికిన్సన్ తన సోదరుడు ఆస్టిన్ కి రాసిన ఉత్తరంతో జతచేసిన కవిత. *** ఆస్టిన్! ఎపుడుచూసినా అందంగా, నిర్మలంగా ఉండే కొత్త ఆకాశం ఇక్కడొకటి ఉంది. అక్కడ ఎప్పుడైనా చీకటి ఉంటుందేమో గాని ఇక్కడ ఎల్లవేళలా చక్కని ఎండ వెలుగే. అక్కడి రంగువెలిసిన అడవుల ఊసు ఎత్తకు, నిశ్శబ్దం రాజ్యమేలే పొలాలని మరిచిపో, ఇక్కడ ఒక చిట్టడివి ఉంది దాని ఆకులు నిత్యం పచ్చగా ఉంటాయి; వెచ్చనివెలుగులు విరజిమ్మే ఈ అడివిలో మచ్చుకైనా ఎన్నడూ…
-
పాప… ఎజ్రా పౌండ్, అమెరికను కవి

ఈ కవిత నేపథ్యం గురించి అందులోని గ్రీకు పౌరాణిక పాత్రలు గురించి, దాన్ని ఏ రకంగా వ్యాఖ్యానించుకోవచ్చు నన్న విషయం గురించి చాలా చర్చలే ఉన్నాయి. .. స్పష్టత, సంక్షిప్తత, నిర్దుష్టత, మాటలపొదుపు లక్ష్యంగా గతశతాబ్దం తొలినాళ్లలో వచ్చిన ఇమేజిజం అన్న కవిత్వోద్యమంలో ఒక ముఖ్యపాత్రధారి ఐన ఎజ్రా పౌండ్ వ్రాసిన ఈ కవిత ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే కవిత. దీనికి నాకు తోచిన వ్యాఖ్యానం ఈ అనువాదం. ఇది అతని ఉద్దేశ్యం కాదు, కానక్కరలేదు.…
-
నెలవంక… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

దుప్పికొమ్ములా కొనదేరిన నవ్వుల నెలరేడా! అల్లంత ఎత్తున ఆకాశంలో మెల్ల మెల్లగా జారుతూ, నా మాటలను వినగలవా? తొందరగా క్రిందకి దిగి రాగలవా? మా పూదోట కిటీకీ గూటిలో కాసేపు నిలకడగా కనిపించగలవా? తర్వాత మనిద్దరం ఈ వేసవి రేయి చెట్టపట్టాలేసుకుని ఎగిరిపోదాం, సరేనా? నక్షత్రాలతో దోబూచులాడుతూ, మహావృక్షాల చివురుకొమ్మలు చేతితో నిమురుతూ, తెల్లగా మెరిసే మేఘామాలికల సందులలోంచి బృహస్పతినీ, అంగారకుడినీ తొంగిచూద్దామా? ఇంటిలో మా అమ్మ పూజకోసం పాలపుంత వనసీమల్లో ఏరిన తారకాసుమాలతో నా ఒడి…
-
ముగింపు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఏ సుఖసంతోషాలమీదకీ ఇపుడు మనసుపోవవడం లేదు, వర్షంతో ముంచెత్తిన ఈ సెప్టెంబరు రోజు ముగింపుకొచ్చింది నేను అమితంగా ప్రేమించిన వ్యక్తికి ఈ రోజు వీడ్కోలు పలికేను ఎంతో ప్రయత్నం మీద నేను నా మనసుని అణుచుకోగలిగేను. వదలకుండా వీస్తున్న రొజ్జగాలి శీతకాలపు రాకడ సూచిస్తోంది వర్షానికి తడిసి కిటికీ అద్దాలు మసకబారి, చల్లగా తగులుతున్నాయి; నేను ప్రయత్నపూర్వకంగా నా అదృష్టాన్ని దూరంచేసుకున్నాను ఇక ఈ జన్మకి అదృష్టం నా దగ్గరకి తిరిగిరాదు. . సారా టీజ్డేల్ 8…
-
కవిత్వంలాగే కొందరు… జిష్వావా షింబోర్స్కా , పోలిష్ కవయిత్రి

. మామూలు కలమూ కాగితమూ తీసుకో. రాయి. నే చెప్పినట్టు రాయి: “వాళ్ళకి తిండి పెట్టలేదు. వాళ్ళందరూ ఆకలి తాళలేక చనిపోయారు”. “అందరూనా? అంటే ఎంత మంది? అదొక పెద్ద మైదానం. వాళ్ళందరినీ సమాధిచెయ్యడానికి ఎంత నేల కావలసి వచ్చుంటుంది?” ప్రశ్నలడక్కు. నే చెబుతున్నట్టు రాయి: అది నాకు తెలీదు. చరిత్ర అస్థిపంజరాలని వేలల్లోనూ, లక్షల్లోనూ చెబుతుంది ఉదాహరణకి వెయ్యిన్నొకటిని వెయ్యిగా చెబుతుంది అక్కడికి ఆ వెయ్యిన్నొక్క వ్యక్తి ఎన్నడూ భూమ్మీద పుట్టనట్టు: ఆ పిండం ఒక…
-
కారు నడిమి శలవులు… సీమస్ హీనీ, ఐరిష్ కవి

ఈ కవిత శీర్షిక చిత్రంగా పెట్టాడు కవి. అందుకని దానిని తెలుగులో అనువదించడానికి కొంతశ్రమపడవలసి వచ్చింది. Mid-term Break ని అన్నదాన్ని ఎన్నికలవిషయంలో చెప్పినట్టు, మధ్యంతర శలవులు అనడం నాకు నచ్చలేదు, కారణం రెండింటి మధ్య ఉన్న మౌలికమైన తేడా. కారు అన్నపదానికి అర్థం ఒక ఋతువు (నవకారు: వసంతం, వానకారు: వర్షాకాలం ఇలా) కొంత నిర్ణీత వ్యవధి… అన్న అర్థాలున్నాయి. అందుకని Term అన్నపదానికి కారు అన్నది సరిపోయినట్టు అనిపించింది. . కళాశాల ఆసుపత్రిలో కూచుని పగలల్లా…
-
ఊగిసలాడుతున్న రోజు… ఆక్టేవియో పాజ్, మెక్సికను కవి
తన పారదర్శకతకి తానే మురిసిపోతూ ఉండనా, మాననా అని రోజు ఊగిసలాడుతోంది. గుండ్రంగా భూమిని కప్పిన మధ్యాహ్నపుటెండవేళ మనుషులులేని సముద్రతీరంలా, ప్రశాంతంగా ప్రజలు జోగుతున్నారు. అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఏదీపట్టుదొరకదు, అన్నీ సమీపంలోనే ఉన్నాయి ఏదీ చేతికందదు. కాగితం, పుస్తకం, పెన్సిలు, అద్దం పేరుకే… అవి ఏ పనీ లేక విశ్రాంతి తీసుకుంటున్నాయి. ‘లబ్ డబ్’ మంటూ నెత్తుటి భాషలో ఎప్పటిలాగే నా కణతల దగ్గర కాలం కొట్టుకుంటోంది. నిర్లిప్తంగా ఉన్న గోడమీద రకరకాల నీడలు వేసి…
-
అవ్యయము… జోసెఫ్ బ్రాడ్స్కీ, రష్యను-అమెరికను కవి

ఇది చాలా చిత్రమైన స్మృతి కవిత. దీని శీర్షిక చాలా నచ్చింది నాకు. మనిషి ఏమిటి మిగిల్చిపోతాడు? లేదా, మనిషి పోయిన తర్వాత ఏమిటి మిగులుతుంది? మనిషి భవిష్యత్తు అదే! వాడి గురించి చనిపోయిన తర్వాత అందరూ ఏమిటి మాటాడుకుంటారో, అంతే మిగిల్చిపోతాడు.వాడి గురించి ఎన్ని మాటాడుకున్నా, ఎన్ని గొప్ప గొప్ప పదాలు వాడినా, ఆ మాటలన్నిటిలోంచి అతిశయోక్తులు కాలక్రమంలో కారిపోతాయి. ఆ మాటలపరదాల వెనుక లేదా మృత్యు పరదా వెనుక ఎంతగొప్పవారున్నా ఒక్కటే. అతను ఎంతకాలం…
-
మరపు… చెస్లావ్ మిహోష్, పోలిష్ అమెరికను కవి

నువ్వు ఇతరులకి కలిగించిన బాధను మరిచిపో ఇతరులు నీకు కలిగించిన బాధనుకూడా మరిచిపో సెలయేళ్ళూ, నదులూ ప్రవహిస్తూనే ఉంటాయి వాటితుంపరలమెరుపులు మెరిసిమాయమౌతాయి నువ్వు నడుస్తున్న నేల నువ్వు మరిచిపోతావు. ఒకోసారి ఏ దూరతీరాన్నుండో పాట ఒకటి వినిపిస్తుంది దానర్థం ఏమిటి, ఎవరుపాడుతున్నారు? అని నిన్నునువ్వు ప్రశ్నించుకుంటావు. బాలభానుడు, మధ్యాహ్నమయేసరికి నిప్పులుకురుస్తుంటాడు నీకు మనవలూ మునిమనవలూకూడా పుడతారు. మళ్ళీ నిన్ను చెయ్యిపట్టుకుని ఎవరో ఒకరు నడిపిస్తారు. నదులపేర్లు నీకు గుర్తుండిపోతాయి. ఎంత నిరంతరాయంగా పారుతున్నట్టు కనిపించేవని! నీ భూములుమాత్రం…
-
నీవు లేక… హెర్మన్ హెస్, జర్మను కవి

సమాధి ఫలకంలా శూన్యంగా చూస్తుంటుంది తలగడ రాత్రివేళ నా వైపు నీ కురులలో తలవాల్చి నిద్రించకుండా ఇలా ఒంటరిగా పడుకోవడం ఇంత కఠినంగా ఉంటుందని ఊహించలేదు. ఏ చప్పుడూ లేని ఇంటిలో నేను ఒంటరిని వేలాడుతున్న లాంతరు మసిబారిపోయింది. నీ చేతులు నా చేతిలొకి తీసుకుందికి మెల్లగా చెయిజాచుతాను , కాంక్షాభరితమైన నా పెదవిని నీవైపు జాచి నన్ను నేనే ముద్దుపెట్టుకుంటాను, నిరాశతో, నిస్సత్తువతో చటుక్కున మేలుకుంటాను నా చుట్టూ చలికప్పినచీకటి నిలకడగా ఆవహించి ఉంటుంది. కిటికీలోంచి…