వర్గం: అనువాదాలు
-
ఆశాంతి … సిసీలియా బొరోమియో, ఫిలిప్పీన్ కవయిత్రి

చావుకీ, బ్రతుకుకీ మధ్య వేలాడే శూన్యంలో ఎవరికీ కనపడకుండా ఉండాలని దొరికిన ఆధారాన్ని పట్టుకుని ఒకమూలకి ఒదుక్కుని ఉంటాము; మన మాటలకీ, చేతలకీ మధ్యనున్న సంబంధం మనం అర్థం అయిందనుకున్నంతమట్టుకు, ఒక సాలెగూడు అల్లుకుంటాం చివరకి అపార్థాలే మిగిలినా; వెంటనే దృష్టిపెట్టవలసిన అవసరాలూ, మనం ఆవేశంతో జరిపే చర్చల … సందిగ్ధ జారుడుతలం మీద నడుస్తూ నన్ను నేను ప్రశ్నించుకుంటుంటాను “ఇంతకీ నేను ఇక్కడ ఏం చేస్తున్నట్టు?” . సిసీలియా బొరోమియో, సమకాలీన ఫిలిప్పీన్ కవయిత్రి Cecilia_Borromeo…
-
ఒక పొద్దుగ్రుంకిన వేళ … ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
సూర్యాస్తమయాన్ని చూడడానికి ఒకరోజు పరుగెత్తి ఒక కొండ శిఖరానికి చేరాను. ఎగసిపడుతున్న సముద్రపుటలల్లా, దిక్కుల చివరవరకూ రక్తవర్ణంతో కొన్నీ, పసిడి అంచులతో కొన్నీ, రకరకాల కాంతులతో మండుతున్న మంటల్ని అదుపుచెయ్యడానికి తూర్పునుండి పడమరకీ, ఉత్తరంనుండి దక్షిణానికీ మేఘాలు ఎలా దొర్లుకుంటూ వెల్లువెత్తాయని! అయినా కీలలు ఆరలేదు సరికదా, భూమ్యాకాశాలు అంటుకుని వెర్రిగా హాహాకారాలు చేస్తున్నట్టు పైపైకి విజృంభించి లేస్తున్నాయి. ఒక్క క్షణం ఏమీపాలుపోక భయంతో అక్కడే నిలబడిపోయాను. “దాడి” అని అరుస్తూ రెండు ఆదిమ వైరి వర్గాలు…
-
అడవిలో ఒక దృశ్యం… ఏంటొనెట్ డికూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఒహ్! ఎంత అద్భుతమైన దృశ్యం! పాపం ఇరుకైన నగర సీమల్లో కమ్మని కలలకికూడా కరువే. చుక్కల్ని తలలో తురుముకుంటున్న ఈ ‘ఫర్ ‘ చెట్లముందు చర్చి గోపుర శిఖరాలుకూడా అంత పవిత్రత నోచుకో లేకున్నాయి. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ 17 Sep 1866 – 30 Apr 1925 అమెరికను కవయిత్రి . In the Forest Ah, the forest visions! Poor and lowly Are the dreams within a…
-
వీడ్కోలూ- స్వాగతమూ… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
గొంతులో కమ్మని పాటతో, రంగురంగుల నీ రెక్కలు ఎండలో తళుకులీనుతున్నప్పుడు నన్ను విడిచి వెళ్లిపోయావు. రెక్కలు విరిగి, రంగులన్నీ తమ తళుకు కోల్పోయి గొంతులో పాట గొంతులో ఇంకి, ఇపుడు తిరిగి వచ్చావు. అయినా సరే, నీకు స్వాగతం. ఇల్లు నీకోసం తెరిచే ఉంటుంది. కళ్ళు కన్నీరు చెమర్చవచ్చు, పెదాలు నవ్వుతూనే పలుకరిస్తాయి నేను కన్న కలలకి ఎన్నటికీ మరుపు అన్నమాట ఉండదు అప్పటి నీ తియ్యని పాట ఇంకా గుండెలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. . ఏంటొనెట్…
-
బహుమతి… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఉదయ సంధ్య తన విమలకంతో తూర్పున రంగులద్దుతుంది, మధ్యాహ్నం తన పుష్యరాగంతో బంగారపు తళుకులీనుతుంది, సాయం సంధ్య కెంపులూ, కురువిందలతో మెరుగు పెడుతుంది, కానీ, రవ్వలాంటి చుక్కతో, రేయి ఆ బహుమతిని ఎగరేసుకుపోతుంది. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ 17 Sep 1866 – 30 Apr 1925 అమెరికను కవయిత్రి . The Award . The dawn’s lovely opal lights the eastern skies, Noon brings a topaz all…
-
అశాంతి… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
ఓ సరంగూ! నన్ను రేవు దాటించు. అవతలి గట్టున పూలు అందంగా కనిపిస్తున్నాయి ఆ గట్టున రాళ్ళుకూడా సూదుగా గరుకుగా కనిపించటం లేదు, అక్కడ పిట్టలుకూడా బాగా పాడతాయని అందరూ అంటున్నారు. ఓ సరంగూ! నన్ను రేవు దాటించవూ. ఓ సరంగూ! నన్ను రేవు దాటించు. ఇక్కడ అన్నీ ఎప్పుడూ ఉండే పాత వెతలే, కాకపోతే, నేను మరికొన్ని సరికొత్తవాటితో సతమతమౌతున్నాను. గాలివాటూ, కెరటాలూ ప్రతికూలంగా ఉంటే ఉండనీ, బాబ్బాబు, ఓ సరంగూ! నన్ను ఎలాగైనా రేవు…
-
అపార్థం… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
పగటికి ప్రేమగా, అపురూపంగా చూసే హృదయ ముందనీ రాత్రి ఏమీపట్టనట్టు, మౌనంగా ఉంటుందని అందరూ అంటారు కానీ, నేను చాలా సార్లు రాత్రి వెళ్లిపోయిన తర్వాత ఆమె కన్నీటి బిందువులు పువ్వులమీదా, గడ్డిమీదా చూశాను. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ 17 Sep 1866 – 30 Apr 1925 అమెరికను కవయిత్రి . Misunderstood . Day has a kindly, loving heart, they say While night is made…
-
రష్యను నర్తకి… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఈ కవితలో lighted wood అన్న పదం మీద ఉపయోగించిన శ్లేష గమనించదగ్గది. ఒకటి చెక్కలతో చేసిన రంగస్థలాన్ని సూచిస్తే, రెండవది చప్పుడులేకుండా చిరుగాలికి లాస్యంచేస్తూ మండుతున్న కట్టె అయి ఉండొచ్చునని నా అభిప్రాయం. మీరు గమనించి ఉంటే, బాగా ఎండిన కట్టెమీది మంట ఒక్కోసారి మండుతున్నంతమేరా కట్టెను తాకీ తాకనట్టు అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అంటే, ఒక నృత్యం కవయిత్రికి అద్భుతమైన మరొక నృత్యాన్ని గుర్తుకు తెచ్చిందన్నమాట. ఎరుపురెక్కల మంట, బాగా వెలుగులున్న…
-
అభిజ్ఞప్రేయసి… ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఓ ప్రకృతీ! నీ ముందు కాళ్ళపై మోకరిల్లే వారిని నువ్వు పతితుడవా? పావనుడవా? అని ప్రశ్నించకు. వా డెవరైనా నిన్ను మనసారా ప్రేమిస్తాడు. అతనికున్న సంగీత, చిత్రకళా నైపుణ్యాలను కోపంలోనూ, ఆనందంలోనూ నువ్వు చిందించే శతసహస్రసౌందర్యావస్థలనీ ఆరాధిస్తాడు. అతను నీ పాదాలచెంతనే మోకరిల్లి ఉండగా అతని స్తోత్రసుగంధాలు రోదసి అంతా వ్యాపిస్తాయి. పాపం, మనశ్శాంతికి ప్రాకులాడే ఈ మానవాత్మని నీ అభిజ్ఞతతో ఎంతకీ సంతృప్తి చెందక నువ్వు విసిగిస్తే, నీమీది మునపటి నమ్మకాల్నీ, విస్వాసాల్నీ విడిచిపెట్టి సులభంగా…
-
ఒంటరి జాబిలి
అసూయ చెందిన ఆమె చెలికాడు మరలిపోయాడు; ఒంటరితనంతో, భయాలతో సతమతమౌతూ చివరకి సముద్రాన్ని ఆశ్రయించింది జాబిలి. ఆ పరాయి గుండెమీద అపురూపమైన తన కన్నీళ్ళని ఒలకబోసుకుంటోంది. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ 17 Sep 1866 – 30 Apr 1925 అమెరికను కవయిత్రి . The Lonely Moon Her envious kin turn from her; sore oppressed With loneliness and fears, She seeks the sea, and…