వర్గం: అనువాదాలు
-
ఒక చలి రాత్రి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నా కిటికీ అద్దం మంచుతో మెరుస్తోంది లోకం అంతా ఈ రాత్రి చలికి వణుకుతోంది చంద్రుడూ, గాలీ రెండంచుల కత్తిలా భరించశక్యంకాకుండా బాధిస్తున్నారు. భగవంతుడా! ఇలాంటపుడు తలదాచుకుందికి కొంపలేనివాళ్లనీ, దేశద్రిమ్మరులనీ రక్షించు. దేముడా! మంచుమేతలు వేసిన వీధుల్లో దీపాల వెలుగుకి తచ్చాడే నిరుపేదలని కరుణించు. మడతమీదమడతవేసిన తెరలతో వెచ్చగా, నా గది ఇప్పుడు వేసవిని తలపిస్తోంది. కానీ ఎక్కడో, గూడులేని అనాధలా నా మనసు చలికి మూలుగుతోంది. . సారా టీజ్డేల్ (August 8, 1884 –…
-
నే నెవర్ని?… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను కవి
నా తల నక్షత్రాలకి తగులుతుంది. నా పాదాలు మహాపర్వతాల శిరసుల్ని తాకుతాయి. నా చేతి కొసలు విశ్వజీవన తీరాల్లో, లోయల్లో తిరుగాడుతాయి ఆదిమ పదార్థాల తొలిశబ్దప్రకంపనల హేలలో చేతులు సారించి గులకరాళ్లవంటి నా విధివ్రాతతో ఆడుకుంటాను. నేను నరకానికి ఎన్నిసార్లు పోయి వచ్చానో! నాకు స్వర్గంగురించి క్షుణ్ణంగా తెలుసు, ఎందుకంటే నేను స్వయంగా దేముడితో మాటాడేను. జుగుప్సాకరమైన రక్తమాంసాదులని చేతులతో కెలికాను. అందం ఎంతగా సమ్మోహపరుస్తుందో కూడా తెలుసు “ప్రవేశం లేదు” అన్న బోర్డు చూసిన ప్రతి మనిషి…
-
దివ్య స్పర్శ… మాయా ఏంజెలో, అమెరికను కవయిత్రి
ధైర్యం అంటే ఏమిటో ఎరుగక సుఖానికి బహిష్కృతులమైన మేము ప్రేమ, పవిత్రమైన తన దేవాలయాలను విడిచిపెట్టి మా చూపుల చాయలకు అందుతూ జీవితంలోకి మళ్ళీ మమ్మల్ని మేల్కొలిపేదాకా ఒంటరితనపు నత్తగుల్లల్లో ముడుచుకు పడుకుంటాము. ప్రేమ వస్తుంది దాని వెనుకే, సుఖపరంపరలూ గతకాలపు ఆనంద చిహ్నాలూ ఏనాటివో, చరిత్ర తుడిచివెయ్యలేని బాధలూ అనుసరిస్తాయి. కానీ, మేము ధైర్యంగా నిలబడగలిగితే మా మనసుల్లోని భయాలని ప్రేమ పటాపంచలు చేస్తుంది. ప్రేమయొక్క ఉద్ధృతమైన కాంతిప్రవాహం అలవాటైన పిరికిదనంనుండి మమ్మల్ని తప్పిస్తుంది. ఇప్పుడు మాకు…
-
సత్యశోధకుడు… ఇ. ఇ. కమింగ్స్, అమెరికను కవి
ఓ సత్య శోధకుడా! ఉన్న ఏ త్రోవనూ అనుసరించి పోవద్దు ప్రతి త్రోవా ఎక్కడికో తీసుకుపోతుంది… సత్యం ఇక్కడ ఉంటే! . ఇ. ఇ. కమింగ్స్ (October 14, 1894 – September 3, 1962) అమెరికను కవి . . Seeker of Truth . seeker of truth follow no path all paths lead where truth is here. . E E Cummings (October 14, 1894 –…
-
ఆనందానుభూతి… రేమండ్ కార్వర్, అమెరికను కవి
అప్పటికింకా పూర్తిగా తెల్లారలేదు. బయట చీకటిగానే ఉంది. కాఫీ కప్పు పట్టుకుని కిటికీ దగ్గరకి వెళ్ళాను సాధారణంగా వేకువనే ముసురుకునే ఆలోచనలతో రోడ్డు మీద నడుచుకుంటూ వార్తాపత్రికలు పంచే కుర్రాడూ వాడి స్నేహితుడూ కనిపించారు. ఇద్దరూ స్వెట్టర్లు వేసుకుని నెత్తిమీద టోపీపెట్టుకున్నారు ఒక కుర్రాడి భుజానికి సంచీ వేలాడుతోంది. వాళ్ళు ఎంత ఆనందంగా కనిపించారంటే ఈ కుర్రాళ్ళసలు ఏమీ మాటాడుకోడం లేదు. వాళ్ళకే గనుక చెయ్యాలనిపిస్తే ఇద్దరూ చెట్టపట్టాలేసుకునే వారు ఇది ప్రశాంత ప్రభాత సమయం. వాళ్ళు…
-
భర్తలకో మాట… ఓగ్డెన్ నాష్, అమెరికను కవి
మీ వైవాహిక జీవితం ప్రేమపాత్రలో నిండుగా అనురాగంతో పొంగిపొరలాలంటే, మీరు తప్పుచేసినప్పుడల్లా, ఒప్పుకోండి, మీది ఒప్పైనప్పుడు, నోరుమూసుకోండి. . ఓగ్డెన్ నాష్ (August 19, 1902 – May 19, 1971) అమెరికను కవి . Ogden Nash . A Word for Husbands . To keep your marriage brimming With love in the loving cup, Whenever you’re wrong, admit it; Whenever you’re right, shut…
-
పుట్టినరోజు కవిత… టెడ్ కూజర్, అమెరికను కవి
. పొద్దు పొడిచిన కాసేపటికి సూర్యుడు రక్తారుణిమమైన తన తల ఎత్తి నల్లని తాటితోపులో నిలుచున్నాడు నురగలు కక్కే తెల్లనికాంతిని అందివ్వడానికి వచ్చేవారికోసం ఎదురుచూస్తూ. తర్వాత రోజు రోజల్లా పచ్చికబయలుమీదే. నేనుకూడా రోజల్లా మేస్తూ గడిపాను చీకటి పడేదాకా తక్కిన వాళ్లతోపాటే అందిన ప్రతి పచ్చ గడ్డిపరకనీ ఆస్వాదించి చివరకి, నేనూ చీకటిలో కలిసిపోతాను నా పేరు ధరించిన ఈ చిరుగంటని మోగిస్తూ. . టెడ్ కూజర్ జననం 1939 అమెరికను కవి …
-
చివరకి… గవిన్ ఏవార్ట్, బ్రిటిష్ కవి
ఎన్నటికీ ముగింపు ఉందదనుకున్న ప్రేమ గడ్డకట్టిన మాంసపు ముక్కలా చల్లారుతోంది. కూరలా వేడి వేడిగా ఉన్న ముద్దులు ఇప్పుడు తొందరలో తీసుకునే చిలక్కొట్టుడులు. విద్యుచ్ఛక్తిని పట్టుకున్న ఈ చేతులు, నాలుగుదిక్కులా లంగరు వేసిన నావలా అచేతనంగా పడి ఉన్నాయి ప్రేమికను కలవడానికి పరిగెత్తిన కాళ్ళు ఇప్పుడు నెమ్మదిగా, ఆలశ్యంగా నడుస్తున్నాయి ఒకప్పుడు మెరుపులా మెరిసి, నిత్యం విచ్చుకున్న కళ్ళే ఇప్పుడు అశక్తతకు బానిసలు. ఎప్పుడూ ఆనందాన్ని వెదజల్లిన శరీరం ఇప్పుడు బిడియంతో, సిగ్గుతో, ఉదాసీనంగా ఉంది కడదాకా…
-
ప్రాణంతో చెలగాటం… రిఛర్డ్ కానెల్, అమెరికను కథా రచయిత
ఈ మాట అక్టోబరు 2019 సంచికలో ప్రచురితం “దూరంగా కుడివైపుకి, ఇక్కడే ఎక్కడో ఒక దీవి ఉండాలి. అదో అంతుపట్టని రహస్యం,” అన్నాడు విట్నీ. “ఏమిటా దీవి?” అడిగేడు రైన్స్ఫర్డ్. “పాత పటాలలో దాని పేరు ఓడముంపు దీవి. తగ్గపేరే పెట్టారు. అందుకేనేమో నావికులకి ఈ ప్రాంతం దగ్గరకి రాగానే హడలు. ఏదో మూఢనమ్మకం…” “నాకేం కనిపించడంలేదే!” అన్నాడు రైన్స్ఫర్డ్ ఆ వేసవి రాత్రి తమ చిన్న ఓడ చుట్టూ తడిదుప్పటిలా బరువుగా కప్పివున్న చీకట్లోకి…
-
Untiring Faith … Ravii Verelly, Telugu, Indian
That the Sky Is my close pal, no doubt; But I amn’t sure If he would Give me way … parting. That the Sun Is my master who taught me To be pragmatic, for sure; But, there is no assurance That he would travel with me Unto the last. Yet, Like the deciduous leaf To…