వర్గం: అనువాదాలు
-
అవిశ్వాసి అని ముద్ర వేయండి!… ఆల్ఫ్రెడ్ గిబ్స్ కాంప్ బెల్, అమెరికను
మీరు నేర్చిన, నమ్మిన సిద్ధాంతాలను వినడానికీ, నమ్మడానికీ ఇష్టపడని వ్యక్తి ఎవరైనా ఎదురైతే అతన్ని విడిచిపెట్టవద్దు, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి! మీరు కట్టిన దైవమందిరాల్లో పూజచెయ్యడానికి నిరాకరించినా, మీ మీ పుణ్యదినాల్లో జరిపే విందులకి హాజరుకాకపోయినా, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి. పాపుల్నీ, పేదల్నీ, బాధితులనీ, చూసినపుడు అతని మనసు కరుణతో పొంగిపొరలవచ్చు గాక, అతన్ని విడిచిపెట్టవద్దు, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి! చిరకాలంనుండీ జరుగుతున్న మంచికీ చెడ్డకీ మధ్య యుద్ధంలో అతను ఎప్పుడూ మంచి పక్షాన్నే నిలబడితే నిలబడుగాక,…
-
నన్ను చావనీయండి, బ్రతిమాలుకుంటా… జార్జ్ మోజెస్ హార్టన్, అమెరికను కవి
నన్ను చావనీయండి, మృత్యువుకి భయపడానికి బదులు, నా కథ ముగిసినందుకు ఆనంద పడనీయండి, నా చివరి ఊపిరి నన్ను విడిచిపోగానే ప్రాభాత వసంత వేళ కూసే కోకిలలా పాడుతూ నిష్క్రమించనీయండి. మృత్యువంటే ఏ భయం లేకుండా పోనివ్వండి, నన్నిక ఏ యమశిక్షలూ భయపెట్టలేవు, నా తలక్రింద విశ్వాసపు దిండుతో, శిధిలమయే శరీరం పట్ల తిరస్కారంతో నన్ను హాయిగా ఆలపిస్తూ వెళ్ళిపోనీయండి. నా శౌర్య పతకాలను ప్రదర్శిస్తూ నన్నొక వీరపుత్రుడిలా మరణించనీయండి; సమాధి అన్న ఆలోచనకే భయపడడమా? ఎన్నటికీ…
-
ప్రాణపాశాల్ని గట్టిగా ముడివెయ్యి, ప్రభూ… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
ప్రభూ, ఈ ప్రాణపాశాల్ని గట్టిగా ముడివెయ్యి నేను నా చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను. ఒకసారి గుఱ్ఱాలసంగతి చూడు… త్వరగా! అది సరిపోతుంది. నన్ను స్థిరంగా ఉండేవైపు కూర్చోబెట్టు అప్పుడు నేను పడిపోతే అవకాశం ఉండదు. మనం ఇప్పుడు కడపటి తీర్పు వినడానికి పోవాలి అది నా అభిమతమూ, నీ అభిమతమూ. నాకు వాలు ఎక్కువున్నా ఫర్వాలేదు సముద్రతీరమైనా ఫర్వా లేదు ఎడతెగని పరుగుపందెంలో చిక్కుకున్నా నా ఇష్టమూ, నీ అభీష్టం కొద్దీ ఇన్నాళ్ళూ బ్రతికిన నా…
-
జీవితమంటే ?… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి

అసలు జీవితమంటే ఏమిటి? నడుస్తున్న ఇసుకగడియారం సూర్యుడికి దూరంగా జరుగుతున్న వేకువ పొగమంచు. క్షణం తీరికలేకుండా కోలాహలంగా పదే పదే వచ్చే కల. దాని గడువు ఎంత? ఒక్క విశ్రాంతి క్షణం, ఆలోచనా లేశం. అదిచ్చే ఆనందం? ప్రవాహంలోని నీటి బుడగ. దాన్ని అందుకుందికి పడే ఆరాటంలో అదీ శూన్యమైపోతుంది. ఆశ అంటే ఏమిటి? హాయినిచ్చే ప్రాభాతపు పిల్లగాలి. దాని హొయలుతో పచ్చికబయళ్ళమీది తెలిమంచు హరిస్తుంది ప్రతిపూలగుత్తినుండీ దాని రత్నాలను త్రెంచి, మాయమౌతుంది. నిరాశల ముళ్ళకొనలను దాచే…
-
ఆనవాలు పట్టడం… రోజర్ మెగోఫ్ , ఇంగ్లీషు కవి
మీరు ఇతను స్టీఫెనే అంటారు. అలా అయితే నేను నిజమో కాదో రూఢి చేసుకోవాలి. నా జాగ్రత్తలో నేనుండడం ఎప్పుడైనా మంచిదే కదా! చూశారా! ఇక్కడే పప్పులో కాలు వేశారు. జుత్తు చూస్తున్నారు గదా, ఇది నల్లగా ఉంది. స్టీఫెన్ జుత్తు తెల్లగా ఉంటుంది… ఏమిటీ? ఏమయిందీ? విస్ఫోటనం జరిగిందా? అలా అయితే నల్లగా మాడిపోతుంది. నా మతి మండినట్టే ఉంది. నా బుర్రకి ముందే తట్టి ఉండాలి. సరే, మిగతావి పరీక్షిద్దాం. ఆ ముఖం, ఆ…
-
రోజులు… వికీ ఫీవర్, ఇంగ్లీషు కవయిత్రి
అవి మనదగ్గరికి కడగని సీసాల్లా ఖాళీగా, మురికిగా వస్తాయి. వాటి అంచులకి ‘నిన్న’ మసకగా పొరలా కమ్మి ఉంటుంది. మనం వాటిని ఉంచుకోలేం. మన బాధ్యత వాటిని నింపి వెనక్కి పంపెయ్యడమే. దానికి కూలి ఏమీ ఉండదు. దానికి ప్రతిఫలం: చేసిన పనే. అంతే! దీన్ని మనం ప్రశ్నిస్తే వాచీల్లా గుండ్రటి ముఖాల్తో వాళ్లు కోపంతో అరుస్తారు. పోనీ అద్దం పగులగొడదామని అనుకుంటే మనల్ని మనమే గాయపరచుకుంటాం. రోజుల్లో ఏమీ మార్పు ఉండదు. అవి పొద్దు పొడుస్తూనే…
-
రానున్న రోజులకో చీటీ… జిమ్ బర్న్స్, ఇంగ్లీషు కవి
నేను ముసలివాడిని అయిపోయేక భయపెట్టే చొక్కాలూ మరీ పొట్టి పంట్లాలూ నాకు తొడగొద్దు. తొడిగి, వేసవిలో పిల్లలాడుకునే చోట్లకు చూస్తూకూచోమని తరమొద్దు. ప్రాణం నిలబెట్టుకుందికి సరిపడినంత తిండిపెట్టి, శీతాకాలమంతా స్థానిక గ్రంథాలయంలో ఏ గదిలోనో కూచుని నిన్నటి పేపరుని ఈరోజు చదవడానికి నా వంతు వచ్చేవరకూ వేచి చూస్తూ గడపమని అనొద్దు. అంతకంటే, నన్ను కాల్చి పారేయండి. అలా చెయ్యడానికి మీకు తోచిన కారణం ఏదో ఒకటి, నా వల్ల తగువులొస్తున్నాయనో నా పనులు నేను చేసుకోలేకపోతున్నాననో,…
-
వసంతంలో పారిస్ నగరం… సారా టీజ్డేల్ , అమెరికను కవయిత్రి
కాసేపు కనిపించీ కాసేపు కనిపించని సూర్యుడి వెలుగులో నగరం ప్రకాశిస్తోంది. పిల్లగాలి హుషారుగా ఈదుకుంటూ పోతోంది. ఒక చిన్న జల్లు కురిసి ఆగిపోయింది. నీటిబొట్లు మాత్రం చూరుకి వేలాడుతూ ఒకటొకటిగా క్రిందకి రాలుతున్నాయి. ఆహ్! ఇది పారిస్, ఇది పారిస్, వసంతం అడుగుపెట్టింది. బోయిస్ పార్కు చిత్రమైన స్పష్టాస్పష్ట కాంతితో మిలమిలా మెరుస్తుండడం నాకు తెలిసినదే. పొడవైన ఛాంప్స్ రాచవీధిలో ఆర్క్ డ ట్రీయోంఫ్ ప్రాచీనతకి చిహ్నంగా నిశ్చలంగా, హుందాగా నిలబడుతుంది. కానీ మహోన్నతంగా పెరిగిన అకేసియా…
-
ప్రాణం అంటే ఏమిటి… కోలరిడ్జ్ , ఇంగ్లీషు కవి
కాంతి గురించి ఒకప్పుడు ఊహించినట్టుగా మనిషి కంటికి అందనంత విస్తారమైనదా ప్రాణం? తనకు ఎదురులేనిదీ, ఏది మూలాధారమో కనుగొనలేనిదీ, మనం ఇప్పుడు చూస్తున్న దాని అన్ని రంగులూ, వాటిలోని అతి చిన్న ఛాయా భేదాలూ, చీకటిని అంచులకు తరుముతూ తరుముతూ ఏర్పడినదేనా? ఆసలు ఈ ప్రాణానికి చైతన్యము హద్దు కాదా? ఈ ఆలోచనలూ, బాధలూ, ఆనందాలూ, ఊపిరులూ ప్రాణానికీ మృత్యువుకీ మధ్య నిత్యం జరిగే కాటా కుస్తీలో భాగమేనా? . సామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ (21 October…
-
లెక్కలు… గవిన్ ఏవార్ట్, ఇంగ్లీషు కవి
నాకు 11 ఏళ్ళు. నిజమే, నాకు నిజంగా రెండో ఎక్కం నోటికి రాదు. మా ఉపాద్యాయులు సిగ్గుచేటు అంటారు. నాకు సమయం దొరికినా, అప్పటికి ఒళ్ళు బాగా అలసిపోతుంది. రోన్ ఐదేళ్లవాడు. సమంతకి 3, కెరోల్ కి ఏడాదిన్నర, అదికాక నెలల బిడ్డ. అవసరమైన పనులన్నీ నేనే చెయ్యాలి. అమ్మ పనికి పోతుంది. నాన్న ఎక్కడో ఉన్నాడు. కనుక నేనే వాళ్ళకి బట్టలు తొడగాలి, ఉదయం ఫలహారం పెట్టాలి. మిసెస్ రసెల్ ఎప్పుడో వస్తుంది, రోన్ ని…