వర్గం: అనువాదాలు
-
మారణహోమం… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
Maple in Autumn శరత్కాలం ఆ లోయని వరదలా కమ్ముకుంది— సీసపు గుళ్ళలా చినుకులు టపటపా రాలుతున్నాయి ఫర్ చెట్లు అటూ ఇటూ బాధతో మూలుగుతూ కదుల్తున్నాయి నేలంతా గాయపడ్డ మేపిల్ చెట్ల రక్తపు మరకలే. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ అమెరికను Carnage . Over the valley swept the Autumn flood— In showers of leaden bullets fell the rain; the firs moved to and…
-
ఎపిక్యూర్… అబ్రహామ్ కౌలీ. ఇంగ్లీషు కవి
మీ పాత్రని ఎర్రని మధువుతో నింపండి తలకట్టున గులాబుల దండ ధరించండి మధువూ, గులాబుల్లా మనం నవ్వుతూ కాసేపు హాయిగా ఆనందంగా గడుపుదాం. గులాబుల కిరీటాన్ని ధరించిన మనం “జహీజ్”(1) రాజమకుటాన్నైనా తలదన్నుదాం ఈ రోజు మనది; మనం దేనికి భయపడాలి? ఈ రోజు మనది; అది మనచేతిలోనే ఉంది. దాన్ని సాదరంగా చూద్దాం. కనీసం మనతోనే ఉండిపోవాలని కోరుకునేలా చేద్దాం. పనులన్నీ కట్టిపెట్టండి, దుఃఖాన్ని తరిమేయండి రే పన్నది సుఖపడడం తెలిసినవాళ్లకే. . అబ్రహామ్ కౌలీ…
-
ప్రేమ ఒక జ్వాల… జార్జి మేరియోన్ మెక్లీలన్, అమెరికను కవి
ప్రేమ అతి పవిత్రంగా జ్వలించే ఒక జ్వాల దాని పాల బడిన వ్యక్తిని తీయని కోరికతో నింపుతుంది. ఒకసారి ప్రేమ వేడి నిట్టూర్పులకు శరీరం ఎరయైతే నాటినుండి ఆ గుండె మరణించేదాకా మండే “మూస”యే ప్రేమే జీవితం అను; అది పొరపాటు కాదను, అది పరమానందానికి పర్యాయపదం అను, నీకు తోచింది ఏదైనా “ఇదీ ప్రేమ” అను ఎన్నిసార్లైనా కానీ, గుండెకి తెలుసు… ప్రేమంటే ఒక వేదన అని. . జార్జి మేరియోన్ మెక్లీలన్ (1860- 1934)…
-
చెయ్యడానికి ఏమీ లేదు… జేమ్స్ ఎఫ్రైమ్ మెగర్ట్, అమెరికను కవి
పొలాలన్నీ పంటతో బరువెక్కి ఉన్నాయి కూలీలు సరిపడినంతమంది లేరు అయినా సోమరిపోతులు అంటున్నారు: “చెయ్యడానికి ఏమీ లే”దని. జైళ్ళు క్రిక్కిరిసి ఉన్నాయి ఆదివారం ప్రార్థనా తరగతులకు హాజరు అంతంతమాత్రం; ఐనా మనం “చెయ్యడానికి ఏమీ లే”దని అంటున్నాం. తాగుబోతులు మరణిస్తూనే ఉన్నారు— వాళ్లు మన పిల్లలే అన్నది నిజం తల్లులు చేతులుకట్టుకు నిలబడి ఉన్నారు “చెయ్యడానికి ఏమీ లేక”. అవిశ్వాసులు మరణిస్తున్నారు. వాళ్ల రక్తం మీ మీద చిందుతోంది. మిరందరూ ఎలా ఉండగలుగుతున్నారు “చెయ్యడానికి ఏమీ లే”దని? …
-
నేను నమ్మకం వీడను… డేనియల్ వెబ్స్టర్ డేవిస్, అమెరికను కవి
ఈ పరీక్షలన్నీ నాకే ఎందుకు వస్తాయో తెలీదు కష్టాలన్నీ గుంపుగా ఒకదానివెనక ఒకటి వస్తాయెందుకో నాకు భగవంతుని లీలలు అర్థం కావు , నా సుఖాలెందుకు చిరకాలముండవో నా ఆశలన్నీ ఎందుకు త్వరలోనే మట్టిపాలవుతాయో అయినా, నేను నమ్మకాన్ని విడవను. ఆశల ఆకాసం మీద ఎప్పుడూ దట్టమైన నీలినీడలే తారాడతాయి ఈ ప్రపంచం నిండా దుఃఖమే నిండి ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ప్రశాంతతతో, అతను చేసిన కమ్మని వాగ్దానాన్నే నమ్ముతాను ఎన్నడూ మాట తప్పని ఆ చెయ్యిని…
-
చావుపుట్టుకలు… జేమ్స్ ఎడ్విన్ కాంప్ బెల్, అమెరికను కవి

మట్టిలోకి ఒక బీజం నాటబడుతుంది గుండెల్నిపిండుతూ అంతరాల్లోంచి ఒకపాట బయటకొస్తుంది ముత్యపుచిప్పలోంచి ఒక ముత్యం బయట పడుతుంది పంజరంనుండి ఒక పక్షి బయటకు ఎగిరిపోతుంది, శరీరంనుండి, ఒక ఆత్మకూడా! విత్తనం మహావృక్షంగా ఎదుగుతుంది విశాలవిశ్వమంతా ఆ పాటని పాడుకుంటుంది కంఠహారంలో ఆ ముత్యం మరింత అందంగా మెరుస్తుంది పక్షి మరింత ఆహ్లాదకరమైన వాతావరణంలోకి ఎగసిపోతుంది మృత్యువు ఒక సగం, జీవితం మరొక సగం, ఆ రెండూ కలిసి పూర్ణత్వాన్ని కలిగిస్తాయి. . జేమ్స్ ఎడ్విన్ కాంప్ బెల్…
-
పిచ్చి ఆశ … అడా ఐజాక్స్ మెన్కెన్, అమెరికను కవయిత్రి
ఓ పిచ్చి, తెలివితక్కువ మనసా! నీ జీవితాశయాలనన్నిటినీ దూరంగా, మసక మసక మొయిలు సింహాసనము మీద పెట్టుకుని, ప్రేక్షకుల చప్పట్లకోసం, తెలిపొద్దు పొగమంచుతో దారాలు పేనుకుంటూ పైకి లాగుతున్నావు కానీ, జాగ్రత్త! ఆ దారి పొడవునా ఎదురయ్యేది ప్రేతవస్త్రాలే; ఎంత ధైర్యవంతుడైనా, వాటిని దాటాలనుకుంటే మాత్రం దారి మధ్యలో మృత్యువునో, హిమపాతాన్నో ఎదుర్కోవడం తధ్యం. ఓ పిచ్చి మనసా! ఏళ్ళు గతించిపోతున్నా నీ పారవశ్యపు దృక్కులు ఇంకా ఆ ఒక్క తారకమీదే. దాని వెచ్చని కాంతి పుంజాలు…
-
మెట్లమీది గడియారం… హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి
ఆ పల్లె వీధికి చివరన కొద్దిదూరంలో ఎప్పటిదో తాతలనాటి భవంతి ఉండేది దాని పాడుబడ్ద ముందు పెరడులో పొడుగాటి పోప్లార్ చెట్లు నీడలు పరుస్తుండేవి చావడి మధ్యలో, తనున్నచోటునుండి పాత గోడగడియారం అందరికీ హెచ్చరిస్తుండేది: “శాశ్వతత్వం… క్షణికం! క్షణికమే… శాశ్వతం!” అని. మెట్లకి సగం ఎత్తులో ఉండేదది గట్టి ఓకుచెట్టు కవచంలోంచి చేతులు చాచి పిలుస్తున్నట్టుండేది తన ఆచ్ఛాదనలోంచి బిక్షువు ఛాతీపై శిలువ విక్షేపించి నిట్టూర్చినట్టు! రుద్ధకంఠంతో దారిపోయేవారందరితో చెప్పేది: “శాశ్వతత్వం… క్షణికం! క్షణికమే… శాశ్వతం!” అని. పగటిపూట…
-
నన్ను స్వతంత్రదేశంలో సమాధిచెయ్యండి… ఫ్రాన్సెస్ ఎలెన్ వాట్కిన్స్ హార్పర్, అమెరికను కవయిత్రి
ఎత్తైన కొండశిఖరం మీదనో, సమతలపు బయలులోనో మీకు ఎక్కడ వీలయితే అక్కడ నన్ను సమాధి చేయండి భూమ్మీద అది ఎంత సామాన్యమైన సమాధి అయినా ఫర్వా లేదు కానీ, మనుషులు బానిసలుగా ఉండే ఏ నేలమీదా సమాధి చెయ్యొద్దు. నా సమాధి చుట్టూ భయం భయంగా నడిచే బానిస అడుగులు వినిపిస్తే నాకు ప్రశాంతత ఉండదు; నా నిశ్శబ్దపు సమాధిమీద అతని నీడ కనిపించినా ఆ చోటు నాకు భయంకరంగా, బాధాకరంగా ఉంటుంది. అమ్మకానికి నిర్దాక్షిణ్యంగా, మందలుగా…
-
నాకు స్వేచ్ఛ వస్తుంది!… ఆల్ఫ్రెడ్ గిబ్స్ కాంప్ బెల్, అమెరికను కవి
నాకు స్వేచ్ఛ వస్తుంది! నేనూ స్వతంత్రుణ్ణి అవుతాను. లోకం నన్ను చూసి నవ్వితే నా కేమిటి లక్ష్యం? దాని నవ్వులూ, ఈసడింపులూ అన్నీ ఒకటే నాకు ఇపుడు, డబ్బున్నదన్న దాని అహంకారాన్ని కాలితో నలిపి పారెస్తా, కిరీటాలూ, వాటిని ధరించే శిరస్సులూ రెంటికీ విలువివ్వను. అబ్బ! మానవాళి ఎలా వాటిని భరించగలుగుతోంది? నాకు స్వేచ్ఛ వస్తుంది! నేనూ స్వతంత్రుణ్ణి అవుతాను. నాకు స్వాతంత్య్రమేమిటని లోకం నవ్వినా, ఇక నేను స్వేచ్ఛాజీవిని. దాని వెకిలినవ్వుల్ని చూసి నవ్వుకుంటా, దాని…