వర్గం: అనువాదాలు
-
నేను పెద్దవుతూంటే… లాంగ్స్టన్ హ్యూజ్
. అది చాలాకాలం కిందటి మాట. ఇప్పుడు ఆ కలని పూర్తిగా మరిచేపోయాను. కాని, అప్పుడు నాకో కల ఉండేది, నా ఎదురుగానే, సూర్యునిలా… తేజోవంతంగా— నా కల. కానీ తర్వాతే ఓ గోడ లేచింది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా లేచింది నాకూ నా కలకీ మధ్య. అది ఆకాశాన్ని అంటేంతగా లేచింది ఆ గోడ. ఇప్పుడంతా నీడ. నేను నల్లబడిపోయాను. నేనిపుడు నీడలో పరున్నాను. ఆ కల వెలుగులు, నా కంటి కెదురుగానూ లేవు, నా…
-
సౌభ్రాతృత్వం… ఆక్టేవియో పాజ్
. నేనొక మానవుడిని… నా ఉనికి క్షణికం… ఈ చీకటి అపారము. నేను తల పైకెత్తి చూస్తాను. నాకు నక్షత్రాలు కనిపిస్తాయి. నాకు తెలియకుండానే ఏదో అవగతమయినట్టనిపిస్తుంది: నేను కూడా ఎవరికో కనిపిస్తున్నాను, ఈ క్షణంలో నన్నెవరో తలుచుకుంటున్నారు. . ఆక్టేవియో పాజ్ (March 31, 1914 – April 19, 1998) మెక్సికను కవి, దౌత్యవేత్త, భారతదేశంలో 1960లలో మెక్సికో రాయబారి, 1990 సంవత్సరం సాహిత్యానికి నోబెలు బహుమతి గ్రహీత. . Brotherhood . I…
-
అజ్ఞాత సమాధి … H.W. లాంగ్ ఫెలో
. ” దేశ సైనిక పటాలం నుండి విడుదలచేయబడిన సిపాయి“ ……………………………………….. అని మాత్రం రాసి ఉంది ఒక సమాధి మీద న్యూపోర్ట్ న్యూస్ సముద్రతీరపు ఉప్పునీటి కెరటాలకి సమీపంలో పేరుగాని, తేదీగాని లేకుండా. ఒక చిన్న పోరాటంలోనో లేక, భీకర సంగ్రామం లోనో తమ దుర్గం మీద జరిగిన ముట్టడిలో శత్రుఫిరంగులు వర్షించిన గుళ్ళు ముందువరుసలోని సాహసికులలోనుండి దూసుకుపోయి నపుడు విధివశాత్తూ తుడిచిపెట్టుకుపోయిన పటాలాలలోని నేలకొరిగిన గూఢచారో, పారావాడో; కడలిపక్కన విస్మృత సమాధిలో విశ్రమిస్తున్న…
-
ఓ ప్రేమా! దయచేసి నాకు నిజం చెప్పు… మికేలేంజెలో
. “ఓ ప్రేమా! దయచేసి నాకు నిజం చెప్పు. నేనూహిస్తున్న సత్య సౌందర్యాన్ని నా కనులతో దర్శిస్తున్నానా? లేక నిజంగా ఈ శిల్పాలలో అంతర్లీనంగా ఆ సౌందర్యం ఉందా? ఎందుకంటే, నేనెటు పరికించినా ఆమె ముఖారవిందమే కనిపిస్తోంది. నీకు తప్పకుండా తెలుస్తుంది… నా ప్రశాంతతని హరించడానికీ… నన్ను దహించివెయ్యడానికీ నువ్వామెను అనుసరించి వస్తావు గనుక… అయినా, నేను తక్కువ బాధనాశించను… అంతకంటే శీతల వహ్నిని కోరుకోను.” . “నిజంగా నువ్వు దర్శిస్తున్న సౌందర్యం ఆమెదే! కాని, చర్మచక్షువులలోనుండి…
-
కవిత్వమూ- ఛందస్సూ … గేథే
. ఒక “గ్రీకు”, మిత్తికని తనకు నచ్చిన ఆకృతికి మలుచుకోనీ. తన హస్తకౌశలం పట్ల మించెడు మోహం పెంచుకుంటే పెంచుకోనీ. కానీ మనకి మాత్రం యూఫ్రటిస్ అమృతధారలను చే పట్టి ప్రవాహంలో చేతులటూ యిటూ అలవోకగా తేలియాడిస్తునప్పుడే అలౌకికానందం. దాహార్తిని శమింపజేసుకున్న నా తప్తహృదయము, దాని రసానుభూతిని అది ఆవిష్కరిస్తుంది. అమలిన కవి హస్తాల్లో ఒదిగిన తరళసలిలాలు నెమ్మదిగా ఘనీభవించడం ప్రారంభిస్తాయి. . గేథే (28 August 1749 – 22 March 1832) ఆధునిక…
-
నే నొక గొర్రెల కాపరిని. … ఫెర్నాండో పెసో
. నే నొక గొర్రెల కాపరిని. ఆలోచనలే నా మందలు, నా ఆలోచనలన్నీ ఇంద్రియానుభూతులే. నేను కళ్ళతో, చెవులతో, చేతులతో, కాళ్ళతో, నాసికతో, నాలుకతో ఆలోచిస్తాను. . ఒక పువ్వు గురించి ఆలోచించడమంటే దాన్ని చూసి ఆహ్రాణించడమే ఒక పండుని ఆశ్వాదించడమంటే, దాని అర్థాన్ని గ్రహించడమే . కనుకనే బాగా వేడిగా ఉన్న రోజున దాన్ని అనుభవించలేక బాధగా ఉన్నప్పుడు గడ్డిమీద నిలువుగా బార్లాజాచుకుని పడుక్కుని వేడీకి మండుతున్న నా కళ్ళు మూసుకుని నా శరీరం విశ్రమిస్తోందన్న…
-
నువ్వు నన్ను ప్రేమించదలుచుకుంటే … ఎలిజెబెత్ బారెట్ బ్రౌనింగ్
. నువ్వు నన్ను ప్రేమించదలుచుకుంటే, నీ ప్రేమకు కారణం ప్రేమే తప్ప మరేదీ కాకూడదు “ఆమె నవ్వుకి ఆమెను ప్రేమిస్తున్నాననీ– ఆమె చూపులకు ప్రేమిస్తున్నాననీ– ఆమె సౌమ్యంగా మాట్లాడే తీరుకనీ, — మా ఇద్దరి ఆలోచనలూ ఆ విషయం లో ఆశ్చర్యం గా ఒక్కలా ఉన్నందుకనీ, ఫలానా రోజు నిజంగా నాకు ఎంతో ఉపశమనాన్నీ సంతృప్తినీ ఇచ్చిందనీ…” చెప్పకు. ప్రియతమా! ఎందుకంటే అలాంటి ప్రవర్తనలు స్వతహాగా మారేవి… నీకోసం మారొచ్చు. అంతే కాదు, అలా కలిగిన…
-
పిల్లలు … ఖలీల్ జీబ్రాన్
. బిడ్డను తన గుండెకు హత్తుకున్న ఒకామె అడిగింది, ‘”పిల్లల గూర్చి చెప్పండి “ అతను ఇలా అన్నాడు: ‘మీ పిల్లలు’— ‘మీ’ పిల్లలు కారు వారు తన కోసం తపించే జీవితం యొక్క కొడుకులూ, కూతుళ్ళూ. . వాళ్ళు మీ ‘లోంచి’ వస్తారు కానీ, మీ ‘వలన’ రారు, వాళ్ళు మీతో ఉన్నప్పటికీ, మీకు చెందరు. వాళ్లకు మీరు మీ ప్రేమనివ్వగలరేమో గాని, మీ ఆలోచనలివ్వలేరు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. వాళ్ళ శరీరాలను మీరు…
-
పంజరంలోని పిట్ట ఎందుకుపాడుతుందో నాకు తెలుసు —మాయా ఏంజెలో
. ఒక స్వేఛ్ఛావిహంగము గాలి మూపున పైకెగురుతూ ప్రవాహ దిశలో గతి మందగించేదాకా తేలియాడి, సూర్యుని స్వర్ణారుణ కిరణాలలో రెక్కలల్లార్చి ఆకసం పై తన హక్కును ప్రకటించ సాహసిస్తుంది… . కాని పంజరం ఇరుకులో ఒయ్యారపు నడలు పోయే పిట్ట పంజరపు మోజులో తన రెక్కలుత్తరించబడడం గాని, తన కాళ్ళు బంధింపబడడం గాని గుర్తించలేదు. అందుకే దాని గొంతుని పాటలాలపించడానికి విప్పుతుంది. పంజరం లోని పిట్ట భయద నిస్వనంతో ఆలపిస్తుంది… తనకి తెలియనివీ, అయినా ఆకాంక్షించే…
-
పుస్తకం … ఎమిలీ డికిన్సన్
. మనల్ని అపూర్వ తీరాలకు తీసుకెళ్ళడానికి పుస్తకాన్ని మించిన నౌక లేదు. పద్యకావ్యాన్ని* పోలిన, మనోవేగంతో దూకుతూ పరుగులిడే జవనాశ్వమూ ఉండదు. ఈ ప్రయాణం సుదీర్ఘమై ఉండొచ్చు అయితేనేం! ఇందులో హింస, పీడన ఉండవు. మానవాత్మను మోసుకుపోయే రధము ఎంత పోడిమి గలది! . * ఇక్కడ పద్యకావ్యం (A Page of Poetry) అన్నమాట కవిత్వం మొత్తానికి పర్యాయపదంగా వాడబడింది తప్ప కవిత్వం లో ఒక్క పద్య విభాగానికి సూచనగా కాదు అని గమనించ మనవి……