వర్గం: అనువాదాలు
-
రెక్కతొడిగిన ఆశ … ఎమిలీ డికిన్సన్
. ఆశ ఒక రెక్కతొడిగిన పిట్ట… అది మనసు చివురులమీద వాలి నిర్విరామంగా రాగం తీస్తూనే ఉంటుంది పదాల్లేని పదం ఏదో. . మలయమారుతంలో అది మరీ కమ్మగా వినిపిస్తుంది తుఫాను ఎంతభీకరంగా ఉన్నా, ఎంతోమందిని నులివెచ్చగా ఉంచగలిగినందుకు ఆ చిన్ని పిట్ట సిగ్గులుపోతుంది . ఆ రాగం అత్యంత శీతల ప్రదేశాల్లో విన్నాను వినూత్న సాగరాలమీద విన్నాను కానీ, ఎంత విషమ పరిస్థితుల్లోనూ నా ‘కిది’ కావాలని అది నన్నెన్నడూ కోరలేదు. . ఎమిలీ…
-
సమాధి మృత్తికలు … జాన్ మెక్రీ, కెనెడియన్ కవి
. సమాధి మృత్తికలపై వరుస మీద వరుస కావిరంగు సుమాలు పూస్తున్నై మా ఉనికి తెలపడానికి; పైన ఆకాశంలో భరతపక్షులు పాడుకుంటూ ఎగురుతున్నాయి క్రింది తుపాకుల గౌరవవందనంలో వినిపించకపోయినా . మేమిపుడు విగతజీవులం. అయితేనేం? మొన్నటివరకూ బ్రతుకు రుచి ఎరిగినవాళ్ళం; సూర్యోదయం చూసేం, అస్తమయసంధ్య కని పరవశించేం; ప్రేమించి, ప్రేమింపబడిన వాళ్లం. ఇప్పుడీ అశ్రాంతవిడుదులలో విశ్రాంతితీసుకుంటున్నాం . శతృవుపై పోరాటాన్ని కొనసాగించండి. మా వాలుతున్నచేతులతో అందిస్తున్న దివిటీలను అందుకోండి; వాటిని నిలబెట్టే పూచీ ఇక మీదే; మాటతప్పేరో, మేము…
-
బతుకు పాట … లాంగ్ ఫెలో
. నాకు చెప్పకు, నీ శోకగీతికలతో, జీవితమొక శూన్యపు కల అని! చైతన్యవంతం కాని ఆత్మ, మృతిచెందినట్టే లెఖ్ఖ. యదార్థానికి, వస్తువులు కనిపించినతీరులో ఉండవు. . జీవితం సత్యం. జీవితం వాస్తవం! గోరీ కాదు దాని గమ్యం మట్టిలోంచి పుట్టినది మట్టిలో కలిసిపోతుందన్నది ఆత్మకు వర్తించదు. . సుఖభోగమో, విషాదమో మన మార్గమూ, విధిలిఖిత చరమావధీ కావు. ప్రతి ఉదయమూ, మనం నిన్నటికంటె ముందు ఉండేలా అడుగెయ్యడమే! . కళ చూస్తే అనంతం… కాలమా! పరిగెడుతోంది, మన…
-
మనిషొక దీవి కాదు … జాన్ డన్
. మనిషి ఒక స్వయం సమృధ్ధమైన దీవి కాదు… ప్రతివాడూ ఒక భూఖండంలో ఖండమే… సంపూర్ణతకి పరిపూర్ణతనిచ్చే అంతర్భాగమే… ఒక మట్టిపెళ్ళ కెరటాలకి కొట్టుకుపోయినా, యూరోపు ఆ మేరకు వెలవెలబోతుంది ఒక మిట్ట తరిగిపోయినరీతి… నీదో, నీ స్నేహితుడిదో, మొఖాసాలో కొంత భూమి కోల్పోయినతీరు… మరణించిన ప్రతి మనిషితోనూ, నాలో కొంత మేరను కోల్పోతున్నాను నేను, ఎందుకంటే నేను మనుషులతో ముడిపడి ఉన్నాను గనుక. అందుకే, గంటలు ఎవరికోసం మ్రోగుతున్నాయో తెలుసుకుందికి కబురంపకు… అవి నీ కోసమే…
-
ఈ క్షణం … లార్డ్ బైరన్
. మావి గుబురులలోనుండి కోయిల పంచమస్వరాలు వినిపించేది ఈ క్షణమే … ప్రేమికుల రహస్యవాగ్దానాలలోని ప్రతి మాటా మధురంగా వినిపించేది ఈ వేళలోనే … సమీపంలోని ప్రతి తెమ్మెరా, ప్రతి అలా ఏకాంతంలో వీనులకు సంగీతపు విందు చేసేదీ ఈ సమయమే… తుహినబిందువులు పువ్వులపై లలిత లలితంగా రాలేదీ, ఆకసాన తారకలు కలిసేదీ, కెరటపుటంచున తొలి నీలి మెరుగు మెరిసేదీ, ముదురాకున కావిరంగు కవిసేదీ ఈ క్షణమే… సాయం సంధ్యననుసరించిన చీకటి, గహన గగనాంతరాన వ్యాపించిన మెత్తని…
-
ఓజిమాండియస్ … షెల్లీ
. నేనొక పురాదేశపుయాత్రికుడిని కలిసేను అతనన్నాడుగదా: “ఎడారిలో నేను శిల్పాకృతిలో రెండు మహోన్నతమైన పాదాలు మొండివి, చూసేను. దగ్గరలోనే ఇసుకలో సగం కప్పబడి చెదిరిన శిరస్సుకూడా కనిపించింది. ఆ ముఖంమీద చిట్లించిన నొసలు, మడిచిన క్రింది పెదవీ, అపహసిస్తున్న అధికార దర్పమూ, నిర్జీవమైన ఆ శిలలో ఎంత సజీవంగా అచ్చుగుద్దినట్టు ప్రతిఫలిస్తున్నాయంటే, ఆ శిల్పి ఎవరో ఆ వెక్కిరించిన చేతినీ, ఆవేశపూరితమైన హృదయాన్నీ బాగా చదివేడని తెలుస్తోంది. అక్కడ పీఠం మీద ఈ మాటలు చెక్కి ఉన్నాయి:…
-
నేను నిన్ను ప్రేమించాను… అలెగ్జాండర్ పుష్కిన్
. నేను నిన్ను ప్రేమించాను. బహుశా ప్రేమిస్తున్నానేమో కూడా ఈ భావన ఇంకా కొంతకాలం కొనసాగుతూనే ఉంటుంది నా ప్రేమ నిన్నిక ఇబ్బంది పెట్టదులే, నీకు ఏ రకమైన బాధా కలిగించదలుచుకోలేదు నిన్ను ప్రేమించాను; అది ఎంత నిరాశావహమైనదో నాకు తెలుసు ఆ అసూయ, బిడియము నిష్ప్రయోజనమైనప్పటికీ నా నిజమైన, సుకుమారమైన ప్రేమకు ఆలంబనలయ్యాయి భగవంతుడు నువ్వు తిరిగి ప్రేమించబడేట్టుగా అనుగ్రహించుగాక! . అలెగ్జాండర్ పుష్కిన్ ప్రముఖ రష్యన్ కవి . I Loved You .…
-
షేక్స్పియర్ … సానెట్ 18
. నిన్నొక గ్రీష్మోదయముతో సరిపోల్తునా? కానీ, నువ్వు దానికంటే మనోహరంగా, మితోష్ణంగా ఉంటావు. మే వడగాడ్పులు కుసుమిస్తున్న లేత మొగ్గల్ని కుదిపేస్తాయి, అయినా, వేసవి నిడివి అనగా అదెంత ? ఒకోసారి దినకరుడు మరీ తీక్ష్ణంగా ప్రకాశిస్తాడు, తరచు అతని స్వర్ణరోచిస్సులు మేఘాఛ్ఛాదనకు గురౌతాయి. అదిగాక, ప్రతి సౌందర్యమూ, తన సౌందర్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు వీడవలసిందే… సంభవతవలననో, ప్రకృతిపరివర్తనవల్లనో… మరి చక్కబడదు. కానీ, నీ వాయని వెచ్చదనం శాశ్వతం. ఇసుమంతైనా వాడని సౌందర్యం నీ సొత్తు. అనశ్వరమైన…