వర్గం: అనువాదాలు
-
మరణం అనివార్యమైతే… క్లాడ్ మెకే, జమైకన్ కవి

మరణం అనివార్యమైనపుడు, మనం పందుల్లా చావొద్దు. వాళ్ళు మనల్ని హేళనచేస్తూ, పిచ్చికుక్కల్లా, ఆకలిగొన్న వేటకుక్కల్లా నాల్గుపక్కలా చుట్టుముట్టి ఏ లజ్జాకరమైన చోటుకో, పందులదొడ్లోకో వెంటతరుమినపుడు, శాపగ్రస్తుల్లా మనం చావొద్దు. మరణం అనివార్యం అయినపుడు, మనం చిందించిన పవిత్రరక్తం వృధాపోనివ్వకుండా, ఉదాత్తంగా మరణిద్దాం; అపుడు, మనం మరణించినా, మనం ఎదిరించిన దుర్మార్గులు తప్పనిసరిగా మనల్ని గౌరవించవలసి వస్తుంది. ఓ నా బంధులారా! మనం మన శతృవుని సమిష్ఠిగా ఎదుర్కోవాలి! సంఖ్యాబలంలో సాటి రాకున్నా ధైర్యంలో వాళ్లకి దీటని చూపించాలి,…
-
కొత్త సంవత్సరం… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి
I WISH ALL MY FRIENDS A VERY HAPPY AND PROSPEROUS NEW YEAR 2020 MAY THIS YEAR USHER IN NEW FRIENDSHIPS, SOOTHE OLD PAINS, FULFILL YOUR DREAMS AND INSPIRE YOU TO ASPIRE FOR MORE. ఇప్పటికే వేలసార్లు చెప్పి, చెప్పకుండా మిగిలినదేముందని నూతన సంవత్సరంలో కొత్తగా కవితలో చెప్పడానికి? కొత్త సంవత్సరాలు వస్తూంటాయి, పాతవి వెళుతూంటాయి, మనం కలగంటామని తెలుసు, అయినా ఎన్నో కలలు కంటాం.…
-
రాత్రి తలెత్తే ప్రశ్నలు… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి
అసలు ఈ ఆకాశం ఎందుకు? నెత్తిమీద ఉరుములు ఎవరు రేపెడతారు? ఆ ఫెళఫెళమనే శబ్దం ఎవరు చేస్తారు? దేవతలు నిద్రలో పక్కమిదనుండి క్రిందకి దొర్లిపోతారా? వాళ్ళ ఆటబొమ్మలన్నిటినీ పగలగొడుతున్నారా? సూర్యుడు ఎందుకు అంత త్వరగా క్రిందకి దిగిపోతాడు? రాత్రిపూట మేఘాలెందుకు ఆకలితో అప్పుడే ఉదయిస్తున్న చంద్రుణ్ణీ, చంద్రుడిచుట్టూ ఉన్న గుడినీ మింగడానికి అన్నట్టుగా నెమ్మదిగా పాకురుతుంటాయి? అందరూ చెప్పుకుంటున్నట్టు చుక్కలమధ్య ఎలుగుబంటి ఉంటుందా? అలాగైతే, అది పచ్చికబయళ్ళ కడ్డంగా కట్టిన దళ్ళు దూకి పాలపుంతని తాగెయ్యదా? రాలిన…
-
బహిష్కృతుడు… క్లాడ్ మెకే, జమైకన్ కవి
మా తాతముత్తాతలు పుట్టిన … చీకటి, అనామకపు ప్రదేశాలకి ఎలాగైనా వెళ్ళాలని తనువులోఇరుక్కున్న నా ఆత్మ ఉవ్విళ్ళూరుతోంది. పెదాలు పేనుతున్న మాటల్ని, ఎప్పుడూ వినకున్నా, అనుభూతిస్తున్నాను. నా మనసు ఎన్నడో మరిచిపోయిన అడవి పాటలు పాడుతోంది. నేను మళ్ళీ ఆ చీకటిలోకి వెళ్ళకపోతే నాకు ప్రశాంతత లేదు, కానీ, ఈ పడమటి దేశాలు నాకో వెల నిర్ణయించాయి, పరిచయంలేని వాళ్ల దేవుళ్ళకు నేను మొక్కినా నాకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందన్న ఆశ లేదు. “నా”దన్నదాన్ని దేన్నో నేను…
-
కాలపరిభ్రమణం… రాబర్ట్ సౌత్ వెల్, ఇంగ్లీషు కవి
Merry Christmas to all my Christian Friends నరికిన చెట్టు కాలక్రమంలో తిరిగి చిగురించగలదు; పూర్తిగా మోడులైపోయిన మొక్కలు పూలు పళ్ళూ కాయవచ్చు; యమబాధ అనుభవించే మనిషికికూడా ఉపశాంతి లభిస్తుంది; బొత్తిగా ఎండిపోయిన నేలసైతం చినుకులుపడి తడిపీల్చుకుంటుంది; మంచి చెడులు దొర్లుతూ వస్తాయి, అదృష్టం యాదృచ్చికంగా మారుతుంది, కష్టాలనుండి సుఖానికీ, మంచిరోజులనుండి గడ్దురోజులకీ. అదృష్టమహాసాగరం ఎప్పుడూ పొర్లిప్రవహించదు అది ఆటులో ఉనప్పుడే మేళ్ళు చేసిపోతుంది; దాని ఆటుపోటులు రెండూ ఒక్కగతిలోనే నడుస్తాయి దాని మగ్గం నాజూకు,…
-
చిత్రమైన కలయికలు- 1… హెరాల్డ్ మన్రో, ఇంగ్లీషు కవి
ఎవరైనా తాము చూస్తుండగా ఒక మట్టి పెల్ల లేచి నాలుగుపక్కలా నడుస్తూ, ఊపిరి తీస్తూ, మాటాడుతూ, ప్రేమిస్తుంటే భయంతో ఎంత గజగజలాడిపోతారు? ఎంత ఆశ్చర్యంతో “నువ్వు కదలగలుగుతున్నావా?” అని ఎగబీల్చుతారు? కనుకనే, మనిషి నడవడం చూస్తున్నప్పుడు ఎప్పుడూ అనుకుంటుంటాను: ఓ ధరిత్రీ! నువ్విది ఎలా సాధించగలిగేవు? నీ శక్తి ఎంతని? నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే,నిర్మొహమాటంగా చెబుతున్నా, నాకు ఇది ఎంతమాత్రం నమ్మబుద్ధి కావటం లేదు. . హెరాల్డ్ మన్రో (14 March 1879 – 16…
-
మన వారసత్వం… జోసెఫ్ ప్లంకెట్, ఐరిష్ కవి
రాజ సంతతికి అనూచానంగా వస్తున్న వారసత్వం: తొలి రాజవీరుల పిల్లలూ, వాళ్ళ పిల్లల పిల్లలూ ఘనకార్యాలు సాధించడం ద్వారానూ, గొప్పవస్తువులు నిర్మించడం ద్వారానూ వాళ్ళ కలలను నిజం చేసారు. పోరాటాలు ఏసిన ఆ చేతులు, పురాతన విషాదాంత నాటకాలలో చిరస్థాయిగా నిలిచిన గుండెకోతలు సూర్యచంద్రులున్నంతకాలం కొనసాగిస్తూనే ఉన్నాయి వాళ్ళ వారసుల తలలు అధికారానికి తలవంచవు. వాళ్ల చేతులు ఇప్పటికీ, వాళ్ళ తాతముత్తాతల అస్థికలను దాచిన ఈ మట్టిని పరిరక్షిస్తూనే ఉన్నాయి. తమ ప్రజల భవిషత్తు కోసం వాళ్ళ…
-
కొడుక్కి ఆశీస్సులతో… థామస్ మెక్డొనా, ఐరిష్ కవి
భగవంతుడు నీకు సందేహించనవసరంలేని బలాన్నీ, స్పష్టంగా దర్శించగల శక్తినీ ఇచ్చుగాక. పోరాటాలెప్పుడూ ఒక లక్ష్యంకోసమే స్వాతంత్య్రంకోసం చేసే పోరాటం సుదీర్ఘం, అది నువ్వు నీ ఆగ్రహం, పోరాటంద్వారా సాధించడమే నా జీవితానికి కొనసాగింపు. కానీ, సెయింట్ సిసీలియా విందురోజున పుట్టిన నీవంటి బుజ్జి పాపాయికి నే నిపుడు నీ వయసుకి తగిన రీతిలో లౌకిక ఆనందాలు కలగాలని ఆలపించాలి. అతి సాధారణమైనవి: నీ బాల్యం, నీ కౌమారం ఏ ఒడిదుడుకులూ లేకుండా ధైర్యంతో అమాయకత్వంతో, సత్యసంధతతో సాగాలని.…
-
ఒక పల్లవి… పెడ్రైక్ పియర్స్, ఐరిష్ కవి
నా తలపున ఒక పల్లవి మెరిసింది మహరాజుకీ, సైనికునికీ నా ప్రేయసికొక పల్లవి రాసాను రాజులకే రాజు, చిరకాలపు మృత్యువుకి. ఓ మిత్తీ! నీ మృత్తికాగృహపు చీకటి నల్లదనపుజిగి పట్టపగటి వెలుతురుకంటే ప్రకాశవంతంగా ఉంది. నీ ఇంటి స్తబ్దత, అనంతమైన నీరవత పావురాల సంగీతంకంటే ఇంపుగా ఉంది. . పెడ్రైక్ పియర్స్ (10 November 1879 – 3 May 1916) ఐరిష్ కవి, గేలిక్ నుండి అనువాదం: జోసెఫ్ కాంప్ బెల్ A Rann .…
-
ప్రతిధ్వని… ఛార్లెట్ బెకర్
నా ప్రియుడు కడసారి వీడ్కోలు చెప్పాడు, దుఃఖమూ కన్నీళ్ళూ లేకుండా బహుశా, మేము ఇద్దరం ఇన్నాళ్ళూ కలిసి తిరిగి గడిపిన ఆనందక్షణాలు గుర్తుచేసుకున్నాడేమో?! కానీ, పెదవిమీద ఆ నిర్లిప్తపు చిన్న చిరునవ్వు— ఎన్ని చెప్పు, ఎన్ని ఏడుపులూ అందులోని విషాదానికి సాటి రావు ఎంతో బాధేసింది! తెరిచిన తలుపులనుండి బయటకి వెళ్ళాడు రెక్క తెగిన పక్షిలా… నెమ్మదిగా … నిరాశగా… నిట్టూరుస్తూ . అతను ఎక్కడికెళ్ళాడో నే చెప్పలేను గానీ తెల్లవారీదాకా అతని నవ్వు నాకు వినిపిస్తూనే ఉంది.…