వర్గం: అనువాదాలు
-
ప్రాచ్య గీతం… ఏలన్ జింజ్బెర్గ్
. నేను నాకు గుర్తుకొస్తున్న ప్రేయసి గురించి చెబుతాను: ఆ చంద్రముఖి ఎంతో విశ్వసనీయురాలు, తెరలమాటున ఉన్నప్పటికీ… ఆమె పలుకకపోయినా, ఆలోచనలలో నిత్యం మెదులుతూనే ఉంటుంది సంరక్షణ బాధ్యతలు ఆమెని నా పట్ల ఉదాసీనురాలిగా చేసినై . సముద్రం అంత గంభీరంగానూ, భూమి అంత గహనంగానూ ఉంటాయని ఎన్నడూ ఊహించలేదు; గాఢనిద్రలో పడి నేను మరో పిల్లవాణ్ణయిపోయా; లేచి చూస్తే, ప్రపంచం అంతా మమతతో కేరింతలుకొడుతోంది. . . ఏలన్ జింజ్బెర్గ్ (June 3, 1926 –…
-
మానసిక క్షోభతో … రాబర్ట్ బర్న్స్
. ఓ పరమాత్మా! నీవెవ్వరో నా కగమ్యగోచరం. కానీ, నీకీ సృష్టిలో జరిగేవన్నీ నీకు తెలుసుననే నమ్ముతున్నాను. . ఈ జీవుడు దీనుడూ, దుఃఖితుడై నీ మ్రోల నిలబడ్డాడు ఈ హృదయాన్ని దొలిచే ఆవేదనలు నీ ఆనతి వినా జరగవని నమ్ముతున్నాడు . అయితే, శర్వశక్తిమయా! నువ్వు కోపంవలననో, నిర్దయతోనో ఇలా చేశావనుకోను. ప్రభూ! అలసిన నా కనుల కన్నీరైనా తుడు లేదా, శాశ్వతంగా మూసుకునేలా వరమివ్వు! . లేదూ, నీ చర్యల వెనుక ఏదో నిగూఢ…
-
భగ్న ప్రేమ … ఎలిజబెత్ సిడాల్
. ఓహ్! భగ్నప్రేమ గురించి చింతించడమెందుకు? ప్రేమ ఎన్నడు నిజం అయింది గనక?! అది అనువును బట్టి నీలం నుండి ఎరుపుకీ, రక్తవర్ణం నుండి నీలానికీ రంగులు మారుస్తుంటుంది. అసలు ప్రేమ పుట్టుకే బాలారిష్టాలతో… కనక అదెన్నడూ నిజం అవమన్నా అవలేదు. . సొగసైన నీ ముఖం మీద ఆ చిరునవ్వెందుకు? వద్దు. మళ్ళీ నిట్టూర్చవలసి వస్తుంది సుమా! చిట్టితల్లీ! ఎంత నిజాయితీగల మాటలు, నిష్కల్మషమైన పెదాలు పలికినా అవి గాలిలో కలిసి హరించిపోవలసిందే… శీతగాలులు కోతపెట్టే వేళ నువ్వు ఒంటరిగా మిగిలిపోవలసిందేనే…
-
కపాల లిఖితం … లార్డ్ బైరన్.
. భయపడకు… నా ఆత్మ లేచిపోయిందని అపోహపడకు. నాలో కపాలాన్ని మాత్రమే చూడు బ్రతికున్న బుర్రల్లోంచి ప్రవహించేవాటిలా నాలో ప్రవహించేదేదీ నిరుత్సాహం కలిగించదు . నీ లాగే నేనూ ఒకప్పుడు జీవించేను, ప్రేమించేను, తాగేను, మరణించి నా ఎముకలను నేలకి అప్పగించేను. నింపుకో… నన్ను నువ్వు బాధించ లేవు; క్రిముల పెదాలు నీ పెదాలకంటే కంపుగొట్టేవి . కులకులలాడే వానపాములని పోషిస్తూ వాటి ఆహారమై మిగిలే కన్న మెరిసే మదిరని మోస్తూ సురాపానపాత్రగా తిరుగాడమే మిన్న .…
-
ఎవరీతడు? … రవీంద్రనాథ్ టాగోర్
. బయలువెడలితి నొంటిగ సమావేశ స్థలికి ఈ నిశీధిని నన్ననుగమించు న ద దెవరు? . దారి విడిచితి తప్పించుకొన, విఫలుండనైతి . ప్రతి పదమునను భూ పరాగముల చెణుకు గర్వి, ప్రతి పదమున అహంకారమునె తొణుకు . స్వామి! నా ప్రతిరూపమె, స్వల్పబుధ్ధి, సిగ్గదన్నదెరుంగడు, చిత్రమేమొ వెనుకె వచ్చెను నీ గృహవాటి వారకు మరలనేరడు, సిగ్గయ్యె మరల మరల . రవీంద్రనాథ్ టాగోర్ . Who is This? . I came out alone…
-
A Babe is Greater Than the World … K. Geetha
——————————————————————————————- నా బ్లాగ్మిత్రులకీ, సందర్శకులకీ వారి కుటుంబ సభ్యులకీ, ఈ మకర సంక్రాంతి 2012 అశ్రాంతమూ ఆనందోత్సాహాలూ, సుఖసంతోషాలూ, సిరిసంపదలూ, ఆయురారోగ్యాలూ సమకూర్చుగాక అని మనసా కోరుకుంటున్నాను. —————————————————————————————— . My babe is greater than any world to me The world shall be on its heels the moment the day breaks But, the day begins in our world with exultations of giggling. As…
-
జీవన సంధ్య … డొరతీ పార్కర్
. వయసు పైబడి, సౌకర్యాలమరి కోరికలకి భరతవాక్యం పాడి, కేవలం జ్ఞాపకాలే శయ్యావిభాగినులై ప్రశాంతతతో నే చలికాగుతున్నప్పుడు చలువచేసిన నా టోపీ క్రింద శిరోజాలనందమైన పాయలుగ అలంకరించుకుని బలహీనమూ, శీతలమూ ఐన నా చేతులు నా ఒడిలో వేసుకుని నెమ్మదిగా కూర్చుంటాను. పూలూ, లతలూ అల్లి, లేసులువేసిన నా గౌను మెడదాకా తొడిగి లోకానికి తెరదించి, ఒక ఉల్లాసమైన కూనిరాగాన్నందుకుంటాను. కారే కన్నీరు తీరు మరచి, తూగుతూ, ఊగుతూ, నా టీ కలుపుకుంటాను.…
-
రూపాంతరాలు … థామస్ హార్డీ
. ‘యూ’ చెట్టు లోని ఈ భాగం మా తాతగారికి తెలుసు, దాని మొదలులో కనిపించకుండా దాగున్న ఈ కొమ్మ బహుశా అతని భార్య అయి ఉండవచ్చు… జీవం తొణికిసలాడే మానవ జీవితం ఇపుడు లేజివురుగా రూపాంతరం చెందింది . ఈ పచ్చికలు, గత శతాబ్దంలో ప్రశాంతత కోసం నిరంతరం ప్రార్థనలు చేసిన ఆమె కావచ్చు; నేను చాలా సార్లు పరిచయం చేసుకోవాలని ఉబలాటపడ్డ ఆ అందమైన పిల్ల బహుశా ఈ గులాబీలో ప్రవేశిస్తోందేమో! . కనుక,…
-
వెఱపు ఛాయలు … HW లాంగ్ ఫెలో
. నాలో నే ననుకున్నా, “రేపు నాకేదైనా జరిగితే నా పిల్లల గతి ఏమిటి? సాయం, ప్రోత్సాహం కోసం ఇపుడు నా దిక్కు చూస్తున్న వీళ్ళ భవిష్యత్తు ఏం గాను? ఒక మహాగ్రంథం లాంటి వీళ్ల జీవితాలలో కేవలం తొలి అధ్యాయాలు మాత్రమే చదివేను, ఇంకెంత సౌందర్యమూ, విషాదమూ భవిష్యత్తులో మిగిలిఉన్నాయో చూడలేను కద!” మళ్ళీ నన్ను నేనే సముదాయించుకున్నా: “ఈ ప్రపంచము ఈనాటిదా! ఎన్ని తరాలు గతించేయి; సూర్యుణ్ణనుగమించే నీడల్లా ఇంకెన్ని తరాలు గతించనున్నాయి; బహుశా ఈ…
-
ప్రజాస్వామ్యం … లాంగ్స్టన్ హ్యూజ్
. భయం వలనా, రాజీ పడడం వలనా ప్రజాస్వామ్యం ఇవాళా, ఈ ఏడాదీ రాకపోవడమే కాదు, ఎప్పటికీ రాదు. నా రెండు కాళ్ళ మీదా నిలబడడానికీ ఈ నేలని స్వంతంచేసుకుందికీ అవతలి వ్యక్తికి ఎంతహక్కుందో నాకు కూడా అంత హక్కే ఉంది. అన్ని విషయాలనీ ‘కాలమే నిర్ణయించనీ’ అనే వ్యక్తులను విని విని నాకు విసుగెత్తిపోయింది. రేపు అన్నది మరో రోజు. నేను పోయిన తర్వాత నాకు స్వాతంత్ర్యంతో పనిలేదు. నేను రేపటి రొట్టెతిని ఇవాళ బతకలేను.…