వర్గం: అనువాదాలు
-
గూటికి… తావో చియాన్, చీనీ కవి
అవినీతి బలిసిపోయిన ప్రభుత్వంలో ఇమడలేక, ఉన్నతోద్యోగానికి వయసులోనే రాజీనామాచేసి, జీవితావసరాలని సంక్షిప్తంచేసుకుని జీవించగలిగితే, ప్రకృతిలో మనిషికి చాలినంత ఉంటుందనీ, కీర్తిప్రతిష్టల లాలసలేనపుడు ప్రకృతితో మమేకమై జివించడానికి మించిన “జీవితం” లేదనీ తన గ్రామానికి తిరిగి వెళ్ళి, పోతనలా హాలికుడై, ప్రకృతికీ, సాహిత్యానికీ ఉన్న దగ్గర సంబంధాన్ని తన జీవితంద్వారా ఋజువుచేసిన కవి తావో చియాన్. ఈ దిగువనిచ్చిన లింకులోనూ, వికీపీడియాలోనూ ఈ కవిగురించి మంచి సమాచారాన్ని చదవొచ్చు. . ఏప్పటినుండో నాకు అనిపిస్తుండేది ఈ కొండలూ, సరస్సులూ…
-
సాంధ్యదృశ్యం, తొలగుతున్న మంచుతెరలు… చియా తావో, చీనీ కవి
చేతికర్ర ఊతంగా, మంచుతెరలు తొలగడం గమనిస్తున్నాను వేనవేల మబ్బులూ, సెలయేళ్ళూ పోకపెట్టినట్టున్నాయి. కట్టెలుకొట్టేవాళ్ళు తమ కుటీరాలకి చేరుకుంటున్నారు, త్వరలో, వాడైన కొండశిఖరాల్లో వేడిమిలేని సూరీడు అస్తమించనున్నాడు. కొండ చరియల గడ్డివరుసల్లో కారుచిచ్చు రగులుకుంటోంది రాళ్ళమీదా, చెట్లచిగురుల్లోనూ పొగమంచు కొద్దికొద్దిగా పేరుకుంటోంది. కొండమీది ఆశ్రమానికి దారిదీసే త్రోవలో నడుస్తుండగానే సంధ్యచీకట్లు ఆ రోజుకి గంటకొట్టడం కనిపించింది. . చియా తావో (779 – 843) చీనీ కవి . . Evening Landscape, Clearing Snow . Walking…
-
సాంధ్యమేఘం… జాన్ విల్సన్, స్కాటిష్ కవి
అస్తమిస్తున్న సూర్యుడి సమీపంలో ఒక మేఘం వ్రేలాడుతోంది మంచుతో పెనవేసుకున్నట్టున్న దాని అంచు పసిడిలా మెరుస్తోంది, దిగువన స్ఫటికంలా మెరుస్తున్న నిశ్చల తటాకంలో నెమ్మదైన దాని నడకని అలా గమనిస్తూ ఎంతసేపు గడిపానో! దాని హృదయం ప్రశాంతతతో నిండే ఉంటుంది, అందుకే అంత నెమ్మది! అసలు దాని నడకలోనే ఎంత ఠీవి ఉందని. ఆ సాయంత్రం వీచిన ప్రతి చిన్న గాలి రివటా ఆ విహాయస విహారిని పడమటికి తేలుస్తూనే ఉంది. శరీరబంధాన్ని త్రెంచుకున్న ఆత్మలా, బ్రహ్మానందాన్ని…
-
మరణశయ్య… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి
రాత్రంతా ఆమె ఊపిరితియ్యడాన్ని గమనిస్తూ గడిపాం, పోల్చుకోలేనంత నెమ్మదిగా ఆమె ఊపిరి తీస్తూనే ఉంది ఆమెగుండెలో కొట్టుకుంటున్నట్టే ప్రాణం అటూ ఇటూ కొట్టుమిట్టాడుతోంది. మేం ఎంత నెమ్మదిగా మాటాడుకున్నామంటే ఎంత నెమ్మదిగా ఆమె చుట్టూ కదలాడేమంటే ఆమెకి ఊపిసితీయగలశక్తి నివ్వడానికి మా శక్తులన్నీ ధారపోస్తున్నామేమో అనిపించేంతగా. మా ఆశలు మా భయాల్ని వమ్ము చేశాయి మా భయాలు మా ఆశల్ని వమ్ము చేశాయి; ఆమె పడుకున్నప్పుడు చనిపోయిందనుకున్నాం, చనిపోయినపుడు పడుకుందనుకున్నాం. ఎందుకంటే, చిన్న చినుకులతో, చలితో, మసకమసకగా,…
-
విషాద గీతిక… ఫెలీషియా హెమన్స్, ఇంగ్లీషు కవయిత్రి
ఫెలీషియా హెమన్స్ పేరు వినగానే గుర్తొచ్చేది ఒకప్పుడు పాఠ్యభాగంగా ఉండే ఆమె కవిత Casabianca… The Boy who stood on the burning deck. కన్యాశుల్కం చదివిన వారికి గుర్తు ఉండొచ్చు: వెంకటేశం తల్లి వెంకమ్మ “మా అబ్బాయీ మీరూ ఒక పర్యాయం యింగిలీషు మాటాడండి బాబూ!” అని బతిమాలినపుడు – గిరీశానికీ- వెంకటేశానికీ మధ్య జరిగిన సంభాషణలో ఇద్దరూ ఇష్టం వచ్చిన ఇంగ్లీషుముక్కలు మాటాడతారు. అందులో గిరీశం పై మాటలు … Casabianca పద్యానికి…
-
దిగువన… కార్ల్ శాండ్ బర్గ్, అమెరికను
Today is Carl Sandburg’s Birthday. మీ అధికార కెరటాల దిగువన ఉన్నత శాసనయంత్రాంగపు పునాది స్తంభాలను నిత్యం తాకుతూ వ్యతిరేకదిశలో ప్రవహించే తరంగాన్ని నేను నేను నిద్రపోను నెమ్మదిగా అన్నిటినీ సంగ్రహిస్తాను అందనంతలోతుల్లో మీరు భద్రంగా దాచుకున్న వస్తువులకు తుప్పునూ, తెగులునూ కలుగజేసేది నేనే మీ కంటే మిమ్మల్ని కన్నందుకు గర్వపడే వారికంటే పురాతనమైన శాసనాన్ని నేను మీరు “ఔ”నన్నా “కా”దన్నా ఎప్పటికీ నే వినిపించుకోను. నేను అన్నిటినీ కూలదోసే రేపుని. . కార్ల్…
-
గ్రంథాలయం… రాబర్ట్ సదే, ఇంగ్లీషు కవి

నేను మృతుల్లో ఒకడిగా ఉండే రోజులు గతించాయి ఇప్పుడు నే నెటుచూసినా నా దృష్టి యాదృచ్చికంగా దేనిమీద పడినా నా కంటికి గతంలోని మేథావులు కనిపిస్తున్నారు. ఎన్నడూ నన్ను తిరస్కరించని స్నేహితులు వాళ్ళు ప్రతిరోజూ నేను సంభాషించేది వాళ్లతోనే. నా ఆనందం వాళ్లతో పంచుకోవడం ఇష్టం, నా బాధలకి ఉపశాంతి కోరేదీ వాళ్ళ దగ్గరే; నేను వాళ్లకి ఎంత ఋణపడి ఉన్నానో నాకు అర్థమై, అనుభూతి చెందుతున్న కొద్దీ కృతజ్ఞతా భావంతో నిండిన కన్నీళ్ళతో నా చెంపలు…
-
తెంచుకున్న స్నేహం… ST కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి
పాపం! వాళ్ళు చిన్నప్పటినుండీ స్నేహితులు, కానీ, పుకార్లు పుట్టించే నాలుకలు సత్యాన్ని విషపూరితం చేస్తాయి: స్వర్గంలో తప్ప భూమ్మీద శాశ్వతత్వం దేనికీ లేదు. జీవితం కంటకప్రాయం; యవ్వనం నిరుపయోగం; మనం ప్రేమించిన వాళ్లమీద రగులుతున్న కోపం పిచ్చెత్తించేలా, బుర్రలో పనిచేస్తూనే ఉంటుంది. రోలండ్ కీ సర్ లియొలైన్ కీ, ఇది నా ఊహ, అది తీరే ఒక సందర్భం తటస్థించింది. ఇద్దరూ తమ ఆరోప్రాణంలా ఉండే రెండో వారిని చెప్పరాని అవమానకరమైన దూషణలు చేసుకున్నారు. ఇద్దరూ మరెన్నడూ…
-
మనోకామన… అబ్రహామ్ కౌలీ, ఇంగ్లీషు కవి

ప్రభూ! నాకీ వరాన్నొక్కటీ ప్రసాదించు! నా సంపద పరులు ఈర్ష్యపడనంత చిన్నదిగా, చీదరించుకోనంత ఎక్కువగా ఉండేట్టు చూడు. నేను సాధించబోయే ఏ గొప్పపనులవల్లనో కాకుండా, కేవలం నా మంచితనంవల్ల నాకు కాసింత గౌరవం దక్కాలి. చెడ్డపేరుకంటే ఏ గుర్తింపూ లేకపోవడం మెరుగు పుకార్లు మరణానికి దారిచూపిస్తాయి. నాకు మనుషుల పరిచయాలు ప్రసాదించు, అది కేవలం సంఖ్య మీద ఆధారపడకుండా, నా స్నేహితులను నే నెంచుకునేట్టుగా ఉండాలి. నా వ్యాపారం కాకుండా, పుస్తకాలు రాత్రి కొవ్వొత్తిని వెలిగించాలి అలాగే,…
-
సంతృప్తి… రాబర్ట్ గ్రీన్, ఇంగ్లీషు కవి
సంతృప్తిని ప్రతిఫలించే ఏ ఆలోచనైనా అందంగా ఉంటుంది! ప్రశాంతంగా ఉండగలిగే మనసు మహరాజుకన్నా సంపన్నమైనది! ఏ వంతలూ లేకుండా నిద్రపోగలిగే రాత్రులే దివ్యమైన రాత్రులు! పేదరికం కోపంగా నుదుట ముడివేసి చూసే భాగ్యాన్ని ధిక్కరిస్తుంది అటువంటి సంతృప్తి, అటువంటి మనసు, అటువంటి నిద్ర, పరమసౌఖ్యం యాచకులకి తప్ప యువరాజులకి సైతం తరచు దొరికేది కాదు. ఎల్లప్పుడూ ప్రశాంతతనిండిన విశ్రాంతి నివ్వగలిగిన ఇల్లూ, అటు గర్వాన్నీ, ఇటూ ఆందోళననీ కలిగించని కుటీరమూ, తన పరిసరాలకి తగినట్టుగా జీవించడానికి సరిపోయే…