వర్గం: అనువాదాలు
-
గొల్లపదం … జాన్ బన్యన్
[జాన్ బన్యన్ ఒక అతిపేద కుటుంబం నుండి వచ్చి (అతని తండ్రి పాత్రలకు మాట్లు వేస్తూ బతికేవాడట. తనుకూడ అదేవృత్తికొంతకాలం కొనసాగించేడు). అతని సవతితల్లి పోరు భరించలేక 16వ ఏట ఇల్లు వదలి వెళ్ళిపోయి అన్ని రకాల చెడు అలవాట్లకు బానిసై, తన జీవితాన్ని చేజేతులా పాడుచేసుకున్నా, తను పెళ్ళిచేసుకున్న ఒక అనాధ స్త్రీ తండ్రి ఆమెకు వారసత్వంగా ఇచ్చిన రెండే రెండు పుస్తకాలు Plain Man’s Pathway to Heaven by Arthur Dent; Practice…
-
మిడత – కీచురాయి … జాన్ కీట్స్
వర్డ్స్ వర్త్ అతన్ని తీసిపారేసినా, అతని Endymionకి వచ్చిన కువిమర్శకి తట్టుకోలేక Here lies one whose name is writ in water అన్న మాటలు పేరులేని తన స్మృతిఫలకం మీద రాయమని చెప్పినా, తర్వాతితరం కవులు, ముఖ్యంగా లే హంట్ (Leigh Hunt), మాత్యూ ఆర్నాల్డ్ (Mathew Arnold) వంటి వాళ్ళు అతని కవిత్వ ప్రతిభ గుర్తించడమే గాక, రెండు దశాబ్దాలు తిరగకముందే, రొమాంటిక్ మూవ్ మెంట్ కి ఆద్యులుగా పేరువహించిన వర్డ్స్ వర్త్,…
-
శాశ్వతనిద్రలోకి నెమ్మదిగా జారుకోవద్దు … డిలన్ థామస్
[డిలన్ థామస్ పై గ్రామర్ స్కూల్ టీచర్ గా పనిచేసిన అతని తండ్రి ప్రభావం చాలా ఉంది. భాషపట్లా, సాహిత్యం పట్లా అతనికి అబ్బిన అభిమానం అతనిదగ్గరనుండి వచ్చినదే. 1945 లో మృత్యుముఖంలో ఉన్న తండ్రిని ఉద్దేశించి ఈ కవిత రాసినట్టు అతని స్నేహితురాలికి రాసిన ఉత్తరం ద్వారా తెలుస్తున్నా, దీన్ని అతని మరణానంతరం (16 Dec 1952) గాని ప్రచురించలేదు. ఇది చాలా గొప్ప ప్రేరణనిచ్చే కవిత. మనిషి ఎటువంటి జీవితాన్ని గడిపినా, మృత్యువు విషయం…
-
కిటికీ పక్క గొంతుకలు … సర్ ఫిలిప్ సిడ్నీ
(కవిత్వమన్నా, స్నేహానికిప్రాణంపెట్టడమన్నా, ఉత్తమమైనశీలాన్ని అలవరచుకోవడమన్నా, చనిపోతున్నపుడుకూడా మానవీయవిలువలకి జీవితాన్నిఅంకితంచేసి ఉదాత్తంగా వ్యవహరించడమన్నా, సర్ ఫిలిప్ సిడ్నీ నుండి ఈ కాలపు కవులు నేర్చుకోవగలిగినది చాలా ఉంది. ఇంగ్లీషు కవీ, రాజసేవకుడూ, సైనికుడూ అయిన సర్ ఫిలిప్ సిడ్నీది ఉదాత్తమైన వ్యక్తిత్వం. అతని అపురూపమైన వ్యక్తిత్వానికి చిహ్నంగా ఒక కథ బహుళ ప్రచారం లో ఉంది. తన స్నేహితుడికోసం యుధ్ధానికి వెళ్ళిన సిడ్నీ, గాయపడి పడిపోయి, దాహ దాహం అంటుంటే, ఎవరో తాగడానికి నీళ్ళు తీసుకు వచ్చి అతనికి…
-
మౌన ప్రేమికుడు … సర్ వాల్టర్ రాలీ (1552–1618)
. ఓ నా హృదయ రాణీ! నీ ప్రేమను అర్థించపోయినంత మాత్రంచేత గాయపడలేదనుకుని అచ్చమైన ప్రేమలోని మౌనాన్ని తప్పుగా అర్థంచేసుకోకు…. . ప్రేమలో మౌనం, మాటలు చెప్పగలిగినదానికంటే ఎక్కువ బాధని వ్యక్తపరుస్తుంది. నీకు తెలుసుకదా, ముష్టివాడు మూగవాడుకూడ అయితే వాడిమీద మరింత జాలి చూపించాలని. . నా మనోహరీ! నా నిజమైన ప్రేమని, చెప్పలేకున్నా, తప్పుగా అర్థం చేసుకోకు; ఎవడు తనగాయాన్ని దాచుకుని, కనికరంకోసం ప్రాకులాడడో, వాడే ఎక్కువ బాధ అనుభవిస్తాడు. . సర్ వాల్టర్ రాలీ…
-
Television … రోవాల్ డాల్
(ఈ కవిత టెలివిజను పిల్లలమీద ఎంత దుష్ప్రభావాలు చూపుతుందో వ్రాసింది. ఇది ప్రపంచ ఆంగ్లసాహిత్యంలో One Website ఎంపికచేసిన 500 ఉత్తమమైన కవితల్లో చాలా కాలం నుండి 15వస్థానంలోపునే ఉంది.) . పిల్లలకు సంబంధించినంతవరకు మనం నేర్చుకున్న అతిముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్ళని TV దరిదాపుల్లోకి ఎన్నడూ, ఎన్నడూ రానియ్యకూడదని… అంతకంటే మంచిది… వీలయితే ఇంట్లో ఆ బుధ్ధితక్కువ దాన్ని కొనిపెట్టకపోవడం. సుమారు ప్రతి ఇంట్లో పిల్లలు నోరువెళ్ళబెట్టుకుని TV చూడ్డం గమనిస్తూనే ఉన్నాం. వాళ్ళు అక్కడే…
-
బంగారు పిచ్చుకలు … జాన్ కీట్స్
. ఒక్కోసారి క్రిందకి వాలి ఉన్న కొమ్మలమీదనుండి బంగారు పిచ్చుకలు ఒకటొకటిగా వచ్చి వాల్తాయి; ఒక్క క్షణం ఆగి, రెండుచుక్కలు నీళ్ళు తాగి, కిచకిచమంటూ తమ నిగారింపుఈకలని ఒకసారి ముక్కులతో దువ్వుకుని, తుంటరి పిల్లల్లా మూకుమ్మడిగా ఎక్కడికో ఎగిరిపోతాయి; లేదా, ఆగి ఆగి రెక్కలల్లార్చుకుంటాయి, తమ నల్లని, బంగారు రంగుల రెక్కలు చూపించడానికో యేమో అన్నట్లు. . నేనే గనుక అటువంటి చోట ఉంటే, నేలమీద విరిసిన అడవిపూలమీద తేలియాడే అందమైన అమ్మాయి పరికిణీ మెత్తని రెపరెపల…
-
బహుమతి … ఫరూవే ఫరుక్జాద్, పెర్షియన్ కవయిత్రి
నేను నిగాఢ నిశిలోంచి మాటాడుతున్నాను… కాలబిలం లాంటి చిమ్మ చీకటి లోంచి … అనంతాంధకారపు అంతరాలలోంచి మాటాడుతున్నాను… . మిత్రమా! నువ్వు మా ఇంటికి వస్తే, చూడడానికి వీలుగా ఒక దీపాన్నీ, కిటికీనీ వెంట తీసుకు రా! వీధిలో ఆనందంతో ఆడుకుంటున్న జనాల్ని చూడాలి. . Image Courtesy: http://upload.wikimedia.org ఫరూవే ఫరుక్జాద్, పెర్షియన్ కవయిత్రి 20వ శతాబ్దపు ఇరానియన్ కవయిత్రులలో అతిప్రతిభావంతమైన, శక్తివంతమైన గొంతుకలలో ఫరూవే ఫరక్జాద్ ఒకరు. విడాకులు తీసుకున్న స్త్రీగా, ఛాందస భావాలను…
-
గుడ్డివాళ్ళ లోకం… సి. ఎస్. లూయిస్.
(ఈ కవితలో ఒక మహత్తర సందేశం ఉంది. అజ్ఞానులముందు వాళ్లకు ఎంతమాత్రం తెలియని విషయాల గురించి ప్రస్తావించినా, తమకు తెలుసినట్లు ప్రవర్తించడమేగాక, వాటి గురించి అసందర్భంగానైనా, అనర్గళంగా మాట్లాడగలరు… అని చెప్పడమే దీని తాత్పర్యం. ఇది యుధ్ధానికి వ్యతిరేకంగా అతని అభిప్రాయంగా కొందరు పరిగణిస్తారు.) . సాంద్ర సూర్యకిరణాలు వాళ్ళని ముంచెత్తాయి… అ గుడ్డివాళ్ళ లోకం లో ఉన్న అందరినీ… పాపం! అంధ ద్విపాదులు వాళ్ళకు తెలీదు వాళ్ళ వైకల్యం ఏమిటో. తెలుస్తూనే ఉంది, ఏనాటిదో, ఈ…
-
కెరటాలం మేం కెరటాలం … ఆగస్ట్ స్ట్రిన్ బర్గ్
(స్వేచ్ఛానువాదం.) . కెరటాలం మేం కెరటాలం, అనంతసాగర కెరటాలం, ఎంతగాలినైనా మా ఒడిఊయల డోలలూపి విశ్రాంతి గూర్చెదము. . తడిగా, తడి తడిగా ఉన్నా ఉప్పగ ఉన్నా నిప్పులాగ ఎగరగలం నింగికి, ఉన్నమాట చెప్పాలంటే, మేం మంటలమే… తడి మంటలమే . కీలలాగ పైకెగసి, నివురులాగ లో గునిసి, అడ్డమొస్తే అన్నిటినీ తుడిచి, లేనిచోట గుట్టలుగా పోసే, ఉప్పునీరుగా కనిపించే ప్రాణుల, ఉమ్మనీటి తొలి కోశాలము మేము . కెరటాలం మేం కెరటాలం, అనంతసాగర కెరటాలం,…