వర్గం: అనువాదాలు
-
ఔష్విజ్ … లేయాన్ ఫెలిపె స్పానిష్ కవి.
. ప్రపంచంలోని యూదులందరికీ… నా స్నేహితులారా (నా తోబుట్టువులారా), నరకాన్ని వర్ణించిన కవులు దాంతే, బ్లేక్, రింబో లని నెమ్మదిగా మాటాడనీండి… మౌనంగా ఉండనీండి! ఇవాళ, ఈ భూమ్మీద నివసిస్తున్న వాడెవడికైనా, నరకం అంటే ఏమిటో వాళ్ళముగ్గురి కంటే ఎక్కువ తెలుసు. దాంతే ఒక భగవద్దత్తమైన ప్రతిభకల వాయులీన విద్వాంసుడని నాకు తెలుసు. ఓహ్! అతనొక గొప్ప కళాప్రపూర్ణుడు. . కానీ, ఇప్పుడు తల్లి దండ్రులనుండి దూరం చెయ్యబడి అక్కడ ఔష్విజ్ శ్మశానవాటికలో ఒక్కడూ, ఒంటరిగా నిలబడి,…
-
ఆవేదన … ఆస్కార్ వైల్డ్
. విశాలమైన బంగారపు పాతరలు సంపాదించి తుఫానుల వలన భయం గాని అడవిలో చెట్లు కూలుతున్న చింతగానీ లేని ఎవరికైనా జీవితం సాఫీగా సాగితే సాగనీ . ఆకలితో అలమటించిన రోజుల వేదనగాని బాధలూ కన్నీళ్లతో తలపండిన తండ్రిగాని ఏకాంతంలో దుఃఖాశృవులు రాల్చే తల్లిగాని ఎరుగక ఎవరికైనా జీవితం సాఫీగా సాగితే సాగనీ. . కానీ, అలయించే కష్టాల,పోరాటాల బాటలో కాళ్ళరిగినా, ఎంత జీవనవిషాదంలోనైనా దేవునికి చేరువగా నిచ్చెనలు వేసేవారికి మాత్రం జీవితం సాఫీగా సాగిపోవాలి . ఆస్కార్…
-
నష్టపరిహారం … సారా టీజ్డేల్
. శీతకాలపు రాత్రి క్షణికమైనాసరే, మనోజ్ఞంగా, వెలుగుతూ రాలిపోయే ఉల్కలా గుండెలోనే కొట్టుకులాడే, సుమధురమైన గీతం ఒక్కటి రాయగలిగితే చాలా సంతోషిస్తాను… బాధామయమైన జీవితం లో మార్పులేకపోయినా మనసు అలసినా, దేహం ఆర్తితో తపించినా విరిగినరెక్కలతోనే గంటలతరబడి ఎగరవలసివచ్చినా ఒంటరిగా మిగిలిపోయినా! . Compensation . I should be glad of loneliness And hours that go on broken wings, A thirsty body, a tired heart And the unchanging…
-
నేనొక తలెత్తుకుని జీవించగల ఏకాకిని … హెన్రీ డేవిడ్ థొరో.
. నేను తలెత్తుకుని బ్రతకగల ఏకాకిగా సృష్టించబడ్డాను. నాలో దమ్ముంది. నా దృష్టి నిర్మలంగానే ఉంటుంది; నా జీవితం ఎన్నడూ నిరుత్సాహంగా ఉండదు. కేంద్రానికి అన్నిబిందువులూ దగ్గరే. (భగవంతునికి అందరూ సమదూరమే). ఈ క్షణానికి నేనే రాజుని. కాలమా! నువ్వు నాకు ప్రతికూలించదలుచుకున్నా, అనుకోని ఆఘాతాలు కలిగించదలుచుకున్నా ఫర్వాలేదు. జీవిత సారాన్ని తీసుకో. కానీ, హృదయం మాత్రం నాకు విడిచిపెట్టు. . హెన్రీ డేవిడ్ థొరో (జులై 12, 1817 – మే 6, 1862) [19వ శతాబ్దపు…
-
అది సాధ్యమా? … సర్ థామస్ వైయట్
. అది సాధ్యమా? అంత తీవ్ర వాగ్వివాదం, అంత నిశితంగా, అంత వాడిగా, అంత జోరుగా, జరిగింది ఆలస్యంగా ప్రారంభమైనా అంత తొందరగా ముగిసిందా? అది సాధ్యమా? అది సాధ్యమా? అంత దుర్మార్గమైన ఆలోచన, అంత క్షణికావేశము, అంతతొందరగా తగ్గిపోయిందా, ప్రేమనుండి ద్వేషానికి, ద్వేషం నుండి జాలిపడడానికీ మారిందా? అది సాధ్యమా? అది సాధ్యమా? ఆ గుండెలోనే ఒకసారి ప్రశాంతంగానూ, మరోసారి కల్లోలంగానూ మారిపోగల వైరుధ్యాలున్న మనసు ఉండడం… అది నిజంగా సాధ్యమేనా? అది సాధ్యమేనా? ఎంతమాత్రం…
-
ఎప్పుడూ ఇంతే! … Fernando Pessoa
. కాలు ఆనకుండా పరిగెత్తే ఈ బరువైన కాలపు పరుగులో ఎప్పుడూ అదే మూసపోసిన జీవితం నమ్ముతూనో, అనుమానిస్తూనో మనల్ని మనం మోసంచేసుకునే పాత అలవాటు. . నిముషంలో గతించే కాలపు పరుగులో ఎప్పుడూ ఒకటే భ్రమ శిఖరాగ్రము నుండి మైదానం వైపు సారించే పోతపోసిన నిర్నిమేషమైన చూపు . అనుభవమూ – ఆశ… పేరు మారుతుంది, అంతే! మధ్యలో నిరుపయోగంగా ఆత్మ తూగాడుతుంది భావదారిద్ర్యంతో… తనసంపదని తలుచుకుంటూ నిన్నా… ఇవాళా… రేపూ. . ఎప్పుడూ, ఒకటే…
-
కెరటం … (సంక్షిప్తం) ఫరూవే ఫరుక్జాద్.ఇరానియన్ కవయిత్రి
. నా మట్టుకు నువ్వు కేవలం లోపలికి లాగి, ఈడ్చుకుని పారిపోయే ఒక సంద్రపుటలవి ప్రాణాంతకమైన మహమ్మారిలా నువ్వు చప్పున వ్యాపిస్తావు ఏవో తీరాలవైపు పరిగెత్తుతావు పోనీ, గమ్యం? అగమ్యం. నిజం! నిరంతరం చరిస్తూ అంతులేకుండా సాగుతూ నువ్వొక అదుపులేని కెరటానివి. *** కానీ, నీ కో విషయం తెలుసా? ఓ రాత్రి నేను గురుతు తెలియని ఏకాంత ద్వీపాల, వాటి తీరాల దాహార్తిని ముసుగుగా కప్పుకుంటాను కప్పుకుని, సముద్ర గర్భం నుండి, నీ జన్మభూమికి…
-
ఏబ్రహాం లింకన్ గెటీస్బర్గ్ ఉపన్యాసము
[అమెరికను అంతర్యుద్ధ కాలంలో 19 నవంబరు 1863 గురువారం మధ్యాహ్నం అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన చారిత్రాత్మకమైన ఉపన్యాసం. నిజానికి యుద్ధంలో మరణించిన వీరులకి “Soldiers’ National cemetery” ని అంకితం చేసే సందర్భంలో, నిర్వాహకుల మాటల్లో చెప్పాలంటే “కొన్ని సందర్భోచితమైన మాటలు (to say few appropriate words)” చెప్పడానికి అధ్యక్షుడిని ఆహ్వానించేరు. [ఈ సంఘటనని పదే పదే ఉటంకిస్తూ చెప్పిన గొప్ప విషయాలని Public Speaking by Dale Carnegieలో చదవొచ్చు. ఈ సందర్భాన్ని అతను…
-
సానెట్ XVII …పావ్లో నెరూడా
. నువ్వొక అపురూపమైన గులాబీవనో, గోమేధిక మణివనో, లేక నిప్పురవ్వల్లాంటి లవంగమొగ్గవనో ప్రేమించను. నిన్ను కొన్ని రహస్యమైన వస్తువుల్ని ప్రేమించినట్టు, ఎవరికీ తెలియకుండా గుండెకీ, నీడకీ మధ్య ప్రేమించాలి ఎన్నడూ పుష్పించకపోయినా, కనపడని ఎన్నోపుష్పాలప్రకాశాన్ని తనలో నిలుపుకున్న ఒక చెట్టుని ప్రేమించినట్టు, నిన్నుప్రేమిస్తా. నీ ప్రేమ కారణంగానే, ఒక చెప్పలేని గాఢ సుగంధం భూమినుండి వెలువడి నిగూఢంగా నాలో నిక్షిప్తమై ఉంది ఎలా, ఎప్పుడు, ఎక్కడనుండి ప్రేమిస్తున్నానో తెలీదు నిన్నునిన్నుగా, భేషజాలూ, అహం లేకుండా ప్రేమిస్తున్నాను. నిన్నలా ఎందుకు ప్రేమిస్తున్నానంటే…
-
వస్తానని రాలేదు … థామస్ హార్డీ
. నువ్వు వస్తానని రాలేదు కాలం నిర్లిప్తంగా పరిగెత్తుకుంటూ పోయింది. నన్ను మొద్దుబారిపోయేలా చేస్తూ. అయినా, నువ్వు నా ఎదురుగా లేకపోవడంకంటే కూడ ఎక్కువగా బాధించింది… నీ వ్యక్తిత్వంలో మన విముఖతని సైతం త్రోసిరాజనగల ఉదాత్తమైన కనికరభావన కనిపించకపోవడం. ఆశల చిట్టచివరి ఘడియ గడిచిపోయి, నువ్వురాకపోయిన తర్వాత నేనొంతో దుఃఖించాను. . నువ్వు నన్ను ప్రేమించటం లేదు. ప్రేమ ఒక్కటే మనిషిపై విశ్వాసాన్ని కలుగజేస్తుంది. నాకు నువ్వు ప్రేమించడం లేదనీ తెలుసు నువ్వు రావనీ తెలుసు. కానీ, దైవకార్యాలన్న పేరుపెట్టి…