వర్గం: అనువాదాలు
-
అనగా అనగా ఒకప్పుడు … గాబ్రియేల్ ఒకారా, నైజీరియన్ కవి
(నా ఈ 400వ టపా సందర్భంగా సాహితీ మిత్రులకీ, నా బ్లాగు అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అపూర్వమైన కవిత అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 1975 ప్రాంతాల్లో The Hindu లో ఒక సారి చదివాను. అప్పటినుండీ ఇది నా మనసులో నాటుకు పోయింది. అప్పట్లో అంత సాహిత్యవ్యాసంగం లేకపోవడంవల్ల కవి పేరూ గుర్తు పెట్టుకోలేదు, కవితా గుర్తులేదు. ఆఫ్రికన్ కవి అని తెలుసు. అందులో “సందర్భానికి తగ్గ ముఖాలు” అన్న విషయం లీలా మాత్రంగా…
-
వదనం … ఫాతిమా అల్ మతార్, సమకాలీన కువైటీ కవి
Listen to the Poem in Fatima Al Matar’s Voice: http://www.youtube.com/watch?feature=player_embedded&v=DRkKmkFfhk0 ఓ నా వదనమా! నువ్వూ నేనూ ఎలా పెరిగాము! నిన్ను నాకో ముసుగులా వాడడం ఎంత త్వరగా నేర్చుకున్నానో అంత త్వరగా నువ్వు నీ బుగ్గల నునులేతదనం విడిచావు విశాలమైన కన్నుల్లో అమాయకత్వాన్ని కూడా విడిచిపెట్టావు వదనమా! నీ వెనక దాక్కోడం ఎంత హాయిగా ఉంటుందో! నిన్ను నా వయసుని మోయనియ్యడం ఎంత తేలికగా ఉంటుందో! నా పిచ్చి పిచ్చి ఆలోచనల్నీ, ప్రతి…
-
వంశప్రతిష్టలూ- అధికారముద్రలూ… జేమ్స్ షర్లీ, ఇంగ్లీషు నాటక కర్త.
మన వంశప్రతిష్టలూ, అధికారముద్రలూ ఎంతగొప్పవైనా అవికేవలం ఛాయామాత్రమే, అల్పమైనవే. విధినితప్పించుకోగల కవచం ఏదీ లేదు. మృత్యువు తన శీతలహస్తాన్ని మహరాజులమీదనైనా వెయ్యగలదు. రాజదండాలూ, అపురూపమైన కిరీటాలూ నేలకు ఒరిగిపోవలసిందే. పలుగు పారలతో మట్టిలోకప్పబడి అన్నిటితో సరిసమానంగా దొర్లవలసిందే . కొంతమంది శౌర్యవంతులు కదనరంగంలో శతృసంహారంచేసి కొత్తచరిత్ర లిఖించవచ్చు. అయినా, వాళ్ళ భుజబలాలు లొంగవలసిందే. కొంతకాలం ఎదిరించవచ్చేమోగాని ముందో వెనకో విధికి దాసోహమనక తప్పదు. రక్తహీనులై, మృత్యువుకి తలవంచినపుడు, వాళ్ల ఊపిరి కూడా సమర్పించవలసిందే. . నీ నుదిటిమీది…
-
డడింగ్స్టన్ … రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి
కాకుల కా, కా, లతో పక్షుల కిలకిలలతో ఈ చిట్టడవి సన్నటి ఈ నీరెండలో ఆహ్లాదంగా ఉంది. దూరాన చర్చిలోనుండి ప్రార్థన తేలివస్తోంది కాని వాళ్ళు చిత్తమొచ్చినరీతిలో అది పాడుతున్నారు మేఘాలసందులలోనుండి జాలువారుతున్న బంగారు కిరణాలు సరసుమీది నునుతరగలపై తళతళలాడుతున్నాయి ఈ శిలలు కూడా ఒకదానికొకటి తమసామీప్యతకు సంతసిస్తున్నట్టు కనిపిస్తున్నాయి మరొకసారి నా మనసు ఉప్పొంగి ఉరకలేస్తూ ఆనందంతో పరవశిస్తోంది వెలుగునీడలు చేతి వేళ్లలా నా స్వరతంత్రులను మీటుతున్నాయి ప్రియతమా! నా ఊహగతాన్ని చిత్రిస్తోంది… క్రిందటిసారి నువ్వు…
-
ష్రాప్ షైర్ పచ్చని కొండలమీద రైల్లో …ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్
ష్రాప్ షైర్ పచ్చని కొండలలోనుండి రైలు పరిగెడుతోంది, ఆకాశపుటంచుల్నీ, ఊరు రూపురేఖలనీ మారుస్తూ; దూరంగా ఒక కొండశిఖరం కనుమరుగై, వెనక్కి మరలి పోయింది; ఎత్తుగా పొడుచుకొచ్చిన “క్లీ” కొండ కొన పశ్చిమదిక్కున నిర్మానుష్యమైనలోయలో కలిసిపోయింది నా చెయ్యి ఖాళీగా నా ముణుకుమీద ఉంది. నొప్పితో ఆ చెయ్యి ముణుకుమీద అలా ఉంది. ఆరోజు ఉదయం, ఊరు సగందాటేలోపు ఎన్ని నిజాయితీపరుల చేతులు దాన్ని తాకేయంటే అది మణికట్టునుండి ఊడిపోతుందేమోననిపించింది. నేనన్నాను: ఓ నా హస్తమా! మనం మనకు…
-
ప్రేమ తత్వం … Tagore
. రాత్రి చూడబోతే నల్లగా ఉంది, ఈ అడవికా అంతు కనిపించదు; లక్షలమంది మనుషులు లక్షలమార్గాల్లో వస్తూపోతూ ఉంటారు. ప్రతివారికీ ఈ చీకటిలోనే తాము చేరవలసిన సంకేతస్థలాలుంటాయి కానీ, ఆ కలయిక ఎక్కడో, ఎవరితోనో, ఎందుకోసమో మాత్రం తెలీదు. అయితే, మనకో నమ్మకం ఉంది: ఏ క్షణంలో నైనా పెదాలపై చిరునవ్వు చిందుతూ, మన జీవనభాగ్యరేఖ ఎదురౌతుందని సువాసనలూ, శబ్దాలూ, స్పర్శలూ, పాటలపల్లవులూ మనల్ని తాకుతూ, పులకింతలు కలిగిస్తూ పోతుంటాయి. కాని ఒకసారి ఒక విద్యుల్లత మెరుస్తుంది;…
-
మైక్రోస్కోప్ లో … మిరొస్లావ్ హోబ్, చెక్ కవి
. ఇక్కడకూడా మతిపోగొట్టే సుందర దృశ్యాలూ, చంద్రోపరితలాలూ, నీరవ ప్రదేశాలూ ఉన్నాయి. ఇక్కడకూడా జీవకణాలూ, సేద్యగాళ్ళూ, తమజీవితాన్ని తృణప్రాయంగా త్యజించగల యోధులైన కణాలూ ఉన్నాయి. ఇక్కడకూడా సమాధులూ, కీర్తిప్రతిష్టలూ, గుర్తింపులేకపోడాలూ ఉన్నాయి. వ్యవస్థలమీద తిరుగుబాటు గూర్చి నేను గొణుగుడు వింటున్నాను . మిరొస్లావ్ హోబ్, చెక్ కవి, వ్యాధినిరోధశాస్త్రజ్ఞుడు (13 September 1923 – 14 July 1998) . In the Microscope Here too are the dreaming landscapes, lunar, derelict. Here…
-
నన్ను ఆలోచించనీ… ఫైజ్ అహ్మద్ ఫైజ్ పాకిస్థానీ కవి
నువ్వు నన్నాదేశం గురించి అడుగుతున్నావు కానీ దాని వివరాలు నా స్మృతిపథం నుండి తప్పుకున్నాయి. నాకిప్పుడు దాని చరిత్రగాని, భౌగోళిక రూపంగాని గుర్తులేవు. ఇప్పుడు దాన్ని జ్ఞాపకాల్లోంచి ఊహించుకోవడం ఎలా ఉంటుందంటే పాత ప్రియురాలిని ఒక రాత్రికి కలుసుకున్నట్టుంటుంది; కాలందొర్లిపోయేక మునుపటి ప్రేమోద్వేగం, అశాంతీ, భయం విచారం ఏమీ ఉండవు. . నేనిప్పుడు మనిషి మర్యాదకోసం తనహృదయాన్ని పలకరించే స్థితికి చేరాను. . ఫైజ్ అహ్మద్ ఫైజ్ (February 13, 1911 – November 20, 1984)…
-
ఓ తల్లి కొడుకు … రుడ్ యార్డ్ కిప్లింగ్
. నాకో కల వచ్చింది… ఒక భయంకరమైన పీడ కల, ఆ కల ఎప్పటికీ అంతం కాదు… నేనో మనిషికి పిచ్చెక్కడం చూసాను, వాడేవరో కాదు, మా అమ్మకొడుకే. వాడిని ఒక పిచ్చాస్పత్రిలో పడేశారు, అది ఒక సమాధిలా ఉంది వాళ్ళు అక్కడ మేడ మీద పడుక్కోనివ్వరు గెడ్డం గీసుకుందికి అనుమతించరు. అతనక్కడికి చేరడానికి కారణం నిజంగా ఏ జబ్బుచెయ్యడమో నేరం చెయ్యడమో కాదు; మా అమ్మకొడుకు మీద వాళ్ళు మోపిన నేరాలు ఒక మనిషి సామాన్యంగా…
-
నాన్న జ్ఞాపకం … యెహుదా అమిఖాయ్, ఇజ్రాయిలీ కవి.
మా నాన్న జ్ఞాపకం, పనిచేసేచోట తినడానికి పొట్లంలో పట్టికెళ్ళే సాండ్ విచ్ లు లా , తెల్లకాగితంలో భద్రంగా ఉంది. ఐంద్రజాలికుడు తన టోపీలోంచి ఏనుగులూ, చెవులపిల్లులూ, తీసినట్టు తనచిన్న శరీరం తోనే మితిలేని ప్రేమ కనపరిచేవాడు జీవనదుల్లాంటి ఆ చేతులు మంచిపనులతో ఎప్పుడూ పొర్లిప్రవహిస్తూండేవి. . యెహుదా అమిఖాయ్ (3 May 1924 – 22 September 2000) ఇజ్రాయిలీ కవి, నవలాకారుడు ఇతను వ్యావహారిక హీబ్రూలో వ్రాసిన మొదటి కవిగా గుర్తింపుపొందాడు. రెండవ ప్రపంచ…