వర్గం: అనువాదాలు
-
నన్నెంతగా ప్రేమిస్తున్నావు? … కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి
నువ్వు నన్నెంతగా ప్రేమిస్తున్నావు ఇవాళ? ఒక మిలియను బుషెల్స్ ఉంటుందా? అంతకంటే ఎక్కువా? నిజంగా, అంతకంటే చాలా ఎక్కువ? . బహుశా, రేపు బుషెల్ లో సగం అయిపోతుందేమో? లేక, బుషెల్ లో సగం కంటే కూడ తక్కువో. . ఇదేనా ప్రేమంటే నీ హృదయగణితం? అచ్చం ఇలాగే, గాలికూడ, వాతావరణాన్ని కొలుస్తుంటుంది. . కార్ల్ సాండ్ బర్గ్ (January 6, 1878 – July 22, 1967) అమెరికను కవి (గాలికి ఎంత…
-
ఎక్కడో ఒక చోట… క్రిస్టినా రోజెటి, ఆంగ్ల కవయిత్రి
ఎక్కడో ఒక చోట, నేను ఇప్పటివరకూ చూడని వదనమూ, వినని స్వరమూ, నా మాటకి ఇంకా స్పందించ వలసిన హృదయమూ నా అదృష్టం ఎలా ఉందో — తప్పకుండా ఉంటాయి . ఎక్కడో ఒకచోట, దగ్గరో దూరమో ఖండాలూ, సముద్రాలూ దాటి, కంటికి కనిపించనంతదూరంలో, చంద్రుణ్ణి దాటి, తనని ప్రతి రాత్రీ గమనించే నక్షత్రానికావల… . ఎక్కడో ఒక చోట, దూరమో దగ్గరో, కేవలం ఒక గోడ, ఒక కంచె, మధ్యలో అడ్డుగా; పచ్చగా పెరిగిన పచ్చికమీద…
-
నీకేగనక ఒక స్నేహితుడుంటే… రాబర్ట్ విలియం సెర్విస్, బ్రిటిషు కవి
నీకే గనక ఒక ఆప్త మిత్రుడు, శక్తిమంతుడూ, అహం లేనివాడూ, నీ తప్పులు తెలిసి, నిన్ను బాగా అర్థం చేసుకున్నవాడూ; నీ శక్తి యుక్తుల మీద అపారమైన నమ్మకం ఉన్నవాడూ నిన్ను తండ్రిలా సంరక్షించేవాడూ; చివరిదాకా నిన్ను విడిచిపెట్టక వెన్నంటి ఉండేవాడూ ప్రపంచం నిన్నెంత పరిహసించినా, నిన్నుచూసి ఎప్పుడూ ఆనందించేవాడూ, అలాంటి స్నేహితుడుంటే, నువ్వు తప్పకుండా అతన్ని సంతోషపెట్టడానికి ఎప్పుడూప్రయత్నం చేస్తూ, స్నేహాన్ని వదులుకోవాలన్న ఆలోచనే రానీయవు. . అదే నీ స్నేహితుడు చాలా గొప్పవాడూ ఉన్నతుడూ…
-
వయసూ – ముదిమీ … ST కోలరిడ్జ్
తలలూపుతున్న పూలగుత్తులమధ్య తూగాడే పిల్లగాలిలా కవిత్వమూ, వాటిలోని మకరందాన్ని గ్రోలుతున్న తేనెటీగలా ఆశా ఉండేవి. రెండూ నా స్వంతం! వయసులో ఉన్నప్పుడు ఆశా కవిత్వమూ ప్రకృతిలో విహరించేవి! ఓహ్!… (నిట్టూర్పు) వయసులో ఉన్నప్పుడు! అదెప్పటి మాట! ఎంతదురదృష్టం! అప్పటికీ ఇప్పటికీ ఎంత వ్యత్యాశం! ఈ గాలితిత్తి అప్పటికింకా రూపుదిద్దుకోలేదు ఈ శరీరం నాకు క్షమించరాని ద్రోహం చేసింది. ఆ రోజుల్లో పర్వతాగ్రాలమీదా, సైకతశ్రోణులమీదా ఎంత తేలికగ మెరుపులా పరుగులెత్తేది… సరస్సుల్లోనూ, విశాలమైన నదీ ప్రవాహాలమీదా, పూర్వం మనకు…
-
Only one Life… Kavi Yakoob, Telugu Poet
You have but only one life… whether you are glad or gloomy; win or vanquished; rejoice or repent; There is but just one life! . Within its scope, desires pile up like tamarind sprigs words course through the pathways to reach papers; the slumbering letters lie drowsing on the finger tips dreaming of wakening and…
-
మనం ఏం చేసుకుంటాం? … చార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి
మహా బాగుందనుకున్నప్పుడు, ఈ మానవజాతిలో సాధుత్వం, కొంత అవగాహన, అప్పుడప్పుడు కొన్ని సాహసకృత్యాలూ ఉంటాయి గాని మొత్తం మీద ఇది ఒక మంద… చెప్పుకోదగ్గదేమీ లేని ఒక శూన్య గోళం. అది మంచి గాఢనిద్రలో ఉన్న ఒక పెద్ద జంతువులా ఉంటుంది; దాన్నెవ్వడూ మేల్కొలపలేడు. అది బాగా చురుకుగా ఉన్నప్పుడు మహాక్రూరంగా ఉంటుంది; స్వార్థపూరితంగా, హత్యలుచేస్తూ, అన్యాయంగా ప్రవర్తిస్తుంది. ఇలాంటిమానవజాతిని మనం ఏం చేసుకుంటాం? ఏమీ చేసుకోలేం. సాధ్యమైనంతవరకు దానికి దూరంగా ఉండడం మంచిది. ఏదైనా విషపదార్థాన్నీ,…
-
కుఠారధారీ, ఈ చెట్టుని విడిచిపెట్టు!… జార్జ్ పోప్ మారిస్
ఓ, వనజనుడా! ఆ చెట్టుని విడిచిపెట్టు! దాని ఏ కొమ్మని కూడా తాకవద్దు! నా చిన్నతనంలో దాని నీడనే ఆడుకున్నాను, దాన్నిప్పుడు నేను సంరక్షిస్తాను. మా గుడిశె ముందు మా తండ్రి స్వయంగా నాటిన చెట్టది. కనుక ఓ వనవాసీ, దాని ఊసెత్తకు. నీ గొడ్డలితో దాన్ని బాధించకు. . ఆ చెట్టు అందరికీ చిరపరిచితం దాని పేరు ప్రఖ్యాతులు దేశాలూ, మహాసముద్రాలు దాటి వ్యాపించేయి. అటువంటిదాన్ని ఇప్పుడు నరకబోతావా? ఓ వనచారీ, ఈ నీ ప్రయత్నం…
-
అనంతకాల గీతిక… సిడ్నీ లేనియర్,
ఒక రోజు రాత్రి మా దివాణం తోటలో నేనూ, నా ప్రేయసీ చాలాసేపు మౌనంగా ఉండిపోయాం ఏ గ్రహచారం వల్లనైనా, మా ఇద్దరికీ ఎడబాటు సంభవిస్తుందేమోనని బాగా దిగులుపడుతూ. . అకారణంగా దుఃఖపడుతున్న నా ప్రేయసి, మా మీద నక్షత్రకాంతి పడకుండా అడ్డుగా ఉన్నతీగమీది ఒక ఆకుని చేయి జాచి, పక్కకి తప్పించింది. . ఆమె దుఃఖాన్ని గమనించిన ఒక తారక ఆకు తొలగించిన మార్గంలోనే సూటిగా ప్రకాశిస్తూ, అద్దంలో ప్రతిబింబంలా,ఆమె కనుకొలకుల చివర వేలాడుతున్న అస్రుకణంలో…
-
నేను ఖగోళ శాస్త్రజ్ఞుణ్ణి విన్నప్పుడు … వాల్ట్ వ్హిట్మన్
నే నొకసారి ఖగోళశాస్త్రపారంగతుడిని విన్నప్పుడు అతను సిధ్ధాంతాలనీ దాఖలాల్నీ, అంకెల్లో అడ్డంగా, నిలువుగా పట్టీలువేసి చూపిస్తూ; పటాలూ, బొమ్మలతో విశదపరుస్తూ; సంకలనవ్యవకలనాలతో అంచనాలు వేసి చెబుతుంటే; ఆ గదిలో అతని ప్రసంగాన్ని అందరి అభినందనల మధ్యా కూర్చుని నేను వింటున్నప్పుడు నాకు వల్లమాలిన విసుగేసి, ఎంత వెగటు అనిపించిందో చెప్పలేను. తక్షణం అక్కడనుండి లేచి మెల్లగా బయటకు జారుకున్నాను . మంత్రముగ్ధుల్ని చేసే ఆ చల్లని రాత్రిలో ఒక్కడినీ బయట తిరుగుతూ పరీవ్యాప్తమైన నీరవ నిశీధిలో అప్పుడప్పుడు…
-
అలబామాలో సూర్యోదయం… లాంగ్స్టన్ హ్యూజ్
నేను స్వరకర్తని కాగలిగినపుడు అలబామాలో సూర్యోదయం గురించి ఒక చక్కని స్వర రచన చేస్తాను . దానికి తంపరల మీదనుంచి అలవోకగా ఎగసివచ్చే పొగమంచులాగా ఆకాశమునుండి తేలికగా నేలకిరాలే తెలిమంచులాగా ఉండే చక్కదనాల గీతాలని సమకూరుస్తాను . . ఆ గీతాల్లో మహోన్నతమైన వృక్షాల గురించీ, దేవదారుచెట్ల ముళ్ల సువాసనగురించీ ఎర్ర రేగడినేలమీద చినుకులుపడిన తర్వాత వచ్చే సుగంధపరిమళం గురించీ, సుదీర్ఘమైన ఎర్రని మెడలతో సింధూరపు రంగు ముఖాలతో బలిష్టమైన గోధుమవన్నె బాహువులతో తెల్లని “డెయిజీ” ల…