వర్గం: అనువాదాలు
-
వినతి… ఎడ్విన్ మార్ఖాం, అమెరికను కవి
తండ్రీ! కొత్తగా మొలకెత్తుతున్న గడ్డిపరకలపై తేల్చితేల్చి ఎలా నడవాలో నాకు బోధించు; క్రూరమైన ఈ ప్రపంచం చేసే గాయాలని రాయిలా తట్టుకోగల ఆత్మనిబ్బరాన్ని ప్రసాదించు; కానీ, ఈ మనసునిమాత్రం నీ శక్తితో నిలబెట్టి, పువ్వుల్లా నిరాడంబరంగా ఉండేలా అనుగ్రహించు; ఆర్ద్రత నిండుకున్న ఈ హృదయకలశాన్ని నిండనీ ఎర్రని పాపీ పువ్వుల్లా తలెత్తి ఎదురుచూస్తూ; జీవితం దాని ఔన్నత్యాన్ని తేలికగా తీసుకోనీ పండిన పాపీలు వినమ్రంగా తలవాల్చుకున్నట్టు; మనసు నైరాశ్యంలో కూరుకుపోయినప్పుడూ, తొలిచిగురుతో తిరిగి బతుకుని ప్రారంభించినపుడూ చెట్లలా…
-
చీకట్లో నీడలు … యుజీన్ ఫీల్డ్, అమెరికను కవి
. నాకు పాములన్నా, కప్పలన్నా, పురుగులన్నా, క్రిములన్నా, ఎలుకలన్నా ఆడపిల్లలు జడుసుకేనేవి ఏవన్నా భయం లేదు; అవెంతో మంచివి. నాకు తెలిసి నేను మహాధైర్యవంతుణ్ణి; అయితే పక్క ఎక్కాలంటేనే చికాకు ఎందుకంటే, నా ప్రార్థనలు చదువుకుని, దుప్పట్లో వెచ్చగా ఒదిగిపోగానే అమ్మ “కమ్మగా పడుక్కో” అని చెప్పి దీపం తీసేస్తుంది, రాత్రి చీకట్లో నన్నొకడినే పడుకోమని వదిలేస్తుంది, ఏవేవో ఆకారాలు కనిపిస్తుంటే. ఒక్కోసారి అవి గది మూలనీ, మరోసారి తలుపువెనకా నక్కి ఉంటాయి; ఇంకొక్కసారి గది మధ్యలో…
-
పెంబ్రోక్ కౌంటెస్ పై మృత్యుల్లేఖనం … బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి.
. ఆంగ్ల సాహిత్యంలో పేరుపడ్డ మృత్యుల్లేఖనాలలో ఇది ఒకటి. దీనికి సర్ ఐజాక్ న్యూటన్ స్మృతిలో అలెగ్జాండర్ పోప్ వ్రాసిన స్మృతిగీతం అంత పేరు ఉంది. . ఈ శోకభరమైన నల్లని సమాధిని పెంబ్రోక్ కన్న తల్లీ, సిడ్నీ సోదరీ, కవిత్వానికే ఉపాధి, నిద్రిస్తోంది. ఓ మృత్యువా! ఆమెవంటి చదువరీ సుందరీ, మనస్వినీ మరొకరిని నువ్వు బలిగొనేలోగా, కాలం నిన్ను శరంతో కూల్చుగాక! . బెన్ జాన్సన్ 11 June 1572 – 6 August 1637…
-
లెస్బియా రాసిన ఉత్తరం నుండి … డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి
… కాబట్టి, కేటలస్ పోయినందుకు దేముడికి వెయ్యిదండాలు పెట్టు, ప్రియమైన నెచ్చెలీ, ఒక విషయం మాత్రం నీకు నే చెప్పదలుచుకున్నా ఇప్పుడైనా ఎప్పుడైనా, నీకు నచ్చినవాణ్ణి ఎవడినైనా ప్రేమించు, ఒక్క కవిగాడిని తప్ప. వాడెవడైనా ఒక్కటే, చిత్రంగా ప్రవర్తిస్తారు. . వాళ్ళకి కలహమైనా, ముద్దుపెట్టుకోవడమైనా ఒక్కటే, అవి వాళ్లకి పిల్లనగ్రోవిమీద పాడుకునే పాటల్లా ఉంటాయి. అయితే దాన్ని స్తుతిస్తూనో, లేకుంటే దీనికోసం విలపిస్తూనో ఉంటాడు; నా మట్టుకి నాకు, వ్యవహారజ్ఞానం ఉన్నవాడు కావాలి. . ఒకసారి ఆయన…
-
పురాతన వ్రాతప్రతి … ఆల్ఫ్రెడ్ క్రేంబోర్గ్, అమెరికను కవి
. ఆకాశం … సూర్యుడూ, చంద్రుడూ తమ దినచర్య రాసుకునే అందమైన పాత తోలుపొరకాగితం. దాన్ని అంతటినీ చదవాలంటే, మీరు బృహస్పతి కంటే భాషాకోవిదులూ, కలలతల్లి కంటే భావుకులూ, యోగదృష్టిగలవారూ అయి ఉండాలి. కానీ, దాన్నిఅందుకున్న అనుభూతి పొందాలంటే మీరు దాని ప్రియ శిష్యులై ఉండాలి: ఆత్మీయ శిష్యుణ్ణి మించి, ఈ భూమిలాగో, సముద్రం లాగో నమ్మకమైన ఏకైక ఆంతరంగికులై నిలవాలి. . ఆల్ఫ్రెడ్ క్రేంబోర్గ్. December 10, 1883 – August 14, 1966 అమెరికను కవి,…
-
నిష్క్రమిస్తున్న అతిథి … జేమ్స్ వ్హిట్ కూంబ్ రైలీ, అమెరికను కవి
జీవితమూ, ప్రేమా ఎంత మనోరంజకులైన గృహస్థులు! నేను ఎంతో అయిష్టంగా, అయినా సంతోషంగానే మరలుతున్నాను. ఈ చరమ ఘడియలలో కూడా వాళ్ళ ఉదాత్తమైన అతిథిమర్యాదలలో నాకు ఏమాత్రం లోటు రానీయలేదు. కనుక ఆనందం నిండిన ముఖంతో నిండు కృతజ్ఞతతో వాళ్ళ చేతులు నా చేతిలోకి తీసుకుని ఒత్తుతూ, “మనం చాలా చక్కని సమయం గడపగలిగాం. ఎంతో కృతజ్ఞుడిని, శుభరాత్రి,” అని చెప్పడానికి ఇంకా వేచి ఉన్నాను. . జేమ్స్ వ్హిట్ కూంబ్ రైలీ October 7, 1849…
-
మంచు మనిషి … వేలెస్ స్టీవెన్స్, అమెరికను కవి
గడ్డకట్టించే చలిగురించీ, పైన్ చెట్టుకొమ్మలమీద పేరుకున్న మంచు గురించీ అవగాహనకావాలంటే, శీతాకాలం గురించి తెలియాలి; అంతే కాదు, జూనిపర్ లు మంచులో మత్తుగాతూలడం చూడాలన్నా జనవరి సూర్యుడి వెలుగులో దూరంగా స్ప్రూస్ చెట్ల నిగనిగలు చూడాలన్నా చాలాకాలం చలిలో మగ్గి ఉండి ఉండాలి; శీతగాలికోతపెట్టేహోరు అయితే చెప్పనలవికాదు. ఆ ప్రదేశాన్నంతా ఆవరించి, ఉన్న ఆ నాలుగు ఆకుల చప్పుడుతప్ప వేరుచప్పుడు అక్కడవినబడదు; ఆ దిగంబర ప్రకృతిలో గిరికీలుకొట్టే గాలి అదే; ఆ మంచులో, తనమాట వినేవాళ్ళు ఎవరూ…
-
నివురుగప్పిన జీవితం…ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికన్ కవయిత్రి
. నా ప్రియుడు నన్ను విడిచివెళ్ళిపోయాడు… ఇపుడిక అన్ని రోజులూ ఒకటే, తినకా తప్పదు, నిద్రపోకా తప్పదు… జీవితమంతా రాత్రైపోతే బాగుణ్ణు… అబ్బా! రాత్రల్లా మేలుకుని గంటలు ఒకొక్కటీ సాగుతూ గడుస్తుంటే… తెలతెలవారుతుంటే, మళ్ళీ ఉదయం అయితే బాగుణ్ణు అనిపిస్తుంది. . నా ప్రియుడు నన్ను విడిచివెళ్ళిపోయాడు… నాకేం చెయ్యాలో తోచడం లేదు, ఇదనీ, అదనీ, మీరేది చెయ్యమని చెప్పినా అన్నీ నాకు ఒకటే, నేను ప్రారంభించిన ఏ పనీ పూర్తిచెయ్యలేకపోతున్నాను నాకు కనిపిస్తున్నంతవరకు, దేనివల్లా ఏమీ…
-
నేను మృత్యువుకోసం ఆగలేను కాబట్టి… ఎమిలీ డికిన్సన్
నేను మృత్యువుకోసం ఆగలేను కాబట్టి, పాపం, తనే నా కోసం ఆగేడు. ఆ బగ్గీలో కేవలం మేమిద్దరమూ, అనంతత్వమూ… అంతే! . మేము నెమ్మదిగా వెళ్తున్నాం, అతనికి తొందరంటే ఏమిటో తెలీదు. అతని మర్యాద చూసి, నా శ్రమనీ ఖాళీసమయాన్నీ ప్రక్కనబెట్టవలసి వచ్చింది. . మేము స్కూలు పక్కనుండి వెళ్ళేము, అక్కడ పిల్లలు విరామసమయంలో ఆటస్థలంలో ఆడుకుంటున్నారు. పంటతో కళ్లుచెదిరిపోయే పొలాలపక్కనుండివెళ్ళేము మేము అస్తమిస్తున్న సూర్యుడినికూడా దాటేము. . నిజానికి, అతనే మమ్మల్ని దాటివెళ్ళేడు సాలెపట్టుమీద పేరుకున్న…
-
ప్రకృతీ – వికృతీ … జేమ్స్ సిమ్మన్స్, ఐరిష్ కవి.
. ఇరవై అడుగులదూరం నుండి, ఒకప్పటి నా ప్రియురాలు కారు తాళం వెయ్యడం చూశాను. చెయ్యి ఊపి, తను నవ్వింది,ఇప్పటికీ అంత అందంగా,ఇరవై ఏళ్ళ పిల్లలా. . గోధుమరంగు జుత్తు తన తలమీద ఇప్పటికీ సూర్యోదయంలా వెల్లివిరుస్తోంది ఆమె నవ్వు, తను ఎంతమామూలువిషయం చెప్పినా నాకు చిరునవ్వు తెప్పిస్తూ ఉండేది. . కానీ ఇరవై ఏళ్ళు గడిచిపోయేయి. చర్మము వేగం చెడిపోయే వస్తువాయె; వ్యాయామాలూ, ఆహార నియమాలూ, సౌందర్య పోషకాలూ సరిపోతాయా . ఆ సూక్ష్మముఖకండరాలని కాపాడటానికి?…