వర్గం: అనువాదాలు
-
ఆతిథ్యం… క్రిస్టినా రోజెటి
. నేను మరణించిన తర్వాత నా ఆత్మ ఎంతోకాలం నే మసలిన ఇల్లుచూడాలని వెళ్ళింది నేను ప్రాకారందాటి, నా మిత్రులందరూ పెరట్లో ఆకుపచ్చని నారింజచెట్లనీడన విందారగించడం చూసేను. ఒకరిచేతినుండి ఒకరికి మధుపాత్ర మారుతోంది; పళ్లలోని రసాన్ని చప్పరిస్తూ ఆస్వాదిస్తున్నారు. నవ్వుతూ, పాడుతూ, పరాచికాలాడుకుంటున్నారు, అవును మరి, ప్రతివారికీ తక్కినవాళ్లంటే ప్రేమ. . కపటంలేని వాళ్ళ మాటలు వింటున్నా: ఒకరన్నారు:”రేపు మనం సముద్రతీరం వెంబడి మైళ్లకి మైళ్ళు, ఒక దారీ తెన్నూ లేని ఇసకతిన్నెలమీద కాళ్ళీడ్చుకుంటూ నడవాలి.” మరొకరు:”…
-
వృద్ధుడు… జీన్ స్టార్ అంటర్ మేయర్, అమెరికను కవయిత్రి
. చూసి నడుస్తున్నట్టు కనిపించని నడకతో ఆ వృద్ధుడు తలవంచి నడుస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది దేనిగురించి ఆలోచిస్తున్నాడు చెప్మా అని: రాబోయే క్రిమిజన్మగురించా? గడచినదాని గురించా? . లేక తనచూపును అంతర్ముఖం చేసి పరిసరాలు గూర్చిన స్పృహ విడిచి ఊహాలోకాల్లో శాశ్వతత్వం గురించి పేకమేడలు కడుతున్నాడో? . జీన్ స్టార్ అంటర్ మేయర్ (May 13, 1886 – July 27, 1970) అమెరికను కవయిత్రి. . Old Man . When an old…
-
ప్రతీకలు … ఫెర్నాండో పెసో, పోర్చుగీసు కవి
ప్రతీకలా? … నాకు చెప్పకండి. విసిగెత్తిపోయాను… కొంతమంది అన్నీ ప్రతీకలే అని అంటారు. అలా అనడంవల్ల వాళ్ళు నాకు చెప్పేదేమీ లేదు. . ప్రతీకలంటే ఏమిటి? కొన్ని ఊహలు… అంతే. సూర్యుడు ఒక ప్రతీక… సరే చంద్రుడు ఒక ప్రతీక… సరే భూమి ఒక ప్రతీక… అది కూడా సరే. కానీ, సూర్యుడ్ని ఎవడు పట్టించుకుంటున్నాడు వర్షంకురిసి కురిసి అలా వెలిసిన తర్వాత మేఘాల మధ్య ఖాళీలోంచి కనిపించి తనవెనక ఉన్న నీలాకాశాన్ని చూపించినప్పుడు తప్ప? అసలు…
-
చలి – విడిది … ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి
చాలామందికి వయసు పైబడుతున్నకొద్దీ చాలా తెలుస్తాయి అయితే, వాటికి వేటికీ నేను పెద్దగా విలువివ్వను. . నా రెండో పాతిక సంవత్సరాల జీవితాన్ని యూనివర్శిటీలో నేర్చుకున్నది వదిలించుకోడంలోనూ . ఆ తర్వాత జరిగిన విషయాలు అర్థంచేసుకుందికి నిరాకరించడంలోనూ గడిపేను. . నాకు ఇప్పుడు పత్రికలలో కనిపించే పేర్లేవీ పరిచయం లేదు. మనుషుల్ని గుర్తుపట్టలేక వాళ్లకి కోపం తెప్పించడంతోబాటు వాళ్ళు చెప్పిన చోట్లలోఎప్పుడూ లేనని ఒట్టేసిమరీ చెబుతున్నాను . నాకు నష్టం కలిగించేవి అన్నిటినీ అలా చివరి వరకూ…
-
కవి… ఖలీల్ జీబ్రాన్, లెబనీస్ – అమెరికన్ కవి
అతను ఈ ఇహపరాలకి వారధి. అతను, దప్పిగొన్న ప్రతి ఆత్మా సేవించగల స్వచ్ఛమైన నీటిబుగ్గ. . అతను… ఆకొన్న హృదయాలు అభిలషించే ఫలాలనందించే, సౌందర్యనదీజలాల తడిసిన పండ్లచెట్టు ; తన గానామృతంతో ఆర్తహృదయాలను అనునయించగల కోయిల; దిగంతాలలో మెరిసి, వ్యాపిస్తూ, పూర్ణాకాశాన్ని ఆవరించగల తెలివెండి మొయిలు; జీవన కేదారాలలో కురిసి ప్రవహించి, వెలుగు వెల్లువను స్వీకరించగల పద్మదళాలను వికసింపజేయగల నిపుణుడు; భగవంతుని దివ్యవాణిని వినిపించడానికి భగవతి ఎంపికచేసిన దేవదూత; ప్రేమైకమూర్తి తనుగా చమురుపోసి, స్వరసరస్వతి వెలిగించిన, పెనుగాలులార్పలేని, చీకటులు…
-
అతిథి గృహం … రూమీ, పెర్షియన్ కవి
. ఈ మానవజీవితమే ఒక అతిథి గృహం . ప్రతి ఉదయమూ ఒక కొత్త అతిథి రాక. ఒక ఆనందం, ఒక నిరాశ, ఒక నీచమైన ఆలోచన, ఒక క్షణికమైన జ్ఞానోదయం, అనుకోని అతిథిలా వస్తుంటాయి. అన్నిటినీ ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వు! అవి ఒక కష్టాల పరంపర అయినప్పటికీ ఇంట్లోని సర్వస్వాన్నీ తుడుచుపెట్టుకుపోయినప్పటికీ, ప్రతి అతిథినీ, అతిథికివ్వవలసిన పూర్తి గౌరవంతో సేవించు ఏమో! ఒకొక్కరూ నిన్నొక కొత్త ఆనందానికి సన్నద్ధం చేస్తుండవచ్చు. భయాలూ, అవమానాలూ, అసూయలూ అన్నిటినీ ద్వారం దగ్గరే…
-
అద్దెకో స్మృతి లేఖనం … టాం క్లార్క్, అమెరికను కవి.
నా పేరు… ఓహ్! ఏ పేరు ఆయితే నేమిటి, తేడా ఏం రాదు. నా ఊరు… ఏ వూరయితే ఎవడిక్కావాలి, నిజానికి? పుట్టేను, పెరిగేను, చదువుకున్నాను ఏదో ఓ మాదిరిగా సంప్రదాయంగానే … ఇది ఎవరికైనా పనికొస్తుందా? నే నెలా బ్రతికేనన్న విషయానికి వస్తే…మనం దాన్లోకి వెళ్ళొద్దు. చివరికి నే చనిపోయాను. ఇక్కడ ఉన్నాను. అదొక్కటే ప్రస్తుతానికి పనికొచ్చే విషయం. . టాం క్లార్క్. అమెరికను కవి మార్చి 1, 1941 . ఈ కవితలో అద్భుత…
-
బాటసారీ… ఏంటోనియో మచాతో, స్పానిష్ కవి
. ఓ బాటసారీ! మరో గతి లేదు. నీ అడుగుజాడలే తప్ప వేరే దారిలేదు. ఓ బాటసారీ! మరో మార్గం లేదు, నీత్రోవ నువ్వుచేసుకుంటూ దూరతీరాలు వెళ్ళాల్సిందే, నువ్వు నడచిన దూరాన్ని సింహావలోకనంచేసుకునేదాకా దూరతీరాలు సాగుతూ, నీ త్రోవ నువ్వు చేసుకోవలసిందే ; బహుశా, నువ్వెన్నడూ ఇక తిరిగి అడుగిడలేవు ఆ త్రోవను వెనుదిరిగి చూడడం మినహా! ఓ బాటసారీ! మరో మార్గం లేదు… నీటిమీద జాడలు విడిచి వెళ్ళడమే! . ఏంటోనియో మచాతో 26 July…
-
The Sea … Ramana GV, Telugu, Indian
That e-mail was received when I was at the mental hospital. That was sent by an editor of a magazine soliciting a story for a special issue. My wife had informed me about it. That I was in the mental hospital she kept it a secret. Only my children knew about it. She felt it…
-
స్వయం నిరాదరణ … జీన్ స్టార్ అంటర్మేయర్, అమెరికను కవయిత్రి
తడిలేని ఈ మిట్టను దున్నడానికిగాని ఇక్కడ చెట్టునాటడానికిగాని ప్రయత్నించకు; ఈ పర్రలో విత్తుకి జీవగర్ర లేదు. నీ అక్కరకు పనికివచ్చి ఏమాత్రం ఉత్సాహాన్నివ్వలేని రసహీనమైన నేల ఇది. ఏ ఎండా దీనికి చైతన్యాన్నివ్వలేదు. ఇది దైవోపహతమైన భూమి. ఏ చినుకూ నిస్సారమైన ఈ నిట్రాతిలోకి ఇంకదు. దీని రాతి కొనలలో, గత ఏడు మిగిలిన ఆ చిట్టచివరి మోడునికూడా చండగాలులు తుడిచిపెట్టుకుపోయాయి. ఏ ఆశలూ లేనిదానిమీద నీ కెందుకింకా ఆశ? పో! వృధాశ్రమ; ప్రయాస పడకు! .…