వర్గం: అనువాదాలు
-
Damayanti’s Daughter … P. Satyavathi, Telugu, Indian
I usually pull the window blinds down on Sundays to keep the Sun away. But my roommate Sneha, who gets up at six no matter whether it is Sunday or working day, and with old Hindi songs in the background cherishes reading every damn Telugu and English daily with its supplement leisurely sipping her coffee,…
-
ఉత్ప్రేరకం … సారా క్లెగ్ హార్న్ , అమెరికను
. ఎండా, గాలీ, వానా, చలీ ఎరగక స్వేచ్ఛగా పెరగడానికి అవకాశంలేక బలహీనంగా తన కొమ్మకే వాడి వాలిపోయిన ఒక బోన్సాయ్ మొక్కని చూసేను నేను. ఇంతలో ఒక మనిషి లోపలనుండి వచ్చి ఇలా అన్నాడు దానితో: “ఓ తెలివితక్కువ మొలకా! ఇక్కడే హాయిగా సంతృప్తిగా ఉండు! ఎప్పుడూ తడిగా ఉండే ఈ చోటూ, బూజులూ, గెత్తమూ నువ్వు పొడుగ్గా పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయి. అదిగో, ఆ గోడమీద కనిపిస్తోందే, ఆ ఎండపొడదాకా పెరగడానికి సహాయపడతాయి.…
-
ఎవరో అనామక… జాన్ బానిస్టర్ టాబ్, అమెరికను
. ఎవరో అనామక… నిజానికి పేరెందుకు, వెచ్చగా, కొత్తగా సుగంధాలు వెదజల్లుతూ, వెలుగులీనే ఈ జ్వాల ప్రభవించిందని ఆ రహస్యాన్ని విప్పిచెప్పడానికి ? అలాగే, తన వచ్చిన పని ముగించుకుని, దైవం దానిని గమనించి, అనుగ్రహించేక, ఆ తనువుపై కీర్తిచంద్రిక ప్రకాశించేక, పేరు లేకపోతేనేం? ఏ పేరూ లేకపోతేనేం? (అలాగే, దైవం తనపని ముగించుకుని తన సృష్టిని ఒకసారి పరిశీలించి, తృప్తిచెందేక తన వైభవం ఆ బొమ్మలో ప్రకాశించేక పేరు లేకపోతే నేం? ఏ పేరూ లేకపోతే…
-
పొగత్రాగరాదు … కుఝుర్ విల్సన్, మలయాళం, భారతీయ కవి
1 . డాక్టరు హెచ్చరించాడు: “ఈ అలవాటు మీరు మానుకో పోతే, మీ లివరు చెడిపోతుంది.” “ఈ పువ్వు ఎప్పుడో రాలిపోయింది డాక్టర్!” అన్నాను నేను. “నువ్వీ అలవాటుకి బానిసవైపోతే, నువ్వు నాకు దక్కవు,” అంటుంది గ్రేసీ. “ఇప్పటికే నన్ను నే పోగొట్టుకున్నాను,” బదులిస్తాను నేను. తర్వాతవంతు నా కథక మిత్రుడిది “నిన్ను నేనొక పొగతాగే పాత్రగా చూడలేనురా!” “అసలు నాలాంటి హీరోని నీ కథలో ఉంచకుండా ఉంటే సరిపోయేది కదరా!” “చూడు, నీ పెదాలు ఎంత…
-
…..అప్పుడు నవ్వు… బెర్తా ఏడమ్స్ బేకస్, అమెరికను
నీకోసం ఒక దృఢమైన పెట్టె తయారుచేసుకో, అందులో ప్రతి భాగాన్నీ చాలా శ్రద్ధగా తీర్చిదిద్దు, నీ చేత్తో ఎంత దృఢంగా నేర్పుగా చెయ్యగలవో అంత దృఢంగా చేసి, అందులో నీ బాధలన్నీ అందులో దాచిపెట్టు. అందులోనే నీ గతించిన అపజయాల చరిత్ర దాచిపెట్టు; నువ్వు దిగమింగుకున్న ప్రతి చేదు అనుభవాన్నీ పడెయ్; నీ గుండె గాయం చేసిన సంఘటనలన్నీ అందులో వేసి మూసెయ్, ఇప్పుడు దాని మూతవేసి, మీద కూర్చుని మనసారా నవ్వుకో. మరెవ్వరికీ అందులో ఏముందో…
-
రెండు నిజాలు… హెలెన్ హంట్ జాక్సన్, అమెరికను
“ప్రేయసీ,” కళ్ళలో చెమ్మ కదలాడుతుండగా అతనన్నాడు, “నిన్ను బాధించాలని నా ఉద్దేశం కాదు, “ప్రపంచం పాదాక్రాంతమైనా నిన్ను బాధించను, నేను మరిచిపోతే, అది నాదా తప్పు? చెప్పు.” . ఆమె అంది, “ఓహ్! ఎప్పుడూ నా గురించే ఆలోచించే ఈ కన్నీళ్ళకి… క్షమించు. నేను అర్థం చేసుకోగలను ప్రియా, నన్ను బాధించడం నీ అభిమతం కాదని. నువ్వు మరిచిపోయి ఉంటావని కూడా తెలుసు!” . అయినప్పటికీ, ఆమె మనసు లో లోపలి పొరల్లో ఈ ఆలోచన మెరమెరలాడి……
-
కల్పిత కథ … చిత్ర కె.పి. మలయాళం, భారతీయ కవయిత్రి
నాటక ప్రదర్శన ముగిసి చాలసేపయింది. ఆహార్యం మార్చుకోవడమూ పూర్తయింది. ప్రేక్షకులెప్పుడో వెళ్ళిపోయారు. అయినా, నేనిక్కడ రంగస్థలం మీదనే ఉన్నాను… పోగొట్టుకోని దానికోసం వెతుక్కుంటూ… ఇక్కడ నేనే పాత్రధారినీ, ప్రేక్షకుడినీ. అంతేకాదు ఆ రెండూ రూపాంతరంచెంది ఏకమయినవేళ మధ్యలో అంతరించిపోయిన కట్టుకథని నేను . చిత్ర కె.పి మలయాళం భారతీయ కవయిత్రి . Chitra KP Poem and Image Courtesy: Poetrans.wordpress.com . The Fictitious Tale . The play was enacted long since.…
-
సింహం పంజా క్రింద … హామ్లిన్ గార్లాండ్, అమెరికను కథా రచయిత
అది శరత్కాలపు ఆఖరిరోజు, హేమంతపు మొదటి రోజు కలిసిపోయిన రోజు. రోజల్లా రైతులందరూ విశాలంగా సమతలంగాఉన్న తమ ప్రెయిరీ క్షేత్రాల్లో పైనుంచి మంచు కురుస్తూ, పడుతూనే కరిగి ఒళ్ళంతా తడిసిముద్దవుతున్నా పనిచేస్తూనే ఉన్నారు; ఉండీ ఉండీ ఈదురుగాలులతో తెరలుతెరలుగా వచ్చి మంచు వర్షించిపోయే మేఘాల సంగతి చెప్పనక్కర లేదు… క్రింద నాగేటి చాళ్ళలోని మట్టి నల్లగా తారుముద్దలా బురద బురద అవుతోంది. కాడికి కట్టిన గుర్రాలు నీళ్ళోడుతూ తడుస్తున్నా తమ సహజమైన శాంతస్వభావంతో ఏమాత్రం అసంతృప్తి లేకుండా…
-
Everything That is Active… Devipriya, Telugu, Indian.
Somehow I like more … The sky that endlessly stretches its hands in all direction… The waters Whether they overwhelm the banks or attenuate to a bare ten-feet tributary but, nevertheless run… The wheel on the move even if it were that of a child’s tricycle … The nib of a writing pen… The mote…
-
ప్రమాదం… రాబర్ట్ విలియం సెర్విస్, బ్రిటన్
నా కారులో నిన్న రాత్రి తీసుకెళ్ళిన ఆ కుర్రాడు, శరీరం దారుణంగా చితికి వేలాడిపోతూ, పెదాలు రక్తంగడ్డకట్టి ఎర్రగా, కళ్ళు నిప్పుకణికల్లా మెరుస్తూ, పాపం చేతులు మట్టిముద్దల్లా చల్లగా, ముడుచుకుని… ఓహ్, ఈ రోజు రోజల్లా అతనే గుర్తుకొచ్చాడు. అలసిపోయిన ఆ ముసలి డాక్టరు నాతో అన్నాడు గదా: “మహా అయితే అతనొక గంటకుమించి బతకడేమో. అతని కాళ్లు రెండూ ముణుకులవరకూ బాంబుపేలుడుకి తెగిపోయాయి, కాబట్టి బాబూ నెమ్మదిగా వెళ్ళు. పాపం అతనికి ఈ విషయం తెలీదు.…