వర్గం: అనువాదాలు
-
సిపాయి బ్రౌన్ స్వర్గంలోకెలా వచ్చేడు? … గిల్బర్ట్ ప్రాంకో, బ్రిటిషు కవి
(గమనిక: నార్స్ జానపదగాధ ప్రకారం యుద్ధంలో వీరమరణం పొందిన వారు స్వర్గంలో ‘vAlhAlA’ (War -Hall) అనే చోటుకి స్వర్గ సుఖాలనుభవించడానికి చేరుకుంటారు.) . వల్హాలాలో దిగువ హాల్లోకి, అంతగా పేరులేని యోధుల మధ్యకి తన విధినిర్వహించే “సరిహద్దు-ఠాణా” నుండి విముక్తుడై సిపాయి బ్రౌన్ తన ఖాకీ చొక్కాకి ఒక్క చింకి లేకుండా, ముఖం మీద రక్తం మరక లేకుండా భుజాలమీద నుండి సంచీని ప్రక్కకి విసిరి, ఖాళీ జాగాచూసుకు కూచున్నాడు. వల్హాలాలోని వీర సైనికులు భోజనాల…
-
భావనాతీతం… రూమీ, 13వ శతాబ్దపు సూఫీ తత్త్వవేత్త
తప్పొప్పులు చేస్తున్నామన్న భావనలకి అతీతంగా ఒక క్షేత్రం ఉంది. అక్కడ నేను నిన్ను కలుస్తాను. అక్కడ పచ్చిక మీద ఆత్మ మేను వాలిస్తే ఈ ప్రపంచం మాటలకి అందనంత పూర్ణంగా కనిపిస్తుంది. భావనలు, భాష, ఆ మాటకొస్తే ఒకరితో ఒకరు చేసే సంభాషణా ఏదీ అర్థవంతంగా కనిపించవు… . రూమీ 13వ శతాబ్దపు సూఫీ తత్త్వవేత్త. . . Out beyond ideas of wrongdoing and right doing, there is a field. I’ll…
-
దేవుని నిష్క్రమణ … గెమాలియల్ బ్రాడ్ ఫోర్డ్, అమెరికను కవి
మన తాత, తండ్రులకి దేముడు అన్నది ఒక నిజం ఎంత నిజమంటే ఎదురుగా చూస్తున్నంత అది వాళ్ళని దండించేంతగా భయపెట్టడమే గాక విలువల్ని నిబద్ధతతోపాటించేట్టు చేసింది వాళ్ళు ఇరుకైన న్యాయమార్గంలో అతి జాగరూకతతో నడిచేరు, ఎందుకంటే వాళ్ళు నిరతాంధకార నరకాన్నీ అక్కడి మరిగే నూనెలో శిక్షలకీ భయపడే వారు. ఇప్పుడు నరకమే ఏకంగా కొట్టుకుపోయింది దేముడు ఇప్పుడొక ఛాయామాత్రంగా మిగిలేడు. పాపం, అతను సృష్టించిన ఈ ప్రపంచంలోనే అతనికి తలదాచుకుందికి చోటు లేదు. …
-
ఓ పైసా, నా పైసా… విలియం బట్లర్ యేట్స్, ఐరిష్ కవి
“నేనింకా చిన్న వాణ్ణి” అని నాలోనేనే గొణుక్కున్నాను. వెంటనే,”ఫర్వాలేదు, నాకూ వయసొచ్చింది,” అని నిశ్చయించుకుని పైసా పైకెగరేసా నేను ప్రేమించొచ్చో లేదో తెలుసుకుందామని. “ఓయ్ కుర్రాడా, ఫో! ఫో! తప్పకుండా ప్రేమించు పిల్ల వయసులో ఉండి తీరుగా ఉంటే చాలు” ఓ పైసా, నా పైసా, నా బంగారు పైసా నే నామె కేశపాశాల్లో బందీనైపోయాను! . ఓహ్! ప్రేమ చాలా జటిలమైనది అందులో ఉన్నదంతా అర్థం చేసుకోగల తెలివైనవాడింకా నాకు కనిపించలేదు; ఎందుకంటే, చుక్కలు తొలగిపోయేదాకా…
-
నేను లేకుండా రోజు ఎగసిపోతుంది… జాన్ స్టామర్స్, బ్రిటిషు కవి
అన్ని దిక్కులకూ ప్రయాణమవుతున్న విమానాలు నా ఆఫీసు కిటికీ మీద గీతలు గీస్తున్నాయి; మేడమీద నుండి లండను అన్నిదిక్కులకూ జరుగుతోంది దూరంగా: ప్రపంచం నిండా ఎన్నో స్పందిస్తున్న హృదయాలు. నేను నిశ్చలంగా ఉన్నాను; నువ్వు మాత్రం దూరమౌతున్నావు; నేనిప్పుడు కేవలం పటంమీద ఒక ప్రామాణిక బిందువుని; నువ్వు రేఖాంశాలన్నిటినీ దాటుకుంటూ పోతుంటే, నేను మాత్రం సున్నా మధ్యాహ్న రేఖ మీద ఉన్నాను. మనిద్దరం సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకి నువ్వు ఆకాశంలో ఉండగా మన వీడ్కోలు సందేశాలను…
-
ఓ నా డేనియల్… అజ్ఞాత 8వశతాబ్దపు ఐరిష్ కవి
నిన్న రాత్రే పొద్దుపోయేక కుక్కపిల్ల నీ గురించి అడిగింది అదుగో చిత్తడినేల్లో ‘కసవుగువ్వ’ నీగురించే తలుచుకుంటోంది ఆ చిట్టడివిలో ఒంటరిగా అరిచే పిట్టవి నువ్వేననుకుంటాను నన్ను కలిసేదాకా నీకు తోడు దొరకకుండు గాక! నాకు మాటిచ్చావు; నాతో అబద్ధం చెప్పావు: గొర్రెలు మందకట్టేవేళకి నా ప్రక్కన ఉంటానని; నేను నీకోసం ఈలకొట్టి, మూడు వందసార్లు అరిచేను, నాకు ఆఖరికి దొరికిందల్లా అరుస్తున్న ఈ గొర్రెపిల్ల. నీకు అశక్యం అని తెలిసీ నాకు మాటిచ్చేవు: వెండి తెరచాపక్రింద ఓడనిండా…
-
నమ్మకానికి పరాకాష్ఠ … ఎర్నెస్ట్ హెమింగ్వే, అమెరికను కవి
మన ఆలోచనలన్నీ సుదీర్ఘమైనవే, కానీ మనం నడిచేదే అడ్డదారి; కోరికలదయ్యాల శృతికి నర్తించి నర్తించి ఇంటిదారిలో భయంతో వేయి ప్రార్థనలు; రాత్రి ఒక దొర దగ్గర కొలువైతే, పగలు ఇంకొక ప్రభువు దగ్గర. . ఎర్నెస్ట్ హెమింగ్వే Jul 21, 1899 – Jul 02, 1961 అమెరికను కవి, నవలా రచయిత ఈ కవిత అతి పొందికైన తక్కువ మాటలలో, మన శరీరానికీ, మనసుకీ నిరంతరం జరిగే సంఘర్షణని సులభంగా పట్టిఇస్తుంది. ఇది అనాది నుండి…
-
Severally…. Ravi Verelly, Telugu, Indian
In the absence of whiffs of breeze that punctuate the air with fragrances, two flowers blooming to the same sprig shall experience impassable reaches like the two detached gold discs hanging severally to the thrice knotted sacred thread, sagging under the weight of diverging lateral thoughts. Like the light and darkness lying like Siamese…
-
ఆ చలికాలపు ఆదివారాలు… రాబర్ట్ హేడెన్, అమెరికను
ఆదివారాలు కూడా మా నాయన పొద్దున్నే లేచే వాడు లేచి ఆ చీకటిలో చలిలో బట్టలుతొడుక్కుని, వారం అల్లా ఎండనక వాననక చేసినశ్రమకి పగుళ్ళుబారిన చేత్తోనే, నిద్రపోతున్న నిప్పుల్ని మేల్కొలిపి భగభగమండేలా చేసేవాడు. అతనికెవరూ ఎన్నడూ కృతజ్ఞతలు చెప్పుకోలేదు. చలి విరిగుతున్న చప్పుడుకి నేను మేల్కొనేవాడిని; గదులు వేడేక్కుతుంటే నన్ను పిలిచేవాడు మా నాయన. అప్పుడు నెమ్మదిగా లేచి, బట్టలు వేసుకునే వాడిని. ఎక్కడ అలవాటుకొద్దీ కోపంతో తిడతాడోనని భయపడుతూ . చలిని అవతలకి పారదోలడమే కాదు…
-
జీవితపు పూరేకులు మాడిపోయాయి… ఎల్సీ పంపెలీ కేబో, అమెరికను
రాలి, నలిగి, ధూళిలో కలిసిపోయిన గులాబిలా జీవితపు పూరేకులుకూడా మాడిపోయాయి గతకాలపు జ్ఞాపకాలు దగ్ధమైపోయాయి, ఇక ఆ బూడిదను శాశ్వతంగా జల్లించవలసిందే రేపటికోసం మొగ్గలను తెరిచే సూర్యకిరణాలకంటే అసాధారణంగా. ఒకసారి నిర్మలినమైన ప్రేమ సమసిపోతే దేవతలుకూడా దాన్ని తిరిగి రప్పించలేరు. గతకాలపు జ్ఞాపకాలు దగ్ధమైపోయాయి, ఇక ఆ బూడిదను శాశ్వతంగా జల్లించవలసిందే. ఓ ఆశావహమైన రేపటి ప్రభాతమా! గతకాలపు గులాబులే, అనంత జీవితకాలపు అవశేషాలు. . ఎల్సీ పంపెలీ కేబో అమెరికను . . Burnt are…