వర్గం: అనువాదాలు
-
అతిథి .. ఆల్బర్ట్ కామూ
భారతీయులందరికీ 67వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. సెరెన్ కీర్కెగార్డ్ (1813-55) అనే డేనిష్ తత్త్వవేత్త రచనలు ఆధారంగా ప్రారంభమైన ఒక తాత్త్విక సిద్ధాంతం, నేడు “అస్తిత్వవాదం”గా ప్రచారంలో ఉంది. జర్మన్ తత్త్వవేత్త ఫ్రీడ్రిక్ నీచ (‘నీచ’ సరైన ఉచ్చారణే!)(Friedrich Nietzsche), ఫ్రెంచి తత్త్వవేత్త జఁపాల్ సార్ట్రె (Jean Paul Sartre) ఈ వాదాన్ని బాగా వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. కీర్కెగార్డ్ ప్రతిపాదన ప్రకారం, ఒక వ్యక్తి తనజీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చుకుని, అటువంటి జీవితాన్ని నిజాయితీగానూ, నిష్టగానూ జీవించడంలో…
-
యామినీ గీతం… విలియం రాస్కోథేయర్, అమెరికను కవి
అనంత శక్తిమయివై, విశ్వపరీవ్యాప్తమై, అపారనీరవాన్ని మోసే యామినీ! మనుషి ఏనాటికైనా సాధ్యపడితే, నీవల్లే దైవం పరిమితి తెలుసుకుంటారు. అహంకారియైన సూర్యుడు అసూయతో తనముఖాన్ని చాటుచేసుకుంటున్నాడు లక్షలసూర్యుల్నీ, పాలపుంతనీ నువ్వు ప్రకాశించమని ఆదేశిస్తావు. ప్రతి తారకా లెక్కలేని గ్రహాలకి వెలుగూ, వేడిమీ, చలనమూ అనుగ్రహిస్తుంది అతిదగ్గరనుండి అనంతదూరం వరకూ, అన్నిచుక్కల్నీ కొంగులో దాచుకోగలవు, అన్ని కోట్ల సూర్యప్రభలూ నీ పాదాల క్రిందనలిగే ముచ్చిరేకులు; కేవలం మండుతున్న పూసలు; తిరుగుతూ, తేలుతూ, మెరిసిపడే బుద్బుదాలు. విలియం రాస్కో…
-
రోడ్డువార నిద్ర … ఆర్థర్ కెచం, అమెరికను
ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారో! వేసవిలూ శరత్తులూ గడిచిపోతుంటాయి, ఇప్పుడు గడ్డిమీద పూస్తున్నది మంచో, డెయిజీలో కూడా వాళ్ళకి తెలీదు. రోజల్లా “బర్చ్” చెట్టు ఒదిగి చెవి పారేసుకుంది నది లోలోపల ఏమిటిగొణుగుతోందో విందామని చుట్టూ ఆవరించిన నిశ్శబ్దంలో ఓ పిట్ట ఒంటరిగా సాంధ్యగీతాన్ని ఆలపిస్తోంది. గాలి తేలికగా వీచనీ, గట్టిగా రోదించనీ వాళ్ళ కలల అంచుల్లో ఏ చలనమూ ఉండదు. “శాంతి” గుండెలమీద సేదతీరుతున్నారు ఆమె లభించినందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఏమి…
-
చిరుకవిత… విలియం రాస్కో థేయర్, అమెరికను
చిన్నప్పుడు నేను కవులతో తిరిగేను ఎందుకంటే వాళ్ళు చిత్రించే ప్రపంచం నేనెరిగిన ప్రపంచంకన్నా ఎన్నోరెట్లు అందంగా, ఉదాత్తంగా కనిపిస్తుండేది. ఇప్పటికీ కవులు నాకు సన్నిహితులే. కాని, చిన్నప్పటికంటే కూడ వాళ్ళిప్పుడు నాకు ఇష్టం. ఎందుకంటే నాకు ఇప్పుడు తెలుసును వాళ్ళొక్కరే సత్యాన్ని ఆవిష్కరిస్తారని. . విలియం రాస్కో థేయర్ (January 16, 1859 – 1923) అమెరికను . . ENVOI I Walked with poets in my youth, Because the world…
-
మూడు పద్యాలు… లిల్లా కాబో పెర్రీ, అమెరికను కవయిత్రి
1. కప్పు ఆమె అంది: “కప్పును పైకెత్తు!” అని. ఆమె చేయి అలసినట్టు ఏ సూచన కనిపించనీ లేదు, నవ్వుతూనే చెయ్యి పైకి ఎత్తింది అందులో మధువులేదని ఇతరులు చూడకుండా, ఊహించకుండా. 2. నన్ను క్షమించకు! నన్ను క్షమించకు! నన్ను ద్వేషించు, నాకు తెలుస్తుంది నీ గుండెలో ప్రేమాగ్ని అవశేషం ఇంకా జ్వలిస్తోందని! రాగరహితమైన హృదయాలలోనే క్షమ చోటుచేసుకుంటుంది అచేతనమైన అగ్నిపర్వతం మీద మంచుపేరుకున్నట్టు. 3. గులాబి ఒక రక్తవర్ణపు గులాబిని అతని సమాధిలో జారవిడిచేను అంత…
-
బ్రతికున్నవారికో గులాబీ… నిక్సన్ వాటర్ మేన్, అమెరికను
బ్రతికున్న వారికి ఇచ్చే ఒక్క గులాబీ మృతులని ముంచెత్తే వేల దండలకంటే మెరుగు అనంత ప్రేమ భాండాగారాన్ని పూరించే ప్రయత్నంలో బ్రతికున్నవారికి ఇచ్చే గులాబీ ఎంతో విలువైనది కానీ, దానికొరకు తపించే ఆత్మ కృశించేలోగా అయాచితంగా ఉదారంగా సమర్పించాలి. బ్రతికున్న వారికి ఇచ్చే ఒక్క గులాబీ మృతులని ముంచెత్తే వేల దండలకంటే మెరుగు నిక్సన్ వాటర్ మేన్ 12 November 1859 – 1 September 1944 అమెరికను. . . A Rose…
-
వనకన్య… హిల్డా డూ లిటిల్, అమెరికను కవయిత్రి
Image Courtesy: http://bobsbaitandtackle.com/tag/cut-mullet/ సుడిలేచి ఎగసిపడు సంద్రమా! నీ సూదంచు కొమ్మలను నిలువెత్తు ఎగయనీ. ఎగసిలేచిన నీ దేవదారువుల నా బండరాళ్ళపై భంగపడనీ; నీ హరిత వర్ణాన్ని మామీద చిలికించి నీ పచ్చనాకుల పెనవేయవమ్మా. . హిల్డా డూలిటిల్ September 10, 1886 – September 27, 1961 అమెరికను కవయిత్రి HDగా ప్రఖ్యాతి వహించిన హిల్డా డూలిటిల్, 20 వ శతాబ్దం ప్రథమార్థంలో కవిత్వంలో బాగా వ్యాప్తిలో ఉన్న ఇమేజిజం ఉద్యమమానికి మారుపేరుగా నిలిచిన కవులలో…
-
చీకటిలో నామస్మరణ … డొరతీ పార్కర్, అమెరికను
కొందరు మగాళ్లు, అవును మగాళ్ళు ఒక పుస్తకాలషాపును దాటి రాలేరు. (తల్లీ! ఇప్పుడే నిశ్చయించుకో, జీవితకాలం ఎదురుచూడడానికి) కొందరు మగాళ్ళు, అవును మగాళ్ళే ఆ దిక్కుమాలిన ఆట ఆడకుండా ఉండలేరు. (ఏదీ, చీకటిపడేలోగా రానూ అన్నాడు, తేదీ మారిపోయింది) కొందరు మగాళ్ళు, మ..గా..ళ్ళు మధుశాలను దాటి రాలేరు. (నిరీక్షించు, ప్రాధేయపడు, వాళ్లతత్త్వం మారదు.) కొందరు పురుషులు, మహా పురుషులు ఏ ఆడదాన్నైనా చూడకుండా ఉండలేరు. (భగవంతుడా! నాకు అటువంటివాణ్ణి భర్తగా చేయకు) …
-
All Lovely Things … Conrad Aiken, American
అందమైన వస్తువులన్నిటికీ ఓ ముగింపు ఉంటుంది ఎంత సుకుమారమైన వస్తువైనా ఓ రోజు వాడి, రాలిపోతుంది ఈ రోజు అంత ధైర్యంగా ఖర్చుపెడుతున్న యువత, రేపు ఒక్కొక్క పెన్నీని అడుక్కోవలసి వస్తుంది. ఎంత అద్భుత సౌందర్యరాశులనైనా మరిచిపోతారు ఎంత రారాజులైనా మరణించి మట్టిలో కలవాల్సిందే. ఇంత మిసమిసలాడే శరీరమూ,పువ్వులూ,మురిగిపోవలసిందే ఎంత మేధావి శిరసైనా సాలీడు గూడుకి నెలవుకావలసిందే. ఒక్క సారి తిరిగా యవ్వనమా! ఓ ప్రియతమా, ఒక్కసారి! కాలం ఏమాత్రం పట్టించుకోకుండా సాగిపోతుంటుంది ఆశగా…
-
ఎవరికి వర్తిస్తే వారికి… ఏడ్రియన్ మిచెల్, ఇంగ్లీషు కవి
. Hear the poem in poet’s voice: To Whom It May Concern . ఒకరోజు సత్యం నన్ను తొక్కుకుంటూ నా మీంచి వెళ్ళిపోయింది ఆ ప్రమాదం జరిగిన దగ్గరనుండి ఇలా కుంటుతున్నాను. నా కాళ్ళకి ప్లాస్టర్ వెయ్యండి వియత్నాం గురించి అబద్ధాలు చెప్పండి. అలారం గంట బాధతో మూలగడం వినిపించింది నాకు నేను కనిపించక మళ్ళీ తిరిగి పడుక్కున్నాను. నా చెవుల్లో సీసం పొయ్యండి. కాళ్ళకి ప్లాస్టర్ వెయ్యండి. వియత్నాం…