వర్గం: అనువాదాలు
-
నెఱి చూపులు … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
మొదటిసారి నువ్వు నన్ను వసంతకాలంలో కలిసేవు. నిన్ను తొలిసారి చూసినప్పుడు అప్పుడే సముద్రాన్ని చూసినట్టనిపించింది. గాలికి ఊగుతున్న ఆ పూతీగకి తొలిచివురులు తొడగడం ఏటా పరిశీలిస్తూ అప్పుడే నాలుగు వసంతాలు గడిచేయి మనిద్దరం సహజీవనం సాగిస్తూ. ఐనప్పటికీ, నన్ను చుట్టుముట్టే నీ కళ్లలోకి నేనెప్పుడు చూసినా అప్పుడే మొట్ట మొదటిసారి సముద్రాన్ని చూస్తున్న భావన కలుగుతుంది నాకు. . సారా టీజ్డేల్ అమెరికను . English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit:…
-
రెండవ పెళ్ళి … సామ్యూల్ బిషప్, ఇంగ్లండు
“ఇదిగో, మేరీ, ఈ ఉంగరం సాక్షిగా నిన్ను వివాహం చేసుకుంటున్నాను,”… అని పధ్నాలుగేళ్ళ క్రిందట అన్నాను. కనుక మరో ఉంగరం కోసం ఎదురుచూడు. “దేనికి?” “ఇంక దేనికి? నిన్ను మళ్ళీ పెళ్ళిచేసుకుందికి. ఏం కూడదా? ఆ ఉంగరం తొడిగి నీ యవ్వనాన్నీ, నీ అందచందాల్నీ, అమాయకత్వాన్నీ, నిజాయితీనీ పెళ్ళిచేసుకున్నాను ఆనాడు. ఎంతకాలం నుంచో అభిరుచుల్ని అభినందిస్తూ తెలివితేటలని సమ్మానిస్తూ వచ్చేను ఒకపక్క నా తెలివితక్కువలు బైటపడుతున్నా. నేను ఊహించిన దానికంటే రెండురెట్లు యోగ్యతగలస్త్రీగా నువ్వు…
-
ఆమెని సరిదిద్దడం వృధాప్రయాస… జార్జి స్మోలెట్, స్కాటిష్ కవి .
ఆమె మనసు మార్చడం … వృధా ప్రయాస అది వర్షంలో చినుకులు లెక్కెట్టడం లాంటిది ఆఫ్రికా ఊసరక్షేత్రాల్లో నారుపొయ్యడం లాంటిది తుఫానుల్ని నిరోధించాలని శ్రమపడడం లాంటిది. మిత్రమా! నాకు తెలుసు : ఆమె గాలికంటే తేలిక బోయవాడి వలకంటే కళాత్మకమైన ఉచ్చు; వీచే గాలికంటే నిలకడలేనిది;హేమంతపు నీరవ మంచు మైదానాలంత దయమాలినది. ఆమె చాలా లోభి, ఆఖరికి ప్రేమలో కూడా; ఆమె కన్నులగెలుపులో తమభవిష్యత్తుకై వందలమంది వీరులు ఆతృతగా ఎదురుచూస్తున్నా ప్రేమలోని ఆనందమెవరితోనూ పంచుకోదు,ప్రకటించదు; అటువంటి లజ్జాకరమైన…
-
ఆమె అంత అందంగా కనపడదు…హార్ట్లీ కోలెరిడ్జ్,ఇంగ్లీషు కవి
చాలామంది కన్నెపిల్లల్లాగే చూడ్డానికి ఆమె అంత అందంగా కనపడదు; ఆమె నన్ను చూసి చిరునవ్వు నవ్వేదాకా ఆమె అంత మనోహరంగా ఉంటుందని అనుకోలేదు; ఓహ్! అప్పుడు గమనించాను ఆ కళ్ళ మెరుగు ప్రేమతో ఉప్పొంగుతూ, వెలుగులు విరజిమ్ముతూ. ఇప్పుడా చూపులు బిడియంతో నిర్లిప్తంగా ఉన్నాయి నా చూపులకి బదులివ్వడం లేదు; అయితేనేం? నేను చూడ్డం మానను ఆమె కళ్ళలోని వెలుగుల్ని; తక్కిన కన్నియల చిరునవ్వుల కంటే చిట్లించుకున్నా, ఆమె ముఖమే మెరుగు. . హార్ట్లీ కోలెరిడ్జ్ (19…
-
ప్రేమ సారూప్యత… జార్జి డర్లీ, ఐరిష్ కవి
ఆ గులాబిరెమ్మని చూడు! పడమటి గాలి ప్రేమాతిశయంతో చుంబించబోతే తన చెక్కిలి పక్కకి తిప్పుకుంటోంది; కాని ఒక క్షణం గాలి ఆగితే మళ్ళీ అటే తిరిగిచూస్తూ తను చెంతనే ఉండాలని లాలనగా చూస్తోంది. మరులుకొన్న యువకుడు దరిచేరబోతే బిడియపడుతున్న కన్నియలా లేదూ ఆ గులాబి? బిడియపడుతూనే, తనూలతని విదిలించుకుంటూ తన అనురాగాన్ని తెలియపరుస్తూ ఉంది. ఒకవంక అతని అనునయాన్ని ఆశిస్తూనే మరొకవంక అతను హద్దుమీరకుండా వారిస్తోంది. . జార్జి డర్లీ (1795–1846) ఐరిష్ కవి, నవలా కారుడు,…
-
కాలిమడమ… విష్ణు ప్రసాద్, మలయాళం, ఇండియన్
సరిగ్గా నా కాలిమడమలో మేకు దిగిపోయిన నాడే ఆమె మా యింటికి వచ్చింది. “మనం అలా కలిసి తిరిగొద్దామా, ఎక్కడైనా కాస్సేపు కూచుని కాలక్షేపానికి ఏదో నములుతూ కూచుందామా” అంది. ఆమె పట్ల ప్రేమతో తలమునకలై ఉన్నానేమో ఆమె అడగడమే ఆలస్యం, నా నొప్పి ఊసు ఎత్తకుండా వెంటనే బయలుదేరాను. కుంటుకుని కుంటుకుని కాసేపూ, సాగదీసుకుని నడుస్తూ కాసేపూ అలా సముద్రతీరం వెంట ఆమె పక్కనే నడిచాను. ఆమె నన్ను తనతోపాటు సముద్రం నీళ్ళలోకి పరిగెత్తి లాక్కెళుతుందని…
-
ఓ భాగ్యమా! నువ్వెప్పుడూ ఇంతే… జేమ్స్ థామ్సన్, ఇంగ్లండు
ప్రేమకి రాజీలేని శత్రువువి! మేము రెండు మనసులు ఒకటిగా కలుస్తుంటే మధ్యలో దూరి వేరు చేస్తుంటావు. యవ్వనం, స్వారస్యమూ హరించుకుపోయి జీవితంలో జీవం ఉడిగిపోయేదాకా ఏ రోజుకి ఆ రోజు నిట్టూరుస్తూ జీవితాంతమూ నీకోసం అపేక్షించేలా చేస్తావు అయినా, నువ్వు చాలా చురుకుగా ఉంటూనే ఉంటావు ప్రేమ, ఆనందమూ లేని ప్రమాణాలను చేయిస్తూ మనసుల్ని సుఖాలతో వంచిస్తూ సున్నితమైనవాళ్ళని మొరటువాళ్ళకి జతగూరుస్తూ. ఆడంబరాలకీ, వేడుకలకీ, అర్థంలేని డంబాలకీ లొంగి, సహజమైన ఆనందాలకి దూరమయేలా చేస్తావు. బంగారపు శృంఖలాలను…
-
జపాను నుండి నూరు “టంకాలు”
ఆ కొండనెమలి పింఛము చాలా నిడివైనది అది ఎగురుతుంటే క్రిందకి ఇంకా సాగుతుంది. అంతకంటే నిడివిగా కనిపిస్తోంది నన్ను నా బాధలకు ఒంటరిగా వదిలేస్తూ ఈ అంతుకనిపించని చీకటి రాత్రి. . కకి నొ మొటొ కవి గురించి గాథ: ఈ కవి జపాను భాషలో కకి అనిపిలవబడే తియ్యని పండ్లచెట్టు మొదల్లో దొరికేడట పెంచుకున్న తల్లి ‘అబయే’ కి. ఇతను క్రీ.శ. 697-707 వరకు పరిపాలించిన మొమ్ము చక్రవర్తికి పరిచారకుడుగా ఉండేవాడు. ఇతను ప్రాచీన జపనీస్ కవిత్వంలో…
-
కిటికీ దగ్గర… పాల్ ఎలూర్, ఫ్రెంచి కవి
మనలో ఉత్తములైన వారికి కూడా భద్రతాభావాన్ని కలుగజేసే నిరాశావాదం మీద అంత ఖచ్చితమైన అభిప్రాయముండేది కాదు నాకు. నా మిత్రులు నన్ను చూసి పరిహసించిన రోజులున్నాయి. నే నెన్నడూ మాటలమీద అంత పట్టున్నవాడిని కాను. ఎందుకో, ఓ రకమైన నిర్లక్ష్యం, ఉదాసీనత, చెప్పదలుచుకున్నది సరిగా చెప్పిన పేరూ లేదు నాకు, దానికి కారణం చాలా సార్లు చెప్పడానికి ఏమీలేకపోవడమూ ఏదో చెప్పాల్సి రావడం, ఎవరూ వినకూడదనుకోవడమూ. నా జీవితం ఒకే ఒక దారప్పోగుకి వేలాడుతోంది. నాకేమీ అర్థం…
-
మహావృక్షము… ఏన్ ఫించ్, వించిల్సీ రాణి, ఇంగ్లండు
అద్భుతమైన ఓ వృక్షరాజమా!ఇంత చక్కని నీడనిచ్చే నీకు ప్రత్యుపకారం చెయ్యడం న్యాయం; నేను ఖచ్చితంగా ఏదైనా చెయ్యాలి నీకు, నీ చల్లని ఛాయనందుకున్నందుకు. నువ్వు పక్షులకి ఆశ్రయం కల్పిస్తున్నావంటే ప్రతిగా చక్కని సంగీతాన్ని తిరిగి వినిపిస్తున్నాయి; తుఫానులు విసుగెత్తి మరలే వరకూ బాటసారులు నీ అండన తలదాచుకున్నారంటే ఆ సమయమంతా; వాళ్ళు స్తుతిస్తూ గడుపుతారు నిన్నూ, నీ రక్షణకవచాన్నీ; పాపం పశుల కాపరి ఎండకి తాళలేక నీ నీడ చేరినా నీ ఆకుల కదలికలకి అనుగుణంగా వేణువూదుతుంటాడు;…